సంచయిత గజపతిరాజుకు ఇంకా తెలియలేదా..? బాబాయ్ నిర్వాకం ఇంకా చెవిలో పడలేదా..? అవునులే, నీకు ఆడాళ్లంటే చులకన కదా..? నీ అన్న బిడ్డనే తిట్టిపోస్తున్నవ్, రాక్షసిగా చిత్రిస్తున్నవ్, బయటివాళ్లను కొడితే ఆశ్చర్యం ఏముంది..? అని ట్వీటలేదా..? పోనీ, ఆమె సవతి చెల్లెలు ఇంకా తెర మీదకు రాలేదా..? ఏమీ స్పందించలేదా..? అవును మరి, ముందుగా వాళ్లే స్పందించాలి… ఎందుకంటే..? ఇన్నాళ్లూ బయటి జనానికి ఆయన ధర్మరాజు… మర్యాదస్తుడు… రాజకీయాల్లో హుందాతనం ఉన్న రాజు గారు… ఓ పద్ధతీ, ఓ మంచీచెడూ తెలిసిన పెద్దమనిషి… అదేనండీ విజయనగరం రాజా వారు అశోకగజపతి… కానీ సందర్భం వస్తే కదా, సమయం వస్తే కదా ఒక్కసారిగా ముసుగు తొలగిపోయేది… వుమెన్స్ డే, ఒకామెను కొట్టేశాడు… కోపగించాడు… అదీ బహిరంగంగానే… బజారులో ఓ మహిళను కొట్టేంత నేరం ఆమె ఏం చేసింది..?
సాక్షి వాడు ఏం చెబుతాడంటే..? ‘‘విజయనగరంలో సోమవారం ప్రచార కార్యక్రమంలో రాజావారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రచారానికి వచ్చిన మహిళపై అశోక్ గజపతి రాజు చేయిచేసుకున్నారు. తన అభిమాన నేత వచ్చారని గౌరవంతో పువ్వులు మహిళ పువ్వులు జల్లుతుండగా… సహనం కోల్పోయిన గజపతిరాజు ఆ మహిళా కార్యకర్తను మెడలు వంచి మరీ కొట్టారు. దీంతో అవమానంగా ఫీల్ అయిన బాధిత మహిళ అక్కడి నుంచి వెళ్లిపోయారు…’’ ఏమో… బహుశా ఇది నిజం కాకపోవచ్చు… సాక్షి కదా ఏదో రాసేశాడు… ఏ రాజయినా తనపై పూలు చల్లితే అవమానకరంగా ఫీలవుతాడా..? ఆనందిస్తాడు గానీ…! పైగా తమ కార్యకర్తను తాము కొట్టేస్తారా..? ఏదో వేరే కారణం ఉండే ఉంటుంది… లేకపోతే ఈ శాంతమూర్తి అంత అశాంతిగా చేయి ఎత్తడు…
Ads
ఐనా మరీ అంత తప్పేముంటుంది..? కొట్టాల్సిన పనేముంది అంటారా..? వాళ్ల బాసుడు బాబు గారు ఒక్కొక్కరినీ ప్రచారంలో నిలదీస్తూ… ‘‘మీకు సిగ్గులేదా..? శరం లేదా..? ఉప్పూకారం తినడం లేదా..?’’ అంటూ జనాన్నే తిట్టిపోస్తున్నాడు… ఇక ఆయన గారి వియ్యంకుల వారయితే ఫ్యాన్లను కూడా దంచి కొట్టేస్తున్నాడు… ‘‘ఆడది కనిపిస్తే ముద్దయినా పెట్టాలి లేదా కడుపైనా చేయాలి’’ అనే కేరక్టర్ అది… మరి పెద్ద బాసులే ఇలా రెచ్చిపోతుంటే… దంచుడు సిద్ధాంతాన్ని ఆవహింపజేసుకుని… ఈమాత్రం ఒక మహిళను బజారులో పట్టుకుని కొట్టకపోతే ‘‘బాసుల పిలుపు’’లకు న్యాయం చేసినట్టు కాదు అనుకున్నాడేమో… అసలే సంచయిత కొట్టే దెబ్బలు, వృద్ధాప్యపు ఛాందసాలతో కాస్త ఈమధ్య డిస్టర్బ్ అయిపోతున్నాడు… అందుకని టెంపర్ కోల్పోయినట్టున్నాడు… ఫాఫం, తనకూ అంతకుముందు ఇలాంటి దంచుడు తనకూ అలవాటు ఉందో లేదో తెలియదు… పైగా బజారులో కొట్టాలి… అందుకని ఒక్కసారి మనసులో జై చింతమనేని, జైజై బాలయ్య అని సంకల్పం చెప్పుకుని… మస్తు ధైర్యాన్నివ్వండి గురువులారా అని దండం పెట్టుకుని… ఆమెను పట్టుకుని కొట్టేసినట్టున్నాడు… ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయిపోయింది… ఐనా వైసీపీ ఓ రౌడీ పార్టీ, అందులో ఉన్నవాళ్లంతా రౌడీలే అని ప్రచారం చేస్తూ, మీరు అంతకుమించి వ్యవహరిస్తే ఎలా బాబు గారూ..?! పాపం, పెళ్లి కాని పిల్ల, ఆ సంచయితకు దొరికిపోయారుగా…!! అవునూ… ఆయన చెంపదెబ్బ మహాభాగ్యం అని బాలయ్య బాధిత ఫ్యాన్‌తో ఓ వీడియో విడుదల చేయించినట్టుగా…. ఇప్పుడు విజయనగరం మహిళతో కూడా ఓ వీడియో విడుదల చేయిస్తారా సార్ ..?!
Share this Article