.
తొలిసారిగా తిరుమల వ్యవహారాల్లో కేంద్రం ఎంటర్ కావడానికి ప్రయత్నించింది… ఆ తొక్కిసలాట ఏమిటి… అసలు ఏం జరుగుతోందక్కడ, కమాన్ మా హోం శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ జిందాల్ వస్తాడు, వివరించండి అని కేంద్రం హుకుం జారీ చేసింది…
అసలే చంద్రబాబు తాలూకు ఎంపీలతో ఊపిరి పీల్చుకుంటున్న కేంద్ర ప్రభుత్వం అది… పైగా చంద్రబాబు అస్సలు ఊరుకునే రకం కాదు… ఆ పుష్కర మృతుల కేసునే నిమజ్జనం చేసినవాడికి ఈ తిరుమల కేసుకు నామాలు పెట్టడం పెద్ద కథా..?
Ads
ఎలాగూ ఇంటికి వచ్చాడు కదా హోం మంత్రి అమిత్ షా… ఏమిటండీ ఇది, మా టీటీడీ వ్యవహారాల్లో మీ జోక్యం ఏమిటి అని ఉరిమాడు… చంద్రబాబుతో గోక్కోవడం మంచిది కాదని తెలుసు కదా… వెంటనే తన అధికారులపై తను ఉరిమాడు… తక్షణం కేంద్రం జారీ చేసిన సర్క్యులర్ కాస్తా వెనక్కి వెళ్లిపోయింది…
ప్రపంచ హిందూ సమాజం యావత్తూ మనోభావాలు దెబ్బతిన్న అంతటి లడ్డూ కేసుకే ఇప్పటికీ దిక్కులేదు… కేంద్రం ఆరాలు, దర్యాప్తు అన్నారు… అదయ్యే పనేనా..? అసలే ఇక్కడ ఉన్నది చంద్రబాబు… అప్పట్లో ఆంధ్రప్రదేశే ఓ ప్రత్యేక దేశంగా పరిగణించినవాడు… ఇప్పుడైనా మోడీని రానిస్తాడా..? అమిత్ షాను రానిస్తాడా..? ఏదీ, ది గ్రేట్ అజిత్ దోవల్‌ను అడుగుపెట్టమనండి చూద్దాం…
ఇదే కాదు… జగన్ పాలనలో ఉన్నన్ని రోజులూ ఏపీ వ్యవహారాలను పూచికపుల్లల్ని తీసిపారేసినట్టు తీసేసింది కేంద్రం… జగన్ గట్టిగా ఏమీ అనలేడు… అడగలేడు, తన కేసుల భయం తనది… కానీ చంద్రబాబు కథ వేరు, కదా ఇప్పుడు తనదే అప్పర్ హ్యాండ్… ఎన్డీయే భాగస్వామి, పైగా చంద్రబాబు కాడికింద పడేస్తే కేంద్రంలో బీజేపీ కథ సపరేటుగా ఉంటుంది…
సరే, ఆ పరిస్థితి వస్తే అమిత్ షా ప్రలోభచాణక్యం ఎలా పనిచేస్తుందో, చంద్రబాబు పార్టీని ఎలా తిప్పలు పెడతారనేది తరువాత సంగతి… ప్రస్తుతానికి చంద్రబాబు కనుసైగ చేస్తే చాలు వచ్చిపడుతున్నాయి… విశాఖపట్నం ఉక్కుకు 11 వేల కోట్ల పైచిలుకు గ్రాంట్లు వచ్చిపడ్డాయి… ఇది తెలుగు ప్రజల సెంటిమెంటు అని అమిత్ షా చిలకపలుకులు పలుకుతున్నాడు ఇప్పుడు… (అఫ్‌కోర్స్, ఇప్పటికీ దాన్ని ఈ గ్రాంట్లతో మేకప్ చేసి, అడ్డంగా అమ్ముకునే ఎత్తుగడ అని నమ్మేవాళ్లూ ఉన్నారు…)
విశాఖ కొత్త రైల్వే జోన్ వచ్చేసింది… విశాఖ గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ పేరిట 2 లక్షల కోట్ల పెట్టుబడులు… అమరావతికి 15 వేల మేరకు రుణాలు ఇప్పిస్తున్నారు… అడిగిన వెంటనే పోలవరం నిధులు చకచకా వచ్చేస్తున్నాయి… తమ ఆదాయలోటు కూడా భర్తీ చేయాలని అడగడమే కాదు… ఆరు నెలల్లో 3 లక్షల కోట్లు కేటాయించామని అమిత్ షా స్వయంగా చెబుతున్నాడు…
పోలవరం- బనకచర్లను కూడా కేంద్రమే జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని కొత్త డిమాండ్ పెట్టేశాడు అప్పుడే… అఫ్‌కోర్స్, అదీ తనే దగ్గరుంచి నిర్మింపచేస్తాడు… అందులో మర్మం ఏమిటో తెలిసిందే కదా అందరికీ…
ఇక్కడ ప్రశ్న ఇవన్నీ చకచకా ఎందుకు ఇచ్చేస్తున్నారు అని కాదు… ఇన్నేళ్లూ ఎందుకు స్పందించలేదు అని..! ఇవ్వాళ చంద్రబాబు మీద ఆధారపడిన బతుకు కాబట్టి… అడిగినవన్నీ ఇచ్చేస్తున్నారు… ఇన్నేళ్లు ఏపీ ఎందుకు కనిపించలేదు… అసలు దేశంలో ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రమే ఉన్నట్టు గుర్తించలేదు ఎందుకు..?!
Share this Article