Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఏమయ్యా రాధాకృష్ణా… నీమాట మీద నువ్వే నిలబడకపోతే ఎట్లా..?!

September 27, 2022 by M S R

మిస్టర్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణా… ఇది కరెక్టు కాదు… నీ మాట మీద నువ్వు నిలబడి ఉండాలె కదా… గిట్ల చేస్తవేంది..? మొన్న ఏదో వార్త మీద నిలదీయడానికి నీ ఆఫీసుకు వచ్చిన కవితను కూర్చోబెట్టి ఏమంటివి..? నమస్తే తెలంగాణ అదొక పేపరా..? అసలు దాన్ని కేసీయారే చదవడు అన్నావు… మేం మస్తు పోటీ ఇస్తున్నాం, మస్తు సర్క్యులేషన్ పెరిగింది అని ఆమె ఏదో చెప్పుకుంది… అది వేరే సంగతి…

మరి అది అసలు పేపరే కాదంటివి నువ్వు… అలాంటప్పుడు వాళ్లు ఏం రాస్తే నీకెందుకు చెప్పు..? ఈనాడోడు ఏం రాసినా నువ్వెలాగూ కౌంటర్ చేయవు… సేమ్ నెత్తురు కాబట్టి, కౌంటర్ చేయడానికి బ్లడ్డు, బ్రీడ్ అంగీకరించదు… సాక్షి వాడు ఏం రాసినా సరే కౌంటర్ చేస్తవ్… ఆజన్మవైరం కాబట్టి అదీ తప్పదు… ఆజన్మవైరం అంటే ఇక్కడ సామాజికవర్గవైరం అని కాదు అర్థం, గమనించగలరు… దాని పుట్టుక పరమార్థమే మీ యెల్లో క్యాంపెయిన్‌కు కౌంటర్ కదా… సో, మీ తన్నులాటకు ఓ అర్థముండి ఏడ్చింది… కానీ…

Ads

కేసీయార్, నువ్వు మంచి దోస్తులు… కేటీయార్, కవిత అంకుల్ అంకుల్ అంటూ నిన్ను బాగా అభిమానిస్తారు… నీ ఆఫీసు కాలిపోతే హుటాహుటిన కేసీయార్ పరుగెత్తుకుని వస్తాడు… మీకు ఒకరంటే ఒకరికి ప్రేమ… కానీ పత్రికల్లో మాత్రం ఒకరికొకరు కొట్టేసుకుంటారు, తిట్టేసుకుంటారు… కౌంటర్లు రాసుకుంటారు… ఈరోజు రాత కూడా అదే కదా…

ntnews

నమస్తే తెలంగాణ పత్రికల్ని కాలబెట్టారని నాలుగు కాలాల ఫోటో వార్తను రంగులు పూసి మరీ పబ్లిష్ చేస్తివి… అంత ఖుషీ ఏంటయ్యా నీకు..? ఫాఫం, తనను తాను పేపర్ అని ఇంకా అనుకునే నమస్తే తెలంగాణ ఏదో కేసీయార్‌ను అర్జెంటుగా జాతీయ నాయకుడిని చేసే పనిలో పడింది… ఆయన పేపర్ ఆయన ఇష్టం… ఆయన డప్పు కొట్టకపోతే ఎట్లా..?

తెలంగాణే మాడల్, కేసీయారే లీడర్ అని ఓ క్యాంపెయిన్ తలపెట్టింది… ఫాఫం, ఏదేదో రాసుకుంటోంది… స్వయంతృప్తి… యావత్తు మహారాష్ట్ర రైతాంగం కేసీయార్ అర్జెంటుగా ప్రధాని కుర్చీ ఎక్కాల్సిందే అని ఉద్యమించడానికి రెడీ అయిపోతున్నట్టుగా కూసింది… సారీ, రాసింది… సో వాట్..? అలా మేమెప్పుడు అన్నాం, మీకేమైనా పిచ్చా..? ఏమిటీ తిక్క రాతలు అంటూ ఆ మరఠ్వాడా రైతులు, నాయకులే ఆ పత్రికల్ని కాలబెడుతున్నారు… నమస్తే తెలంగాణ స్వయంగా రాసుకున్నట్టు కేసీయార్ ప్రతి అడుగునూ గమనిస్తున్నారు మరాఠాలు… అవును నిజమే, ఆ పత్రికల్ని కాలబెట్టిన వాళ్ల గుండెలు కూడా మండిపోతున్నయ్… ఎందుకంటే, వాళ్లు మేడిగడ్డ ముంపు బాధితులు…

nt

ఫాఫం, వీళ్లేదో డప్పు కొట్టబోతే, అది కాస్తా ఉల్టా అయిపోయింది… సరే, తమ బాసును ప్రధాని పీఠం ఎక్కించాలనే ఓ బృహత్ యజ్ఞంలో చిన్న చిన్న లోపాలు సహజం… నువ్వు ఏదో వెక్కిరిస్తూ, మీ పత్రికల్ని కాలబెట్టారోయ్ అని రంగురంగుల వార్త రాయగానే నమస్తే తెలంగాణ ఉక్కు సంకల్పం ఏమీ వంగిపోదు… మరింతగా డప్పు మోగిస్తుంది… అది ఖాయం… కేరళ నుంచి కాశ్మీర్ దాకా రైతులంతా కేసీయార్ అధికారం కోసం ఉద్యమిస్తున్నట్టు కలరిచ్చే మహా యజ్ఞం కొనసాగుతుంది…

మరాఠా అయిపోయింది కదా… ఈరోజు కన్నడ ఘోష… కేసీయార్ మాడల్ కావాలె అని కర్నాటక అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారట, భారీ ర్యాలీ అట… జాతీయ రైతు నాయకుల అరెస్టు అట… నిజానికి లోకల్ జోన్ పేజీలో చిన్న సింగిల్ కాలమ్ వార్త అది… కానీ నమస్తే తెలంగాణకు అది బ్యానర్… ఆ పత్రిక రేంజ్ అది… సో వాట్..? నీకెందుకు అసహనం… మీ చంద్రబాబును మళ్లీ చక్రాలు గిరగిరా తిప్పేసి, ప్రధాని కుర్చీ ఎక్కమను… ఆంధ్రజ్యోతిలో ఇదేతరహాలో క్యాంపెయిన్ తీసుకో… అంతేతప్ప ఇదెక్కడి ధోరణి..? మరీ జగన్ ఆరోపిస్తున్నట్టు… కేసీయార్ తలపెట్టిన పవర్ హోమగుండంలో వ్యర్థపదార్థాల్ని పారబోసే మారీచసుబాహుల పాత్ర పోషిస్తే ఎలా..?!

 

Ads

nt

 

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • చలికాలంల సర్వపిండిదే సౌభాగ్యం… ఉల్లి కొత్తిమీర గుమగుమలతో ఊరిస్తది.
  • రేవంత్ టీంలో ఉంటాడో లేదో తెలియదు… కానీ ఐటీ మినిస్ట్రీకి ఆప్ట్ ఎమ్మెల్యే…
  • సాయిపల్లవి… ఆగీ ఆగీ… ఒకేసారి మూడు పాన్ ఇండియా మూవీస్…
  • టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్… నిజానికి రేవంత్‌రెడ్డి ఎవరి మనిషి..?!
  • నిజమే… అతడు ఓడిపోతున్నాడు… ఈ లోకం నుంచే వెళ్లిపోతున్నాడు…
  • హై హై నాయకా… మాయాబజార్ ఘటోత్కచుడిని చేసేశారా..?
  • తీరొక్క తీపి..! స్వీట్ల జాతర..! మధుమేహులు కుళ్లుకునే విందు…!
  • వచ్చిన రెడ్ల రాజ్యంలోనే వెలమ ఎమ్మెల్యేలు ఎక్కువ… 13 మంది…
  • ఇండి కూటమి… ఫెవికాల్ బంధాలేమీ కావు… అప్పుడే ‘ఇచ్చుకపోతోంది’…
  • తెలంగాణ కాబోయే సీఎం ఎవరు..? రేవంత్ మరో అస్సోం సీఎం కాగలడా..?

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions