Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓ అరుదైన ఖగోళ దృగ్విషయంతో మహా కుంభమేళా ముగింపు

February 23, 2025 by M S R

.

మహా కుంభ మేళా ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో ముగుస్తోంది కదా… ఆ ముగింపు మరో ఖగోళ విశేషాన్ని తీసుకొస్తోంది… ఆసక్తికరమే… అరుదైన మరియు ప్రత్యేకమైన ఖగోళ దృగ్విషయం ఇది… సౌర వ్యవస్థలోని ఏడు గ్రహాలూ రాత్రిపూట ఆకాశంలో కనిపిస్తాయి…

వివరాల్లోకి వెళ్తే… సౌర వ్యవస్థలోని ఏడు గ్రహాలు – బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్ మరియు నెప్ట్యూన్ – ఆ రాత్రి సమయంలో కనిపించనున్నాయి.., ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సమావేశానికి ప్రత్యేక ప్రాముఖ్యతను కూడా ఇవ్వనుంది…

Ads

ఈ విశ్వ పరిణామాలు కూడా ఆధ్యాత్మిక శక్తులకు తోడ్పడతాయని కొందరు నమ్ముతున్నారు. జనవరి 2025లో శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్ మరియు నెప్ట్యూన్ కనిపించడంతో ప్రారంభమైన ఈ ఖగోళ దృశ్యం, ఫిబ్రవరిలో బుధుడు కూడా చేరడంతో గ్రాండ్ ఫినాలేకు చేరుకుంటుంది…

astronomy

ఈ అమరిక ఫిబ్రవరి 28న గరిష్ట స్థాయికి చేరుకుంటుంది… అంటే మహాకుంభమేళా ముగిసిన రెండు రోజులకు…! అప్పుడు ఏడు గ్రహాలు సూర్యుని ఒక వైపున చేరి, అద్భుతమైన గ్రహాల కవాతును సృష్టిస్తాయి…

ఈ ఖగోళ వస్తువులు ఒక నిర్ణీత మార్గంలో గోచరమవుతాయి… ఎందుకంటే వాటి కక్ష్యలు దాదాపు ఒకే సమతలం లోపల ఉంటాయి… ఈ గ్రహాల కవాతు సమయంలో, ఐదు గ్రహాలు – బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి మరియు శని – మన కంటికి నేరుగా కనిపిస్తాయి. కానీ, యురేనస్ మరియు నెప్ట్యూన్ చూడటానికి బైనాక్యులర్స్ లేదా టెలిస్కోప్ అవసరం అవుతుంది…

kumbh mela

ఈ ఏడు గ్రహాలు కూడా ఆకాశంలో సమ ఎత్తులో ఉన్నప్పుడు.., సరైన వీక్షణకు సూర్యాస్తమయం తర్వాత లేదా సూర్యోదయానికి ముందు సంధ్యా సమయం మంచిది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రాహుల్ చెప్పబోయే పేర్లు ఎవరివి..? గుర్తొస్తున్న చంద్రస్వామి పాత కథ !!
  • ఏకంగా అమెరికా భద్రత వ్యవస్థల్లోకే జొరబాటు..! ఏదో పెద్ద మిస్టరీ !!
  • విజయ్- త్రిష బంధం ఓకే… మరి మధ్యలోకి ఉదయనిధి ఎందుకొచ్చాడు?!
  • చిరంజీవికి ఎవరూ చెప్పినట్టు లేదు- ఆ ‘వర్స్’ అనే పదమే అశుభసంకేతం!!
  • కార్తీకదీపం కంట్రవర్సీ! ప్రభుత్వాన్ని కూల్చేస్తారా? ఆర్టికల్ 356 ఆషామాషీ కాదు!!
  • Suicidal – ఉక్రెయిన్ యుద్ధం.. రష్యాకు కనిపించని మహా విపత్తు!
  • ఎవరు ఈ మూర్తి..? ఏమిటి ఈ వెలి..? ఇదేం జర్నలిజం..?
  • లేదు, అక్కడ ‘కార్తీకదీపం’ వెలిగించలేదు- కోర్టు తీర్పులూ బేఖాతరు!
  • వైభవం! ఒకే మ్యాచులో ఏకంగా ఎనిమిది వరల్డ్ రికార్డులు!
  • వైభవ్ సూర్యవంశీ దెబ్బకు రికార్డులన్నీ బద్దలయ్యాయి!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions