Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కోర్టుకు అనసూయ..? ‘మా’ అక్రమాలపై కేసు..? ప్రమాణానికి ముందే స్టే..?

October 12, 2021 by M S R

కోర్టుకు అనసూయ..? మా అక్రమాలపై కేసు..? ప్రమాణానికి ముందే స్టే..? ఈ హెడ్డింగులు చూడగానే….. ఏమిటిది యూట్యూబ్ చానెల్ ఏదో ఇలా పిచ్చి థంబ్ నెయిల్స్ వదిలిందా అనే డౌటొచ్చిందా..? మా ఎన్నికలు, దాని తదనంతర పరిణామాలు, ప్రత్యక్ష ప్రసారాలు, చానెళ్ల వికారాలు ఇదుగో ఇలాంటి శీర్షికలే బెటర్ అనిపించేలా ఉన్నయ్… అందుకే ఈ వ్యంగ్య శీర్షిక… విషయానికి వస్తే… MAA అసోసియేషన్ ఎన్నికల్లో దారుణంగా భంగపడి, సలసలమండిపోతున్న సెక్షన్… ఇక ATMA అనే పేరుతో మరో అసోసియేషన్ ఏర్పాటు చేయనుందనే వార్త బాగానే చక్కర్లు కొడుతోంది… (All Telugu Movie Artists Association) అట… పేరు బాగుంది… నిజం కావొద్దనీ ఏమీ లేదు…

కానీ ఈ ఓడిపోయిన వారి వెంట ఎవరొస్తారు..? ఓటమితో కుంగిపోయి, ఒక్కసారిగా సంయమనం తప్పిపోయిన నాగబాబు, ప్రకాష్‌రాజ్ రాజీనామాలు చేయవచ్చుగాక… శివాజీరాజాకు ఏం కారణాలున్నాయో గానీ తనూ రాజీనామా చేశాడు… కానీ మిగతా ‘మా’ సభ్యులు కూడా ఇలాగే ఆలోచించి, సై సై, అందరమూ వేరే దుకాణం పెట్టేద్దాం అని పోలోమంటూ చీల్చేసి, గోడ కట్టేస్తారా..? ఇప్పటికే నాగబాబును, పవన్ ‌కల్యాణ్‌ను ఏమీ అనలేక, చేతులు కట్టేసుకుని, నోరు కుట్టేసుకుని, తన ఫరెవర్ ప్రత్యర్థి మోహన్‌బాబు గెలుపుకి కారణమైన చిరంజీవి… ఇండస్ట్రీకే పెబ్బ స్థానంలో కూర్చోవాలని ఆరాటపడుతున్న నేపథ్యంలో… ఈ ఆత్మ సంఘానికి వోకే అంటాడా..? నెవ్వర్… చిరంజీవి ఆ తప్పు ఎప్పుడూ చేయడు…

తెలుగు ఇండస్ట్రీకి జస్ట్, ఒక అతిథిగా వచ్చీవెళ్లడమే తప్ప… ఈ ఓటమితో తనెప్పుడూ ఇండస్ట్రీకి లోకల్ కాదని ఇక మనసులో ఫిక్సయిపోయిన ప్రకాష్‌రాజ్ వెంట కూడా ఎవరూ నడవరు… నడిచే సీన్ లేదు… ఈ నాగబాబు వంటి కేరక్టర్లను, మాటలను నమ్ముకుని కదిలితే ఇంకా నష్టపోతాడు… సో, కొన్నాళ్లు ఈ హడావుడి, ప్రకంపనలు గట్రా ఉంటయ్… నాలుగు రోజులయ్యాక ఎవరూ పట్టించుకోరు… కెరీర్‌పరంగా కూడా ప్రకాష్‌రాజ్ నష్టపోయే సూచనలయితే కనిపిస్తున్నయ్… నాగబాబుదేముంది..? తను నష్టపోయేది ఏముంది..? జస్ట్, వరుణ్‌తేజ్ తండ్రి, తన పాత్రకు అంతకుమించి ప్రాధాన్యమేముంది..? ప్రకాష్‌రాజ్ మెచ్యూరిటీ లెవల్స్ మీద ఇన్నాళ్లు కొన్ని భ్రమలుండేవి, ఇప్పుడు తను ఉత్తపోశిగాడే అనిపించుకుంటాడా..? ఇవి సరే గానీ, పర్ డిబేట్ సేక్, ఆత్మ ఎన్నికల్లో ఓడిపోయినవాళ్లు రేప్పొద్దున ఇంకో సంఘం పెడితే..!!??

anasuya

MAA ఎన్నికలన్నాక అది బిగ్‌బాస్ షోలో ఎలిమినేషన్ ప్రహసనంలాగే ఓ నవ్వులాట, ఓ నాటకం, ఓ వినోదం లేకపోతే ఎలా..? అందుకే హేమ శివబాలాజీ అనబడే ఓ తమిళనటుడి జబ్బను కసిగా కొరికేసి ఈ ఎన్నికల్లో ఓ కామిక్ కేరక్టర్ పాత్ర పోషించింది… అక్కడితో ఆగిపోతే ఎలా..? అలాంటి కేరక్టరే మరొకటి ఉంది… ఆమె యాంకర్ అనసూయ… అప్పుడప్పుడూ పిచ్చి పిచ్చి దుస్తులతో సోషల్ పోస్టులు పెట్టేసి, అదేమంటే అందరిపై తిట్లతో విరుచుకుపడి, ఆ అర్ధ డ్రెస్సులే స్త్రీ సమానత్వానికి సూచిక అన్నట్టుగా మాట్లాడుతుంది తెలుసు కదా… ఆమె కూడా మొన్నటి ఎన్నికల్లో నిలబడిందట, కానీ ఫాఫం, వర్క్ బిజీలో పడి ఓటు వేయడానికి రాలేదన్నారు మరి..! అవును మరి, ఆఫ్టరాల్ ఇతర పోటీదారులు ప్రకాష్‌రాజ్, విష్ణులాగా ఆమె ఏమైనా ఖాళీగా ఉందా..? ఈ ప్రచారాలు, వోటు వేయడాలు గట్రా చేయడానికి… మా సభ్యుల తీటకు ఆమెను గెలిపించాలి తప్ప ఆమె ఎవరినీ ఏమీ అడుక్కోదు…


😂 Kshaminchali.. okka vishayam gurtochi tega navvochestundi.. meeto panchukuntunna emanukovoddey..! Ninna “athadhika majority” “bhaari majority” to gelupu ani.. eeroju “lost” “otami” antunnaru.. raathriki raathri enjaruguntundabba🧐 🤔

— Anasuya Bharadwaj (@anusuyakhasba) October 11, 2021


Asalu unna sumaru 900 voters lo sumaru 600 chillara voters lekkimpuki rendo roju ki vaayida veyalsinanta time eduku pattindantaru?? Aha edu ardhamkaka adugutunnanu.. 🧐🤔

— Anasuya Bharadwaj (@anusuyakhasba) October 11, 2021


ఇప్పుడు ఆమె ఉద్దేశం ఏమిటంటే..? మా ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరిగాయి అని..! పోనీ, అదయినా స్ట్రెయిట్‌గా చెబుతుందా అంటే… చెప్పదు… భయం..! ఆ అర్థం వచ్చేలా ట్వీట్లు కొడుతుంది, అంతే… ‘‘ఫస్ట్ నేను భారీ మెజారిటీతో గెలిచాను అన్నారు, తరువాత సుధీర్ గెలిచారని ప్రకటించారు, బ్యాలెట్ పేపర్లను కొందరు ఇళ్లకు తీసుకువెళ్లారు అంటున్నారు, నిజం నాకయితే తెలియదబ్బా’’ అని అతి తెలివితో కూడిన సగం బుర్ర ట్వీట్లు ఫటాఫట్ కొట్టేసింది… ఫాఫం, ఎన్నికల సిబ్బంది… ఐనా మొత్తం రిజల్ట్ వచ్చేదాకా మీడియా కూడా అక్కడే ఉంది కదా… వాళ్ల కళ్లు తప్పి బ్యాలెట్ పేపర్లను ఎవరు ఇళ్లకు తీసుకెళ్లారు..? తీసుకెళ్లారనే అనుకుందాం, అనసూయ అస్సలు అబద్ధం ఆడని మహా పరిణత విజ్ఞురాలు అనుకుందాం… (బుద్దొచ్చింది, నాకు రాజకీయాలు ఎందుకు, నా పిల్లలతో గడుపుతా అంటోంది ఇప్పుడు… మరి ఎన్నికల్లో ఎందుకు నిలబడినట్టు..? కొంపదీసి ఆమెకు తెలియకుండానే, చెప్పుకుండానే ఆమె పేరుతో ఎవరైనా నామినేషన్ వేశారా..?) నిజానికి రిజల్ట్ ప్రకటించేదాకా ఫాఫం, ఎన్నికల సిబ్బంది ఎటూ వెళ్లలేదు కదా, రిజల్ట్ తరువాత ఇంటికి వెళ్లి, బ్యాలెట్ పేపర్లను ట్యాంపర్ చేసి, తాపీగా అనసూయ కాదు, సుధీర్ గెలిచాడు అని ప్రకటించలేదు కదా…!!

ఐనా సరే, అనసూయ తనకు అన్యాయం జరిగిందీ అనిపిస్తే కోర్టుకు వెళ్లడం బెటర్, MAA ఆఫీసులో సుధీర్ ప్రమాణం చేయకముందే స్టే తీసుకురావడం మేలు… ఈ అక్రమాలు మన దేశ ప్రజాస్వామిక వాతావరణానికే పెను ముప్పు… అందులోనూ అనసూయ ఓటమి చాలా డెమొక్రటిక్ విలువల ధ్వంసానికి, తదుపరి విపత్తులకు దారితీసే ప్రమాదం కూడా ఉన్నట్టుంది… కమాన్ అనసూయా… కమాన్, సుడిగాలి సుధీర్ ఆర్మీ, మంచు రెజిమెంట్ అడ్డుకోకముందే వేగంగా కదలాలి… నాకెందుకు పాలిటిక్స్ అని నీలాంటోళ్లే ఊరుకుంటే ఎలా..? ప్రకాష్‌రాజ్ తన ఓటమితో కుంగిపోయి ఉన్నాడు, ఇప్పట్లో తేరుకోడు గానీ ఇక నువ్వే కదలాలి, పోరాటం చేయాలి… ట్వీట్లతో ఎన్నికల్ని, ఫలితాల్ని వెకిలి చేయడం వద్దు, బీ సీరియస్… అసలు సీబీఐతో కాదు గానీ, ఇంటర్‌పోల్ ఈ కుట్రను ఛేదించాలి…!! అవునూ, అనసూయ ఏ ప్యానెలబ్బా…? ఆమెకైనా గుర్తుందో లేదో…!!

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • సినిమాకు ఓ లేఖ ప్రాణం… ఆ లేఖ దగ్గరే తప్పుదొర్లితే…? అదే సీతారామం…!!
  • నిత్యమేనన్ చేసిన తప్పు…! ఆరేళ్ల క్రితమే వాడి వీపు పగలాల్సింది…!!
  • సింహాలు అమ్మబడును…! దివాలా తీసిన పాకిస్థాన్ సర్కారు పొదుపుపాట్లు..!!
  • నేషనల్ హెరాల్డ్ కేసు ప్రభావం వచ్చే కర్నాటక ఎన్నికల మీద…!
  • బాబ్బాబు… ప్లీజ్… మీరు వస్తుండండి..? పోనీ, నన్నే హైదరాబాద్ రమ్మంటారా..?!
  • టీవీ ప్రేక్షకుల్ని ఈటీవీ, మల్లెమాల పిచ్చోళ్లను చేసి, వెక్కిరించడమే ఇది…!!
  • మిస్సింగ్ గరల్ నంబర్ 166… తొమ్మిదేళ్ల ఓ అన్వేషణ కథ… ఓ పోలీస్ గ్రేట్‌నెస్…
  • ఓహ్… ఆత్రేయ రాసిన ఆ బర్త్‌డే పాటలో అంత ఫిలాసఫీ ఉందా..?
  • హీరోయిన్ కాదు, లేడీ డాన్… మాఫియా క్వీన్… గంగూబాయ్ మీద ఓ రీలుక్…!
  • కడువ..! ఓహ్.., ఇది మలయాళీ సినిమాయేనా..? ఆశ్చర్యంగా ఉందే…!

Archives

Copyright © 2022 · Muchata.com · Technology Support by CultNerds IT Solutions