.
డప్పు కొట్టాలంటే ఆంధ్రజ్యోతే… ఈనాడుకు చేతకాలేదు… చంద్రబాబునాయుడు 75వ జన్మదినం సందర్భంగా ఆంధ్రజ్యోతి దంచికొట్టింది… కాకపోతే ఓనర్ రాసుకున్న కొత్త పలుకు వ్యాసానికీ, అదే పత్రికలో మరో పేజీలో అధికభాగం పబ్లిష్ చేసిన సంకల్పానికి వజ్రోత్సవం అనే కీర్తనకూ పెద్ద తేడా లేదు… (సంకల్పానికి వజ్రోత్సవం అనే హెడింగ్ పెద్ద అబ్సర్డ్)…
నిజానికి సాక్షిలో ఎడిటోరియల్ వ్యాసాలతో పోలిస్తే ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ వ్యాసాలు కాస్త దమ్ బిర్యానీ టైపు… సాక్షి కూడా జగన్ డప్పు కొట్టినా సరే, అవి మరీ రుచీపచీ లేని ఉప్మా వ్యాసాల్లాగా ఉంటాయి… సరే, విషయానికొస్తే…
Ads
చంద్రబాబునాయుడికి వజ్రోత్సవ శుభాకాంక్షలు చెప్పి తీరాలి… తరచి తరచి విశ్లేషిస్తే ఎన్నో మైనసులు, ఎన్నో ప్లసులూ ఉన్నా సరే.,. తెలుగు రాజకీయాల్లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ లీడర్ తను… నమ్మిన మామనే వెన్నుపోటు పొడిచాడనే అపప్రథ, నెగెటివిటీ నుంచి పార్టీని కాపాడుకుని, ఈరోజుకూ దాన్ని బలమైన శక్తిగా ఉంచడం ఆషామాషీ కాదు…
ఎస్, రాధాకృష్ణ చెప్పినట్టు… తనకు పెద్దగా సెంటిమెంట్లు, ఎమోషన్స్ ఉండవు… ప్రాక్టికల్… ఎంత ప్రాక్టికల్ అంటే తను ఎవరినీ నమ్మడు, ఎవరినీ చేరదీయడు… అవును, అదే వ్యాసంలో చెప్పినట్టు చంద్రబాబు ఓ రోబో…
ఐతే… ఇది చెప్పడానికి రాధాకృష్ణ రాసిన ఓ పేరా బాగా నవ్వు తెప్పించింది… దేనికి దేనికి లంకె పెడుతున్నాడో, అసలు ఈ వ్యాసం ఔట్ సోర్సింగుకు ఇచ్చాడా అనిపించింది… ఆ పేరా ఇలా…
ఆయన భోజనం కూడా చేతులతో కలుపుకొని తినరు. స్పూన్‌తోనే తింటారు. అది కూడా పెదవులకు అంటకుండా తింటారు. నిన్న కాక మొన్న కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయానికి వెళ్లినప్పుడు అక్కడ అందించిన ప్రసాదాన్ని కూడా పూర్తిగా తినలేదు. మొదటిసారి రెండు చెంచాల ప్రసాదం తీసుకొని మిగతాది తన సతీమణి భువనేశ్వరికి ఇచ్చేశారు. రెండవసారి మరో ప్రసాదం ఇవ్వగా అది కూడా ఒక స్పూన్ తీసుకొని మిగతాది భువనేశ్వరికి ఇవ్వబోగా తనకు వద్దని ఆమె వారించారు. దీంతో అటూ ఇటూ చూసి పక్కనున్న వారికి ఇచ్చేశారు. మామూలుగా అయితే మనం మొత్తం ప్రసాదం తినేస్తాం. చంద్రబాబు మాత్రం తూకం వేసుకొని తింటారు.
నిజానికి ఈ వ్యాసాల్లో ఏదో చంద్రబాబు చరిత్రను ఏకరువు పెడుతూ పోయారు తప్ప… పెద్దగా తన పనితీరును, తన తత్వాన్ని విశ్లేషించిన లోతు, పాత్రికేయ పక్వత లేవు… పైగా ఏది రాసినా చివరకు జగన్ మెడలో వేసినట్టు… చంద్రబాబు 75 వ బర్త్ డే వ్యాసాన్ని కూడా మళ్లీ జగన్‌ను మళ్లీ మళ్లీ తిట్టడానికి వాడుకున్నాడు రాధాకృష్ణ…
తిట్టండి, తిట్లకు జగన్ అనర్హుడేమీ కాదు రాజకీయాల్లో… కానీ ఏ సందర్భాన్ని ఎందుకు వాడుతున్నారనేదే ప్రశ్న… జగన్‌ను తిట్టాలంటే మరో నాలుగు ప్రత్యేక పేజీలు వేసి కుమ్మేయండి… కానీ చంద్రబాబు కీర్తనలో కల్తీ చేయడం దేనికి..?
ఒక్కటి మాత్రం నిజం… మెల్లిమెల్లిగా పార్టీ మీద, ప్రభుత్వం మీద లోకేష్ పట్టు పెరుగుతోంది, తన చేతుల్లోకి పోతున్నాయి… బట్, 75 ఏళ్ల వయస్సులో కూడా చంద్రబాబు ఆ 1978 నాటి ఉత్సాహమే కనిపిస్తోంది… దానికి అభినందిస్తూ… జన్మదిన వజ్రోత్సవ శుభాకాంక్షలు….
Share this Article