Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బుడ్డిమంతుడు Vs బుద్ధిమంతుడు… బాపు క్లాస్ & మాస్ సినిమా…

February 26, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ……… బాపు గారి క్లాస్ & మాస్ సినిమా . ఉత్తర ధృవం , దక్షిణ ధృవం లాంటి రెండు వైరుధ్య పాత్రల్లో ANR గొప్పగా నటించారు . మాధవాచార్యులు , గోపాలాచార్యులు . విప్ర నారాయణ గుర్తుకు వస్తుంది మాధవాచార్యుల పాత్రను చూస్తుంటే .

బడి vs గుడి . ఏది ముఖ్యం ? ఇప్పటి రోజుల్లో గనక ఇలాంటి చర్చను సినిమాలో పెడితే , ఆ సినిమాను బహిష్కరించమని సోషల్ మీడియాలో పిలుపు ఇస్తారు . ఘట్టి ఆస్తికులు ఇదే చర్చ మసీదుకు , చర్చికి కూడా పెడతారా అని నిలదీస్తారేమో కూడా .

Ads

భూమ్మీద సుఖపడితే తప్పు లేదురా బులబాటం తీర్చుకుంటే తప్పు లేదురా అనే చార్వాకం పాట , నను పాలింపగ నడిచీ వచ్చితివా మొరలాలింపగ తరలీ వచ్చితివా గోపాలా అనే భక్తితో నిండిన పాట రెండు విభిన్న జీవన శైలులను చూపిస్తాయి . ఇంత కన్నా గొప్ప వేదాంత చర్చ ఏముంటుంది !!

anr

గుడిలో ఏముంది అంతా బడిలోనే ఉంది అనే ఎర్ర పాట … తోటలోకి రాకురా తుంటరి తుమ్మెదా గడసరి తుమ్మెదా.., పచ్చి మిరపకాయలాంటి పడుచుపిల్లరో దాని పరువానికి గర్వానికి పగ్గమేయరో.., గుట్ట మీద గువ్వ కూసింది కట్ట మీద కౌజు పలికింది పాటలు శ్రావ్యంగా ఉంటాయి .

కుర్రాళ్ళంగా ఉన్న రోజుల్లో భూమ్మీద సుఖపడితే తప్పు లేదురా అనే హుషారయిన పాట ఫేవరేట్ సాంగ్ . కంఠస్థం చేసాం కూడా . బాపు గారంటే నదులు , పడవలు , తోటలు , ప్రకృతి ఉండాలి కదా ! ఈ పాట బోటు మీదనే .

మరో గొప్ప పాట టాటా వీడ్కోలు గుడ్ బై ఇంక సెలవు . కె వి మహదేవన్ సంగీతం , ఆరుద్ర , దాశరధి , నారాయణరెడ్డిల సాహిత్యం అద్భుతం . ఈ సినిమాలో పాటలు పాపులర్ కావటానికి సంగీతం దోహదపడిందా లేక సాహిత్యం దోహదపడిందా అనే చిరకాల చర్చను గుర్తుకు తెస్తుంది .

ముళ్ళపూడి వారి మాటలు తూటాలే . సినిమాలో చాలా డైలాగులు ఆ తరం ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తే . నాగభూషణాన్ని ఏడిపించే గుమ్మడి కాయ ప్రహసనం సరదాగా ఉంటుంది . చాలా గ్రామాల్లో ఆరోజుల్లో పాఠశాలలు ఎలా ఉంటాయో చక్కగా చూపించారు .

విజయనిర్మలకు ANR సరసన హీరోయిన్ గా చక్కని పాత్ర . తల్లిగా శాంతకుమారి పాత్ర , ఆమె నటన చాలా గొప్పగా ఉంటుంది . నాగభూషణం , అల్లు రామలింగయ్య , రుక్మిణి , సూరేకాంతం , గుమ్మడి , కృష్ణంరాజు , సంధ్యారాణి , భానుప్రకాష్ , పద్మనాభం ప్రభృతులు నటించారు .

ఈ సినిమాలో మరో హైలైట్ మాధవయ్య కృష్ణునితో తాదాత్మ్యత చెందుతూ కబుర్లు చెప్పటం . ANR , శోభన్ బాబుల చేత బాపు ఎంత బాగా నటింపచేసారంటే మనమే కృష్ణుడితో మాట్లాడుతున్నామా అని అనిపిస్తుంది . సూపర్బ్ సన్నివేశాలు . నిత్యం పూజించుకునే దైవానికి దూరం చేసినప్పుడు మాధవయ్య పాత్రలో ANR నటన మరచిపోలేనిది .

షూటింగ్ ఎక్కువగా తూర్పు గోదావరి జిల్లాలోని ర్యాలీ , వెలిచేరు ప్రాంతాలలో జరిపారు . సాక్షి కూడా ఈ ప్రాంతంలోనే తీసారట . స్టూడియోలలో కృత్రిమ సెట్టింగులలో సినిమా తీయడమంటే బాపు గారిని చీకటి కొట్లో బంధించినట్లే . ఆయన్ని ప్రకృతికి వదిలేస్తే , స్వేఛ్ఛగా హాయిగా మనస్ఫూర్తిగా సినిమా తీసుకుంటారు . 1975 లో తమిళంలోకి , 1994 లో హిందీ లోకి రీమేక్ అయింది .

యూట్యూబులో ఉంది . ఈ తరంలో చూడని పిల్లకాయలు ఎవరయినా ఉంటే అర్జెంటుగా చూసేయండి . ఇలాంటి క్లాస్ & మాస్ కళాఖండం చూడకపోతే ఎలా !? Hats off to Bapu , the Romantic – Theistic – Nature Director . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమా_కబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆదిత్య ధర్… యామీ గౌతమ్… వెరీ పాపులర్ బాలీవుడ్ జంట ఇప్పుడు…
  • జగన్ క్యాంప్ ఎంత డిఫన్స్‌లో పడిందంటే… ఇదుగో ఈ యాడ్ పక్కా రుజువు…
  • ఏది ఉషోదయం..? ఏది పరాభవం..? ఎవడి నవ్వు, ఎవడి ఏడుపు..?
  • సారీ గబ్బర్ సింగ్..! ఈ సనాతన సీక్వెల్‌లో ఏదో మిస్సయింది..!!
  • తొండల భాషకు స్వస్తి… సెటైర్లతో ఎద్దేవా… రేవంత్ స్టయిల్ మారింది…
  • ప్రస్తుతం తమిళనాడు పొలిటికల్ ముఖచిత్రం ఎలా ఉందంటే..? ఫుల్ పిక్చర్..!!
  • ఆ బూతు రోత పాటపై అందరూ లెంపలేసుకుంటున్నారు..! కానీ..?
  • ఎవరు ఈ లారీజానీ..? ఇరాన్ ‘మాస్టర్ మైండ్’నే లేపిన ఇజ్రాయిల్..!!
  • వైఎస్ విజయమ్మ ‘ఫరమ్’ అటాక్… ఆస్తుల పంచాయితీలో జగన్‌కు షాక్…
  • ఈ ఒక్క దాడితో… ఇక ప్రపంచవ్యాప్తంగా ఇంధన విధ్వంసం..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions