.
ఇది స్పీడ్ యుగం… ఏ రంగమైనా సరే…. వేగంగా పరుగెత్తగలిగేవాడికే మనుగడ… ఫిట్టెస్ట్ ఆఫ్ సర్వైవల్… ప్రత్యేకించి రాజకీయాల్లో ఎవరు ఏ అంశాన్ని ఎంత వేగంగా అందుకుని ఎలా స్పందించారనేది ముఖ్యమే…
వాడెవడో పిచ్చోడు వీరరాఘవరెడ్డి అట… చిలుకూరు అర్చకుడు రంగరాజన్‌పై దాడికి దిగాడు… వాడిది తూర్పు గోదావరి జిల్లా, అనపర్తి మండలం, కొప్పవరం అట… తనకన్నా ఈమధ్య తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్న మరో మెంటల్ కేరక్టర్ అఘోరి నయం అనిపిస్తుంది…
Ads
రామరాజ్యం అట, సొంతంగా సైన్యాన్ని తయారు చేస్తున్నాడట, ఆ సైన్యంలో చేరేవారికి యూనిఫామ్, 20 వేల చొప్పున జీతం అట… అదొక పైత్యం… చిలుకూరు దేవాదాయ శాఖ పరిధిలో లేదు, ఆస్తులున్నాయి… ఆదాయం ఉంది, భక్తులెక్కువగా వస్తున్నారు… దాంతో వీడి దృష్టి పడ్డట్టుంది… వెళ్లి, నా సైన్యంలో చేర్పించు, ధనం కావాలి అని అడిగినట్టున్నాడు…
ఏమో, ఇంకా ఏమైనా కారణాలున్నాయా..? ఎవవైనా వెనక ఉన్నారా తెలియాలి… వర్తమానంలో తెలంగాణ పోలీసుల విజయగాథల్ని బట్టి అదేమీ ఎక్స్‌పెక్ట్ చేయలేం గానీ… రాజకీయాలకు వద్దాం… అసలు అర్చకుడు ఫిర్యాదు చేయడమే లేట్, దాని వెనుకా ఏదో కారణం ఉండే ఉంటుంది… సరే, బయటపడ్డాక… ధర్మరక్షణ, సనాతనధర్మం అని పదే పదే ప్రవచించే బీజేపీలో ఒక్క నాయకుడికీ ఖండించడానికి తీరిక లేకుండా పోయింది…
ఆ కూటమిలోని సనాతన ధర్మరక్షకుడు పవన్ కల్యాణ్‌కు కూడా..! చంద్రబాబును వదిలేయండి, పాపం ప్రపంచంలోకెల్లా వీర సెక్యులర్ కదా… ఏం స్పందిస్తే ఏమిటో అని జంకు… ఏ చిన్న అంశమైనా సరే వెంటనే అందుకుని ప్రచారంలోకి వచ్చేస్తూ, రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టేస్తున్న బీఆర్ఎస్ వెంటనే స్పందించింది…
కేటీయార్ ఇద్దరు మాజీ మంత్రులతో కలిసి స్వయంగా వెళ్లాడు, పరామర్శించాడు… ఇదంతా మీడియాలోకి వచ్చాక గానీ కాంగ్రెస్ కళ్లు తెరుచుకోలేదు… సమన్వయం ఉండదు, ఎవరు ఆదేశించాలో, ఎవరు ఎలా స్పందించాలో ఎవరికీ ఓ దిశ లేదు, ఓ దశ లేదు… బీఆర్ఎస్ అలా కాదు కదా… బావబామ్మర్దులు ఏది చెబితే అది… ఫామ్ హౌజ్ పడుకుని ఉన్నా సరే…
అరెరె, బీఆర్ఎస్‌కు మైలేజీ వస్తోంది, మనం వెనుకబడ్డాం అని సోయి రాగానే వీరకమలం బండి సంజయ్ తొలుత, తరువాత కిషన్ రెడ్డి ఖండించారు… మెల్లిగా కాంగ్రెస్ నుంచి శ్రీధర్ బాబు మొదట, తరువాత కాసేపటికి గానీ రేవంత్ రెడ్డి టీం కళ్లు తెరవలేదు… ఫోన్ కాల్ చేసి పరామర్శించాడు, నాకు చెప్పి ఉండాల్సింది కదా అన్నాడు… ఆరుగురిని అరెస్టు చేశారు… తరువాత కాసేపటికి మంత్రి కొండా సురేఖ ఖండించింది… వెళ్లి పరామర్శించింది…
ఆ గుడికీ ఆమె పర్యవేక్షించే దేవాదాయ శాఖకూ అసలు లింక్ లేదు… సరే, ఐదుగురిని అరెస్టు చేశారు, ఈలోపు బీఆర్ఎస్ దీన్ని పొలిటికల్‌గా వాడుకుంటోందని తెలియగానే ఓ సెక్షన్ కేటీయార్ మీద సోషల్ దాడి స్టార్ట్ చేసింది…
1) వరంగల్ పూజారి హత్య సమయంలో ఏం చేసినవ్..? 2) భైంసాలో హిందువుల ఇళ్లు తగులబెడితే ఏం చేసినవ్..? 3) జైశ్రీరాం నినాదం కడుపు నింపదు అని నువ్వు పేలితే విమర్శించాడని ఓ హనుమాన్ దీక్షాపరుడిని అరెస్టు చేయించినవ్… 4) హిందూ దేవుళ్లను తూలనాడే ఓ స్టాండప్ కమెడియన్ హైదరాబాద్‌లో షో పెడితే వేల మంది పోలీసులతో బందోబస్తు ఇచ్చినవ్… 5) అయోధ్య చందాల మీద రచ్చ చేసినవ్… 6) హిందూగాళ్లు బొందుగాళ్లు అన్నాడు మీ నాయన… 7) రావణ జన్మభూమి, శూర్పణఖ జన్మభూమి అని రచ్చ చేసిండు… ఇలా అనేక కారణాలతో దాడి…
ఇక సీపీఎం పత్రిక ప్రజాశక్తి అయితే ఇది సంఘ్ పరివార్ దాడి, విషనాగు తన పిల్లల్ని తనే చిదిమేసే ధోరణి అని ఆ ఎర్రన్నలకే అర్థం కాని ఓ పిచ్చి రాతలకు, కూతలకు దిగింది… ‘‘కుల అసమానతలు ఉండకూడదని ఆయన ఆకాంక్షించడం ఓర్వలేని విహెచ్‌పి, ఆర్‌ఎస్‌ఎస్ మతోన్మాదులు దాడికి తెగబడటం అత్యంత దుర్మార్గం…’’ అని సీపీఎం కొత్త కార్యదర్శి జాన్ వెస్లీ చేసిన ఖండన కాస్త నవ్వొచ్చింది… ఆ రామరాజ్యం వెధవ ఆర్ఎస్ఎస్ మనిషని ఎవరు చెప్పారు కామ్రేడ్ నీకు..? హిందువులపై ఇతర మతస్తుల దాడుల సందర్భాల్లో నోళ్లు పెగల్లేదేం మరి..?
https://www.facebook.com/photo?fbid=9875003259193623&set=a.593162164044492
సాధారణంగా ఆర్ఎస్ఎస్ చాలా అంశాల్లో బహిరంగ సమర్థనలకు గానీ, ఖండనలకు గానీ దిగదు… చాలా అరుదు… అలాంటిది మొదటిసారి ఈ విషయంలో ఖండన ప్రకటన జారీ చేసింది, విశ్వహిందూ పరిషత్ కూడా…
నిజానికి ఇలాంటి సందర్భాల్లో కాంగ్రెస్ గానీ, ప్రభుత్వం గానీ వేగంగా స్పందించాలి… అనవసర ప్రచారాలకు అడ్డుకట్టలు వేయాలి… కానీ ఆ సోయి ఎక్కడిది టీపీసీసీకి గానీ, రేవంత్ సర్కారుకు గానీ..!!
Share this Article