.
యాంకర్ రవి… తనకూ వానరసేన అనే హిందూ సంఘం బాధ్యుడికీ జరిగిన ఓ సంభాషణ వింటుంటే… రవి అనేవాడు తెలిసి మాట్లాడతాడా..? తెలియక మాట్లాడతాడా…? అర్థం కాలేదు… కానీ తన మాటతీరే తేడా ఉంది…
బహుశా ఈ తిక్క మాటలతోనే కావచ్చు… ఇండస్ట్రీలో అటూఇటూ గాకుండా పోయాడు… చివరకు యాంకర్‌గా కూడా పెద్ద క్లిక్ కాలేదు… ఆ సంభాషణ నేపథ్యం ఏమిటంటే..?
Ads
ఈమధ్య ఓ స్కిట్ చేశారు… రంభ అనే ఓ వెటరన్ నటిని మోస్తూ, కీర్తిస్తూ… అప్పుడెప్పుడో ఆమె చిరంజీవితో కలిసి బావగారూ బాగున్నారా అనే సినిమాలో చేసిన ఓ సీన్‌ను స్పూఫ్ చేశారు ఈ స్కిట్‌లో… నందీశ్వరుడి కొమ్ముల నడుమ నుంచి చూస్తే ఆ సినిమాలో చిరంజీవికి రంభ కనిపిస్తుంది… ఈ టీవీ స్కిట్‌లో సుడిగాలి సుదీర్‌కు కూడా ఈ వెటరన్ రంభ కనిపిస్తుంది…
హిందూ ఆధ్యాత్మిక మనోభావాల్లో నందీశ్వరుడి కొమ్ముల నుంచి చూస్తే దేవుడు కనిపించాలి… దేవుడిని అలా చూడటం ఓ అలవాటు, ఓ పద్ధతి, ఓ నమ్మకం… చాలామందికి ఈ స్పూఫ్ నచ్చలేదు… హిందూ సంఘాలు ఆక్షేపించాయి… ఒకాయన రవికి ఫోన్ చేసి మాట్లాడాడు…
నిజానికి ఈ స్పూఫ్‌లో రవి పాత్ర పరిమితం… తను హోస్ట్ అంతే,.. అక్కడ చూసింది సుడిగాలి సుధీర్… కనిపించింది రంభ… ఆ స్పూఫ్ రాసిందెవరో, తీసిందెవరో… టీమ్ ఉంటుంది… అంతిమంగా బాధ్యత వహించాల్సింది జీతెలుగు… కానీ రవి మొత్తం తనే బాధ్యత మీదేసుకుని సమాధానాలు ఇవ్వడం అంటే గాలికి పోయే ముళ్లకంపను దేనికో తగిలించుకోవడం…
ముందే కాల్ కట్ చేస్తే సరిపోయేది… గతంలో కూడా చలపతిరావు ఎపిసోడ్‌లో ఇలాగే ఏదేదో సమర్థించుకోబోయి అడ్డగోలుగా బదనాం అయ్యాడు రవి… గుర్తున్నట్టు లేదు ఫాఫం… ఆ వానరసేన ఏదో ఝలక్ ఇచ్చింది, అలాంటప్పుడు సారీ, నేను బాధ్యుడిని కాను అని చెప్పేసి కట్ చేస్తే అయిపోయేది…
అప్పట్లో చిరంజీవి చేస్తే తప్పు పట్టలేదు కదా, అందుకే మేమూ చేశాం అనేది మూర్ఖపు వ్యాఖ్య… పైగా గుడికి అమ్మాయిలు వస్తారు కదా ఆమె కనిపించింది అని మరో తిక్క సమర్థన… వదిన, చెల్లె, అమ్మలను అమ్మవార్లుగా పూజిస్తాం కదా అంటాడు మరోసారి… ఏమో తనకే తెలియాలి…
మళ్లీ తనే చెబుతున్నాడు… కొందరు హర్టయ్యారని తెలిసి వీడియో తీసేశాం, చెప్పులు తీసేసి షూట్ చేశాం అని… చెప్పులు తీసేసి షూట్ చేసేంత పవిత్రమైన సీనా అది..? మరి అంత నిష్టగా ఓ ఆధ్యాత్మిక సీన్ తీస్తే యూట్యూబ్ నుంచి వీడియో ఎందుకు తీసేసినట్టు..? ఈ మొత్తం ఎపిసోడ్‌లో అసలు రవి ఎవరు..? తన బాధ్యత, తన నిర్ణయాధికారం ఎంత..?
నువ్వు హిందువు కావా అనడిగితే… నేను ఇండియన్ అంటాడు… ఇండియన్‌కు మతం ఉండదా..? సొంత మతం చెప్పుకోవడానికి అంత సిగ్గుపడటం దేనికి..? హిందువు అని చెప్పుకోవడమే అంత నామోషీ వ్యవహారమా..? అలా అనుకోవడమే కదా అసలు సిగ్గుచేటు…
ఇంత మాట్లాడి చివరకు జీతెలుగు ఆఫీసు అడ్రస్ చెప్పి, అక్కడికి వెళ్లి అడుగుపో అంటాడు… ముందే అది చెప్పేసి తప్పుకుంటే అయిపోయేది కదా… ఆ చానెల్ నీది కాదు, ఆ స్కిట్ నిర్మాత నువ్వు కావు, కొమ్ముల నుంచి చూసింది నువ్వు కాదు, డెసిషన్స్‌లో నీ పాత్ర ఉండదు… మరెందుకు ఎవరో కాల్‌తో గోకితే అడ్దంగా బుక్కయ్యావు..?!
Share this Article