ఆ పిచ్చోడు కాదు… ఈ పిచ్చోడు ఎలిమినేటయ్యాడు అని ఓ తాజా సమాచారం… అదేనండీ, బిగ్‌బాస్ హౌజు నుంచి మెంటల్ పృథ్వి ఎలిమినేట్ కాలేదు, తన బదులుగా మణికంఠను పంపించేశారు… కాదు, తనే కోరుకుని బయటికి వచ్చేశాడు అని ఆ సమాచారం… నిజానికి ప్రాథమిక సమాచారం ఏమిటంటే… టేస్టీ తేజ, హరితేజలను కాపాడటానికి పృథ్విని ఎలిమినేట్ చేశారని..! బిగ్‌బాస్ న్యూస్ రాసే మెయిన్ స్ట్రీమ్ సైట్లు సహా అన్ని యూట్యూబ్ చానెళ్లూ పృథ్వికి మంగళం పాడేశాయి… నిజానికి […]
అడిగేవాడికి చెప్పేవాడు లోకువ..! అసందర్భ ప్రశ్నలతో అద్భుత పాత్రికేయం..!!
అడిగేవాడికి చెప్పేవాడు లోకువ… సినిమావాళ్లు ఎలాగూ దొరికారు కదాని కొందరు ఫిలిమ్ జర్నలిస్టులు ఏవేవో ప్రశ్నలు వేస్తూ, చివరకు సినిమావాళ్లు ప్రెస్మీట్లు అంటేనే చికాకుపడే సిట్యుయేషన్ తీసుకొస్తున్నారు ఈమధ్యకాలంగా..! సినిమాకు సంబంధం లేని ప్రశ్నలు, ఏవో గెలికి, ఏదో రాబట్టే విఫల ప్రయత్నం చేసి, హబ్బ, భలే అడిగాం ప్రశ్నల్ని అనుకుని వాళ్లే భుజాలు చరుచుకునే విచిత్ర ధోరణి… సోకాల్డ్ సీనియర్ జర్నలిస్టులు కూడా మినహాయింపేమీ కాదు… తెలుగమ్మాయి, హీరోయిన్ అనన్య నాగళ్ల ఓ లేడీ రిపోర్టర్ […]
హరీశ్‌రావుపై విమర్శ కాదు… ఆ నిజాలేమిటో చెప్పాల్సిన బాధ్యత రేవంత్‌రెడ్డిదే..!!
నా కారు ముందు డాన్స్ చేసినవ్, నీ స్థాయి మరిచిపోయినవా అని ఎద్దేవా చేస్తున్నాడు హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి..! అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్ మాటల్ని కూడా అదుపు తప్పిస్తుందనేది నిజమే గానీ… నిజంగానే నీ కారు ముందు డాన్స్ చేసిన ఓ సాదాసీదా నీ శిష్యుడు, నీ కార్యకర్త ఏకంగా సీఎం అయ్యాడు… సో, ఆ సక్సెస్ స్టోరీలో నీకూ సంతోషం ఉండాలి కదా… ఆడిపోసుకుంటావు దేనికి..? పోనీ, అదే బీఆర్ఎస్లో ఉండి […]
అన్‌స్టాపబుల్..! మళ్లీ ఆ బావాఅల్లుళ్లతో స్టార్ట్… తోడుగా పొలిటికల్ జతగాడు..!
ఆహాలో అన్‌స్టాపబుల్ రియాలిటీ షో మొదట్లో సూపర్ హిట్… నో డౌట్… బాలకృష్ణ వంటి స్టార్, వెటరన్ హీరో హోస్ట్ చేయడంతో ఆ క్రేజ్ వచ్చింది… ఆ చాట్ షో మొదట్లో సరదాగా సినిమా సెలబ్రిటీలతో సాగింది… ఎప్పుడూ ఫ్యాన్స్‌ను కొడుతూ, తిడుతూ… బ్లడ్డు, బ్రీడు కామెంట్లతో… ఓ తరహాలో కనిపించే బాలకృష్ణను మరో కోణంలో ఆవిష్కరించింది ఆ షో… మొదటి రెండు సీజన్లూ పర్లేదు… ఒకటీరెండు సినిమా ప్రమోషన్ల కోసం ఒక్కో ఎపిసోడ్ కూడా ప్రసారం […]
బొచ్చులో ఎపిసోడ్..! ఆ బవిరి గడ్డంలో ఏదో మంత్ర శక్తి దాగున్నట్టు బిల్డప్పు..!!
ఎలాగూ పృథ్విని బయటికి పంపించేయాలని బిగ్‌బాస్ టీమ్ నిర్ణయం తీసేసుకుంది… దాని లెక్కలు దానికున్నాయి… కానీ వెళ్లే ముందు తనను డిఫరెంటుగా ఆటపట్టించి మరోసారి తనలోని మూర్ఖత్వాన్ని, తన ఆలోచనల్లోని అపరిణత ధోరణినీ బయటపెట్టింది… ఓరకంగా ఆటాడుకుంది… అవినాష్ గడ్డం తీసేయించుకుని, జుట్టు కత్తిరించుకోవడం వల్ల ప్రైజ్ మనీకి 50 వేలు యాడ్ అయ్యాయి… తనకే ప్రైజ్ మనీ రావాలనీ లేదు… ఆటలో అంతిమ విజేత ఎవరో చెప్పలేం కాబట్టి… కానీ తనకు ఆట పట్ల కమిటెడ్ […]
వాళ్లంతా పరభాష నటులే… కానీ తెలుగు భాషలోనే జీవిస్తున్నారు… గ్రేట్…
ఎస్, ఎవరు కాదన్నా, ఎవరు ఔనన్నా… టీవీల్లో ప్రసారమయ్యే సినిమాల్ని ఎవడూ చూడటం లేదు… అందుకే స్టార్ హీరోల భారీ సినిమాలకూ రేటింగులకు కరువు… కాస్తో కూస్తో చూస్తున్నారూ అంటే… ఎంత దిక్కుమాలినవే అయినా సరే, సీరియళ్లు చూస్తున్నారు… అవీ స్టార్ మా, జీ తెలుగు సీరియళ్లు మాత్రమే… జెమిని టీవీని జనం ఏనాడో మరిచిపోయారు, ఈటీవీ ఆ పోటీ బరి నుంచి ఏనాడో తప్పుకుంది… ఏటా ఒకసారి స్టార్ మా, జీ తెలుగు తమ సీరియళ్ల […]
శుభం… ఎట్టకేలకు పృథ్విని బయటికి తరిమేశారు… ఇక ప్రేరణ సేఫ్…
ఎట్టకేలకు పృథ్వి శెట్టి బిగ్‌బాస్ హౌజు నుంచి తరిమివేయబడ్డాడు… శుభం… ఒక ఉన్మాదిని బయటికి పంపించి మిగతా హౌజ్మేట్లు ప్లస్ ప్రేక్షకులు తేలికగా ఊపిరి పీల్చుకునేలా చేశారు బిగ్‌బాస్ టీం… కానీ ఈ పని మొదట్లోనే చేయాల్సింది… కాదు, హౌజులోకి ఎంపికే శుద్ధ తప్పు… ఎప్పుడు చూసినా సిగరెట్లు తాగుతూ… లేడీ కంటెస్టెంట్లతో పులిహోర కలుపుతూ… గేమ్స్, టాస్కులు వచ్చినప్పుడు ఓ ఉన్మాదిలా కేకలు వేస్తూ… పైపైకి దూసుకొస్తూ… ఓ అరాచకం… మొదట్లో అందరూ మణికంఠను మెంటల్ […]
రావణవధ అయిపోయింది… మనం అయోధ్య వైపు నడుస్తూ దారిమధ్యలో ఉన్నాం…
ముందుగా ఓ పోస్టు చదవండి… చాలామంది దీన్ని చాన్నాళ్లుగా పోస్ట్ చేస్తున్నారు… పలు భాషల్లో కూడా… కోరా వంటి వేదికలపై దీనిపై చర్చలు కూడా సాగాయి… సోషల్ మీడియాలో చాలామంది పిచ్చోళ్లు ఉంటారు, మేమేం రాసినా చదువుతారు అనే భావన కావచ్చు లేదా తామే పిచ్చోళ్లలాగా రాయడం కావచ్చు… భలే వింతగా ఉంటాయి ఇలాంటి పోస్టులు… ప్రతి సంవత్సరం దసరా తర్వాత సరిగ్గా 21 రోజుల తర్వాత దీపావళి ఎందుకు వస్తుంది..? మీరు నమ్మకపోతే, క్యాలెండర్‌ను తనిఖీ […]
వ్యక్తిత్వ వికాస నిపుణుల్లో 97% మంది మానసిక రోగులే… ఎందుకంటే..?
ఈ రోజుల్లో కొంత మంది “గొప్పవాడిగా ఎలా మారాలి?”, “విజయం సాధించటం ఎలా?” అని ఎక్కువగా మాట్లాడుతుంటారు. కానీ, రియలిస్టిక్ గా చూసుకుంటే, ప్రతి ఒక్కరూ ఇప్పటికే గొప్పవాళ్లే… మనం కొండాపూర్‌లో ఉన్నా, కాకినాడలో ఉన్నా, క్యాలిఫోర్నియాలో ఉన్నా, మనిషి అంటేనే గొప్పవాడు అని అర్ధం. ప్రత్యేకంగా ఎవరూ మారాల్సిన అవసరం లేదు, గొప్పవాడిగా మారాల్సిన అవసరం అసలే లేదు. ఎందుకంటే, మనిషి విలువ, గొప్పతనం అనేది అంతర్గతంగా వారి వారి ప్రత్యేకత, ప్రతిభలని బట్టి ఉంటుంది. […]
ఎంతకు తెగించార్రా… చివరకు నైవేద్యపు బెల్లం కూడా కల్తీయేనా..?!
తిరుమల లడ్డూలో జంతుకొవ్వు నూనెల కల్తీ నెయ్యి ఆనవాళ్లు బయటపడటంతో దేశవ్యాప్తంగా గుళ్లల్లో ప్రసాదాలపై భక్తుల్లో సందేహాలు మొదలయ్యాయి… భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆయా రాష్ట్రాలు వెంటనే చర్యలు ప్రారంభించాయి కూడా… పలు రాష్ట్రాలు తమ గుళ్లలో ప్రసాదం తయారీకి రాష్ట్ర సహకార సంస్థల బ్రాండ్లనే వాడాలని ఆదేశించాయి… తెలంగాణలో కూడా విజయ డెయిరీ నెయ్యినే వాడాలని ఆదేశించారు… ఎందుకైనా మంచిదని కల్తీ పరీక్షలు కూడా చేయించారు… ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరయ్యే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం […]
పేరున్న మొహాల కోసం బలగం వేణు తన్లాట… అక్కడే అసలు తప్పు…
ఎమోషన్స్‌ను తెరపై బలంగా ప్రజెంట్ చేయగల ఓ దర్శకుడు వేణులో ఉన్నాడని చాలామందికి బలగం సినిమా వచ్చేవరకూ తెలియదు… అప్పటిదాకా తను జస్ట్, ఓ జబర్దస్త్ బాపతు కమెడియన్ మాత్రమే… కానీ బలగం వచ్చాక తనలో రియల్ టాలెంట్ లోకానికి అర్థమైంది… తనను ఐదారు మెట్లు ఎక్కించింది ఆ సినిమా ఒకేసారిగా… వోకే, గుడ్, ట్రెమండస్… ఫస్ట్ సినిమా తనను ఇండస్ట్రీలో నిలబెట్టింది… కానీ వాట్ నెక్స్ట్..? అసలు పెద్ద పెద్ద దర్శకులకు ద్వితీయ గండం ఉంటుంది… […]
పురాణాల్ని సోషలైజ్ చేయడం బాపుకు అలవాటే… ఈ కథ కూడా అంతే…
బాపు సృష్టించిన మరో గొప్ప మాస్ & క్లాసిక్ సినిమా మన వూరి పాండవులు… . పాండవులు అనో , లవకుశులు అనో టైటిల్ పెట్టకపోయినా పురాణాలను సోషలైజ్ చేయకుండా ఉండలేరు బాపు . అది ముత్యాలముగ్గు కావచ్చు , బుధ్ధిమంతుడు కావచ్చు . టైటిల్లోనే పాండవులు అన్నాక ఇంక చెప్పేదేముంది . భారతంలో పంచ పాండవుల్లాగా ఈ సినిమాలో కూడా అయిదుగురు పాండవులు , ఓ దుర్యోధన+ దుశ్శాసనుడు ఉంటాడు , ఓ శకుని ఉంటాడు […]
అక్షరాలా ఆమె మహాతల్లి..! ప్రపంచ మానవ చరిత్రలో ఇదే తొలిసారి…
. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ పోస్టు ఒకటి కనిపించింది… 16 సంవత్సరాల క్రితం సెన్సేషన్ జననం అని… ఏమిటీ అంటే… ఏడుగురు ఒకేసారి పుట్టారు… వాళ్లంతా బతికే ఉన్నారు… ఇదుగో తల్లిదండ్రులతో వాళ్లందరూ ఒకే ఫోటోలో… ఇదీ ఆ పోస్టు సారాంశం… కానీ, నాకు తెలిసి… వాళ్లు పుట్టింది 16 ఏళ్ల క్రితం కాదు… McCaughey septuples గా ఈ ప్రసిద్ధులు పుట్టింది 1997లో… అంటే దాదాపు 27 ఏళ్ల క్రితం… ప్రపంచంలో పుట్టిన ఏడుగురు […]
ఓ చిన్న తప్పు ఆటనే మార్చేస్తుంది… జీవితమైనా… బిగ్‌బాస్ ఆటయినా…
ఒక తప్పుటడుగు… ఒక తప్పుడు అంచనా… మొత్తం గేమ్‌ను మార్చేస్తుంది… నిజ జీవితంలోనైనా అంతే, బిగ్‌బాస్ ఆటలోనైనా అంతే… అదే జరిగింది… నిజానికి మణికంఠ ఓ మెంటల్ కేసు… కానీ రోజులు గడిచేకొద్దీ మారాడు, మెచ్యూరిటీ కనిపిస్తోంది… అంటే, మొదట్లో ఫ్యామిలీ ఇష్యూస్ చెప్పి, సింపతీ గేమ్ ఆడాడని లెక్క… మొన్న అవినాష్ అండ్ కో తనను కరప్ట్ చేయాలని చూశారు, కానీ మణికంఠ నిజాయితీగా తను కోవర్టుగా మారలేనని తిరస్కరించాడు… ఈరోజు గేమ్‌లో కూడా అంతే… […]
ఆమే… అవును, ఆమే… ఇండియన్ సినిమా తెరపై ఓ ప్రజ్వలిత వెలుతురు…
. , ‘భూమిక’ The Role ఎ ఫిల్మ్ బై శ్యాం బెనెగల్ …………………………………………………….. S M I T A P A T I L A Barometer for Accomplishment 1955 అక్టోబర్ 17 మహానటి స్మితాపాటిల్ పుట్టిన రోజు ……………………………………… మహారాష్ట్రలో ఓ మారుమూల కుగ్రామం. ఒక అందమైన దేవదాసీ, వయసులో పెద్దవాడైన ఓ బ్రాహ్మడు (బి.వి.కారంత్) భార్యాభర్తలు . వాళ్ళకో పదేళ్ళ కూతురు ఉష. శాస్త్రీయ సంగీతంలో ఆరితేరిన ఉష […]
కులమే తెలుగు మీడియాకు ఇంధనం… కాదని ఖండిస్తే పెద్ద అజ్ఞానం…
. విన్నావా గురూ… ఆంధ్రజ్యోతిలో మార్పులట…? గాసిప్స్ అంటావా..? లేదే… హేమిటట…? ఇంకా తెలియదా..? ఎడిటర్ నల్గొండ బ్రాహ్మణ శ్రీనివాస్‌ను తరిమేస్తున్నారట…! మొన్నీమధ్యే రాజీనామా ఇచ్చాడట… కాదు, అడిగారట… ఫస్ట్ నుంచి తను ఎడిటర్ కాదట… పోనీలే ఫాఫం… ఏదో నామ్కేవాస్తే ఎడిటర్… వారానికో వ్యాసం తప్ప, ఆయనకూ పెద్ద పనేం ఉంది గనుక… ఆయన చెబితే ఎవరు విన్నారు గనుక… ఐనా ఆయన తెలుగు స్టార్ హీరో కమర్షియల్ మాస్ మసాలా సినిమాకు దర్శకుడు కాలేదు […]
మళ్లీ ఫ్లాప్ దిశగా బిగ్‌బాస్… అట్టహాసాలు ఫలించక మళ్లీ పూర్ రేటింగ్స్…
8 మంది పాతవాళ్లు హౌజులో ఉంటే మరో 8 మందిని వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా హౌజులోకి జొప్పించారు కదా… వాళ్లూ పాత కాపులే… ఈ ఎంట్రీలను రీలోడ్ పేరిట ఆరో తేదీన స్పెషల్ ఈవెంట్ అట్టహాసంగా నిర్వహించారు… మూడూమూడున్నర గంటల ఎపిసోడ్.,. ఐతేనేం..? రేటింగుల్లో తుస్సు… హైదరాబాద్ బార్క్ కేటగిరీలో ఆరు రేటింగులలోపే… శనివారం వీకెండ్ షో రేటింగ్స్ ఐదులోపు… మిగతా రోజుల్లో 3.5 నుంచి 4 వరకు… దసరా స్పెషల్ కూడా హంగామా చేశారు మొన్న… […]
చేతక్..! చరిత్ర మెచ్చిన అశ్వం… అందుకే ఆ నగర కూడలిలో ఓ విగ్రహం…
. ఒక మహారాణా ప్రతాప్- ఒక చేతక్ గుర్రం ఇప్పుడంటే ప్రత్యర్థిమీద గెలవడానికి చాలా సులభమైన మార్గాలున్నాయి. బోడి పెంపుడు వేటకుక్కలను ఉసిగొలిపి…వదిలినా చాలు. చచ్చినట్లు శరణాగతి చొచ్చి యుద్ధసీమలో శంఖారావం పూరించడానికి ముందే కాళ్లమీద పడి…కనికరించమని శత్రువే వేడుకుంటాడు. సభా మర్యాద దృష్ట్యా చెప్పడానికి వీలుకాని ఇంకా ఎన్నెన్నో క్షుద్రవిద్యల ద్వారా ఇప్పుడు గెలుపు చిటికెలో పని. వెన్నుపోట్లు కూడా పొడవకుండానే కూర్చున్న చోట కూర్చున్నట్లుగానే ఉండి శత్రువు అంతు చూడవచ్చు. యుద్ధం చేయకుండానే విజయాన్ని […]
ఒళ్లమ్ముకుంటేనేం..? గుండెలో తడి ఉండదా..? దానికీ భావోద్వేగాలుండవా..?
. మనం ఎన్నో సినిమాలు చూస్తుంటాం . కానీ కొన్ని సినిమాలు , ఆ సినిమాల కధాంశాలు , పాత్రలు , ఆ పాత్రల్లోని నటులు , సంగీతసాహిత్యాలు , దర్శకత్వ ప్రతిభ మన మనసుల్లో అలా శాశ్వతంగా నిలిచిపోతాయి . మధురానుభూతిని కలిగిస్తాయి . నాకు అలా మిగిలిపోయిన సినిమాలలో ఒకటి 1978 లో వచ్చిన ఈ మల్లెపూవు సినిమా . It’s a musical , literary , emotional classic . ముఖ్యంగా […]
లారెన్స్ బిష్ణోయ్..! ఓహ్… లా చదివిన గ్యాంగ్‌స్టర్ వెనుక ఇంత కథ ఉందా..?
. బాగా తెల్లగా, ఎర్రగా బుర్రగా ఉన్నాడని బిష్ణోయీ కుర్రాడికి బ్రిటిష్ ఉన్నతాధికారి హెన్రీ లారెన్స్ పేరు! ……………………………………………………………………… బాలీవుడ్ ‘కండలవీరుడు’, ముస్లిం తండ్రికి, హిందూ తల్లికి పుట్టిన అత్యంత లౌకిక పౌరుడు సల్మాన్ ఖాన్ ఇప్పుడు ముంబై నగరం బాంద్రాలో నివసించే డీలక్స్ అపార్ట్మెంట్ వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. విజిటర్లు ఎవరినీ ‘టైగర్ జిందా హై’ హీరో తన నివాసంలోకి అనుమతించడం లేదు. ఇవి ఇప్పుడు ఇంగ్లిష్ న్యూజ్ చానల్స్‌లో పదే పదే […]