Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పబ్బు వార్తలకు ఇది మరో కోణం… నిజాలు నిష్ఠురంగానే ఉంటయ్…

April 4, 2022 by M S R

‘‘తెలుగు సినిమాలు, సీరియళ్లలాగే రొటీన్ ఫార్ములా కథనాలు… అదుగో పబ్బు, డ్రగ్స్ గబ్బు, మత్తు హబ్బు, కల్చర్ నాశనం, భ్రష్టుపట్టిపోయింది, పెద్ద తలకాయలు, డబ్బు గబ్బు, మైకంలో సెలబ్రిటీలు…. వార్తల కోణం ఇదే, హెడింగులు ఇవే, పోలీసుల వెర్షన్‌తో మాత్రమే ఎడాపెడా దున్నేయబడుతున్నయ్… చాలామంది జర్నలిస్టులకు అసలు పబ్బుల్లోకి ఒక్కసారి అడుగుపెట్టిన అనుభవం కూడా ఉండదు… వాళ్ల జీతభత్యాలు పర్మిట్ చేయవు…

రాడిసన్ బ్లూ పబ్బుపై పోలీసుల దాడి, సెలబ్రిటీలు, రేవ్ పార్టీ, భగ్నం గట్రా వార్తల హోరు చదివారు, విన్నారు, చూశారు కదా… వేరే కోణం నుంచి, అంటే బార్లు, పబ్బుల వ్యాపారంపై అవగాహనతో సాగే లాజికల్ విశ్లేషణలు కూడా ఓసారి ట్రై చేయండి… అసలు కథలు ఇంకేవో ఉన్నయ్, అవి ట్రై చేయండి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీకి ఇలాంటి దుందుడుకు దాడులు దెబ్బ… అది గుర్తించండి…

  • మొదట ఏమన్నారు..? అనుమతించిన టైమ్ దాటాక పబ్బు నడుస్తున్నందున దాడులు జరిగినయ్ అన్నారు… కానీ బేసిక్‌గానే తప్పు, అది 24 గంటల పబ్బు… హైదరాబాదులో రాడిసన్‌తోపాటు నోవాటెల్‌కు మాత్రమే ఈ అనుమతి ఉంది, 24 గంటల విక్రయాలు అనే విషయం అక్కడి ఎక్సైజ్, పోలీసు అధికారులందరికీ తెలుసు…
  • ఐనా ఒకవేళ టైమ్ దాటాక నడుస్తున్నా సరే, దాడులు చేసి ఠాణాకు తీసుకుపోవాలా..? వినియోగదారుడు నేరస్థుడు ఎలా అవుతాడు..? వాళ్లు వ్యభిచార కొంపలకు వచ్చిన విటులు కాదు… టైమ్ దాటితే జరిమానాలు వేయండి, తెల్లారి పబ్బు మూసేయండి, ఓ డ్రింకర్‌ను ఆ రాత్రి అరెస్టు చేసినట్టుగా తీసుకుపోవడం దేనికి..?

ఓటీపీ… పాస్‌వర్డ్ దేనికి..? ఒకాయన ఏకంగా ఓ యాప్ ఉంటుంది, అందులో మనకు కావల్సిన డ్రగ్, పరిమాణం ఆర్డర్ ఇస్తే సరి, సప్లయ్ చేస్తారు అని ఓ ఎల్‌ఎస్‌డీ రేంజ్ వార్తను సర్వ్ చేశాడు… నిజానికి రాడిసన్ బ్లూ హై ప్రొఫైల్ పబ్… ఎవరినిపడితే వాళ్లను రానివ్వరు… చిల్లర కొట్లాటలు, న్యూసెన్సులు, నాన్‌సెన్సులకు చాన్స్ ఇవ్వకూడదని ఈ పాస్‌వర్డ్ సిస్టం… ఎవరైనా రెగ్యులర్ కస్టమర్ ఇంకొకరిని రికమెండ్ చేస్తే, పబ్ వాళ్లకు పాస్‌వర్డ్ పంపిస్తుంది… అది చూశాకే లోనికి రానిస్తారు… అదీ డ్రెస్‌కోడ్‌తో…

Ads

ఆ రాత్రి జరిగిన సడెన్ (డెకాయ్) దాడులతో రెగ్యులర్‌గా దాన్ని హ్యాంగవుట్‌గా చేసుకున్న విదేశీయులు ఠారెత్తిపోయారు… పబ్బు అనగానే అక్కడికి వచ్చిన ప్రతివారూ డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా పరిగణించేసి, ఠాణాకు తీసుకెళ్లడం పక్కా అన్ ప్రొఫెషనల్ పోలీసింగ్… ఒకవేళ డ్రగ్స్ పెడిలింగ్ జరుగుతుందని డౌటొస్తే, ముందుగా వాళ్లను ఐడెంటిఫై చేయాలి, టార్గెట్ చేయాలి… ఏదైనా రాకెట్ ఉంటే బరస్ట్ చేయాలి… అంతేతప్ప రెగ్యులర్ పబ్ కస్టమర్లందరినీ నేరస్థుల్లాగా తీసుకుపోవడం దేనికి..?

ఈ పబ్ రేణుకా చౌదరి చిన్న కూతురు పేరుతో ఉన్నమాట నిజమే, కానీ ఉప్పల అభిషేక్ లీజు తీసుకుని నడిపిస్తున్నాడు… తనకు ఈ దందాలో బ్యాడ్ రిమార్క్స్ ఏమీ లేవు… ఆయన మదర్ శారద రాజకీయాల్లో ఉంది… రెగ్యులర్ డ్రగ్స్ అడ్డాగా చేసి, అక్కడే విక్రయిస్తే… అంతమంది హైప్రొఫైల్ కస్టమర్లకు అది రెగ్యులర్ హ్యాంగవుట్ కాకపోయేది… ఒకవేళ కస్టమర్లు ఎవరైనా డ్రగ్స్ బయటి నుంచి తెచ్చుకుంటే దానికి పబ్ బాధ్యత ఏమీ ఉండదు… ఓ చిన్న పేపర్ ముక్క వంటి ఎల్‌ఎస్‌డీని తాగుతున్న మద్యం గ్లాసులో వేసుకుంటే ఎవరూ కనిపెట్టలేరు…

పబ్బుల దగ్గర డ్రగ్స్ పెడలర్స్‌కు వ్యవహారం ఈజీ… డబ్బు సమస్య ఉండదు, పోలీసుల రెగ్యులర్ తనిఖీలుండవ్, హైప్రొఫైల్ సర్కిల్ కస్టమర్లు దొరుకుతారు… అంతేతప్ప డ్రగ్స్ అవి మాత్రమే అడ్డాలు కావు, రేవ్ పార్టీలు, శివార్లలోని రిసార్టుల్లో సాగే స్పెషల్ పార్టీల్లో… డ్రగ్స్ మాత్రమే కాదు, అన్నిరకాల కంపు యవ్వారాలు నడుస్తుంటయ్… నిజానికి డ్రగ్స్ తీసుకోవాలనుకుంటే పబ్బే అవసరం లేదు, సరుకు దొరికితే ఏ మామూలు బార్‌లోనైనా నడిచిపోతుంది… చాలామంది కార్లలోనే కథ నడిపించేస్తుంటారు…

నీహారిక తెలుగు మీడియాకు తెలిసిన సెలబ్రిటీ కాబట్టి మీడియాకు అలా బుక్కయిపోయింది… ఇంకాస్త పెద్ద సెలబ్రిటీలు ఉండి ఉంటే గాలిదుమారం వాళ్ల మీదకు పోయేది… తను ఏవో పర్సనల్ ఇష్యూస్‌లో ఉంది, ఆ పబ్బుకి వచ్చింది సరే… మరి మిగతా 150 మంది..? మీడియాకు ఒకరిద్దరు నాయకుల బిడ్డలు, కొడుకులు మాత్రమే తెలుసు, తెలిసిన పేర్ల మీదే కాన్సంట్రేట్ చేసింది…

నిజానికి కొందరి పేర్లు ఇప్పటికీ పోలీసులు వెల్లడించలేదు… వాళ్లెవరు..? ఎందుకు దాచిపెట్టారు..? మరో కీలకప్రశ్న… ఒక పబ్బులో డ్రగ్స్ విక్రయ ఆరోపణలొస్తే సస్పెండ్ చేయాల్సింది అక్కడి ఎక్సయిజు వాళ్లను కదా, మరి లోకల్ సీఐని ఎందుకు సస్పెండ్ చేశారు..?

రెయిడ్స్ చేసిన సీఐని అదే ప్లేసులో ఎందుకు నియమించారు..? దాదాపు 40 మందిని ఎస్కేప్ చేయించారని… అంటే స్టేషన్‌కు గాకుండా పబ్ నుంచే నేరుగా ఇళ్లకు పంపించేశారని అంటున్నారు..? వాళ్లంతా ఎవరు..? అసలు పోలీసులు టార్గెట్ చేసింది ఎవరిని..? ఎస్కేప్ అయినవాళ్లలో ఉన్నారా..? వాళ్లు డ్రగ్స్ అమ్మకందారులా..? డ్రగ్స్ దందాకు సూత్రధారులా..? అదే నిజమైతే వాళ్లనే కాన్సంట్రేట్ చేయకుండా ఇలా దొరికిన వాళ్లందరినీ పట్టుకుపోవడం దేనికి..?

అక్కడ రెండుమూడు బర్త్‌డే పార్టీలు జరిగినట్టున్నయ్… నిజం చెప్పాలంటే, డ్రగ్స్ కాదు, అందరూ మందు తాగాలని కూడా ఏమీ లేదు… పార్టీకి వచ్చినవాళ్లలో ఒకరిద్దరు కేవలం బ్రీజర్ తాగే బ్యాచ్ కూడా ఉంటారు… అక్కడికి అందరూ మందు తాగి, డీజే సౌండ్‌కు ఊగిపోతూ, సోలిపోయే బాపతు కస్టమర్లే రారు… కళ్లు బైర్లు కమ్మే లైట్లు, చెవులు పగిలే సౌండే కాదు… ఓ పక్కన కూర్చుని, గంటల తరబడీ దోస్తులతో హసీమజాక్ ముచ్చట్లు చెప్పుకుని కాలం గడిపే వాళ్లూ బోలెడు మంది…

అక్కడ 5 గ్రాముల కొకైన్ దొరికిందీ అంటున్నారు… అంతమంది డ్రగ్స్ సేవిస్తే ఈ 5 గ్రాముల సరుకు ఎవడి ముక్కులోకి సరిపోతుంది..? రాహుల్ ఏమన్నాడు..? నాగబాబు ఏమన్నాడు..? ఉప్పల శారద ఏమంటోంది..? ఇవి కాదు… ఠాణాకు తీసుకెళ్లబడిన విదేశీ యువతులతో మాట్లాడి, వాళ్ల వెర్షన్ రాస్తే బాగుండేది..!!

తెల్లవారే 140 పైచిలుకు వ్యక్తుల పేర్లు, అడ్రెస్సులు, ఫోన్ నంబర్ల జాబితా మీడియాలో ప్రత్యక్షమైంది… అదెలా కరెక్టు..? వాళ్లందరి మీద డ్రగ్స్ వ్యసనపరులనే ముద్రవేయడం (పరోక్షంగా) ఎలా సమంజసం..? పోలీసుల సాయం లేనిదే ఆ జాబితా ఎలా మీడియాకు ఎక్కింది..? దానివల్ల పోలీసులకు వచ్చే ప్రయోజనం ఏమిటి..?

చివరగా :: కొన్నాళ్ల క్రితం ఏం జరిగింది..? అకున్ సభర్వాల్ అత్యుత్సాహంతో సినిమా సెలబ్రిటీలను విచారణకు పిలిచి నానా హంగామా చేశాడు… ప్రచారం… హైదరాబాద్ అంటేనే డ్రగ్స్ అడ్డా అన్నట్టుగా నెగెటివ్ ఇమేజీ… ఏదో అంతర్జాతీయ టెర్రరిస్టుల్ని పట్టుకున్నంత హడావుడి… చివరకు ఏం జరిగింది..? ఏమీ జరగదు..? డ్రగ్స్ తీసుకునేవాడు నేరస్థుడు కాదు, బాధితుడు… గోళ్లు, వెంట్రుకలు గట్రా సేకరించి డ్రగ్స్ తీసుకున్నట్టు నిరూపించినా సరే, రీహాబిలిటేషన్ సెంటర్లలో చేర్చమంటుంది కానీ కోర్టు జైలులో పారేయండి అని చెప్పదు… మరి ఈ 150 మందిని ఠాణాకు ఎందుకు తీసుకుపోయినట్టు..?!’’

……… ఇదంతా ఈ పబ్బులు, క్లబ్బులు, బార్ల దందాపై కాస్త అవగాహన ఉన్న ఒకతని వెర్షన్… అన్నీ నిజాలే కాకపోవచ్చు, లాజిక్ లేని ప్రశ్నలు కూడా ఉండవచ్చు… కానీ ఇది నాణేనికి మరో కోణం… మెయిన్ స్ట్రీమ్ మీడియా కవరేజీ పూర్తిగా ఒక కోణంలోనే సాగింది… వాళ్లందరికీ మంచిగైంది, బాగైంది అనే తరహాలో ఉంది… జస్ట్, ఫర్ డిబేట్ సేక్… ఓ జర్నలిస్టు ఓ బార్‌లో పార్టీ ఇస్తున్నాడు… ఈలోపు పోలీసులు వచ్చి, ఠాణాకు నడవండి అని నిర్బంధంగా తీసుకుపోయారు… అదేమంటే డ్రగ్స్ యూజ్ అని డౌట్ అన్నారు… అప్పుడు జర్నలిస్టులు ఏమని ప్రశ్నిస్తారు..? స్పందన ఏమిటి..?! ఆ ప్లేసులో హైలీ పెయిడ్ లీగల్ పర్సనాలిటీస్ ఉండి ఉంటే..? ఇంకాస్త పెద్ద తలకాయలు ఉండి ఉంటే…!?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!
  • Dekh Thamaashaa Dekh… ఓ కోర్టు కేసు విచారణపై ఫన్నీ ప్రజెంటేషన్…
  • పాపం ఉండవల్లి, ఎంత లాజిక్స్ మాట్లాడేవాడు, ఎలా అయిపోయాడు..?
  • కథ ప్రజెంట్ చేసే దమ్ముండాలే గానీ… పనిమనిషి కూడా కథానాయికే…
  • పర్లేదు, వితండవీరులు కూడా చదవొచ్చు ఈ కథను… కథ కాదు, చరిత్రే…
  • ఒక పనిమనిషి మరణిస్తే ఇంత దయా..?! ఇప్పటికీ వెంటాడే ఆశ్చర్యం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions