.
బిగ్‌బాస్ అనేది ఫెయిర్ గేమ్ ఏమీ కాదు… అది వినోద దందాలో ఓ భాగం… ముందే రూపొందించుకున్న స్క్రిప్ట్ ప్రకారం ఆటగాళ్లతో ఆడించబడే ఓ నాటకం… రకరకాల ఫ్యాక్టర్స్ ప్రభావం చూపిస్తాయి… రియాలిటీ షో పేరిట నడిచే ఓ టీవీ సీరియల్… ఇదే అసలు రియాలిటీ…
టీవీ సీరియళ్లు చూసినట్టే దీన్నీ చూడాలి, అంతే… ఇక చివరి పదీపదకొండు రోజులకు వచ్చేసింది ఆట… వచ్చే వీకెండ్ నాగార్జున షో అయిపోయాక ఇక నేరుగా ఫినాలే షో… ఈ వారం కూడా పెద్దగా పోటీలు, మన్నూమశానం ఏమీ ఉండవు పెద్దగా… పైగా ఉన్నదే ఏడుగురు…
Ads
హఠాత్తుగా భరణి చేతికి సీ అని కెప్టెన్సీ బాండ్ కనిపించింది… ఓహ్, ఎట్టకేలకు కెప్టెన్ అయ్యాడా అనిపించింది… ఎలా అయ్యాడో తెలియదు… ఇక కెప్టెన్ గాకుండా మిగిలింది తనొక్కడే కదా అని మిగతా కంటెస్టెంట్లు కూడా లైట్ తీసుకున్నట్టున్నారు…
నిజానికి తను ఇన్నివారాలుగా ఉండటమే విశేషం… నాగబాబు ఆశీస్సులు, ఆ ఆశీస్సులున్నాయి కాబట్టి నాగార్జున దాన్ని ఆనర్ చేస్తున్నట్టుగా ఉంది… ఎందుకంటే..? మధ్యలో బయటికి వెళ్లిపోయిన భరణికి రీఎంట్రీ కూడా బహుశా నాగబాబును గౌరవించడం కోసమేనేమో… ఏదో పేరుకు శ్రీజను, భరణిని తీసుకొచ్చి, మళ్లీ ఆ ఇద్దరికే పోటీ పెట్టి, శ్రీజను తరిమేసి, భరణిని కంటిన్యూ చేయడం బిగ్‌బాస్ ఆడిన ఆట…

ఆల్రెడీ ఓసారి బయటికి వెళ్లి వచ్చిన వాళ్లకు ఓ అడ్వాంటేజ్ ఉంటుంది… ఒక ప్రేక్షకుడిగా కంటెస్టెంట్లలో ఎవరు గట్టిగా ఉన్నారో అవగాహన ఏర్పడుతుంది… అందుకని రీఎంట్రీ మొహమాటానికి ఇచ్చినా చివరి దాకా ఉంచడం సరైంది కాదు…
ట్రయాంగిల్ కాదు, రెక్టాంగిల్ అని అరుపులు, కేకలు వేశాడు కదా… వీకెండ్ షోలో నాగార్జున తనను పెద్దగా ఏమీ అనకుండా తనూజతో ఆడుకున్నాడు… నిజానికి ఆమె కంటెస్టెంట్ కాదు, సంచాలక్ కాదు, ఓ అభిప్రాయం చెప్పింది అంతే…
ఏదోొ అనఫిషియల్ వోటింగ్ చూస్తుంటే… ఎప్పటిలాగే కల్యాణ్, తనూజ టాప్ 2 ప్లేసుల్లో ఉన్నారు… కల్యాణ్ వోటింగు కాస్త ఎక్కువ… నిజానికి తనూజ మొదటి నుంచీ నామినేషన్లలో ఉన్నా ఎప్పుడూ తన వోటింగే టాప్… కల్యాణ్ పీఆర్ టీమ్ కాస్త లేటుగా అందుకుంది…
మిగతా అందరూ వోటింగులో దాదాపు సేమ్ కనిపిస్తున్నారు… మొదట్లో తనూజకు పోటీ ఇచ్చిన ఇమాన్యుయేల్, సుమన్ శెట్టి వోటింగు కూడా బాగా పడిపోయింది… ఇప్పుడు సుమన్ శెట్టి, ఇమాన్యుయెల్, సంజన, డిమోన్ పవన్ చివరి స్థానం కోసం కొట్లాడుతున్నట్టుగా ఉంది… భరణికి కాస్త ఎడ్జ్ ఉంది…
సంజన ఎప్పటికప్పుడు తృటిలో తప్పించుకుంటూ వస్తోంది… ఇక ఈ వారం సుమన్, సంజన, డిమోన్‌లలో ఒకరిని బయటికి పంపించేసి బహుశా మిగతా ఆరుగురిని ఫైనలిస్టుల్లో ఉంచేస్తారేమో..!! నో, నో, నాగబాబు మొహమాటం భరణిని ఫైనలిస్టుగా ఉంచడం వరకే..!!
Share this Article