వ్యక్తిగతం వేరు… వృత్తిగతం వేరు… ఐనా సరే, అనేక మంది మహిళలతో సంబంధాలున్నట్టుగా తన పాత సహజీవనే ఆరోపిస్తున్న రాజ్ తరుణ్ సినిమాకు పురుషోత్తముడు అనే పేరు కాస్త నవ్వొచ్చేదిగా ఉంది… సరిగ్గా తన కేసు బహుళ ప్రచారంలో ఉన్నప్పుడే ఈ సినిమా విడుదల కావడం విశేషమే… (కాకపోతే సినిమా టైటిల్స్‌లో మాత్రం జోవియల్ స్టార్ అని వేసుకున్నారు… హహ)
సినిమా సంగతికొస్తే… రాజ్‌తరుణ్ చాన్నాళ్లుగా వెనకబడిపోయాడు… ఈ సినిమాకు కూడా పెద్ద బజ్ లేదు… కథ విషయానికొస్తే… హీరో రాజ్‌తరుణ్ పెద్ద కోటీశ్వరుడు… లండన్‌లో చదువుకుని వస్తాడు… రాగానే సీఈవో బాధ్యతలప్పగించాలని తండ్రి మురళీశర్మ ప్లాన్… నో, నో, మన కంపెనీ నియమాల ప్రకారం అనామకంగా, రహస్యంగా ఎక్కడైనా గడిపి, తనను తను ప్రూవ్ చేసుకుంటే గానీ కంపెనీ పగ్గాలు ఇవ్వవద్దు కదాని అభ్యంతరపెడుతుంది పెద్దమ్మ అలియాస్ రమ్య కృష్ణ…
ఆమెకూ కంపెనీలో అధిక వాటాలుంటాయి కాబట్టి ఇక తప్పదు… (గుజరాత్‌లోని కొందరు బడా సంపన్నులు కూడా తమ కొడుకుల్ని కొంతకాలం రహస్య జీవనానికి పంపించేస్తారు… వాళ్లు తమ ఐడెంటిటీ బయటపడకుండా, కుటుంబ డబ్బు వాడుకోకుండా ఏదో ఒక పని చేసుకుంటూ బతకాల్సి ఉంటుంది…) ఇక ఎక్కడికో వెళ్తాడు హీరో, అక్కడ హీరోయిన్‌తో పరిచయం, ప్రణయం…
Ads
ఏదో కొన్నాళ్లు అలా గడిపి తన కంపెనీకి వెళ్లిపోవాలనుకున్న దశలో అక్కడి రైతులకు జరుగుతున్న అన్యాయం గ్రహించి, వాళ్ల తరఫున పోరాడతాడు… ఊరిని ఉద్దరిస్తాడు… నిజానికి చాలా సినిమాల్లో ఇలాంటి కథాంశాలున్నవే… కాకపోతే రాజ్‌తరుణ్ రేంజ్‌కూ ఈ కథకూ లింక్ కుదరలేదనిపిస్తుంది… పెద్ద హీరోలు అయి ఉంటే ఆ ఎలివేషన్లు, హైఫై సీన్లు నప్పేవేమో… కథనం వీక్… కాకపోతే రాజ్‌తరుణ్ ఆ పాత్రకు తగినట్టు చేశాడు, అన్యాయం చేయలేదు…
ఏమో… ఇంకాస్త కథనం గ్రిప్పింగుగా ఉండి, అక్కడక్కడా ఓవరాక్షన్ సీన్లను తగ్గించి ఉంటే… నాలుగు రోజులు నడిచేదేమో… హీరోయిన్ హాసిని సుధీర్ అందంగా ఉంది… ఎటొచ్చీ రాజ్‌తరుణ్ గ్రహచారమే బాగా లేదు కదా… సినిమా నాణ్యత మీద కూడా ఆ ప్రభావమే ఉన్నట్టుంది… ఈసారి ఇంకెవరైనా నిర్మాత దొరికితే డిఫరెంట్ కథాంశం ట్రై చేయి రాజ్‌తరుణ్… బెస్టాఫ్ లక్..!! (ఈ సినిమాలో పాత్ర మీద, హాసిని సుధీర్ మీద కూడా రాజ్‌తరుణ్ పాత సహజీవని ఏదైనా కామెంట్ చేసిందేమోనని వెతికితే, కనిపించలేదు…)
Share this Article