నిన్నో మొన్నో మనం ఒక స్టోరీ చెప్పుకున్నాం కదా… కేరళలో మన్సియా అనే భరతనాట్యం కళాకారిణి ప్రదర్శనను ఆమె హిందూ కాదనే కారణంతో ఓ ప్రముఖ గుడి కమిటీ రద్దు చేసింది… ఆమె నాట్యప్రదర్శనను తిరస్కరించింది… ఆమె ముస్లిం మతంలో పుట్టినా సరే, ఓ హిందువును చేసుకున్నా సరే, భరతనాట్యంలో రీసెర్చ్ చేస్తున్నా సరే, శిక్షణ పొందిన నాట్యగత్తె అయినా సరే… గుడి సంప్రదాయం ప్రకారం ఆమెను అనుమతించలేదు ఆ గుడి కమిటీ…
దీని మీద సహజంగానే విమర్శలు వస్తున్నయ్… అరె, కళకు మతం ఉంటుందా..? కళకు ఎల్లలుండవు కదా… భరతనాట్యం అనేది హిందూ మత ప్రత్యేకమా..? ఇతర మతస్థులకు, నాస్తికులకు నిషిద్ధమా..? అదెలా..? ఇది మనుషుల పట్లే కాదు, కళ పట్ల వివక్ష కూడా… ఇలాంటి విమర్శల నేపథ్యంలో మన్సియాతో పాటు ఆమె సోదరి కూడా గుళ్లల్లో ప్రదర్శనలు ఇస్తుంటారనే సాకుతో వాళ్ల ఏరియా మసీదు కూడా వాళ్లను దూరం పెట్టేసిందట…
ఈ వార్త లింక్ ఇదుగో…
Ads
https://muchata.com/art-form-also-have-religion/
ఇప్పుడు తాజాగా అలాంటిదే మరొకటి… మరో శాస్త్రీయ నృత్యకారిణి ఉంది… ఆమె పేరు సౌమ్య సుకుమారన్… గుళ్లల్లో ప్రదర్శనలు ఇస్తుందనే పేరిట ఆమె ఏరియాలోని చర్చి ఆమెను దూరం పెడుతోందట… సో, కళను కూడా మతం కోణంలో చూడటంలో ఏ మతమూ అతీతంగా లేదన్నమాట… అదీ ఓ వీర సెక్యులర్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో…!! మా చర్చికి కోపం ఏందంటే… నేను హిందూ ప్రార్థన గీతాలకు నర్తిస్తాను అని… నేను కళాకారిణిని, నా వృత్తి అది… ఇటు హిందూ మతం నుంచీ వివక్ష ఉంది అంటోందామె…
Share this Article