ఏమిటీ..? ఇన్‌హేలర్ మీద ఓ స్టోరీయా అని తీసిపడేయకండి… ఆస్తమా ఓ నరకం… అనుభవించేవాడికే తెలుస్తుంది ఆ పెయిన్… కొన్నిసార్లు ఇక శ్వాస నిలబడుతుందా అనే సందేహంలోకి ప్రాణాల్ని తోసేస్తుంది… ఈ ఇన్‌హేలర్ నిజంగా ఆక్సిజెన్… అందరూ రాయలేరు, ఆ రిలీఫ్‌ను అక్షరబద్ధం చేయగలిగేది రచయితే… దర్శకుడు- రచయిత- నిర్మాత ప్రభాకర్ జైనీ రాసుకున్న ఉపశమనం…
నేను భగవంతుని పట్ల అచంచల విశ్వాసంతో ఉంటాను.
దేవుడి తర్వాత, నేనెవరికైనా కృతజ్ఞత తెలుపుకోవాలంటే, ఈ క్రింద చూపిన ఇన్ హేలర్‌కే. వంశపారంపర్యంగా వచ్చిన జబ్బు. ఈ ఇన్‌హేలర్ రాకముందు నరకయాతన అనుభవించేవాడిని. ఆ బాధ పగవాడికి కూడా రాకూడదు. ఊపిరితిత్తులను కాంక్రీటుతో నింపినట్టయి, ఊపిరి ఆడదు. మనిషి ఉక్కిరి బిక్కిరి అవుతుంటే, ఎదుటి వాళ్ళు చూడలేరు.
Ads
ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో, మాత్రలు పనిచేసే గంట సేపటి వరకు, నేనూ, నా భార్యా, పిల్లలూ ఏడుస్తూ కూర్చునే వాళ్ళం. అన్ని రకాల వైద్య విధానాలలో మందులు వాడాను. ఏవీ పని చేయవు. శాశ్వతంగా ఈ జబ్బును తగ్గించవు.
ఒక బాధ్యత కలిగిన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారిగా, ఎన్నో టెన్షన్లు, టార్గెట్ వెంట పరుగులు, అధికారులు, రాజకీయ నాయకుల వత్తిళ్ళు, విధినిర్వహణలో భాగంగా, దుమ్ము బాగా ఉండే గ్రెయిన్ మార్కెట్లు, ఫ్యాక్టరీలు సందర్శించినప్పుడు, నా అవస్థ భగవంతుడికే తెలుసు. మిర్చీ యార్డులు విజిట్ చేసినప్పుడు, కళ్ళనీళ్ళు కారేవి. అటువంటి సమయంలో నన్ను ఆదుకున్నది ఈ ఇన్ హేలరే.
ఆస్త్మా వ్యాధి తీవ్రత ఎలా ఉంటుందంటే, ఏదైనా సినిమాలో గానీ, కథలో గానీ, ఒక నటుడు/పాత్ర ఆస్త్మా వ్యాధితో దగ్గడం చూసినా/చదివినా, వెంటనే నాక్కూడా ఆస్త్మా అటాక్ మొదలయ్యేది.
వీటన్నింటిని ఈ ఇన్‌హేలర్ సహాయంతోనే ఎదుర్కున్నాను. నాతో పాటు 24 /7, కారులో, ఇంట్లో, ఇంట్లోని అన్ని రూముల్లో, ఆఫీసులో, బ్యాగులో, జేబులో కంపల్సరీ ఉండాల్సిందే.
అదొక భరోసా!
ఒక వేళ, మరిచిపోతే, జేబులో ఇన్‌హేలర్ లేదన్న విషయం గుర్తుకొస్తే, వెంటనే అటాక్ మొదలవుతుంది. అందుకే, మా కుటుంబ సభ్యులంతా, ప్రతీ రోజూ గుర్తు చేస్తుంటారు, ఇన్ హేలర్ ఉందా అని.
ఇన్‌హేలర్ వల్లనే నేను ప్రశాంతంగా, ఇన్ని నవలలు, సినిమాలు రాయ/తీయ గలిగాను.
ప్రాణాయామం కూడా నాకు బాగా ఉపయోగపడింది. ఒక్కోసారి, రోజుకు ఐదు సార్లు కూడా ప్రాణాయామం చేస్తాను.
నాకు ఈ వ్యాధి ఉందని చెప్పడానికి నేనేమీ గిల్టీగా ఫీల్ కావడం లేదు. దీని వల్ల మిగతా వ్యాధులేవీ రాలేదు లక్కీలీ!
Thank you
#Cipla
For makung this wonderful Drug.
I owe you.
Share this Article