Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇదేం కామెడీరా బాబూ..? వికటిస్తున్న లవ్ ట్రాకులు… కుళ్లు జోకులు…!!

April 6, 2022 by M S R

టీవీ షోలలో రేటింగుల యావతో కృత్రిమంగా సాగే లవ్ ట్రాకులు చాలా సహజం… బోలెడు చూశాం… షోల నిర్మాతలు, స్క్రిప్ట్ రైటర్లు, డైరెక్టర్లు కావాలనే ఈ కాగితపు ప్రేమల్ని క్రియేట్ చేస్తుంటారు… తెలుగు టీవీ చానెళ్లలో ఎవర్ గ్రీన్ లవ్ ట్రాక్ సుధీర్, రష్మిలదే… పదేళ్లపాటు సాగుతూనే ఉన్నా, అది అబద్ధం అని తెలిసినా, వాళ్లే చెప్పినా సరే… ప్రేక్షకులు వాళ్ల కెమెస్ట్రీని ఎంజాయ్ చేస్తూనే ఉంటారు… ఆ జంటను చూసి ఎన్నో జంటల్ని క్రియేట్ చేసి, వాతలు పెట్టినా సరే, ఏ లవ్ ట్రాకూ సక్సెస్ కాలేదు…

అయితే ఈమధ్య ఇవి కాస్త వికటిస్తున్నయ్… విసుగును, వెగటును పుట్టిస్తున్నయ్… ఈమధ్య ఒకటీరెండు షోలలో సీనియర్ యాంకర్ సుమతో నరేష్ చేస్తున్న ప్రేమ అల్లరి ఒక దశలో కాస్త సరదాగా అనిపించినా సరే, అది ఆపాల్సిన చోట ఆపలేదు… దాంతో చిరాకు కలుగుతోంది… అసలు సుమ రేంజ్ ఏమిటి..? పొట్టి నరేష్ ఏమిటి..? కాకపోతే… ఇన్నేళ్ల సుమ కెరీర్‌లో ఆమె వైపు ఓటైపు చూపు చూడాలన్నా మిగతావాళ్లకు వణుకు… ఆమధ్య ఏవో పిచ్చి పంచు డైలాగులు వేసి అంతటి ఆలీయే తరువాత గింగరాలు తిరిగిపోయాడు… ఆమె కూడా అలాంటి పైత్యాలకు అవకాశమివ్వదు… అలాంటిది పొట్టి నరేష్ సుమ చెంపలపై గులాబీతో కొట్టడం, ప్రేమ చూపులు… బాబోయ్…

తాజాగా జాతిరత్నాలు అనే స్టాండప్ కామెడీ షో లాంచింగ్ వీడియో చూస్తుంటే… మరో సీనియర్ యాంకర్ శ్రీముఖితో కమెడియన్ నూకరాజు ఏదో ప్లర్టింగ్ అవస్థలు పడుతూ కనిపించాడు… బాబూ, నూకరాజూ… శ్రీముఖి కూడా చిన్నదేమీ కాదు నాయనా… అప్పుడెప్పుడో సుమ సమకాలీనురాలు… ఏదో టీవీ రేటింగ్స్ ప్రయాస అయితే పర్లేదు, శ్రీముఖి చాలా జోవియల్‌గా తీసుకుంటుంది… కానీ వేషాలు ముదిరితే ఎవరనేదీ చూడకుండా నాలుగు అంటించగలదు…

Ads

రాకేష్, సుజాత లవ్వు నిజమే… పెళ్లి వైపు వెళ్తోంది… కాస్త ఆసక్తికరంగా అనిపించే మరో జంట ప్రవీణ్, ఫైమా… అలాగే ఇమాన్యుయెల్, వర్ష… ఈ జాతిరత్నాలు లాంచింగ్ షోకు గెస్టుగా వచ్చిన పోసాని కృష్ణమురళి కూడా ఈ రేటింగుల జంటల మీద భలే సెటైర్లు వేశాడు… సరే, ఈ ఆర్టిఫిషియల్ లవ్వుల బాగోతాన్ని వదిలేస్తే… ఇంకొన్ని చికాకు వ్యవహారాలు…

ఆమధ్య వ్యభిచార సంబంధ కేసులో పోలీసులకు చిక్కిన ఇద్దరు జబర్దస్త్ కమెడియన్లు పరదేశి, దొరబాబుల మీద… అదే అంశాన్ని గుచ్చి, గోకి, గెలికి ఇప్పటికే వందల పంచులు వేశారు అదే జబర్దస్త్ షోలో…! బాడీ షేమింగ్ దరిద్రం సరేసరి… కమెడియన్ల ఆకారం మీదే కాదు, ఇప్పుడది కమెడియన్ల అనారోగ్యాల మీదకూ పాకింది… పంచ్ ప్రసాద్‌కు కిడ్నీల సమస్య ఉంది… దాని మీద విపరీతంగా పంచులు వేస్తున్నారు… తనే స్వయంగా వేసుకుంటున్నాడు… ఎక్కువైపోయింది…

ఇంకా ఎన్నిరోజులు..? నూకరాజు సుగర్, కలర్… ఇమ్ము పిర్రల బలుపు… విష్ణు ప్రియ ముక్కు, వర్ష మేల్ లుక్కు… ఇదా కామెడీ..? ఈటీవీ కామెడీ అనగానే అదే జబర్దస్త్ తరహా బూతు కామెడీయే గుర్తొస్తుంది… చివరకు కొత్తగా స్టార్టయిన జాతిరత్నాల్లో కూడా అవే వాసనలు… ఎవరో భద్రం అట… వచ్చాడు, నవ్వు పుట్టించని నాలుగు శోభనం జోకులు చెప్పాడు… వెకిలిగా, చిల్లరగా ఉన్నయ్…

అన్నట్టు… అఖిల్ సార్థక్ అక్కడ బిగ్‌బాస్ హౌజులో ఉన్నాడు కదా… మరి ఢీ షోలో ఎలా కనిపిస్తున్నాడు..? హైపర్ ఆది ఎందుకు జబర్దస్త్ షోలలో కనిపించడం లేదు..? ఎందుకు సెలవు పెట్టాడు..? రోజా ఎందుకు హఠాత్తుగా జబర్దస్త్‌ షోలలో కనిపించడం లేదు…? ఢీ ఎపిసోడ్లు ఏదో పాత సరుకట… ప్రేక్షకుల చెవుల్లో కొత్త పూలు పెడుతున్నారు… రోజా మంత్రి పదవి మీద ఆశతో గుళ్లూగోపురాలు తిరుగుతోంది… ఆది సంగతి తెలియదు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అరుదైన గౌరవం… రోశయ్యకు ఘన నివాళి…
  • మార్గన్..! ఆ ‘బిచ్చగాడు’ గుడ్డిగా ఓ దర్శకుడిని నమ్మి మునిగిన కథ..!!
  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions