Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మరి బంపర్ హిట్ డైరెక్టర్ కదా… ఈమాత్రం నెత్తికెక్కదా..? ఎక్కినట్టుంది..!!

February 6, 2024 by M S R

చిన్నాచితకా డైరెక్టర్లకే ఒక్క హిట్టు దక్కేసరికి కిక్కు నెత్తికెక్కుతోంది… ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే అర్థం కావడం లేదు… మరి అర్జున్‌రెడ్డి, దాని హిందీ రీమేక్ కబీర్ సింగ్, ఇప్పుడు యానిమల్ సూపర్ బంపర్ హిట్లు కొట్టిన వంగా సందీప్‌‌కి ఇంకెంత ఎక్కాలి..? కిక్కు..! అసలే తన సినిమాలే కాస్త మెంటల్ టైపు, తన హీరోలూ అదే టైపు… మరి తనూ అంతే అనుకోవాలి కదా… పైగా మా వరంగల్ కదా, కాస్త తల పైకెత్తుకునే ఉంటుంది ఎప్పుడూ… హహహ…

సరే, తన సినిమాల్ని మస్తు బూతులు తిట్టుకునేవాళ్లు ఉంటారు… అరె, భలే ట్రెండింగ్‌గా తీస్తున్నాడు అని మెచ్చుకునేవాళ్లూ ఉంటారు… కానీ సక్సెస్ ఎప్పుడూ మనల్ని మైకంలో పడేయొద్దు… నిజానికి సక్సెస్ సమయాల్లోనే ఇంకా ఎక్కువ సంయమనం అవసరం… వంగాకు అది ఎవరూ చెప్పినట్టు లేరు… విమర్శకులకు ఎడాపెడా ఇచ్చి పడేస్తున్నాడు…

యానిమల్ మూవీ

Ads

ఉదాహరణకు… కంగనా రనౌత్ ఎక్కడో మాట్లాడుతూ… ‘మహిళల్ని శృంగార వస్తువులుగా చిత్రీకరిస్తూ, బూట్లు నాకమని చెప్పే హీరో చిత్రాలను ప్రేక్షకులు ప్రోత్సహిస్తున్నారు… మహిళా సాధికారత మీద సినిమాలు తీసే నాలాంటోళ్లను ఈ ధోరణి నిరుత్సాహపరుస్తోంది’ అని విమర్శించింది… చాలా మందిలో ఆ అభిప్రాయం ఉంది, సరే, ఎవరి ఒపీనియన్ వాళ్లది అని వదిలేయాల్సిన వంగా సందీప్ వ్యంగ్యంగా ‘ఆమె రివ్యూ చేసినా పర్లేదు, విమర్శించినా సరే వోకే, నా చిత్రాల్లో ఆమెకు సరిపడా పాత్ర ఉంటే ఇస్తా’ అని తూలాడు…

kangana

ఆమె అసలే కంగనా కదా… ‘ఎహె ఊకో… రివ్యూకు, విమర్శకు తేడా తెలియకపోతే ఎలా..? నీ కామెంట్‌తోనే నాపై నీకున్న గౌరవం అర్థమవుతోంది… ఏ పాత్ర నాకు వద్దు, నేనేమీ వెయిట్ చేయడం లేదు… పాత్ర ఇచ్చినా సరే నేను చేయను… నేనే గనుక నీ పాత్రలు చేస్తే నీ అల్ఫా హీరోలు కాస్తా ఫెమినిస్టులు కావల్సి ఉంటుంది, బట్ అఫ్‌కోర్స్ ఇండస్ట్రీకి నువ్వు కావాలి, నీలాంటోళ్లు కావాలి’ అని అంతే వ్యంగ్యంగా చురకలు వేసింది… ఆమె కూడా ఎప్పుడూ తలెత్తుకుని తిరిగే కేరక్టర్ కదా మరి…

kangana

ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ కూడా యానిమల్ వంటి సినిమాలు ప్రమాదకరం అని ఓసారి కామెంట్ చేశాడు… వంగా ఆయనకు మరీ ఘాటుగా రిప్లయ్ ఇచ్చాడు… ‘నీ కొడుక్కి చెప్పు ముందుగా… మీర్జాపూర్ సీరీస్‌లో ప్రపంచంలో ఉన్న అన్ని బూతులూ ఉన్నాయి… నేను మొత్తం చూడనేలేదు, చూసినంత వరకు వాంతి వచ్చినంత పనైంది… మీ జావేద్ అక్తర్‌ను తన సినిమాల మీద దృష్టి పెట్టాలని సలహా ఇవ్వు ముందుగా’ అని చెడామడా ఇచ్చిపడేశాడు…

వంగా

అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు కూడా ఎక్కడో మాట్లాడుతూ ‘బోల్డ్ కంటెంట్, స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులు పెరిగేలా ఉంటున్నయ్ కొన్ని సినిమాలు’ అని వ్యాఖ్యానించింది… ఆ కోవ సినిమాలు అంటే ముందుగా గుర్తొచ్చేది యానిమల్ వంటి సినిమాలే కదా… ఆమెకూ సందీప్ ఏవో చురకలు పెట్టాడు… నీ భర్త నటించిన దిల్ సినిమా చూశావా అనడిగాడు… సందీప్‌‌తో గోక్కోవడం దేనికి అనుకున్నట్టుంది ఆమె…

వంగా

‘అబ్బే, నీ సినిమాల గురించి కాదయ్యా బాబూ, జనరల్ అబ్జర్వేషన్ చెప్పాను, మరి నువ్వెందుకు భుజాలు తడుముకుంటున్నావో నాకు తెలియదు’ అన్నట్టు రిప్లయ్ ఇచ్చింది… అంతే మరి… తనూ అర్జున్ రెడ్డి బాపతే కదా… ఇంకా నయం, తన సినిమాల్లోని బూతులు వాడలేదు, తిక్కలేస్తే అలా వాడేసే రకం కూడా…!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆల్ పార్టీ మీటింగు… నవ్వు పుట్టించే తెలంగాణ ప్రభుత్వ లేఖ…
  • Annamalai Breaks Free of His Shackles… Trouble Ahead for Palaniswami
  • నందూస్ వరల్డ్..! ఈ యూ-ట్యూబర్ చీటరా..? అసలేం జరుగుతోంది..?!
  • బంధనాలు తెంచుకున్న అన్నామలై… పళనిస్వామికి చుక్కలే…
  • రాత్రికిరాత్రి వైరల్ స్టార్… ఒక్క రాత్రికి నీ రేటెంత అనడిగేదాకా…
  • yudhvir ahlavath … హఠాత్తుగా సోషల్ మీడియాలో వైరల్… ఎందుకంటే…
  • రహేఁ నా రహేఁ హమ్…! ‘సుమనో’హర మధుర స్మృతి, ఒక మూగ వేదన..!
  • Rahen na rahen hum… remembering great singer suman kalyanpur…
  • ఆక్రమణ దురుద్దేశాలు లేకపోతే… చెరువులో ఈ కంచె ఏమిటయ్యా…!?
  • దుష్ట శిక్షకుడు పబ్లిక్ రౌడీ… చెడ్డ పనుల దుష్ట రౌడీ… బోత్ ఆర్ నాట్ సేమ్…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions