Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎవరు రియల్ జర్నలిస్టు..?! తేల్చాల్సింది ఎవరు..? ఏ ప్రామాణికాల్లో..?!

March 16, 2025 by M S R

media

. ఎవరు జర్నలిస్టు..? తెలంగాణ ముఖ్యమంత్రి ఓ కీలకమైన ప్రశ్న వదిలాడు… నిజంగానే ఇదుగో జర్నలిస్టులు అంటే వీళ్లు అని నిర్వచించి, వివరించి, వర్గీకరించి చెప్పగలిగేవాళ్లు ఉన్నారా..? నిజమే… అందరిలోనూ ఉంది డౌట్… ఎవరు జర్నలిస్టు..? సరే, బీఆర్ఎస్ అనేక యూట్యూబ్ చానెళ్లను ఆపరేట్ చేస్తూ… తన మీదకు ఉసిగొల్పుతూ…, వ్యక్తిగా, పార్టీ నేతగా, ముఖ్యమంత్రిగా తనను, తన ప్రభుత్వాన్ని బూతులతో చాకిరేవు పెట్టిస్తుందనే మంట తనలో రగిలిపోతున్నది… సహజం… పైగా అధికారంలో ఉన్నాడు… ఒకప్పుడు కేవలం […]

అప్పుడే ఏమైంది..? పాకిస్థాన్‌కు మరిన్ని షాకులు ముందున్నాయి..!!

March 15, 2025 by M S R

pak army

. ( పార్థసారథి పొట్లూరి ) …….. BLA అన్నంత పనీ చేసింది!  బాలూచ్ లిబరేషన్ ఆర్మీ 240 మంది పాకిస్తాన్ ఆర్మీకి చెందిన సైనికులని కాల్చి చంపింది! మొదట 100 మంది తమ వద్ద బందీలుగా ఉన్నారని ప్రకటించిన BLA ఈ రోజు 240 మంది పాకిస్తాన్ ఆర్మీ కి చెందిన వాళ్ళని కాల్చి చంపామని ప్రకటించింది! పాకిస్తాన్ ని బట్టలు ఊడదీసి కొట్టింది BLA! ఈ మాట ఎందుకు అనాల్సి వస్తున్నది అంటే పాకిస్తాన్ సైన్యం చెప్పే […]

లేదు… అస్సలు నమ్మేలా లేదు కథ… ఇంకేవో చేదు నిజాలు..?!

March 15, 2025 by M S R

crime

. ఆ వార్త చదవగానే పెద్దగా ఆసక్తి అనిపించలేదు, ఈమధ్య ఈ ధోరణి బాగా గమనిస్తున్నదే కాబట్టి… కానీ సంఘటనకు కారణాల్ని చదివితే మాత్రం సందేహాస్పదంగా అనిపించింది… పైగా ఆ ఫోటో చూడగానే కడుపులో దేవేసినట్టు అయ్యింది… కాకినాడ ఓఎన్‌జీసీలో కొలువు చేసే వానపల్లి చంద్రశేఖర్ తన పిల్లలు సరిగ్గా చదవడం లేదనీ, ఈ పోటీ ప్రపంచంలో వాళ్లు నెగ్గుకురాలేరనీ ఓ సూసైడ్ నోట్ రాసి…పిల్లలిద్దరి కాళ్లూ కట్టేసి, తలల్ని బాత్‌రూమ్‌లో నీళ్ల బకెట్లలో ముంచి, చంపేసి… తరువాత […]

వై నాట్… మన సినిమాల్ని నార్త్ మార్కెట్‌లో అమ్మేస్తాం, తప్పేమిటి..?!

March 15, 2025 by M S R

hindi

. విశీ (సాయివంశీ) …. ..‘దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష అయిన హిందీని తమిళ పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి. ఈ తరహా వాదనలు తప్పు. హిందీ వద్దనుకున్నప్పుడు తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయొద్దు మరి! హిందీ భాష వద్దనుకున్నప్పడు, ఆ భాష మాట్లాడే రాష్ట్రాల నుంచి డబ్బులెందుకు ఆశిస్తారు?’ – పవన్‌కల్యాణ్, డిప్యూటీ సీఎం, ఏపీ. PS: కింది ఫొటో 2017 నాటిది. అదేంటని, ఎందుకని మీరు అడగొద్దు. గప్‌చుప్! త్యాగరాజ కీర్తన పాడాలనిపిస్తోంది.. […]

కొందరు.. కొంత మత్తుమందు.. కొన్ని హత్యలు … The Crime with an Injection…

March 15, 2025 by M S R

injection

. Sai Vamshi ……. కొందరు.. కొంత మత్తుమందు.. కొన్ని హత్యలు … The Crime with an Injection తమిళనాడు రాష్ట్రం రామనాథపురం జిల్లాకు చెందిన తైక తంబి తన వ్యాపార పనుల కోసం చెన్నై వెళ్లాడు. అలా వెళ్లినవాడు ఏమయ్యాడో తెలియదు. అతణ్నుంచి ఏ సమాచారమూ లేదు. అతని మామ చెన్నైకి వచ్చి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వాళ్లూ విచారణ ప్రారంభించారు. కానీ అతను ఏమయ్యాడు, ఎక్కడున్నాడు అనేది అంతుచిక్కలేదు. రోజులు గడుస్తున్నాయి. కానీ […]

ఓహో… డీఎంకే తాజా పొలిటికల్ కుప్పిగంతుల వెనుక మద్యం ఉచ్చు..!!

March 15, 2025 by M S R

tasmac

. ( పొట్లూరి పార్థసారథి )…… తమిళనాడు మద్యం కుంభకోణం! పార్ట్ -1 ద్రావిడ దేశం నాటకం! ప్రాంతీయ పార్టీల అవసరం మన దేశానికి ఉందా? అవినీతి, అక్రమార్జన లేనంత వరకూ ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ పార్టీ అయినా పెద్దగా భేదం ఏమి ఉండదు! అవినీతి, అక్రమార్జన అనేది ఇప్పుడు ప్రాంతీయ, జాతీయ పార్టీ అనే భేదం లేకుండా ఒక సాంప్రదాయం అయి కూర్చుంది. అంచేత అది ఏ పార్టీ అన్నది ప్రధానం కాదు. తన […]

ఓ దినకూలీ కొడుకు… అవమానం నుంచి ఐఏఎస్ సాధన దాకా…

March 15, 2025 by M S R

ias

. ( రమణ కొంటికర్ల ) ……. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేసిందనే పాప్యులర్ కోట్ ను మనం ఈమధ్య తరచూ వింటూనే ఉన్నాం. కానీ, ఒక్క అవమానం జీవితాన్ని మార్చేసిందనేది ఈమధ్య విన్నామా..? అలాంటి కథే హేమంత్ ది. ఓ కూలీ కొడుకు ఐఏఎస్ ఎలా అయ్యాడు.. ఎందుకు తనకు కలెక్టర్ కావాలనిపించిందో చెబుతుందీ కథ. ప్రముఖ పారిశ్రామికవేత్త.. తెలంగాణా రాష్ట్ర స్కిల్ యూనివర్సిటీ పర్యవేక్షకుడు ఆనంద్ మహీంద్రా తన X ఖాతాలో చేసిన పోస్టుతో.. అవమానం […]

ఏ మోహన్‌బాబో వేయాల్సిన వేషం… దాసరి తనే వేసేసి మెప్పించాడు…

March 15, 2025 by M S R

swayamvaram

. Subramanyam Dogiparthi ……. గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం … జేసుదాస్ పాడిన ఈ పాట ఈ స్వయంవరం సినిమాకే ఐకానిక్ సాంగుగా నిలిచిపోయింది . అద్భుతమైన ఈ పాటను వ్రాసింది దాసరే . ఆగస్టు 6 , 1982న విడుదలయిన ఈ సినిమా ఫక్తు దాసరి మార్క్ సినిమా . హీరో దాసరా లేక శోభన్ బాబా అంటే కూడా చెప్పడం కాస్త కష్టమే . ఏ […]

పొన్‌ మాన్… ఈ మలయాళీలకు భలే కథలు దొరుకుతాయబ్బా…

March 15, 2025 by M S R

ponman

. ( Ashok Pothraj ) … “పోన్ మ్యాన్” మళయాళం (తెలుగు అనువాదం) jio hotstar లో స్ట్రీమింగ్. ఒక డిఫరెంట్ స్టోరీ లైన్ ని సినిమా కథగా మార్చి ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఈ కేరళ వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. వీళ్లు ఆలోచించి తీసే విధానానికి ప్రేక్షకులు ఫిదా అవ్వాల్సిందే. అలాంటి సినిమాలను ఓటీటీలోకి తెలుగులో డబ్ చేస్తూ ఇక్కడ కూడా మంచి సక్సెస్ అందుకుంటున్నారు. అలా ఈ సినిమా హోళి పండుగ రోజు […]

గురువుల గుంజిళ్లు… కొడితే గురువు చేతులే వాచిపోతాయ్ ఇప్పుడు…

March 15, 2025 by M S R

teacher

. అప్పుడు అనంతపురం జిల్లా. ఇప్పుడు సత్యసాయి జిల్లా. లేపాక్షి- కంచిసముద్రం ఊళ్ల మధ్య వివేకానంద జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల. రోడ్డుకు ఒక వైపు సువిశాలమయిన పాఠశాల. ఎదురుగా రోడ్డు దాటగానే చెరువు కట్టదాకా కనుచూపుమేర ప్లే గ్రౌండ్. ఇప్పుడంటే ఊరికో పాఠశాల. నేను అక్కడ చదివిన 1980-84 రోజుల్లో దాదాపు ఇరవై ఊళ్లకు అది చదువుల దేవాలయం. 1400 మంది గ్రామీణ విద్యార్థులతో మిసమిసలాడుతూ, తుళ్లుతూ, పొంగుతూ ఉండేది. “గో ఇన్ ద లైన్” అని […]

కేబీసీ అంటే అమితాబే… తను లేని ఆ షో రుచించదు, కుదరదు…

March 15, 2025 by M S R

kbc

. కౌన్ బనేగా కరోడ్‌పతి… బుల్లితెర మీద ఓ యూనిక్ రియాలిటీ షో… దీన్ని కొట్టగలిగిన షో మరొకటి లేదు… సేమ్, అమితాబ్ బచ్చన్ ఓ యూనిక్ హోస్ట్… 25 ఏళ్లుగా కౌన్ బనేగా కరోడ్‌పతీ అంటే జస్ట్, ఎ అమితాబ్ గ్రేట్ షో… ఇది Who Wants To Be a Millionaire ఓ అంతర్జాతీయ ఇంగ్లిషు టీవీ షోకు అనుకరణ… తనను ఆర్థికంగా నిలబెట్టింది… ప్రతి ఇంటికీ తనను చేరవేసింది… ప్రతి ఇంట్లో సభ్యుడిని […]

మేం తోపులం అని విర్రవీగే ప్రతి ఒక్కడూ చదవాల్సిన డిజాస్టర్ స్టోరీ..!

March 15, 2025 by M S R

jet airways crash

. యండమూరి వీరేంద్రనాథ్ కలం ప్రతిభావంతంగా పరుగులు తీసిన ఆ రోజుల్లో ఒక నవల రాశాడు… పేరు పర్ణశాల… డెస్టినీ అంటే ఏమిటో బలంగా చిత్రీకరిస్తుంది అది… అక్వా ఎగుమతులతో కోట్లు సంపాదించిన ఓ కుటుంబం… ఇన్స్యూరెన్స్ కట్టడం మరిచిపోతారు, ఒక్క క్షణం డీప్ ఫ్రీజర్ రూం డోర్ వేయలేని దురవస్థ… తెల్లారేసరికి తల్లకిందులు… కుటుంబం బజారున పడుతుంది… సదరు ఓనర్ కారు డ్రైవర్‌గా చేరతాడు మరోచోట, సాక్షాత్తూ తన భార్యే ఆ కారు ఓనర్‌కు లొంగిపోతుంది… […]

ఒకే తల్లి కడుపున పుట్టారు… ఆ ఇద్దరి జీవితాలూ ఫుల్ కంట్రాస్టు…

March 15, 2025 by M S R

Mamata

. నీతా అంబానీ గురించి పరిచయం అక్కర్లేదు కదా… ప్రపంచ కుబేరుల్లో ఒకడైన ముఖేష్ అంబానీ భార్య, రిచ్చెస్ట్ వైఫ్ ఇన్ ఇండియా, రిలయెన్స్ ఫౌండేషన్ చెయిర్ పర్సన్, Nita Mukesh Ambani Cultural Centre (NMACC) ఫౌండర్ చెయిర్ పర్సన్, Dhirubhai Ambani International School (DAIS) ఫౌండర్ చెయిర్ పర్సన్… ఇలా ఎన్నెన్నో… అడుగు తీసి అడుగేస్తే రాజభోగం… మొన్ననే తన కొడుకు అనంత్ అంబానీ ప్రివెడ్ ఫంక్షన్‌కు 1000 కోట్లు ఖర్చు పెడితే, […]

అప్పట్లో సత్యంతో ఆయన ప్రయోగాలు… మద్యంతో నా తాజాా ప్రయోగాలు…

March 14, 2025 by M S R

liquor

, పరిశోధన: మందు తాగినప్పుడు మటనో లేక కాసింత కారమో తినకపోతే మందు తాగిన తృప్తే ఉండదు. కొందరు పండ్లూ, ఫలాలూ తింటూ తాగుతారాట. ఎబ్బే… అస్సలు బాగోదు. ‘బాగోపోతే తినకో… మరి మాకెందుకు చెబుతున్నట్టో…’ అనుకుంటున్నారు కదా! బాగుంది సంబడం. మీరేమీ చెప్పక్కర్లేదు. అయితే, అది తిన్నంక కడుపులో మండుతుంది. రేత్రంతా కడుపులో పులుసు మరుగుతున్నట్టు ఉంటుంది. లోపల పొయ్యి ఉంది అని చెప్పడానికా అన్నట్టు నిద్రలో కూడా ఆ పులుసు నోటినుండి, ముక్కునుండి బయటకే […]

ఒరేయ్, పిచ్చి పాకిస్థానోడా… సీఐఏ అంటేనే వాడుకొని వదిలేయడంరా..!!

March 14, 2025 by M S R

cia

. పొట్లూరి పార్థసారథి…. CIA తో సహవాసం అంటే వాడుకొని వదిలెయ్యడమే! పాకిస్తాన్ గూఢచార సంస్థ ISI 20 ఏళ్ళు CIA తో కలిసి పనిచేసింది! కలిసి పనిచేయడం అంటే పాకిస్తాన్ లో ఒకే ఆఫీసులో CIA, ISI లు కలిసి పని చేశాయి. ఆఫ్ఘనిస్తాన్ లో సోవియట్ సైన్యానికి వ్యతిరేకంగా ముజాహిదిన్ లకి శిక్షణ ఇచ్చే నెపంతో CIA, ISI లు కలిసి పనిచేసాయి. తమ లక్ష్యం నెరవేరాక చెప్పాపెట్టకుండా CIA తన సామాను సర్దుకొని పాకిస్థాన్ […]

ఇది జిందగీ… కుచ్ బీ హో సక్తా హై… డెస్టినీ డిసైడ్స్ ఎవరీ థింగ్…

March 14, 2025 by M S R

zindagi

. Murali Buddha ….. హిందీ నటుడు అనుపమ్ ఖేర్ ప్రోగ్రాం ఒకటి జిందగీ మే కుచ్ బీ హో సక్తా .. మంచి ఆసక్తికరమైన ప్రోగ్రాం . ఎక్కడో మారుమూల గ్రామాల నుంచి వచ్చి సినిమా రంగంలో ఎదిగిన వారి జీవిత విశేషాలను పరిచయం చేసే కార్యక్రమం . జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు . జీవితంలో ఏదైనా జరగవచ్చు . ఆశను వదులుకోకుండా ప్రయత్నిస్తే ఏదైనా జరగవచ్చు అని చెప్పే ప్రోగ్రాం . *** […]

సైబర్ ఫ్రాడ్ దందా క్యాంపెయిన్‌లో… ఏకంగా రాష్ట్రపతి ఎడిటెడ్ వీడియో…

March 14, 2025 by M S R

cyber

. హఠాత్తుగా ఫేస్‌బుక్‌లో అనేక యాడ్స్ కనిపిస్తున్నాయి… తెల్లారిలేస్తే కమ్యూనిటీ స్టాండర్డ్స్ అంటూ పిచ్చి పిచ్చి వాడికే అర్థం కాని ప్రామాణికాలతో అందరి ఖాతాలపై కత్తెర పెత్తనం చేస్తుంటాడు కదా… నిజానికి వాడు డబ్బు తీసుకుని స్పాన్సర్ చేసే యాడ్స్ ఇవి… అంటే వాడు బాధ్యత వహించాలి… ఈ యాడ్ ఏకంగా ఈ దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫేక్, ఎడిటెడ్, ఫాల్స్ వీడియోను వాడటమే కాదు… రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా యాడ్‌లో వాడేశాడు… […]

సారీ కిరణ్ అబ్బవరం… నో థాంక్స్… నీ సినిమాకు రాలేమోయ్…

March 14, 2025 by M S R

dilruba

. It is the time for KCPD అంటూ ఒక సాంగ్… కిరణ్ అబ్బవరం లీడ్ రోల్ చేసిన దిల్ రూబా అనే సినిమాలో… అసలు హీరోకు గానీ, దర్శకుడికి గానీ, సంగీతం స్వరపరిచిన మేధావికి గానీ… కేసీపీడీ అంటే సోషల్ మీడియాలో ఏం అర్థం ఉందో తెలుసా.? పరమ బూతు… నికృష్టమైన బూతు అది… కుర్చీ మడతబెట్టి అనే హుక్ లైన్‌కన్నా దారుణమైన బూతు… మరి ఏకంగా దాన్నే లీడ్ వాక్యంగా ఓ పాటే […]

అసలు ట్రంపుదే వలస కుటుంబం… పూర్తిగా చదవండి ఓసారి…

March 14, 2025 by M S R

trump

. Jaganadha Rao ….. చరిత్ర చదువుతున్నప్పుడు కొన్నిసార్లు అసహ్యం కలుగుతుంది, మరికొన్నిసార్లు కన్నీళ్ళు వస్తాయి, కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంది. అన్నీ క్రోడీకరిస్తే, ఏ ఒక్కరినీ తక్కువగా చూడడం లేదా ఎక్కువగా చూడడం ఉండదు. అందరికీ తెలిసిన ఒక ఎదిగిన వాడి కథ, చరిత్ర చూస్తే,.. ఆ కథకు చివరగా పాఠకుల ఇష్టం, ఎవరు ఏమి చెప్తారో…? అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ప్రపంచం మొత్తంలోని 200 దేశాల్లో ఎక్కువమంది ప్రజలకి తెలిసిన పేరు. కానీ డోనాల్డ్ […]

ప్రేమకు మెచ్యూరిటీ కావాలి… ఎస్, అది రియాలిటీలో బతకాలి…

March 14, 2025 by M S R

setupati

. ఇద్దరు హీరోయిన్లను ప్రేమించిన ‘హీరో’… ఆయన పేరు సేతుపతి… …‘ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక..’ అని వేటూరి రాసిన పాట ఒక్కోసారి నిజంగానే నిజమవుతుంది. ఎవరెవరో ఎందుకో కలుసుకొని, మరెందుకో విడిపోతారు. ఆ తర్వాత మరెవరో దూరంగా ఉండేవాళ్లు దగ్గరై, ఒకటవుతారు. అలాంటి కథే ఇది. ఇద్దరు హీరోయిన్లను ప్రేమించిన ఓ హీరో కథ. తమిళ వాళ్లకి ఈ కథ కొంత తెలుసు. అయితే తెలుగువారికి ఈ కథ పూర్తిగా కొత్తదే! మనకు ఒకప్పుడు […]

  • « Previous Page
  • 1
  • …
  • 100
  • 101
  • 102
  • 103
  • 104
  • …
  • 385
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • దీపావళి అమ్మకాలకు దెబ్బ… రెండ్రోజులు బంద్ వాయిదా వేస్తే బాగుండేది…
  • చిరంజీవిని బతికించారు… సినిమా కూడా ఎంచక్కా బతికిపోయింది..!
  • సిరివెన్నెల ఆ పాట పంక్తుల గురించి ఎందుకంత బాధపడ్డాడు..?
  • మద్దతులో నిజాయితీ లేదు… పైగా బీసీలపై హరీష్ రావు వెటకారాలు..!!
  • గుజరాత్ అమిత్ షా..! ఇంతకీ ఎవరు ఈ హర్ష్ రమేష్ భాయ్ సంఘవి..?
  • శేద్య చంద్రికా..! తొలి తెలంగాణ తెలుగు పత్రిక… దొరికిన తీరు ఏమనగా..?
  • అగ్లీ కేరక్టర్..! సీనియర్ నరేష్ చీదర పాత్ర..! ఇదేం టేస్టురా బాబూ…!!
  • సొంత ఇల్లే ఓ లాడ్జి… పేరు హోమ్ స్టే… ఇప్పుడు రోడ్డున పడుతున్నారు…
  • పక్కా టైంపాస్ పల్లీ బఠాణీ సినిమా… జయసుధ ఎందుకు ఒప్పుకుందో…
  • ఒక చంద్రసేనుడు… కొడుకు రామసేనుడు… అల్లుడు హరిసేనుడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions