టీవీల్లో అనేక సాంగ్స్ కంపిటీషన్ ప్రోగ్రామ్స్ వస్తుంటయ్ పలు భాషల్లో… హిందీ ఇండియన్ ఐడల్ వంటి బిగ్ షోలలో వాడినన్ని మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ బహుశా లైవ్ కచేరీలలో కూడా వాడరేమో… మంచి ఆర్కెస్ట్రా లేకపోతే కంటెస్టెంట్ల గొంతు, పాట కూడా మధురంగా ఉండదు… కానీ ఎప్పుడూ ఆర్కెస్ట్రకు నాలుగు చప్పట్లు, నాలుగు మంచి మాటలు దక్కవు… జడ్జిలు, కంటెస్టెంట్లే హైలైట్ అవుతుంటారు…
అప్పుడప్పుడూ ఎస్పీ బాలు పాడుతా తీయగా ప్రోగ్రాం, స్వరాభిషేకం కార్యక్రమాల్లో తన టీంలోని ఆర్కెస్ట్రా టీంలోని సభ్యుల గురించి సందర్భం వచ్చినప్పుడు ప్రస్తావించేవాడు… గతంలో వచ్చిన సూపర్ సింగర్ షోలో కూడా అప్పుడప్పుడూ ఆర్కెస్ట్రాకు ప్రశంసలు దక్కేవి కంటెస్టెంట్ల నుంచి..! ఆహా ఓటీటీలో ఈమధ్య ప్రసారమైన తెలుగు ఇండియన్ ఐడల్ షోలలో ఓ చిన్న ఆర్కెస్ట్రా టీం… కానీ వీలైనంతవరకూ ఆ కొన్ని ఇన్‌స్ట్రుమెంట్లతోనే ఫుల్ ఆర్కెస్ట్రా ఫీల్ తీసుకొచ్చేవాళ్లు…
జడ్జిలు తమన్, కార్తీక్ గానీ, గెస్టుగా వచ్చిన దేవిశ్రీప్రసాద్ ఆర్కెస్ట్రాను మెచ్చుకున్నారు… ఆ పొగడ్తలకు అర్హులే వాళ్లు… తరువాత అదే టీంను స్టార్ మాటీవీ తమ సూపర్ సింగర్ షోకు తీసుకున్నారు… ప్రూవ్ చేసుకుంటున్నారు ఆ మ్యుజిషియన్స్… ఇప్పుడు చెప్పుకునేది ఏమిటంటే… ప్రస్తుతం వస్తున్న సూపర్ సింగర్ షో నిర్వహణకు సంబంధించి బోలెడు అభ్యంతరాలున్నయ్ మనకు… వాటన్నింటినీ పక్కన పెడితే…
Ads
ఆర్కెస్ట్రా టీంను కూడా తమ ఎంటర్‌టెయిన్‌మెంట్ ఎపిసోడ్లలో భాగస్వాములను చేస్తున్నారు… గుడ్… నేనొక్కదాన్నే వచ్చాను, అందరూ జంటలుగా వచ్చారు అని శ్రీముఖి అనగానే డ్రమ్స్, మృదంగం, తబలా అన్నీ కలిపికొట్టే ఓ అబ్బాయి కళ్లద్దాలు సర్దుకుని స్టేజీ మధ్యకు వస్తాడు, శ్రీముఖితో కలిసి డాన్స్ చేస్తాడు… అంతెందుకు..? జడ్జిలు, కంటెస్టెంట్లతో సరదాగా ర్యాంప్ వాక్ చేయిస్తే ఆ లైన్‌లో మొదట వచ్చేది వయోలినిస్ట్ కామాక్షి…
అంతేకాదు, తాజా ప్రోమో ప్రకారం ఆర్కెస్ట్రా టీం వచ్చే ఎపిసోడ్‌లో స్పెషల్ పర్‌ఫామెన్స్ ప్రదర్శించారు… ప్రోమోలోనే అంత బాగుందీ అంటే, ఇక ఫుల్ ఎపిసోడ్‌లో ఆ మ్యూజిషియన్స్ తమ ప్రతిభను వేదిక మీద బాగా ఆవిష్కరించినట్టే… సహజంగానే కామాక్షి మళ్లీ ఫోకస్ అయ్యింది… కంటెస్టెంట్లు, జడ్జిలు గట్రా లేచి నిలబడి, చప్పట్లు కొడుతూ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు… గుడ్… తెరపై బాగా ఫోకసయ్యే వాళ్లే కాదు, తెర వెనుక ప్రతిభను కూడా గుర్తించడం, ప్రేక్షకులకు పరిచయం చేయడం, వాళ్ల పర్‌ఫామెన్స్‌కు కూడా అవకాశం కల్పించడం అభినందనీయం…!
Share this Article