.
విమాన ప్రమాదానికి సంబంధించి ఎన్నో కథనాలు… వాటిల్లో బాగా రీడర్షిప్ ఉండేవి హ్యూమన్ ఇంట్రస్టింగ్ స్టోరీలు… చాలా వచ్చాయి, వస్తున్నాయి… ఇతర టెక్నికల్, ఫాలోఅప్ కథనాలతోపాటు…
జస్ట్, పది నిమిషాలు లేటై ఒకామె ప్రాణాలు దక్కించుకుంది… ఒకాయన సీటు విరిగి ఎక్కడో పడిపోయి, పేలుడు బారి నుంచి తప్పించుకున్నాడు, అతనొక్కడే ఆ దుర్ఘటనలో మృత్యుంజయుడు… పేరు విశ్వాస కుమార్… అది మెడికల్ హాస్టల్ మీద కూలి పలువురు విద్యార్థులు మరణించారు…
Ads
ఒక ఎయిర్ హోస్టెస్, మరో కుటుంబం, ఓ పైలట్… ఒక్కొక్కరిది ఓ కన్నీటి కథ… ఐతే ఆ ఒక్కడే ఎలా బతికాడు, అప్పుడే బయటికి పోయిన ఓ మెడికల్ స్టూడెంట్ ఎలా తప్పించుకున్నాడు, ట్రాఫిక్ లేటై ఆమె ఎలా ప్రాణాలు దక్కించుకుంది..?
మళ్లీ మన చర్చ డెస్టినీ, టైమ్ దగ్గరకు వస్తుంది… నిజంగా మాజీ ముఖ్యమంత్రి మరణించాడు, తన కార్ల నంబర్లన్నీ 1206… మరణం కూడా 12.06 తేదీన… తన సీటు నంబర్ 12… ఆ వరుస ముందో, వెనుకో అదేదో 11ఏ నంబర్ సీటులో కూర్చున్న వ్యక్తేమో అనూహ్యంగా, అబ్బురపడేట్టు తప్పించుకున్నాడు.., నిజానికి విండో ఉండని ఆ సీటును ఎవరూ ఇష్టపడరు… అదిప్పుడు లక్కీ వన్…
తనకే ఇంకా నమ్మకం కుదరడం లేదు… ఇప్పుడు ఆ సీటుకు ఇక ఎక్కడా లేని గిరాకీ… కారణాలు ఏమీ ఉండవు, జస్ట్, ఏదో గుడ్డి నమ్మకం, సెంటిమెంట్…
పరమపదసోపానపటం… నిచ్చెనలు ఎక్కడ, పాము మింగడం అన్నీ మన చేతుల్లో ఏమీ ఉండదు… టైమ్ విసిరే పాచికలు అడుగుల్ని, అదష్టాల్ని నిర్దేశిస్తాయి, శాసిస్తాయి…
అబ్బే, కాకతాళీయం, జస్ట్, యాదృచ్ఛికం అంటారు హేతువాదులు… అవును, జస్ట్, యాదృచ్చికమే కావచ్చుగాక, కానీ దాన్నీ శాసించే ‘అదేదో’ ఉందంటారు విశ్వాసులు… సరే, ఈ చర్చ ఎప్పుడూ తెగదు… ఆదిలాబాద్ జిల్లాలో వర్షంలో తలదాచుకున్నచోట పిడుగుపడి ఆరుగురు రైతులు మరణించారు…
మృత్యు రాకడను ఊహించలేం… అదే ఇది… ఇజ్రాయిల్ మీద దాడి ఎలా చేద్దామని ఇరాన్ ఆర్మీ చీఫ్, ఐఆర్జీసీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ కీలకాధికారులు భేటీ వేశారు, అదే సమయంలో ఇజ్రాయిల్ బాంబులు సరిగ్గా ఆ భవనం చీల్చుకుని పేలాయి… అందరూ మరణించారు,
అంతేకాదు, అణు కార్యక్రమంలో తమ పని తాము చేసుకుపోతున్న సీనియర్ న్యూక్లియర్ సైంటిస్టులు కూడా మరణించారు… ఆ కేంద్రం తుడిచిపెట్టుకుపోయింది… అన్నీ మనిషి అనుకునేదొకటి, జరిగేదొకటి… అలా జరిగిపోతుంటాయి, అదే కదా జీవితం అంటారా..? అవునేమో గానీ, మరణం మన చేతుల్లో లేదనేది స్పష్టం…
సో, అన్ని కథనాలూ చెప్పేది ఒకటే సూత్రం… రేపు ఏమిటో తెలియదు, ఈ క్షణాన్ని జీవించడమే ఉత్తమం… అన్నీ ఎప్పటికప్పుడు సర్దుకుని,, దేనికైనా రెడీగా ఉండటమూ ఉత్తమమే..!……. (ఓ పెద్దాయన ఉవాచ)
Share this Article