నిజంగానే అన్నీ మంచి శకునములే… పాజిటివ్ టైటిల్.., రొడ్డకొట్టుడు హీరో ఇమేజీ లేని హీరో… కాస్త మైండ్ ఉన్న దర్శకురాలు… ఆమె ఖాతాలో ఇప్పటికే ఓ బేబీ వంటి సినిమా… మిక్కీజేమేయర్ సంగీత దర్శకత్వం… మెరుగైన నటి, హీరోయిన్ మాళవిక నాయర్… అన్నింటికీ మించి భారీ తారాగణం… గౌతమి, వాసుకి… మరీ ముఖ్యంగా షాహుకారు జానకి… అసలు మహానటి, సీతారామంతో తమ టేస్టును ప్రూవ్ చేసుకున్న స్వప్నా దత్, ప్రియాంకా దత్… నిర్మాణవిలువలకు డబ్బు కొరత లేదు…
ఏం చూసినా మంచి శకునమే… అందుకే సినిమా టైటిల్ సరిగ్గా కుదిరింది… పైగా బీభత్సమైన పగలు, ప్రతీకారాలు, మాఫియా, చేతబడుల సినిమా కూడా కాదు… యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్ కూడా కాదు… ఐటమ్ సాంగ్స్, భీకరమైన యాక్షన్ సీన్ల మీద పెద్దగా నమ్మకం లేని దర్శకురాలు, నిర్మాతలు… అసలు ఫ్యామిలీ సినిమాలే రావడం లేని రోజుల్లో ఇలాంటి సినిమా పాజిటివ్ వైబ్‌తో రావడం కూడా మంచిదే… ఇంత పాజిటివ్ శకునములున్న సినిమా నిజానికి నడవాలని కోరుకుంటాం, తద్వారా ఇలాంటి మరో నాలుగు సినిమాలు రావాలనే ఓ చిన్న ఆశ… కానీ ఈ ఆశల్ని నందినీ రెడ్డి అడుగంటా ధ్వంసం చేసింది…
ఎవరూ బాధ్యులు కారు… ఈ సినిమా నిరాశపరచడానికి ప్రధాన కారణం దర్శకురాలే… కథ సేమ్ ఓల్డ్ చింతకాయ పికిల్… ఈమధ్యే ఏదో బన్నీ సినిమా చూశాం కదా…. శిశువులు మారిపోయే కథ… ఆ రెండు కుటుంబాల నడుమ ఏదో కాఫీ ఎస్టేట్ పంచాయితీ, అదే వైరం, అదే ఆస్తి గొడవ… కానీ వీళ్లిద్దరూ ప్రేమించుకుంటుంటారు… నిజంగా అది ప్రేమేనా..? నిఖార్సయిన స్నేహమా..? సినిమా పూర్తయ్యాక కూడా మనకు అర్థం కాదు… ఫాఫం దర్శకురాలికీ అర్థమైనట్టు లేదు…
Ads
మనమీద మనమే జాలిపడే మరో మైనస్ పాయింట్… సంగీత వైఫల్యం… ఒక్క పాటా గుర్తుండి చావదు… నీరసమైన నాసిరకం ట్యూన్లు… ఏ కొత్తదనమూ లేదు… అక్కడక్కడా రెండుమూడు కామెడీ బిట్లు, క్లైమాక్స్ గట్రా బాగున్నట్టు అనిపించినా ఓవరాల్‌గా సినిమా బోరింగ్… సీతారామం, మహానటి తీసిన నిర్మాతలు వీళ్లేనా అనిపించేలా..? వాళ్ల టేస్టు మంచిదే… కానీ దర్శకురాలు నందిని వైఫల్యమే నిర్మాతలన్నీ ముంచేసింది…
పలు సినిమాలు హీరోగా చేశాడు సంతోష్ శోభన్, కానీ ఏవీ సరిగ్గా క్లిక్ కాలేదు… ఈ తాజా ప్రాజెక్టు కూడా నిరాశే… నిజానికి సినిమాకు సినిమాకు నటుడిగా మెరుగుపడుతున్న సంతోష్ శోభన్‌కు ఓ హిట్ పడాలి… స్క్రీన్ ప్రజెన్స్ విషయంలో తనతోపోలిస్తే ఈ సినిమాలో మాళవిక నాయర్‌కు ఎక్కువ స్పేస్ దొరికింది… సరిగ్గానే వినియోగించుకుంది… ఆమెకు సరైన పాత్రలు పడాలే గానీ ఇరగదీయగలదు… కానీ మంచి పాత్రలు రావడం లేదు… ( ఈ నిర్మాతల తొలి సినిమా ఎవరే సుబ్రహ్మణ్యంలో కూడా మాళవికే హీరోయిన్…) ఇక గౌతమి, షాహుకారు జానకి, వాసుకిల గురించి కొత్తగా చెప్పడానికి ఏముంది..? అలాగే రాజేంద్రప్రసాద్, రావురమేష్, సీనియర్ నరేష్ తమ పాత్రల మేరకు ఒదిగిపోయారు… ఎటొచ్చీ కథాకథనాల విషయంలోనే దర్శకురాలి వైఫల్యం అందరి శ్రమను వృథా చేసేసింది…!!
Share this Article