ఎలాగూ సినిమా ఇండస్ట్రీలో ఆడదాన్ని ఎలా చూస్తారో మళ్లీ మళ్లీ వార్తల్లోకి వస్తూ కలకలం సృష్టిస్తూనే ఉన్నాయి కదా అనేక ఉదాహరణలు, ఫిర్యాదులు… కానీ ఈ వాతావరణానికి పూర్తి భిన్నంగా అసాధారణంగా గౌరవాన్ని, ప్రేమను, అభిమానాన్ని పొందుతున్నవాళ్లు ఎవరూ లేరా..? ఈ ప్రశ్న తలెత్తినప్పుడు ఇదుగో ఈ ఎపిసోడ్ గుర్తొచ్చింది…
ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ షో వస్తుంది కదా… రీసెంట్ ఎపిసోడ్‌లో థమన్ ఒక ఐఫోన్ చూపిస్తూ, ఇది నాకు అనుష్క పంపించింది… ఇదేకాదు, ఐఫోన్ కొత్త ఎడిషన్ వచ్చిన ప్రతిసారీ లేదా ప్రతి ఏటా నాకు కొత్త ఫోన్ పంపిస్తుంది… భాగమతి సినిమాకు పనిచేస్తున్నప్పుడు నాకు ఓ మాట ఇచ్చింది, అది తప్పడం లేదు…
హీరోయిన్ అని కాదు, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి ఆమె, బంగారం… అందం గురించి కాదు, మంచి వ్యక్తి, ఇన్‌సైడ్ రియల్ బ్యూటీ… నేను ఇంతవరకు చూసిన బెస్ట్ హ్యూమన్ అనుష్క’’ అని పొగడ్తల్లో ముంచెత్తాడు… అవసరం కోసం సినిమా ప్రముఖులు ఇండస్ట్రీలో పెద్దలను పొగుడుతారు, సత్సంబంధాల కోసమో, ఇగోలు శాటిస్‌ఫై చేయడం కోసమో, కొత్త అవకాశాల కోసమో అవి ‘అవసరాలు’… కానీ అనుష్క పొందే గౌరవం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది…
Ads
డిఫరెంట్ కేరక్టర్లు కొందరుంటారు… నిత్యా మేనన్, సాయిపల్లవి వంటి కొందరు హీరోయిన్లు తమ చుట్టూ కొన్ని గీతలు గీసుకుంటారు… ఆ గీతలు ఎవరినీ దాటనివ్వరు… కానీ అనుష్క మరీ డిఫరెంట్… థమన్ వ్యాఖ్యలు వింటుంటే చార్మి జగన్నాథ్ ఆమధ్య అనుష్క మీద చేసిన మరీ అసాధారణ వ్యాఖ్యలు గుర్తొచ్చాయి… (ఇక్కడ నటన, మెరిట్, సక్సెస్, పాత్రలు, లక్ వంటివి పక్కన పెడితే…)
‘‘ఆమె కనిపిస్తే నేను, రవితేజ ఆమె కాళ్లు మొక్కుతాం..’’ చాలా అసాధారణ ప్రశంస… అంతకుమించి… దానికి కారణాల్ని కూడా ఏవేవో ఏకరువు పెట్టాడు… ఈ రేంజ్ గౌరవం, అదీ మన ఇండస్ట్రీల్లో ఒక మహిళా నటి పొందడం విస్మయమే… ఆమె రియల్ బ్యూటీ… దైహిక అందం గురించి కాదు, అందరూ తనను గౌరవించేలా వ్యవహరించేలా చేసుకునే ఏదో వ్యక్తిత్వ ఆకర్షణ ఉంది ఆమెలో… ఎవరూ ఆమె గురించి నెగెటివ్‌గా మాట్లాడినట్టు వినలేదు, చదవలేదు ఇప్పటికీ… బ్యాడ్ లక్… ఏదో పాత్ర కోసం బరువు పెరిగి ఆమె పరుగుకు బ్రేకులు పడ్డాయి గానీ… అంతకుముందు ఆమెకు లభించిన పాత్రలు ఆమెను నంబర్ వన్ తెలుగు హీరోయిన్‌ను చేశాయి…
తరువాత ఈరోజుకూ ఆమె కెరీర్ ట్రాక్‌లో పడలేదు, ఆమధ్య పోలిశెట్టితో ఓ సినిమా… ఏదో మలయాళ సినిమా చేస్తున్నట్టుంది… భాగమతి సీక్వెల్ కూడా వస్తున్నట్టు థమనే చెబుతున్నాడు… బట్, ఆ గత ప్రాభవం ఆమెకు ఇక కష్టమే… ఒక అరుంధతి, ఒక బాహుబలి, ఒక రాణి రుద్రమను మళ్లీ చూడగలమా..!!
Share this Article