Sharath Kumar ……….. బాహుబలితో nationwide exposure వచ్చింది. appreciation ఇంకా acceptance వచ్చింది. ఈ benefits దగ్గరే ఆగిపోయి ప్రభాస్ తన next సినిమాలు దేశం మొత్తం release చేసుకోవచ్చు. కానీ ‘pan indian star’ అనే image కూడా వచ్చింది. ఈ image అనేది ఒక గొప్ప అందమైన switzerland prison లాంటిది. ఒక pleasurable attachment. ఎంతో గొప్పగా ఉంటుంది కానీ ఎన్నో పరిమితులు ఉంటాయి. ఎంతో అందంగా ఉంటుంది కానీ ఒక బందీ అయ్యిపోయి మసులుకోవాల్సి వస్తుంది.
ఈ image తన fans ఇంకా audience అభిమానంతో తయారుచేసుకున్నప్పటికీ, దాన్ని own చేసుకోవడం/చేసుకోకపోవడం ప్రభాస్ control లో ఉంటుంది. కానీ అతనూ ఒక సాధారణ మనిషే కాబట్టి ఆ label అతనికి నచ్చింది. ఇంత grand image వచ్చినపుడు, సినిమాలు కూడా అంతే rich గా ఇంకా grandeur తో తీయాల్సిన motivation ఇంకా pressure ఉంటుంది. (general గా ధనికులు పెళ్లిళ్ల మీద విపరీతంగా చేసే ఖర్చుతో దీన్నే relate చేసుకోండి)
ఇలాంటి image ఉన్నవాళ్ళకి మంచి demand, good openings ఉంటాయి. మంచి collections వచ్చే opportunity ఉంటుంది. అలాంటప్పుడు remuneration కూడా పెరుగుతుంది కదా? పెరిగింది. prabhas 100-150 crores తీసుకుంటున్నాడు అంటున్నారు. అంటే అర్ధం, అతను 100-150 కోట్ల లోపు ఉన్న movies లో ఇక నటించలేడు అని.
general గా మాట్లాడుకుంటే ప్రభాస్ కే approx 100 ఇచ్చినప్పుడు, మిగతా సినిమా అంతా ఏ producer అయినా 50-100 లోపు తీస్తాడా? తన image తో 500 crore invest చేయించగలిగే actor, 500 ని కాదని కేవలం ఒక 50-100 crore మూవీ మనకి చూపించడానికి ఒప్పుకుంటాడా? అది అతని image కి సరిపోతుందా? సరిపోదు. 500 పెట్టగలిగే producers easy గా దొరుకుతారు. దొరికారు. వాటిని ఒప్పుకున్నాడు.
ఇప్పుడు ఆ మూడు-నాలుగు వందల కోట్లు ఎక్కడ పెట్టాలి? కథ మీదా? మంచి కథలకి అన్ని కోట్లు అవసరమే లేదు. 10-50 చాలా ఎక్కువ. ఇలా తక్కువ budget తో తీసి మంచి success చుసిన movies ఎన్నో ఉన్నాయి. అందుకే కథ ఏదయినా, దాన్ని పక్కన పెట్టి ఆ డబ్బంతా grandeur మీద పెడతారు. vfx అనేది కూడా ఒక saleable aspect. మీకు visual treat అని చెప్తూ ఉంటారు కదా? అది!
300 కోట్లు vfx మీద పెడుతున్నప్పుడు, అందరి focus దేని మీద ఉంటుంది? కథ మీదా vfx మీదా? vfx లేదా ఇంకోటో, వాటి మీద విపరీతమైన energy time money emotions need పెట్టడం వల్ల కథ మీద శ్రద్ధ చాలా తగ్గుతుంది, కథలో substance ఉన్నా కూడా. moreover, vfx బాగా లేకపోయినా, బాగుండి కూడా కథకి sink అవ్వకపోయినా అది ఇంకో biscuit.
అందుకే acting అందరూ బాగా చేస్తున్నారా, కథ మీద effort పెడుతున్నారా, audience emotional గా connect అయ్యే విధంగా scene వస్తుందా లేదా అనేదానికంటే, burden మొత్తం prabhas fan base ఇంకా image మీద పెట్టేసి, దేని మీద అయితే డబ్బు ఎక్కువ invest చేస్తున్నారో దాని మీదే పూర్తి focus పెడుతున్నారు.
డబ్బులు, resources ఉంటె సరిపోతుందా?….. ఆ grandeur ని handle చేయగలిగే skill ఉండాలి కదా? అలాగే కథని right గా చెప్పే skill ఉండాలా?
ఇవి రెండూ equal గా balance చేయగలిగేలా ఇంకో skill కూడా అవసరమే కదా? ఇవి ప్రతీసారి ఎక్కడో miss అవుతుంది. ఇంకా vfx తో మనం attract చేయగలిగే chances ఎన్ని?
Hollywood నుంచి వచ్చే super hero movies అందరం చూసినవాళ్ళమే. ott లో ప్రతీ ఒక్కరికి available లో ఉన్నదే… వాళ్ళ vfx ఇంకా grandeur ముందు మనం ఎన్నో సంవత్సరాలు budget, skill ఇంకా experience వెనక్కి ఉంటాము. ఆ high standard చూసి చూసి మన vfx కి ఎట్లా attract అవుతాము? అభిమానంతో బాగుంది, పర్లేదు, చూడొచ్చు అనుకోడం కంటే? అందికే డబ్బు ఖర్చుపెట్టినట్టు మాత్రమే మనకి అర్ధమవుతుంది. కథ ఇంకా grandeur అంతగా impress చేయలేకపోతోంది.
మనకున్న reasonable strength ఏంటి? కథ, నటన ఇంకా emotions. వాటి మీద focus పెట్టకుండా మనం attract చేయలేని వాటి మీద ఎక్కువ focus పెడితే ఏం జరుగుతుంది? ప్రభాస్ last 3 movies లాగా ఉంటుంది. మనకి ఒక diverse population ఉంది. ఏదో ఒక కథ pick చేసుకుని దాని originality ఇంకా nativity miss అవ్వకుండా తీసి అందరికీ చూపించాలి. కానీ pan india కాబట్టి, అందరినీ satisfy చేయాలి కాబట్టి, సరిగ్గా అతకని fragments అన్నీ ఏరుకొచ్చి తీయడం లేదా అందరూ relate చేసుకునేలా ఒక hollywood effect వచ్చేలా తీయటం చేస్తున్నారు కథని గాలికి వదిలేసి..
vfx మనకి wonder, excitement ఇంకా fascination లాంటి emotions ఇస్తుంది. ఈ emotions కొంచెం superficial. వాటి ప్రభావం తక్కువ కాలం ఉంటుంది. మర్చిపోతాం. కానీ ఒక మంచి emotion filled story మనకి sadness, fear, hope, suspense, satisfaction ఇంకా connection లాంటి deep ఇంకా core emotions ని ఇస్తుంది. వీటి ప్రభావం ఎక్కువ. సంవత్సరాలు గడిచినా మరిచిపోము.. ఆ nostalgic feeling ఉండిపోతుంది. ఏది important తెలుసుకోలేకపోవడం వల్ల వచ్చిన problem ఇది వాళ్ళకి.
ఆ grandeur బాగున్నా satisfaction ఉండట్లేదు, కథ నటన core emotions ని compromise చేసేసారు కాబట్టి. image ని పక్కన పెట్టి, story ఇంకా నటన మీద దృష్టిపెట్టి, remuneration కాకుండా collections లో percentage లు మాట్లాడుకునే వరకూ ఇదిలాగే continue అవుతుంది. ఎప్పుడైనా అదృష్టం బాగుండి మంచి skill ఉన్న director ఇంకా story దొరికితే, hit అవ్వోచ్చేమో. But అసలు విషయం అర్ధం అవ్వనంత వరకు ఇదే repeat అవుతుంది. అది matter! నాకు అనిపించింది!
Share this Article