దిల్ రాజు గోల్డెన్ స్పూన్‌తో ఏమీ పుట్టలేదు… తన నేచర్‌కు తగినట్టు లక్ కలిసొచ్చింది… కోట్లకుకోట్లు కుమ్మేశాడు… ఎగ్జిబిషన్ సిండికేట్ గుప్పిటపట్టాడు… తెలుగు ఇండస్ట్రీని శాసిస్తున్నాడు… బలగం సినిమా తీశాడు కదాని, తనేదో తెలంగాణ సెంటిమెంట్ ఉన్నవాడనో, కమిట్‌మెంట్ ఉన్నవాడనో భ్రమపడాల్సిన పనిలేదు…
చౌక ఖర్చుతో ఓ సినిమా నిర్మాణమవుతోంది… వస్తే థియేటర్లలో డబ్బులు… కాదంటే ఓటీటీ, శాటిలైట్ హక్కులతో ఎలాగూ ఒడ్డునే ఉండిపోతాడు… బలగం సినిమా వెనుక దిల్ రాజు ఆలోచన అదే, అడుగులూ అవే… తెలంగాణ కల్చర్, అనుబంధాలు, తోటకూర, పప్పు వంటి పదాలేమీ లేవు… అంతెందుకు..? తను తెలంగాణ సినిమాను ఎంకరేజ్ చేయాలని అడిగినవాళ్లను అవమానించి, తూలనాడిన ఉదాహరణలూ ఉన్నాయి… తనతో కేవలం డబ్బు భాషలో మాట్లాడాలి…
నిర్మాత Ramesh Reddy Thummala ఫేస్‌బుక్ పోస్టు ఒకటి ఆసక్తికరంగా కనిపించింది… అదే ఇక్కడ యథాతథంగా ఇస్తున్నాను…
Ads
తెలంగాణా సినిమాలూ… కొన్ని నిజాలు
ఈ రోజుల్లో తెలుగు సినిమా నిర్మాతలు తెలంగాణ సంస్కృతి మరియు భాషతో సినిమాలు తీస్తున్నందుకు సంతోషంగా ఉంది. నేను 2004-05లో ”నా తల్లి తెలంగాణ” సినిమా చేసినప్పుడు కొందరు నన్ను చూసి నవ్వారు. 2008-2009లో నేను తెలంగాణ గోదావరి సినిమా చేసినప్పుడు, డిస్ట్రిబ్యూషన్‌లో నాకు సహాయం చేయమని దిల్ లేని రాజును అభ్యర్థించాను. కానీ నన్ను చూసి నవ్వుతూ తెలంగాణ సినిమాలు ఎవరు చూస్తారు అని అన్నారు. కానీ నేడు తెలంగాణపై సినిమాలు చేస్తున్నాడు. నేను కూడా అతనిని చూసి నవ్వాను, ఎందుకంటే అతను కష్టపడుతున్న రోజుల్లో నా బంజారా హిల్స్ అపార్ట్‌మెంట్‌కి వచ్చి breakfast మరియు రాత్రి భోజనం చేసేవాడు. అఫ్ కోర్స్ వయసులో నాకంటే చాలా పెద్దవాడు.
In 2015-2017, నేను ‘’ది ఇండియన్ పోస్ట్‌మ్యాన్ ‘’ సినిమాని ఇంగ్లీష్ మరియు తెలుగులో నిర్మించాను. తెలంగాణ చరిత్ర మరియు తెలంగాణ సంస్కృతిపై ఇంగ్లీషులో వచ్చిన తొలి తెలంగాణ సినిమా ఇదే. తెలంగాణ చరిత్రలో తొలి ఇంగ్లీష్ బతుకమ్మ పాట ఈ సినిమాలో వచ్చింది. నాకు పేరు అక్కర్లేదు. నాకు దేనికీ క్రెడిట్ అక్కర్లేదు. కానీ నా తెలంగాణ సంస్కృతి మరియు భాష ఎల్లప్పుడూ గౌరవించబడాలని నేను కోరుకుంటున్నాను. But from 2024 October 4th, I will be Coming with more commercial movies.
Long live telangana revolutionLong live telangana culture & language..
Share this Article