మనం ఎన్నెన్నో అనుకుంటాం గానీ… బూతులతో భ్రష్టుపట్టిన జబర్దస్త్‌ను బూతులు తిడుతూనే విపరీతంగా చూసేస్తుంటాం… టీవీ సీరియళ్లు మొత్తం సొసైటీని నాశనం చేస్తున్నాయని చెబుతూనే వాటి నుంచి మాత్రం బయటపడం… మన విమర్శలు వేరు… జనం వాళ్ల ఇష్టం మేరకు చూస్తూనే ఉంటారు…
లేకపోతే ఒక ఏడాదిలో కార్తీకదీపంలో అనే సీరియల్‌లో ఒక లక్ష మార్పులు చేసి ఉంటాడు ఆ దర్శకుడు… ప్రేక్షకుల్ని హౌలాగాళ్లను చేశాడు… ఐతేనేం, జనం ఇంకా చూస్తూనే ఉన్నారు… ఇప్పటికీ రేటింగ్సులో టాప్ సీరియల్ అదే… అఫ్‌కోర్స్, వసూళ్లకూ, సినిమా క్వాలిటీకి సంబంధం లేనట్టే… కార్తీకదీపం విషయంలో స్టార్ మాటీవీ వాడు ఏదో మాయ చేస్తున్నాడు…
Ads
అసలు అదేకాదు, మొత్తం తన సీరియల్స్ విషయంలోనే రేటింగ్స్ అసాధారణంగా ఉంటాయి… వాటితో జీతెలుగు సీరియల్స్ కొన్ని పోటీపడుతున్నా సరే, వాటికి మాత్రం రేటింగ్స్ రావు… కనిపించవు… ఇప్పుడిప్పుడే జనం ఈటీవీ సీరియళ్లను కూడా చూస్తున్నారు… జెమిని టీవీని అలా వదిలేసెయండి…
నాగుపాము పాలు తీసుకురావడం, పసిపాపకు రక్షణగా ఉండి విలన్లను కాటేస్తానంటూ బుసకొట్టడం, ఎపిసోడ్‌కు ఓ స్వామీజీ రావడం ఏదో కుట్రకు సహకరించడం, తరచూ ఎవరో బాబా వచ్చేసి జరిగింది, జరగబోయేది కళ్లకుకట్టినట్టు చెప్పేస్తుండటం, హీరోయిన్‌ను చంపడానికి ప్లస్ హీరోను చంపటానికి ప్రతివారం నాలుగైదు కొత్త కొత్త ఆలోచనలు అమలు చేయడం, మొత్తం సీరియల్ అంతా మూఢనమ్మకాలే ఉన్నా సరే… త్రినయని సీరియల్ ఇప్పుడు జీతెలుగులో టాప్…
చాలా రోజుల తరువాత టీవీ రేటింగ్స్‌లో టాప్-30 జాబితాలో జీతెలుగు పేరు కనిపించింది… అదే త్రినయని పేరు… అంటే రేటింగుల మాయామర్మాలను తట్టుకుని కూడా ఆ సీరియల్ మాటీవీ సీరియళ్లతో పోటీపడుతుందన్నమాట… అంటే ప్రేక్షకులకు అలాంటి సీరియళ్లే కావాలా..?
ఈసారి బార్క్ రేటింగ్స్‌లో త్రినయనికి 6.40 జీఆర్పీలు వచ్చినయ్… ఇది హైదరాబాద్… మొత్తం రెండు రాష్ట్రాలూ కలిపితే 8 వరకూ వచ్చి ఉండవచ్చు… ఐనా విశేషమే… నిజానికి అన్ని సీరియళ్లలాగే అడుగడుగూ అవలక్షణమే అందులో… ఐతేనేం, హీరోయిన్ అషిక పడుకోన్ తన భుజాల మీద మోస్తోంది సీరియల్‌ను… పేరుకు చాలామంది ఉన్నారు, అందరూ బాగానే నటిస్తారు… కానీ అందరినీ డామినేట్ చేస్తోంది ఆషిక…
మనిషి కాస్త పొట్టిగా అయిపోయింది గానీ లేకపోతే ఇంకా పాపులర్ అయిపోయేది… అందం ఉంది, అభినయం ఉంది… ఆమె సీన్‌లో ఉంటే మిగతా పాత్రలకు దేభ్యం మొహాలే… వాటి కేరక్టరైజేషన్ కూడా దరిద్రమే… ఆషిక నిజం చెప్పాలంటే తెలుగు ప్రజలందరి అభిమానం పొందిన దీప పాత్రధారి ప్రేమీ విశ్వనాథ్‌ను కూడా దాటేసింది… ఈరోజు ప్రేమీకి అంత సీన్ లేదు… కొంతమేరకు ప్రేమ ఎంత మధురం సీరియల్‌లో మీరా పాత్రధారి అనుశ్రీకి, కార్తీకదీపంలో శోభితా శెట్టికి మంచి పేరు వచ్చింది, అయితేనేం, ఆ పాత్రల్ని ఖతం చేసేశారు… ముక్కుపుడక ఐశ్వర్య పిస్సేకు ఎందుకో లక్ కలిసి రావడం లేదు గానీ తనకు మంచి పాత్ర దొరికితే ఇరగ దీస్తుంది…
నిజానికి ప్రేమ ఎంత మధురం సీరియల్‌లో రాజనందిని పాత్రలోకి దిగిన మానస మనోహర్‌కు కొంత స్కోప్ ఉండేది… కానీ ఆమె చికాకు పెడుతోంది… ఆమెకు ఇచ్చిన వాయిస్ ఓవర్ మొత్తం సీరియల్ పాత్రల్లోకెల్లా అధ్వానం… ఆమెతో అలా నటింపజేసుకుంటున్న వారి నిర్వాకం, ఫాఫం, ఆమె తప్పేమీ లేదు… ఇప్పుడు రేటింగుల్లో బాగా దెబ్బతిన్నందున మళ్లీ అనుశ్రీని తెరపైకి తీసుకురావాలని, ఈ మానస మనోహర్ పాత్రను ఖతం చేద్దామని చూస్తున్నట్టున్నారు… కార్తీకదీపం సీరియల్‌ను ఆదర్శంగా తీసుకుంటే మరింత దెబ్బతింటారు… కానీ ఎవరు చెబితే ఎవరు వింటారు..?
Share this Article