అవును సరే గానీ… 4 రోజుల్లో సోనియమ్మను ప్రశాంత్ కిషోర్ మూడుసార్లు కలిశాడు… మిషన్ 2024 గురించి చర్చించాడు… ఈ ఔట్ సోర్సింగ్ దేనికోయ్, పార్టీలోకి వచ్చెయరాదూ, జనరల్ సెక్రెటరీ ఐపో అంటారు వాళ్లు… తనేమో వ్యాపారి… సరుకు అమ్ముతాడు తప్ప, పుణ్యానికి ఇస్తే ఏం ఫలం..? పైగా వందల కోట్ల దందా తనది… సో, చివరకు బేరం ఎంతకు కుదురుతుందో చెప్పలేం… గుజరాత్ సహా ఏడెనిమిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వరకేనా..? వచ్చే జనరల్ ఎన్నికలకు కూడానా..?!
నిజానికి తనకు అప్పగించే బాధ్యత ఎన్నికల వ్యూహరచన మాత్రమే కాదు… యూపీయేను పటిష్టం చేయడం..! ఎన్నికల వ్యూహం అనేది ఓ పార్ట్, అంతే… మొన్నమొన్నటిదాకా కాంగ్రెస్, బీజేపీ లేని ఆల్టర్నేట్ ప్రాంతీయ పక్షాల కూటమి అని భ్రమపడ్డాడు… భంగపడ్డాడు… ఎవరూ కలిసొచ్చే సిగ్నల్స్ కనిపించలేదు… నాయకుల దగ్గరకు తిరిగీ తిరిగీ డంగైపోయాడు… ఆ దిక్కుమాలిన ప్రయాసకన్నా ఓ పెద్ద బేరం చూసుకుంటే బెటరని ఫిక్సయిపోయాడు చివరకు, ఇలా కాంగ్రెస్ క్యాంపులో ల్యాండయ్యాడు…
అయితే కొన్ని ప్రశ్నలు ఇప్పటికీ అలా కొడుతూనే ఉన్నయ్…
Ads
- స్టాలిన్ వోకే… కాంగ్రెస్‌తో పొత్తు ఆల్రెడీ ఉంది… శరద్ పవార్, ఉద్దవ్ ఠాక్రే కూడా వోకే… కాంగ్రెస్‌తో కలిసి సర్కారును ఉద్దరిస్తున్నారు… హేమంత్ సోరెన్ కాంగ్రెస్ క్యాంపే… మరి బలమైన ప్రాంతీయ పార్టీలుగా చెప్పబడే ఇతర పార్టీల మాటేమిటి..? బెంగాల్లో కాంగ్రెస్ జీరో స్థాయికి పోయినా సరే, మమత దాన్ని తన రాష్ట్రంలో సహించదు…
- ఏపీలో మైనస్ రేంజులో కొట్టుకుంటున్నా సరే, జగన్ కాంగ్రెస్ నీడ కూడా సహించడు… ఆ వాసనే భరించలేడు… యూపీలో ఆల్రెడీ ఒంటరిపోరు అంటున్నారు, అంటే అఖిలేషుడితో కుదరదు… కానీ యూపీలో బలమైన ప్రాంతీయ పార్టీ తనదే… బీహార్‌లో ఆర్జేడీ ఇప్పటికీ స్ట్రాంగే… దాన్ని కాదని కాంగ్రెస్ చేసేదేముంది..?
- ప్రశాంత్ కిషోర్ కస్టమర్లలో జగన్, మమత, స్టాలిన్, ఠాక్రే ఉన్నారు… వీళ్లలో జగన్ యూపీయే వైపు ఏ స్థితిలోనూ రాడు… మరి కేసీయార్..?
- ‘‘దేశం కోసం, ధర్మం కోసం, ఉచితంగా రాజకీయ వ్యూహాల్ని అమ్ముతాడు పాపం’’ అని కేసీయార్ సర్టిఫికెట్ ఇచ్చాడు కదా ప్రశాంత్ కిషోర్‌కు… మరి ఆయనేమో కాంగ్రెస్‌కు వర్క్ చేస్తాడు… మరి అప్పుడు టీఆర్ఎస్ ఏం చేయాలి..?
- ప్రశాంత్ కిషోర్‌కు కటీఫ్ చెప్పాలా..? లేక రేప్పొద్దున అక్కరకొస్తాడేమోలే అనుకుని రిలేషన్ కంటిన్యూ చేయాలా..?
- ప్రశాంత్ కిషోర్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు పనిచేస్తాడు సరే, మరి ఆల్రెడీ కర్నాటక, తెలంగాణల్లో పార్టీని ఉద్దరించే పనిలో ఉన్న సునీల్ ఏమైపోవాలి..? తను ప్రశాంత్ కిషోర్‌కు అనుబంధంగా పనిచేసే సవాలే లేదు…
తెలంగాణలో టీఆర్ఎస్ కోసం ఆల్రెడీ వేరే సోషల్ మీడియా టీమ్ పనిచేస్తోంది… తెలుగుదేశానికి ఆ పాత వ్యూహకర్తే పనిచేస్తున్నాడు… ఏమో, ప్రశాంత్ కిషోర్ వచ్చే ఎన్నికల కోసం టీఆర్ఎస్కు, కాంగ్రెస్‌కు నడుమ బంధాన్ని ఫిక్స్ చేసే పనిలో ఉన్నాడనీ, అందుకే టీఆర్ఎస్ క్షేత్ర స్థాయిలో బాగా దెబ్బతిన్నదనే రిపోర్టులు ఇచ్చాడనీ, పొత్తు వైపు లాక్కుపోతాడనీ ఓ ప్రచారం ఉంది… మరి అప్పుడు రేవంత్ రెడ్డి ఏమైపోవాలి..? కేసీయర్, రేవంత్ ఒకరిపొడ ఒకరికి గిట్టదు…
పైగా రెండు పార్టీల్లోనూ బోలెడుమంది యాస్పిరెంట్లు… సీట్ల సర్దుబాటు ఓ పెద్ద యజ్ఞం అవుతుంది… టికెట్లు రానివాళ్లంతా రెబల్స్ లేదంటే జై మోడీజీ… అంటే ప్రశాంత్ కిషోర్ ఏదైనా మనస్సులో పెట్టుకుని మరీ బీజేపీ బలం పెంచే ప్రయాసలో ఉన్నాడా పరోక్షంగా..?! వీళ్లతో కలవండి, వీళ్లతో విడిపొండి అని కూడా ప్రశాంత్ కిషోరే పావులు కదిపితే ఇక కాంగ్రెస్ కోర్ టీం దేనికి..? దాంట్లోని నాయకుల సీనియారిటీ దేనికి..? ఇన్నేళ్ల సైద్ధాంతిక పునాది బలం ఏమైనట్టు..? ఏదో డౌట్ కొడుతోంది… బలంగానే…!!
Share this Article