.
ఉగ్రవాదులు మతం పేరిట సాగించిన పైశాచికాన్ని చూశాం… మతం ఖరారు చేసుకుని మరీ చంపారు… ఫేక్ సెక్యులరిస్టులు ఎంత దాచాలనుకున్నా, ఆ ఆగ్రవాదానికి పరోక్షంగా మద్దతు పలుకుతున్నా జాతికి అర్థం అవుతోంది…
ఆ పైశాచికానికి పాల్పడిన మతానికి చెందిన ఓ సోదరి, ఖురేషి… రాత్రి జరిగిన ఇండియన్ స్ట్రయిక్స్‌ను లీడ్ చేసింది… అదీ ఈ దేశపు గొప్పతనం… ముందు దేశం, తరువాతే మతం, తరువాతే కులం, తరువాతే ప్రాంతం… ఈ భావనను ప్రేమించే ప్రతి ఒక్కరికీ వందనాలు…
Ads
మహిళలతోనే ఈ దాడుల్ని ఎందుకు చేయిస్తున్నారు అనడానికి రకరకాల జీహాదీ నమ్మకాల కారణాలను చాలామంది ప్రచారంలోకి తీసుకొస్తున్నారు గానీ… నేనిక్కడ వాటి జోలికి పోవడం లేదు… కానీ ఆపరేషన్ సిందూర్ అని పేరు పెట్టడం పట్ల భారతీయ మహిళల్లో ఓరకమైన ఆనందం కనిపిస్తోంది…
సిందూర్ అంటే మాంగల్యం, సిందూర్ అంటే మన భారతీయ వైవాహిక వ్యవస్థలోని పవిత్రతకు ఓ సూచిక… ఐతే సూడో సెక్యులరిస్టులకు, దేశం మీద ఉగ్రదాడిని కూడా యాంటీ బీజేపీ కళ్లద్దాలతో చూసే తుచ్ఛత్వానికి ఈ పదం నచ్చడం లేదట…
ఒకతి, గతంలో ది హిందూలో పనిచేసిందట… ఫ్రంట్ లైన్ ఎడిటర్ అట… పేరు వైష్ణారాయ్…
ది హిందూ అంటేనే యాంటీ హిందూ కదా… పక్కా చైనా బానిస… మొన్నమొన్నటిదాకా దాని కవలసోదరి ఎన్డీటీవీ, ఈమధ్య యాజమాన్యం మారింది… అసలు ఇదుగో ఇలాంటి భావజాలమే భారతీయ పాత్రికేయాన్ని నడిపించింది… ఆమె ఏమంటున్నదంటే…
‘‘సిందూర్ అనే పదాన్ని ఈ ఆపరేషన్‌కు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నాను… అది పితృస్వామ్య సూచిక, మహిళపై యాజమాన్య సూచిక, పరువు హత్యలకు సూచిక, శీలానికి సూచిక, వైవాహిక వ్యవస్థ దుర్వాసనల సూచిక, హిందుత్వ పెడపోకడలకు సూచిక…’’
ఖచ్చితంగా ఈమె బుర్ర కుళ్లిపోయి ఉన్నట్టుంది… ది హిందూలో పనిచేసిన బాపతు కదా… అంతే… సిందూర్ అనే పదానికీ ఈమె చెబుతున్న ఇన్ని పదాలకూ లింక్ ఉందా..? చివరకు పరువు హత్యలకు కూడా ఇదే సూచిక అట… గాడ్ సేవ్ హర్…
ఇంకా నయం… గృహహింసకు, కట్న వేధింపులకు, మహిళల అణిచివేతకూ సిందూర్ ఓ ప్రతీక అని సూత్రీకరించలేదు… మరొకామె సిందూర్ అనే పదాన్ని వెటకరిస్తూ ఏదో పోస్టు పెట్టింది, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే ఈ అంశాల్లో ప్రభుత్వ వ్యతిరేక, జాతి వ్యతిరేక పోస్టులకు పాల్పడితే చర్యలు తప్పవు అని రేవంత్ రెడ్డి హెచ్చరించాడు కదా, దానికితోడు నెటిజనం పెద్ద ఎత్తున విరుచుకుపడటంతో ఆ పోస్టు డిలిట్ చేసుకుంది…
వీళ్లందరూ ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు..? మరొకామె… పాకిస్థాన్ హ్యాండిల్స్ ఆపరేట్ చేస్తున్న ఫేక్ క్యాంపెయిన్‌ను యథాతథంగా షేర్ చేస్తోంది… ఆమె ప్రగతి శీల మహిళా శక్తికి జాతీయ స్థాయి హోదాలో ఉందట… ఇవి జస్ట్, కొన్ని ఉదాహరణలు…
కొందరు మహిళలు రుద్రకాళి అవతారాలెత్తి ఉగ్రవాద పైశాచికంపై సాహసోపేత యుద్ధం ప్రత్యక్షంగా చేస్తుంటే… ఇదుగో వీళ్లు ఇలా… కుళ్లిపోయిన మెదళ్లు… మన జాతి ఖర్మ కాలి…! అనేకమంది, సోకాల్డ్ వీర సెక్యులరిస్టులు… రేప్పొద్దున ఆ ఉగ్ర తుపాకీ వాళ్ల పక్కన క్లోజ్ రేంజులో గురిపెట్టి రాక్షసంగా నవ్వుతుంటే గానీ అర్థం కాదు వీళ్లకు…
సందేహం ఉంటే బెంగాల్‌లో ముజఫర్‌నగర్ వంటి ఏరియాలను హస్తగతం చేసుకున్న రోహింగ్యాలు, బంగ్లా వలస పౌరులు ‘అచ్చం అప్పట్లో కశ్మీర్‌లో’ జరిగినట్టే దళితులను అక్కడి నుంచి బెదిరించి, నిర్బంధంగా వెళ్లగొడుతున్నారు… వీళ్లకు తెలుసా, తెలుసుకున్నారా..? అలాంటివి పలు ప్రాంతాల్లో కోకొల్లలు..!!
Share this Article