ప్రభాస్ రైలు మళ్లీ పట్టాలెక్కింది… మారుతి దర్శకత్వం వహిస్తున్న సినిమా నిశ్శబ్దంగా, వేగంగా సాగిపోతుందట… తప్పదు… కాకపోతే రాజడీలక్స్ అని టెంపరరీగా టైటిల్ పెట్టుకున్న ఈ హారర్ కామెడీ సినిమాకు కూడా భారీ గ్రాఫిక్స్ అట… భారీ ఖర్చు అట… ప్రభాస్‌కు ఇంకా ఆదిపురుష్ దెబ్బ సరిపోయినట్టు లేదు… అది మరీ 600 కోట్ల దెబ్బ…
మారుతితో సినిమా ఎప్పటి నుంచో అనుకుంటున్నదే… కానీ రాధేశ్యామ్ ఫ్లాప్ తరువాత, కృష్ణంరాజు మరణం, ప్రభాస్ అనారోగ్యం, కొన్నాళ్లు అసలు నడవలేకపోయాడు… దీంతో సాలార్ డిలే అయిపోయింది… ఎలాగోలా షూటింగ్ పార్ట్ పూర్తి చేసినట్టు చెబుతున్నారు… ఇంకా ఏమైనా మిగిలిన ప్యాచ్ వర్క్ ఏమైనా ఉంటే పూర్తిచేయాల్సి ఉంది… ఇది కూడా వందల కోట్ల పాన్ ఇండియా మూవీయే… నాగ్ అశ్విన్ తలపెట్టిన ప్రాజెక్టు కే సినిమా కూడా ప్రిస్టేజియస్, భారీ ఖర్చు…
మొత్తం పాన్ ఇండియా సినిమాలే… మారుతి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో ప్రభాస్ తాతగా, కొడుకుగా డబుల్ రోల్ చేస్తున్నాడని, పైగా రెండు వేర్వేరు టైమ్‌లైన్స్ తో కథ ఉంటుందనీ ఓ టాక్… కానీ ప్రభాస్ గానీ, మారుతి గానీ సినిమా ప్రోగ్రెస్ గురించి గానీ, సినిమా వివరాలు గానీ బయటకు వెల్లడించడం లేదు… అదీ ఒకందుకు మంచిదే… ఈ సినిమా ఖర్చు కూడా కలిపితే ప్రస్తుతం ప్రభాస్ మీద ఆధారపడి దాదాపు 3 వేల కోట్ల సినిమాలు నిర్మాణంలో ఉన్నయ్… ఇదొక భారీ జూదం…
Ads
వీటిల్లో ప్రధానమైంది ప్రాజెక్టు కే… ఎన్ని వందల కోట్లు ఖర్చవుతుందో వాళ్లే అంచనా వేయలేకపోతున్నారు… అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోన్, దిశా పటానీ తదితరులు నటించే ఈ సినిమా వైజయంతీ మూవీస్ ప్రిస్టేజియస్ మూవీ… సేమ్, సాలార్‌లాగే ఇదీ తెలుగులో తీసి, ఇతర భాషల్లోకి డబ్ చేస్తారు…
శృతిహాసన్ హీరోయిన్‌గా చేసే సాలార్ ఖర్చు నిజానికి 200 కోట్లు అంటున్నారు… కేజీఎఫ్, కాంతార తీసిన హొంబళె ఫిలిమ్స్ వాళ్లే దీనికీ నిర్మాతలు… ఇప్పుడు ప్రభాస్ చేయాల్సింది ఇవన్నీ సకాలంలో పూర్తిచేయడం, ఒకదానికి ఒకటి రిలీజుకు క్లాష్ గాకుండా చూసుకోవడం… ఇవన్నీ ఓ తొవ్వలో పడితే… వంగా సందీప్‌రెడ్డితో స్పిరిట్ అనే సినిమా… ఇదయితే మరీ చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్ని కూడా టచ్ చేయబోతోంది… ఆర్ఆర్ఆర్ దానికి బాటలు వేసిందిగా ఆల్‌రెడీ… పాన్ వరల్డ్ సినిమా…
ఇవి గాకుండా పఠాన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్‌తో తీయాల్సిన సినిమా ఒకటుంది… కత్రినా కైఫ్ హీరోయిన్… ఇది స్పై థ్రిల్లర్… ప్రభాస్ హెల్త్, సినిమాల స్పీడ్ షూటింగ్స్, షెడ్యూల్స్, రిలీజ్ ప్లాన్స్ మీద ఆధారపడి రఫ్‌గా చెప్పాలంటే కనీసం 3 నుంచి 3500 కోట్ల మూవీస్ ఆధారపడి ఉన్నయ్… తలుచుకుంటేనే వామ్మో అనిపిస్తోంది కదా… అవును, వీటిలో ఆదిపురుష్ సంగతి పక్కన పెడితే మిగతావన్నీ కాస్త బాధ్యత తెలిసిన దర్శకుల చేతుల్లో ఉన్నవే… ఇక ప్రభాస్ ఏమేరకు కష్టపడతాడో చూడాలి..! కానీ ఇండియన్ సినిమా తన మీద పెట్టుకున్న నమ్మకం ఓ విశేషమే…
Share this Article