Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అనుపమ నామ సంవత్సరం… అనుకోకుండా అందివచ్చిన సక్సెస్ అదృష్టం…

December 31, 2022 by M S R

అనుపమ నామ సంవత్సరం… ఈ మాట అనడానికి పెద్దగా సందేహించనక్కర్లేదు… ఎందుకంటే..? 2015లో ఇండస్ట్రీకి వస్తే, మొన్నమొన్నటిదాకా ఆమెకు పేరు తెచ్చిన పాత్ర లేదు… చివరకు సెకండ్ లీడ్ పాత్రలు కూడా చేసింది అఆ సినిమాలో చేసినట్టు..! తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో సినిమాలు చేస్తున్నా… కొన్ని హిట్లు పడినా సరే… ఆమెకు దక్కిన ఫాయిదా మాత్రం ఏమీ లేదు…

2022లో కూడా ప్రథమార్థంలో దిల్ రాజు సోదరుడి కొడుకుతో రౌడీ బాయ్స్ అని ఓ సినిమా చేసింది… ఫట్… అంటే సుందరానికి సినిమాలో ఓ పాత్ర… మరీ అతిథి పాత్ర… తనకు ఆల్‌రెడీ పెళ్లయింది… ఇక నటన మీద ఆసక్తి పోతుందేమో, ఎలాగూ అన్నీ తనకు ఉపయోగపడటం లేదు అనుకుంటున్న దశలో… కార్తికేయ-2 సినిమా చాన్స్ దొరికింది…

అది కాస్తా పాన్ ఇండియా రేంజులో హిట్… నిఖిల్ సిద్ధార్థ రాత్రికిరాత్రి స్టార్ అయిపోయాడు… తనతోపాటు అనుపమకూ పేరొచ్చింది… తన పాత్ర అందులో పరిమితమే కావచ్చుగాక, కానీ ఆ రేంజ్ హిట్‌లో ఆమె కూడా పార్టనరే కదా… దేశమంతా పరిచయం అయిపోయింది… తరువాత 18 పేజెస్… సినిమా నాణ్యత మీద కొన్ని భిన్నాభిప్రాయాలు ఉండవచ్చుగాక… కానీ ఆల్‌రెడీ లాభాల్లోకి వచ్చింది సినిమా… అశ్లీలం, అసభ్యత లేకుండా ప్లజెంటుగా ఉండి, ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది…

Ads

anupama

తాజాగా బట్టర్ ఫ్లై సినిమా… ముందే కుదిరిన ఒప్పందం మేరకు హాట్ స్టార్ ఓటీటీలో రిలీజ్ చేశారు… ఇందులో కూడా సినిమా పోకడ పట్ల కొందరికి అసంతృప్తి ఉండవచ్చుగాక… కథాకథనాల మీద దర్శకుడి అశ్రద్ధ సినిమాను చెడగొట్టి ఉండవచ్చుగాక… కానీ ఇందులో హీరో, హీరోయిన్ అనుపమే… తను సొంతంగా ఓ సినిమాను తన భుజాల మీద మోసేంత సీన్ ఉందా అనే సందేహాలను పటాపంచలు చేసింది ఆమె… నిజానికి ఆ సినిమాలో పాత్ర తనకు పెద్ద పరీక్ష ఏమీ పెట్టలేదు…

కానీ సినిమాలో తను తప్ప మరో ప్లస్ పాయింట్ లేదు… ఆమె కనిపిస్తున్నంతసేపు బాగుంది… లేడీ ఓరియంటెడ్ సినిమాల్ని కూడా నేను చేయగలను అని మాత్రం ఆమె ప్రూవ్ చేసుకుంది… మరో మంచి పాత్ర పడితే అనుపమ కెరీర్ మరింత వేగం పుంజుకుంటుంది… బట్టర్ ఫ్లై సినిమా జయాపజయాల్ని పక్కన పెట్టండి… ఆమె చేతిలో మూడు సినిమాలున్నయ్ ఇప్పుడు… తెలుగు, తమిళం, మలయాళం…

డీజే టిల్లు సీక్వెల్… టిల్లు స్క్వేర్‌లో చేస్తోంది… తమిళంలో సిరెన్ అనే సినిమా చేస్తోంది… ఇవి రెండూ నిర్మాణంలో ఉన్నయ్… మలయాళంలో జేఎస్కే, ట్రుత్ ఆల్వేస్ ప్రివైల్ అనే సినిమా ఉంది ఆమె చేతిలో… పర్లేదు, నిలబడింది… ఇక ఆమె కెరీర్ అయిపోయినట్టే అనుకునే దశలో అదృష్టం తలుపుతట్టింది… వెంటనే ఆహ్వానించి సద్వినియోగం చేసుకుంది… అనుపమా, కీప్ రాకింగ్…!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!
  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions