. నిన్ననే కదా మగ శివాజీ నటించిన దండోరా అనే సినిమా రిలీజైంది… అప్పుడే సక్సెస్ మీట్ అట… సరే, అదీ ఓ ప్రమోషన్… విడుదలానంతరం ప్రమోషన్… దెబ్బ కొట్టిందని తెలిసి ఏదో మళ్లీ పైకి లేపే ప్రమోషన్… ఇదే సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్లోనే కదా, ఈ మగ చావనిస్ట్ ఏవో కూసింది… నిధి అగర్వాల్, సమంతల పబ్లిక్ ఫంక్షన్ల భంగపాటుకు వాళ్ల డ్రెస్సులే కారణం అని తేల్చేశాడు కదా ఈ మేధావి… కారణం మగాడి చూపులో […]
నో నో… మగ శివాజీకి ఈ పోస్టుకూ లింక్ లేదు… చదవాల్సిన పని లేదు…
. Psy Vishesh…… కానీ… ఇదొక కంత్రీ పదం.. ♦️ మీ డ్రెస్ బాగుంది, కానీ (but)… ♦️ మీరు బాగా పాడుతున్నారు, కానీ (but)… ♦️ మీ హెయిర్ స్టైల్ బాగుంది, కానీ (but)… ♦️ ఒక ఫ్రెండ్ గా మీరంటే చాలా ఇష్టం… కానీ (but)… ♦️ మీ సెన్స్ ఆఫ్ హ్యూమరంటే ఇష్టం.. కానీ (but)… ♦️ చంపడం, చంపించడం తప్పే… కానీ (but)… ఇలా ఎవరైనా మీతో మాట్లాడినప్పుడు మీరెలా ఫీలవుతారు? […]
జై గురుదత్త… ‘ముచ్చట’ చెప్పిందని కురువాపురం వెళ్లాను… నా అనుభవం…
. మోస్ట్ పాపులర్, రద్దీ, కమర్షియల్ దైవక్షేత్రాల్లో ఉండడు దేవుడు… ప్రశాంతంగా, ఏ హడావుడీ, ఏ కమర్షియల్ వాసనలూ లేని క్షేత్రాల్లో ఉంటాడు… నో, నో, నేను తిరుపతి గురించో, మరే ఇతర క్షేత్రం గురించో చెప్పడం లేదు… ఐనా తిరుమలలో దేవుడు ఉన్నాడా…? అక్కడ రాజకీయ నికృష్టుల ధాటికి ఎప్పుడో వెళ్లిపోయి ఉంటాడు కదా… ఎవడి కర్మ, ఖర్మ వాడు అనుభవిస్తాడు… అలిపిరిలో కావచ్చు, మరో చోట కావచ్చు… సరే, మనం ఆమధ్య కర్నాటక, […]
భేష్ అలిస్సా..! కలలే కాదు, జీవనత్యాగం… ఖగోళ విజయం వైపు..!!
. అరుణగ్రహంపై మనిషి అడుగు పెట్టాలి… ఆ అడుగు నాదే కావాలి…. వావ్, ఇదీ లక్ష్యం, ఇదీ సంకల్పం, ఇదీ మనిషి తనను తాను అభినందించుకునే అసలైన తెగువ, సాహసం… మళ్లీ రాలేనేమోనని తెలిసీ, ప్రాణాలను పణంగా పెట్టి… విశ్వాంతరాల్లో తన అడుగు ముద్ర వేయడానికి తపన పడుతున్న ఓ మహిళ కథ ఇది… అసలు చదువుతుంటే, రాస్తుంటే ఎంత బాగుందో… మనుషులు రెండు రకాలు… కొందరు తాము పుట్టిన నేల మీద మాత్రమే బతకాలనుకుంటారు… మరికొందరు తాము […]
పాకిస్థాన్ అంటే..? ఉగ్రవాదులు ప్లస్ భిక్షగాళ్ల భారీ ఎగుమతిదారు..!!
. పాకిస్థానీ భిక్షగాళ్ల గురించి ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చ నిజంగా విస్తుగొలిపేలా ఉంది… ముఖ్యంగా సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాలు పాకిస్థాన్ ప్రభుత్వానికి ఈ విషయంలో తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశాయి… సౌదీ అరేబియా, యూఏఈ (UAE) వంటి దేశాలు తమ దేశాల్లో పట్టుబడుతున్న భిక్షగాళ్లలో మెజారిటీ పాకిస్థానీయులేనని వెల్లడించాయి… అక్కడి జైళ్లలో ఉన్న విదేశీ భిక్షగాళ్లలో దాదాపు 90% మంది పాకిస్థానీయులే ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి… వీరు సాధారణంగా పవిత్ర యాత్రల […]
వృషభ..! పునర్జన్మల్లోనూ వెంటాడే శాపాలు… జనం మెచ్చని ఓ సోది స్టోరీ..!!
. నిన్న నాలుగైదు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు రిలీజై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి… స్ట్రెయిట్ సినిమాగా ప్రజెంటర్లు చెప్పుకునే ఓ మలయాళ సినిమా కూడా వృషభ పేరిట వచ్చింది… ఇది పేరుకు పాన్ ఇండియా సినిమా కానీ… కేవలం తెలుగు, మలయాళం భాషల్లో మాత్రమే వచ్చినట్టుంది… తెలుగు మార్కెట్‌ను ఎవరూ వదులుకోరు… ఈమధ్య సౌత్ సినిమాలన్నీ హిందీ బెల్టులో తన్నేస్తున్నాయి కదా, అందుకని హిందీ మార్కెట్ జోలికి పోనట్టున్నారు… మోహన్‌లాల్ సినిమా ఇది… తను గొప్ప నటుడే, […]
ఎవరు ఈ తారిక్ రెహమాన్..! బంగ్లాదేశ్ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్..!!
. Pardha Saradhi Upadrasta….. 17 ఏళ్ల తర్వాత తిరిగివచ్చిన తారిక్ రహ్మాన్ – అసలు ఆయన ఎవరు? ఎందుకు కీలకం? తారిక్ రహ్మాన్ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) యాక్టింగ్ ఛైర్మన్. మాజీ ప్రధాని ఖలేదా జియా కుమారుడు. ఒకప్పుడు బంగ్లాదేశ్ రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన యువ నాయకుల్లో ఒకడు. 📌 తారిక్ రహ్మాన్ నేపథ్యం 2001–2006 మధ్య BNP అధికారంలో ఉన్నప్పుడు “డీ-ఫాక్టో పవర్ సెంటర్”గా పేరు. 2007లో సైనిక మద్దతుతో వచ్చిన కేర్‌టేకర్ […]
వైష్ణవీ శర్మ..? ఎందుకంత జనం ఆసక్తి…?! తెగ వెతికేస్తున్నారు..!
. ఆమె పుట్టగానే తండ్రి కుండలి వేయించాడు… ఆమె విజయం రెండు రంగాల్లో ఉన్నట్టు చెబుతోంది… ఒకటి వైద్యం, రెండు ఆటలు… డాక్టరీ చదివిస్తే గ్వాలియర్‌కు మాత్రమే తెలుస్తుంది… ఆటల్లో క్లిక్కయితే ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది అనుకున్నాడు ఆ తండ్రి… ఆయన నమ్మాడు… ఆటల వైపే నడిపాడు ఆమెను… బోలెడంత నిరాశ… కఠిమైన సాధన… ఎట్టకేలకు అన్నీ దాటుకుని మొన్నటి వైజాగ్ మ్యాచులో ఇంటర్నేషనల్ కెరీర్లోకి డెబ్యూ… ఇప్పుడు ఆమె ఎవరు అని తెగ సెర్చింగు సాగుతోంది… […]
పరుచూరి బ్రదర్స్ చెప్పి ఉండాల్సింది… సినీరంగ నైజం చెప్పనివ్వదు…
. Subramanyam Dogiparthi ….. బాలకృష్ణ సినిమాల్లో నాకు నచ్చిన సినిమా 1989 జూన్‌లో వచ్చిన ఈ అశోక చక్రవర్తి . మళయాళంలో సూపర్ హిట్టయిన ఆర్యన్ సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . మళయాళంలో మోహన్ లాల్ , హిందీ నటుడు శరత్ సక్సేనా , రమ్యకృష్ణ , శోభన ప్రధాన పాత్రల్లో నటించారు . ఈ మళయాళ సినిమా హిందీలోకి కూడా డబ్ అయింది . 1989 జూన్‌లో ఒకే రోజు రెండు […]
రాముడు కృష్ణుడు అనగానే ఎన్టీయార్ గుర్తొచ్చినట్టు… క్రీస్తు అనగానే…!!
. Subramanyam Dogiparthi ….. రాముడు , కృష్ణుడు అనగానే NTR ఎలా గుర్తుకొస్తారో….. అలాగే యేసుక్రీస్తు అనగానే విజయచందర్ గుర్తుకొస్తారు … 1978 క్రిస్టమస్ సందర్భంలో రిలీజయిన ఈ కరుణామయుడు సినిమా ద్వారా అంతటి పేరు ప్రఖ్యాతులను విజయచందర్ సంపాదించుకున్నారు … యేసుక్రీస్తు మీద వచ్చిన అన్ని సినిమాలలో కమనీయంగా తీయబడింది ఈ సినిమా … 14 భాషల్లోకి డబ్ చేయబడింది … విదేశాలలో ఇంగ్లీషు సబ్ టైటిల్సుతో ప్రదర్శించబడింది … యేసుక్రీస్తు పాత్రను వేయాలని […]
బుక్ ఫెయిర్ సందర్భం చూసి మరీ వదిలినట్టుంది యండమూరి ఈ పోస్టు..!!
. బుక్ ఫెయిర్ జరుగుతోంది కదా హైదరాబాదులో… పుస్తకాల అమ్మకాల కోసం నానా అగచాట్లు, ఖర్చు… రచయితలు, పబ్లిషర్లు, విక్రేతలు… ఎవరి కష్టాలు వాళ్లవి… మంచి సందర్భం, సమయం చూసి మరీ వదిలినట్టున్నాడు ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ఓ పోస్టును… బాగుంది… ఇది తన రాబోయే కొత్త నవలలోని ఓ భాగమట… Veerendranath Yandamoori ……. ‘మనము’ మూడు అక్షరాలు. ‘నువ్వు’ రెండు అక్షరాలు. ‘నా’ ఒక్క అక్షరం..! ‘నా’ వృత్తాన్ని పెద్దది చేసి, ‘నిన్ను’ […]
మెప్పించావు దర్శకా..! చాలా క్లిష్టమైన ప్రయోగాన్ని ఛేదించావుపో…!!
. నిజంగా శంబాల దర్శకుడు యుగంధర్ ముని ప్రయత్నాన్ని మెచ్చుకోవచ్చు… ప్రజెంట్ సినిమా ట్రెండ్ ఏమిటి..? దైవ శక్తులు, క్షుద్ర శక్తులు, మైథాలజీ,, మూడ నమ్మకాలు, ప్రజల భయబీభత్సాలు ప్లస్ హీరో ఎలివేషన్లు… అంతే కదా… ఈ జానర్‌కు సైన్స్ వర్సెస్ శాస్త్రం అనే ఆలోచన రేకెత్తే అంశాల్ని ముడిపెట్టి, రొటీన్ రొమాంటిక్ మసాలాలు లేకుండా ఓ అత్యంత సంక్లిష్ట కథతో సినిమా కథనాన్ని రక్తి కట్టించాడు… చాలా భిన్నమైన జానర్ ఇది… మిస్టిక్ థ్రిల్లర్… ప్రేక్షకుల […]
రోషన్… హీరో మెటీరియలే…! కానీ ఈ పాత్ర మోయలేనంత బరువు..!!
. శ్రీకాంత్- ఊహ కొడుకు రోషన్… అందగాడు… ఓ లేడీ జర్నలిస్టు భాషలో చెప్పాలంటే హీరో మెటీరియలే… ఒడ్డూ పొడుగూ ప్లస్ నటన కూడా పర్లేదు, అనుభవం పెద్దగా లేకపోయినా కష్టపడతాడు… పాత్రకు తగిన పర్ఫామెన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు… రక్త వారసత్వం నటనే కదా… మొన్న బిగ్‌బాస్ ఫినాలేలో కనిపించాడు… నిజానికి సినిమాల్లోకన్నా బయటే బాగున్నాడనిపించింది… కానీ ఇంకా లేతదనం పోలేదు పిల్లాడిలో… అందుకే ఛాంపియన్ సినిమాలోని బరువైన పాత్ర నప్పలేదేమో… ఒక చారిత్రిక పోరాట యోధుడి […]
‘మగ శివాజీ’ లీడ్ రోల్… దండోరా ఓ మంచి ప్రయత్నమే… కానీ..?!
. రెండు రోజులుగా శివాజీ సామాన్ల డర్టీ వ్యాఖ్యలు… దానిపై వ్యక్తమైన అభ్యంతరాలు, వ్యతిరేకత… అనసూయకు నీ రుణం తీర్చుకుంటానంటూ శివాజీ బెదిరింపులు… చాల్లే అన్నట్టు అనసూయ ప్రతిస్పందన… మొత్తానికి తెలుగు నెటిజనం రెండుగా చీలిపోయి సమర్థనలు, ఖండనలు… ఓ దుమారం… ఆ శివాజీ నటించిన దండోరా సినిమానూ, ఈ వివాదాన్ని కలిపి చూడనక్కర్లేదు… కానీ బయట దుమారంతో శివాజీ మీద మనసులో ఏర్పడిన ఓ అభిప్రాయం ప్రభావం ఖచ్చితంగా ఆ పాత్రను మనం చూసే తీరు […]
ఈషా (Eesha) – ఈ దెయ్యం భయపెట్టలేదు… చిరాకెత్తించింది…
. ఈ మధ్య కాలంలో బాబాల మీద, ఫేక్ స్వాముల మీద సినిమాలు రావడం కామన్ అయిపోయింది… అదే దారిలో వచ్చిన సినిమానే ఈ ‘ఈషా’… మరి ఈ సినిమా భయపెట్టిందా? లేక భయంకరంగా ఉందా? కథాకమామిషు ఏంటంటే… నైనా (హెబ్బా పటేల్) ఒక గ్యాంగ్‌కు లీడర్… తన పని ఏంటంటే… అమాయక జనాన్ని మోసం చేసే దొంగ స్వాముల ముసుగు తొలగించడం… అలా ఒకసారి డాక్టర్ ఆదిదేవ్ (పృథ్వీరాజ్) అనే ఒక న్యూరాలజిస్ట్ కమ్ స్వామీజీని […]
ఒకే ఒక డైలాగ్… బలమైన జంగిల్ రాజ్, మాఫియా రాజ్ కూలిపోయింది…
. ( రమణ కొంటికర్ల ) …… అప్పటివరకూ అచంచలమైన విశ్వాసంతో అప్రతిహతంగా గెలుస్తూ వస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్… 2005 బీహార్ ఎన్నికల్లో కుప్పకూలింది…. అందుకు, కర్ణుడి చావుకి వేయి కారణాల్లా ఎన్నో ఉండొచ్చు. కానీ, ఆ కారణాలన్నింటిలోకి.. ఓ ప్రధాన కారణం ఆర్జేడీని గద్దె దించింది. ఇప్పటివరకూ మళ్లీ కనీసం ఆ పార్టీకి అధికారంలోకొచ్చే అవకాశాలు కూడా లేకుండా చేసేసింది. అదే సమయంలో ప్రజల విశ్వాసం చూరగొన్న ఓ నాయకుడి నోటి […]
తక్కువ మంది అతిథులతో పెళ్లి… ఆశీస్సులు, పలకరింపులు, మర్యాదలు…
. Pardha Saradhi Upadrasta ….. పెళ్లిళ్లపై ఒక నిష్కల్మషమైన విశ్లేషణ (The Honest Wedding Review) మీ పెళ్లి గురించి 70- 80% మంది అతిథులు ఎందుకు పెద్దగా పట్టించుకోరు? వాళ్లు వచ్చేది వేరే కారణాల కోసం – ఇంటర్నెట్ డేటా ఇదే విషయాన్ని రుజువు చేస్తోంది. “మర్యాద కోసం వచ్చే సందర్శన” (The Formality Visit) 3 నిమిషాల కంటే తక్కువ ‘వెడ్డింగ్‌వైర్ ఇండియా’ (Wedding Wire India) ప్రకారం, అతిథులు సగటున వధూవరులతో […]
అసలే వాణిశ్రీ… పైగా చిరంజీవి… విజయశాంతీ ఉండనే ఉంది… ఇంకేం..?!
. కొంగు జారితేముంది కొంటె పిల్లోడా, నీ గుండె చిక్కుకుందేమో చూడు పిల్లోడా అంటూ తెలుగు పిల్లోళ్ళందరి గుండెల్ని కాజేసిన వాణిశ్రీ ఎనిమిది సంవత్సరాల విరామం తర్వాత పొగరుబోతు అత్తగా సెకండ్ ఇన్నింగ్సులో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సినిమా ఈ అత్తకు యముడు అమ్మాయికి మొగుడు . ఆరోజల్లో టాప్ హీరోయిన్లకు ఇచ్చే పారితోషికానికి రెట్టింపు ఇచ్చి అత్త పాత్రకు ఆమెను తీసుకున్నారట . చిరంజీవి మాంచి ఊపులో ఉన్న పీరియడ్‌లో తీయబడిన సినిమా ఇది . […]
దృశ్యం-3… రాంబాబు మార్క్ ‘ట్విస్ట్’… అడుగు దూరంలో అసలు క్లైమాక్స్!!
. సినిమా షూటింగ్ కంటే ముందే ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది దృశ్యం 3… మలయాళంలో మోహన్‌లాల్ (జార్జ్ కుట్టి), హిందీలో అజయ్ దేవగన్ (విజయ్ సల్గాంకర్), తెలుగులో వెంకటేష్ (రాంబాబు) – ఈ ముగ్గురూ తమ కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసే పోరాటం ప్రేక్షకులకు ఒక ఎమోషన్… అయితే, ఈసారి ఈ ముగ్గురు ‘తండ్రుల’ మధ్య ఒక వింతైన యుద్ధం నడుస్తోంది… అది కథలో కాదు, రిలీజ్ డేట్లలో..! హిందీ వెర్షన్ షూటింగ్ శరవేగంగా జరుగుతూ, అక్టోబర్ […]
ఏరు దాటాక బోడి మల్లన్న… ఇది పవర్ లిఫ్టర్ ప్రగతి మరో మొహం…
. సినిమా సెలబ్రిటీలందరూ అంతే… ఎవరూ శుద్ధపూసలు కాదు… సందర్భం వచ్చిన ప్రతిసారీ తమ నిజస్వరూపం చూపిస్తుంటారు… ఆహో ఓహో ప్రగతి అని మనం మొన్న అందరమూ చప్పట్లు కొట్టిన నటి ప్రగతి… వేదిక ఎక్కగానే నానా నీతులూ బోధించింది… అంతేకాదు, ఇప్పుడు వేణుస్వామిని విమర్శిస్తోంది… అవ్వా, తల్లీ… నువ్వు కూడా ఎవరికీ మినహాయింపు కాదు… బరువులు ఎత్తగలిగావు గానీ… పరువు మోయలేని మనస్తత్వం కనిపిస్తోంది… కాస్త వివరంగా చెప్పుకుందాం… ఎస్, వెయిట్ లిఫ్టింగుతో ఏవో పతకాలు […]
- 1
- 2
- 3
- …
- 391
- Next Page »


















