.
ఒక రీల్ కనిపించింది… అప్పట్లో అరుంధతి సినిమా ఎంత ఫేమసో తెలుసు కదా… అందులో అనుష్క చివరలో డ్రమ్ముల మీద చీరెలతో కొడుతూ చేసే క్లైమాక్స్ డాన్స్ కూడా ఎంత ఫేమసో తెలుసు కదా…
ఆ సినిమా మొత్తంలో బాగా హై ఉండే సీన్ అదే… కోడి రామకృష్ణ డైరెక్టర్… సరే, ఆ పాటలో కూడా బాగానే గ్రాఫిక్స్ వాడారు… కానీ చాలామందిలో ఓ సందేహం అలాగే ఉండిపోయింది…
Ads
ఇది ఎందులో నుంచి కాపీ కొట్టారు అని… త్రివిక్రములు, రాజమౌళిలు ఎట్సెట్రా తెలుగు మెగా దిగ్దర్శకులకు అలవాటే కదా, వేరే పరభాష, పరదేశీ సినిమాల నుంచి కాపీలు కొట్టడం…
రాజమౌళి అయితే మక్కికిమక్కి కొట్టేస్తాడు… విక్రమార్కుడు సినిమాలో విలన్ కొడుకును హతమార్చే సీన్ గుర్తుంది కదా… అది ఏదో విజయశాంతి సినిమా నుంచి కొట్టేసిన సీనే కదా… కాపీ మాస్టర్ వేల కోట్ల విదేశీ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వడం అదోరకం సక్సెస్, దాన్ని వదిలేస్తే…
అందరూ… చివరకు సంగీత దర్శకులు కూడా ట్యూన్లు కాపీ కొడతారు… కొరియోగ్రాఫర్లు డాన్సులను కాపీ కొడతారు… ఫైట్ మాస్టర్లు యాక్షన్ సీన్లను కాపీ కొడతారు… సరే, కాపీ కొడితే కొట్టారు గానీ, ఎంత బలంగా తెలుగులోకి తర్జుమా చేశారనేది ముఖ్యం…
కాకపోతే కొన్ని కాపీలు లేటుగా బయటకొస్తాయి… ఇది చూడండి…
https://www.facebook.com/reel/27929384050042046
అరుంధతి సీన్‌ను ఎక్కడి నుంచి యథాతథంగా దింపేశారో అర్థమవుతుంది… ఎవరో నెటిజన్లు సోషల్ మీడియాలో పెట్టిందే ఇది… కాకపోతే చాలా లేటుగా పట్టుకున్నారు ఇది…
అది చైనీస్ సినిమా… మాండరిన్ భాషలో ఉంటుంది… సినిమా పేరు House Of Flying Daggers… 2004 నాటి ఏదో wuxia అనబడే మార్షల్ ఆర్ట్స్ బాపతు సినిమా… పైన రీల్ చూశారు కదా… కాపీ కొట్టడం కూడా ఓ కళ… సో, మన తెలుగు దర్శకుడు ఆ కోణంలో మంచి కళాకారుడు అనుకోవాలి…
చెప్పనే లేదు కదూ… నెట్‌ఫ్లిక్స్‌లో కూడా ఉన్నట్టుంది సదరు చైనీస్ సినిమా… ఆస్కార్ ఎంట్రీ అనుకుంటా చైనా నుంచి ఆ సంవత్సరం..! కమర్షియల్‌గా కూడా హిట్..!!
Share this Article