.
Subramanyam Dogiparthi ………. ఇది angelic beauty శ్రీదేవి సినిమా . ఆమే అనురాగ దేవత . యన్టీఆర్ అంతటి మహానటుడు హీరో కాబట్టి ఆమెను ఈ సినిమాకు షీరో అనలేను .
అంతే కాదు , ఆరాధన సినిమాలో హీరో పాత్రలాగానే ఈ సినిమాలో కూడా హీరో పాత్ర ప్రాధాన్యత కలదే . లేనట్లయితే స్వంత బేనర్ రామకృష్ణ సినీ స్టూడియోస్ మీద యన్టీఆర్ ఈ సినిమాను తీసి ఉండేవారు కాదు .
Ads
1982 సంక్రాంతికి వచ్చిన ఈ అనురాగ దేవత సినిమా హిందీలో హిట్టయిన ఆషా సినిమాకు రీమేక్ . హిందీలో జితేంద్ర , రీనారాయ్ , తాళ్ళూరి రామేశ్వరి 1+2 పాత్రల్లో నటించారు . తెలుగులో బాలకృష్ణ (బాలయ్య) నటించిన పాత్రను హిందీలో గిరీష్ కర్నాడ్ నటించారు .
వంద రోజులు ఆడిన మన తెలుగు సినిమాలో యన్టీఆర్ , శ్రీదేవి , జయసుధలతో పాటు బాలయ్య , గుమ్మడి , అల్లు రామలింగయ్య , నూతన్ ప్రసాద్ , మిక్కిలినేని , కవిత , అన్నపూర్ణ , బేబీ అనూరాధ ప్రభృతులు నటించారు .
తాతినేని రామారావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యన్టీఆర్ నటన రొటీన్ సినిమాలకు కాస్త డిఫరెంటుగా స్టేబుల్ గా ఉంటుంది . ఆరాధన సినిమా గుర్తుకొస్తుంది . అన్నపూర్ణ యన్టీఆర్ తల్లిగా నటిస్తుంది .
ఈ సినిమా విజయానికి ప్రధాన కారణాలలో ఒకటి చక్రవర్తి సంగీతం . పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి .
అందాల హృదయమా నా అనురాగ నిలయమా ఐకానిక్ సాంగ్ . చాలా శ్రావ్యంగా ఉంటుంది . అలాగే మరో శ్రావ్యమైన పాట చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంగా . ఆడవే గోపికా ఆడవే దీపికా , నీ ఆట నా పాట పదిమంది చూడాలీ పూట పాటలు కూడా చాలా శ్రావ్యంగా ఉంటాయి .
నీ ఆట నా పాట అనే పాటలో యన్టీఆర్ , శ్రీదేవిల డాన్సులు బాగుంటాయి . అన్ని పాటల్లోను శ్రీదేవి నృత్యాలు చాలా అందంగా ఉంటాయి . ఒక సన్నివేశంలో పాట లేకుండా శ్రీదేవి నృత్యం అచ్చం పురి విప్పి నృత్యించే నెమలి నృత్యంలా ఉంటుంది . A watchable one .
విజయవాడ కనకదుర్గమ్మ ఘాట్ రోడ్లో షూట్ చేయబడిన ముగ్గురమ్మల కన్న ముద్దుల మాయమ్మ ప్రేక్షకులకు బాగా నచ్చింది . నాకు ఇష్టమైన సీన్ . అప్పట్లో విజయవాడ కనకదుర్గమ్మ గుళ్ళో షూటింగులు తక్కువ . దుర్గమ్మ గుడి అనగానే మన గుడి అనిపిస్తుంది కదా !
వేటూరి , వీటూరిల సాహిత్యం చక్రవర్తి సంగీతం , సుశీలమ్మ , బాలసుబ్రమణ్యంల గాత్రం ఈ సినిమాను గొప్ప మ్యూజికల్ హిట్టుని చేసాయి . ఈ సినిమాను కూడా సంక్రాంతి సెలవుల్లో మా నరసరావుపేటలోనే చూసా . సినిమా , పాటల వీడియోలు యూట్యూబులో ఉన్నాయి . ఇంతకుముందు చూసి ఉండకపోతే తప్పక చూడతగ్గ సినిమాయే .
ఢిష్యూం ఢిష్యూంలు , పిర్రల మీద గుద్దడాలు, కొట్టడాలు , డబుల్ అర్ధాల మాటలు లేకుండా పిక్చర్ నీటుగా ఉంటుంది . పరుచూరి బ్రదర్స్ సంభాషణల్ని చక్కగా వ్రాసారు . పాటలు , నృత్యాలు బాగుంటాయి కాబట్టి వాటి వీడియోలను తప్పక వీక్షించండి . A watchable neat , musical NTR movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగుసినిమాలు
అలనాటి ప్రముఖ నటి ఋశ్యేంద్రమణిని అ(ఇ)ప్పటి తరం వారు చూడగలడం విశేషం. ఈ సినిమాకి కాస్త ముందుగానే పూర్తి అయిన శ్రీ వీర బ్రహ్మేంద్రస్వామివారి చరిత్ర సినిమాలో ఇప్పటి తరానికి మళ్లీ పరిచయమైన ఆమె ఇందులోనూ నటించడం ఎంతో ఆనందం కలిగిస్తుంది. పెద్దరికంతో మన ఇంట్లో ప్రేమాభిమానాలు పంచే అమ్ముమ్మలానో, నానమ్మలానో కనిపిస్తారామే. (వసుధ బీ రావు)
Share this Article