ఇన్నేళ్లుగా మగ జెంట్స్తో ఆడలేడీ వేషాలు వేయించీ వేయించీ… ఇప్పటికీ వేయిస్తూ వేయిస్తూ… ఈ మల్లెమాల టీం, జబర్దస్త్ టీం అసలు సిసలు ఆడ అందాల్ని గుర్తించలేని అంధత్వానికి గురయ్యాయి… ప్చ్, పాపం, ప్రౌఢందాల అనసూయకు ఇది బాగా బాధ కలిగిస్తోంది… అసలు ఈ షోలలో యాంకర్లకు పెద్ద పనేం ఉంటుందని..? ఏదో మంచి మేకప్పు దట్టించుకుని, మాంఛి డ్రెస్సులు వేసుకుని, కాస్త అందంగా కనిపించి, ఎంట్రీ టైంలో నాలుగు పిచ్చి గెంతులు వేస్తే సరి..,
అలాంటప్పుడు కాస్త ట్రెండీగా… ఓసారి కాళ్లు, తొడలు… మరోసారి భుజాలు… ఎక్స్పోజ్ చేస్తే తప్పేమిటి ఫాఫం..? ఏం..? ఆ మగలేడీస్ వేషాలకన్నా తీసిపోయానా అని ఈమధ్య అనసూయ బాగా చింతించిన ఉదంతం తెలుసు కదా… ఏమిటీ తెలియదా..? అరెరె… ఈ లింకు ఓసారి చదివి… తరువాత కంటిన్యూ చేయండి…
Ads
విషయం అర్థమైంది కదా… ఫుల్ ఎక్స్పోజింగ్ డ్రెస్ వేసుకుని వస్తే… అదేమీ కనిపించకుండా, మొత్తం ఆరోజు షో అంతా (17.12.2020) ఆమెను క్లోజప్ షాట్లతో సరిపుచ్చేసి… చాల్లేవమ్మా, నువ్వూ నీ ఎక్స్పోజింగూ… నువ్వేమైనా పూజా హెగ్డేవా అన్నట్టుగా అనసూయ సౌందర్య ప్రదర్శనాభిలాషను చంపేశారు పాపం… అక్కడికి అదేదో పెద్ద ఫ్యామిలీ షో అయినట్టు… ఆ బూతుల షోకు ఆ డ్రెస్సింగు పనికిరానట్టు…. హహహ…
హమ్మ నా జబర్దస్త్ టీమూ… అని లోలోపల రగిలిపోయినట్టుంది అనసూయ… వయస్సు పెరుగుతూ ఉంటే, నా సొగసూ పెరుగుతుందోయ్ అని జనానికి తెలపాలని తను తాపత్రయపడితే… ఎడిట్ చేసి, కట్ చేసి, అవమానిస్తారా అనుకుందేమో… ఫాఫం, మరి ప్రొటెస్ట్ చేయాలి కదా… అందుకని ఈసారి ఫుల్ డ్రెస్సు వేసుకుని వచ్చింది… ఫుల్లంటే మామూలు ఫుల్లు కాదు… మొహం, కాలివేళ్లు, చేతివేళ్లు తప్ప మొత్తం కవర్ చేసేసింది… అద్గదీ నిరసన స్టయిల్… మరి అనసూయ కదా… ఆమె అంతే…
అన్నట్టు ఇది జబర్దస్త్ 400వ ఎపిసోడ్ అట… 24.12.2020 నాడు టెలికాస్ట్ అయ్యే షో… ఈ ఫోటోలు ఈటీవీ వాళ్ల ప్రొమోలోనివే… చూశారుగా… అనసూయ ఫుల్ డ్రెస్ ప్రొటెస్ట్… మరీ అతి అయిపోతుంది అనుకుందేమో… జుత్తును, మెడను వదిలేసింది… ఈసారి గనుక ఆమె సౌందర్యానికి గనుక ఎడిటింగ్ కత్తెర్లు వేస్తే… ఇక తప్పదు… మొహం కూడా కనిపించకుండా కవర్ చేసుకుని వస్తుంది… తరువాత మీ ఇష్టం…!!
Share this Article