అర్థం కాని విషయం ఒక్కటే… సినిమాను నీట్‌గా తీశారు, ఔట్పుట్ బాగానే వచ్చింది… ఒక్కసారి గనుక ప్రేక్షకుల మౌత్‌టాక్ బాగుంటే సినిమా నడుస్తుంది… సినిమాలో దమ్ములేకపోతే ఎన్ని ప్రమోషన్ వేషాలు వేసినా సినిమా నిలబడదు… అంత పెద్ద ఆచార్యే కొట్టుకుపోయింది… చిన్న సినిమాలు ఎంత..? సో, సరదాగా, ఓ ఫ్యామిలీ ఎంటర్టెయినర్గా సినిమా తీశారు కదా… మరెందుకు ఆ ప్రాంక్ వీడియోలు వంటి పిచ్చి ప్రమోషన్ చేష్టలకు వెళ్లినట్టు..?!
నిజానికి విష్వక్సేన్ వ్యవహార ధోరణిలో యారొగెన్సీ కనిపిస్తుంది… మాట్లాడుతుంటే భాషపై అదుపు ఉండదు… చాన్నాళ్లుగా అందరూ గమనిస్తున్నదే… తన సినిమాలు కూడా అంతంతే… ఈ స్థితిలో ఓ ఫ్యామిలీ ఎంటర్టెయినర్ చిత్రం చేశాడు… గొప్ప సినిమా ఏమీ కాదు, గొప్ప పాత్రలు ఏమీ లేవు… కాకపోతే వల్గారిటీకి తావులేకుండా, సరదా సరదా కామెడీతో సినిమాను చూడబుల్ సినిమాగా తీర్చిదిద్దారు… అలాంటప్పుడు సినిమా ప్రమోషన్ల విషయలో కూడా ప్లెయిన్‌గా, హుందాగా వ్యవహరించాల్సింది… ఈ కోణంలో విష్వక్సేనుడిదే తప్పు…
వ్యక్తిగతంగా తన వ్యవహారధోరణి వేరు… ఒక నటుడిగా ఒక సినిమాలో ఎలా చేశాడు అనేది వేరు… సినిమా విషయానికి వద్దాం… ఓ సూర్యాపేట అబ్బాయి… అబ్బాయేమిటి… 30 ఏళ్లు దాటిపోయిన ముదురు… ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావురా అనడుగుతూ ఉంటుంది సొసైటీ… ఎత్తిపొడుస్తూ ఉంటుంది… పిల్ల దొరకదు… కులం చూడాలి, వయస్సు చూడాలి, చదువు చూడాలి, కొలువు చూడాలి, ఇచ్చిపుచ్చకాలు చూసుకోవాలి, పెళ్లంటే మాటలా..?
Ads
సరే, సంబంధాల వేటలో ఓ ఆంధ్రా, గోదావరి అమ్మాయి దొరుకుతుంది… కానీ సేమ్ కులం కాదు… అన్నీ కావాలంటే ఎలా..? సరే అనుకుంటారు… నిశ్చితార్థానికి వెళ్తుంది ఆ కుటుంబం… తీరా అక్కడికి వెళ్లాక లాక్డౌన్… జనతా కర్ఫ్యూ… మరి ఏం చేయాలి..? అక్కడే ఇరుక్కుపోతారు… పెళ్లికూతురు వ్యవహారం చూస్తేనేమో ఈ అబ్బాయి అంటే ఇష్టం లేనట్టుగా ఉంటుంది… మెసేజ్ చేస్తే పాజిటివ్‌గా రియాక్ట్ అవుతుంది… తీరా చూస్తే ఆ రిప్లయ్ ఇచ్చింది పెళ్లికూతురు కాదు… ఆమె చెల్లె…
సదరు పెళ్లికూతురు తను ప్రేమించినవాడితో జంప్… ఈలోపు ఈ చెల్లె, అక్కకు భర్త కాబోయి మిస్సయిన అబ్బాయి… అదీ కథ… పెద్దగా సస్పెన్స్, థ్రిల్, సర్ప్రయిజ్ ఎలిమెంట్స్ గట్రా ఏమీ ఉండవు… సాఫీగా, సరదా కామెడీతో కథ నడిపిస్తాడు దర్శకుడు… విష్వక్సేన్కు ఇది కొత్తతరహా పాత్ర… అక్కగా నటించిన రుక్సర్ థిల్లాన్ జస్ట్ వోకే… కానీ ఆమె చెల్లెగా నటించిన రితికా నాయక్ మాత్రం తనకు వచ్చిన అవకాశాన్ని భలే వాడుకుంది… ఆకట్టుకుంది… అవునూ… అశోకవనంలో అర్జునకల్యాణం టైటిల్ ఈ కథకు ఏమైనా సూటయిందా..? అసలు ఆ టైటిల్‌కు ఏమైనా అర్థముందా..? అర్జునుడు హీరో పేరు సరే, మరి అశోకవనం ఏమిటి..? ఏమో, ఆ దర్శకుడిని అర్థమైతే కదా…!!
Share this Article