Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ సంపూర్ణ నటుడికి గౌరవప్రదమైన తుది వీడ్కోలు పలకండర్రా కనీసం..!!

December 23, 2022 by M S R

నిజంగా కైకాల సత్యనారాయణకు రావల్సినంత గుర్తింపు దక్కిందా..? ఎందుకో దక్కలేదనే అనిపిస్తోంది… ఒక ఎస్వీరంగారావులాగే తనూ వివక్షకు గురయ్యాడా..? 62 ఏళ్లపాటు సినిమా సెట్లలో ఉండి, 777 సినిమాలు చేయడం చిన్న విషయం ఏమీ కాదు… ఎప్పుడో 1959లో మొదలైన కెరీర్ మూడేళ్ల క్రితం నాటి మహర్షి వరకు… ఈ సంఖ్య అనితరసాధ్యం… కొందరికి మినహా… మరి ఆయనకు దక్కిన పురస్కారాలు..? ప్చ్, చెప్పదగినవేమీ లేవు…

నిజానికి తను మొదట్లో హీరో… ఎన్టీయార్, ఏఎన్నార్‌లాగు స్ఫురద్రూపం… డైలాగ్ డెలివరీ గానీ, యాక్షన్ గానీ ఎవరికీ తక్కువ కాదు… అవకాశాల్లేక ఎన్టీయార్‌కు డూప్‌‌గా చేశాడు… తప్పులేదు… తరువాత విలన్‌గా బ్రేక్ ఈవెన్… ఇక ఏ సినిమా అయినా సరే సత్యనారాయణ అంటే విలన్… డిష్యూం డిష్యూం కుర్ర హీరోల నుంచి పెద్ద హీరోల దాకా వాళ్లతో తన్నులు తినేవాడు… మరి తెలుగు విలన్ అంటే అంతేగా…

తరువాత ఇతర పాత్రలవైపు దృష్టి పెట్టాడు… తన కామెడీలో టైమింగ్ సూపర్… తను వేసిన సాఫ్ట్ రోల్స్ కూడా తనలోని నటుడిని ఆవిష్కరించాయి… ప్రత్యేకించి ఘటోత్కచుడు గానీ, యమలీల గానీ తన పాత్రలు హైలైట్… అసలు యమధర్మరాజు అంటే ఇలాగే ఉంటాడేమో అన్నట్టుగా ఫిట్టయ్యాడు తను… ఆ సీరియస్ యముడి పాత్రలో కూడా కామెడీని, కోపాన్ని, ప్రేమను పండించాడు… ఏమాత్రం చిల్లరతనం లేకుండా…

Ads

రాజకీయాల్లో అలా వచ్చి, ఇలా వెళ్లిపోయాడు తను… రాజకీయాలు తనకు సూట్ కావు… అందుకని ఆ కెరీర్‌ను పరిగణనలోకి తీసుకోనక్కర్లేదు… విషయానికి వస్తే ఎవరెవరికో నటన బేసిక్స్ కూడా తెలియని వాళ్లకు పద్మ పురస్కారాలు వస్తుంటాయి… ఏవేవో అవార్డులు మెడలో పడుతుంటాయి… కానీ సంపూర్ణ నటుడు సత్యనారాయణకు అలా గుర్తుంచుకోదగిన పురస్కారాలు ఏమీ వచ్చినట్టు గుర్తులేదు… 2017లో ఫిల్మ్‌ఫేర్ జీవితకాల సాఫల్య అవార్డు మినహా…

kaikala

పురస్కారాలకు పైరవీలు చేతకాక అవి తన దగ్గరకు రాలేదా..? ఇండస్ట్రీలో అవార్డులు, పురస్కారాలు అంటేనే పైరవీల మయం… లేక ఇండస్ట్రీ మొత్తం ఒకే కులం ఆధిపత్యం కింద ఉంది, అన్యకులానికి చెందినందున కైకాల వివక్షకు గురయ్యాడా..? చాలామంది నమ్మేది ఇదే… చిరంజీవి వచ్చాక సీన్ చేంజ్ అయ్యింది గానీ… అంతకుముందు అంతా ఆ కులం ఆధిపత్యమే కదా… అక్కడక్కడా కొన్ని మినహాయింపులు తప్ప… స్టూడియోలు వాళ్లవే… హీరోలు వాళ్లే… నిర్మాతలు వాళ్లే… వాళ్లు గీసిందే గీత, చెప్పిందే శాసనం… సరే, ఇది చర్చిస్తే ఒడవదు, తెగదు… చివరకు మొన్న తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్‌లో చాన్నాళ్లు ఉంటే ఒక్క చిరంజీవి మాత్రమే వెళ్లి పరామర్శించి వచ్చాడు… (సత్యనారాయణలాగే పౌరాణిక ప్రతినాయక పాత్రలకు గతంలో ఎస్వీ రంగారావు ఫేమస్… రావణుడు, దుర్యోధనుడు ఎట్సెట్రా పాత్రలు ఎస్వీఆర్ వేస్తేనే వాటికి ఓ విలువ…)

ఇప్పటిదాాకా కైకాల 777 సినిమాల్లో నటిస్తే, వాటిల్లో 28 పౌరాణికాలు, 51 జానపదాలు, 9 చారిత్రికాలు… తను 200 మంది దర్శకులతో పనిచేశాడు… ఓపికతోపాటు, తన వృత్తికి తను నిబద్దుడిగా, విధేయంగా ఉంటే తప్ప అందరు దర్శకులతో కలిసి పనిచేయడం కష్టం… మరి ఆ సత్యనారాయణకు దక్కిన గుర్తింపు ఏమిటి..? కనీసం తనను సాగనంపేటప్పుడైనా ఈ దిక్కుమాలిన వివక్షకు తెరవేసి… అత్యంత సీనియర్ నటుడికి గౌరవప్రదమైన వీడ్కోలు చెప్పండర్రా…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆహా… ఏం తెలివి..? ఆటో-పే సబ్‌స్క్రిప్షన్ తిర‘కాసులు’…!!
  • ఏడీ..? ఏమైపోయాడు నేను ప్రేమించిన ఆ నా మణిరత్నం..?!
  • భారీ డిజాస్టర్ దిశగా థగ్ లైఫ్… హిందీవాడు అడ్డంగా ఛీకొట్టేశాడు…
  • అమెరికా అధ్యక్షుడు… ఆ టేబుల్‌కు ఆ రెండు ఇంపార్టెంట్ బటన్లు…
  • మహేష్ బాబును త్వరగా పంపించేయండి, నిద్రకు ఆగలేడు… కెవ్వు కేక..!!
  • తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం కాక..! అసలు దోషి ఎవరు..?!
  • మిలమిల మెరిసిన తార… వెన్నెల పైటేసిన కిన్నెరసాని…
  • అల్లరి నవ్వుల అల్లు రామలింగయ్య … మనెవ్వరికీ తెలియని ఓ ఫ్లాష్ బ్యాక్ …
  • సో, ప్లీజ్… దయచేసి ఎవరూ ఆ ఇద్దరికి మాత్రం ఈ స్టోరీ చూపించొద్దు…
  • పార్లె జీ బిస్కట్స్… ఈసారి విషాద వార్తల్లోకి… అంతర్జాతీయ ఖ్యాతితో…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions