మరో పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిలా ఉండాలట… ఎవరో ఏపీ నాయకుడు చెబుతున్నాడు… ఎందుకు తండ్రీ..? ఇక వదలరా మమ్మల్ని..! మీఅంతట మీరు ఎదగరా..? మీ అసమర్థత కొనసాగుతూ ఉండాల్సిందేనా..?
మీకు పదేళ్లలో నామమాత్రం రాజధాని రాలేదు, మీ నాయకులు అలాంటోళ్లు… పోలవరం కథ ఎక్కడికక్కడే ఆగింది… ఇప్పుడు మీ రాజధాని ఏది అనడిగితే ఒక వేలు వైజాగ్ వైపు, ఒక వేలు అమరావతి వైపు చూపిస్తుంది… ఇప్పుడు చంద్రబాబు మళ్లీ కుర్చీ ఎక్కితే మళ్లీ అమరావతి జిందాబాద్… వైజాగ్ అట్టహాస భవనం సీఎం గెస్ట్ హౌజ్ అయిపోతుంది…
సరే, ఎవరో ఏదో కూసినట్టు… రేవంత్ వచ్చాదు కదా, మళ్లీ తెలంగాణను ఏపీలో కలిపేస్తారు వంటి పిచ్చి, శుష్క ప్రచారాల్ని వదిలేద్దాం… అది సాధ్యం కాదు, గడియారం వెనక్కి తిప్పలేం ఇప్పుడు… మరో పదేళ్లు ఉమ్మడి రాజధాని కూడా ఉండదు, రేవంత్ దానికి సాహసిస్తే తెలంగాణ సమాజం ఊరుకోదు, అది తనకూ తెలుసు… అందుకే ఇక హైదరాబాద్ మనదే అని ప్రకటించేశాడు.,.
Ads
సెక్షన్ 8 ప్రకారం హైదరాబాదులో ఉన్న ఆంధ్రుల రక్షణ బాధ్యత కేంద్రానికి లేదా అనే నప్పతట్ల ప్రశ్నలు కూడా వేస్ట్… తెలంగాణ జనం ఎవరూ ఏ ఒక్క ఆంధ్రుడి మీద చేయిచేసుకోలేదు… అది తెలంగాణ తత్వమే కాదు… ఇలాంటి పిచ్చి తర్కాలు నిలబడవు… ఇది ఏపీ కాదు, తరతరాలుగా అనేక రాష్ట్రాలకు చెందిన లక్షలాది ప్రజలు హైదరాబాద్‌ను తమదిగా ఓన్ చేసుకుని, ఇక్కడ జీవనం, సంస్కృతితో మమేకమయ్యారు… అనేక వ్యాపారాల్లో తెలంగాణేతరులదే హవా… ఇక ఉండవల్లి ఏదో అంటున్నాడు…
తెలంగాణ సంబురాలు చేసుకుంటుంటే ఏపీ ఏడుస్తోంది అని..! జగన్, చంద్రబాబులకు హైదరాబాద్ వ్యాపార కేంద్రం కాబట్టి, వాళ్ల వ్యాపార ప్రయోజనాల కోసం తెలంగాణతో ఇష్యూస్ విషయంలో రాజీపడుతున్నారట… పోనీ, కటువుగా ఉండలేకపోతున్నారు అని ఉండవల్లి మాటల మర్మం… నిజమే… నిష్ఠురంగా ఉన్నా సరే నిజమే… జగన్‌కు కేసీయార్ కావాలి… చంద్రబాబుకు రేవంత్ కావాలి… ఆ ఇద్దరికీ హైదరాబాదే అడ్డాగా కావాలి…
నిజానికి తెలంగాణ ఆవిర్భావదినమే కాదు, జూన్ 2 అనేది (అపాయింటెడ్ డే) ఏపీకి కూడా ఆవిర్భావదినమే… కానీ సమైక్యవాదులకు కోపం వస్తుందని భయపడి చంద్రబాబు అధికారికంగా దీన్ని ఆవిర్భావదినంగా గుర్తించలేదు… జగన్‌కు ఈ విషయంలో ఏ సోయీ లేదు… ఏపీ, తెలంగాణలను కలిపిన నాటి నవంబర్ ఒకటిని గాకుండా… అప్పట్లో మద్రాస్ నుంచి ఆంధ్రా విడివడిన తేదీని ఆవిర్భావ దినంగా పాటించినా ఓ పద్ధతి ఉండేది… అదే అక్టోబరు ఒకటి…
చివరాఖరికి… మూడు పుట్టిన రోజులున్నా సరే… ఏ ఒక్కటీ జరుపుకోలేని అయోమయం, గందరగోళం… ఉండవల్లి మాటలకే వద్దాం మళ్లీ… అయ్యా, తెలంగాణ ఏర్పడితే అంధకారం అలుముకుంటుంది, ఉగ్రవాదం పెచ్చుమీరుతుంది, నాశనమైపోతార్రోయ్ అని శపించింది మీరు, అలా కోరుకున్నదీ మీరు… తెలంగాణపై ఏడ్చింది మీరు… ఇప్పుడు మీరే అంటున్నారు… ఏపీ ఏడుస్తోంది, తెలంగాణ నవ్వుతోంది అని..! పోనీ, ఏడిపించే ఈ జగన్, ఈ చంద్రబాబు గాకుండా ఏపీని నవ్వించగల మరో నాయకుడిని చూపించండి… తెర మొత్తం శూన్యంగా లేదూ..!!
Share this Article