Subramanyam Dogiparthi…… 1971 సంవత్సరం అక్కినేనిది . దసరా బుల్లోడు జైత్రయాత్ర కొనసాగుతూ ఉండగానే వర్షాల్లో వచ్చింది ప్రేమనగర్ . సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ . కమర్షియల్ కళాఖండం . Classic . కోడూరి కౌసల్యాదేవి వ్రాసిన నవల ఆధారంగా కె యస్ ప్రకాశరావు , ఆచార్య ఆత్రేయ ద్వయం మలిచిన ప్రేమ సినీ శిల్పం . అక్కినేని , వాణిశ్రీ పోటాపోటీగా నటించి తమను తాము నట హిమాలయాల పైన కూర్చోబెట్టుకున్నారు . ఒక్కరి […]
రాజకీయ వారసత్వమా మజాకా… రాటుదేలడం, నిలబెట్టుకోవడం పెద్ద టాస్క్…
వారసత్వం… రాజకీయాల్లో అత్యంత ప్రధానమైన పదం ఇది… మగ వారసులు ఉన్న తండ్రులకు పర్లేదు… ఎంత చదువుకున్నా, ఎక్కడ కొలువులు చేస్తున్నా పట్టుకొచ్చి రాజకీయాల్లోకి ప్రవేశపెట్టి, పదును పెడతారు తండ్రులు… మరి రాజకీయాల్లో ఉన్నంత ఆస్తి, పెత్తనం, వైభోగం, బలగం, బలం మరే రంగంలోనూ దక్కవు కదా… పైగా కావల్సినంత సంపాదించుకునే చాన్స్… ఎంత తవ్వుకుంటే అంత… అందుకే కుటుంబ పార్టీల్లో ఎక్కువగా మగ వారసత్వమే అలా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది… శరద్ పవార్ అజిత్ పవార్‌ను […]
ఒక్కటి తగ్గింది పుష్పా…! ఫహాద్ ఫాజిల్ వ్యాఖ్యల్లో ఏం తగ్గిందంటే..?!
ఫహాద్ ఫాజిల్… మలయాళ హీరో… అదేనండీ తెలుగులో పుష్ప ఫస్ట్ పార్టు చివరలో వచ్చి దడదడలాడించాడు కదా, అదుగో ఆ విలన్… తనేమీ పిచ్చోడు కాదు… సినిమా ఇండస్ట్రీలో ఒక మాట నోటి వెంట వస్తే దాని పరిణామాలు ఏమిటో తెలియనివాడూ కాదు… లౌక్యం కూడా తెలిసినవాడే… భార్య కూడా ఇండస్ట్రీలోనే ఉంది, హీరోయిన్ కమ్ ప్రొడ్యూసర్… పేరు నజిరియా… తండ్రి ఫాజిల్ కూడా చాన్నాళ్లు ఇండస్ట్రీలో డైరెక్టర్, యాక్టర్, రైటర్… బ్రదర్ ఫరాన్ కూడా యాక్టరే… […]
అయినవారు కూడా అడుగుపెట్టని వాకిళ్లలో నివాసమే నేటి నాగరికత
ఇంటి ముందుకొచ్చే మనుషులు – మహమ్మద్ ఖదీర్‌బాబు రాలిన బాదంకాయల కోసం పిల్లలు వచ్చేవారు. ఎర్రగా పూసి, గోడ బయటకు తలవాల్చిన మందారాల కోసం యూనిఫాముల్లో ఉన్న ఆడపిల్లలు వచ్చేవారు. దేవుని పటాలకు కాదనేదెవరని నందివర్థనాల కోసం పక్కింటామె వచ్చేది. చనువున్న కాలేజీ స్టూడెంట్ కాదనడానికి వీల్లేని పద్ధతిలో రోజాపువ్వును తెంపుకెళ్లేది. రెండు చేతులున్న ప్రతి మహాలక్ష్మి గుప్పెడు గోరింటాకు కోసం హక్కుగా గేటు బాదేది. నాలుగు పుదీనా రెబ్బల కోసం ఎవరైనా రావచ్చు. చారెడు కరివేపాకుకు […]
కపట ప్రభుత్వ నేతల మాల్దీవుల్ని ఇంకా ఇంకా ఉద్దరించాలా మనం..?
‘ప్లీజ్, మా దేశానికి రండి, పర్యాటకం లేనిదే మా దేశం లేదు, మీరు రాకపోతే దివాలా తీస్తాం, మన దేశాల నడుమ బంధం చరిత్రాత్మకం, శాంతి-స్నేహాన్ని కోరుకుంటున్నాం’…. ఇలా మాల్దీవుల పర్యాటక మంత్రి ఇబ్రహీం తాజాగా మీడియా ద్వారా మొత్తుకుంటున్నాడు… ఈ దొంగ మాటల్ని ఇండియా నుంచి వెళ్లాలనుకునే టూరిస్టులు పట్టించుకోవాల్సిన పనిలేదు, అసలు అక్కడికి వెళ్లాల్సిన పనే లేదు… కడుపులో కత్తులు పెట్టుకున్న ప్రభుత్వ ముఖ్యులు అక్కడ… ఒకవైపు చైనాకు తొత్తుగా మారి, అపారమైన సముద్రజలాల్లో […]
కౌంటింగ్‌కు రెండ్రోజుల ముందే రామోజీ హెడింగ్ రెడీ అప్పట్లో… మరిప్పుడు..?
ఏమిటి..? మరీ బజారులో నిలబడి బరిబాతల పోతురాజులా కొరడాతో కొట్టుకుంటున్నదేమి..? ఈ వికృత నర్తనం ఏమిటి..? అని పాఠకులు చాలామంది ఏవగించుకుంటున్నారు గానీ, తెలుగుదేశం పుట్టిన కొత్తలోనూ అంతే కదా… సాక్షి, నమస్తే, జ్యోతి కూడా అంతేకదా, ఇంకా ఎక్కువ కదా అంటారా..? ఆ దరిద్రాల గురించి కాదు… ఈనాడును దశాబ్దాలుగా తెలుగు జనం అక్కున పెట్టుకుని పోషించారు, పెంచారు, లక్షల కోట్ల సంపదలకూ, పెత్తనాలకూ ఆస్కారమిచ్చింది ఆ ఆదరణే… ఐనా సరే, తనలో పాత్రికేయ, ప్రజాస్వామిక […]
ముడత మంచిదే..! ఇస్త్రీ చేయకపోతే ఏంటట..? అలాగే ధరిద్దాం…!
ఒక గంటపాటు లైట్లన్నీ ఆపేద్దాం… ధరిత్రికి అది మనం చూపించే కృతజ్ఞత… ఒక గంట విద్యుత్తు నిలిపేస్తే ఎంత శక్తి ఆదా అవుతుందో, తద్వారా ఎంత కాలుష్యాన్ని వాతావరణంలోకి పోకుండా ఆపగలమో, ఎంత భూతాపాన్ని నిలువరించగలమో లెక్కలతో సహా అప్పుడప్పుడూ ప్రచారాన్ని, పిలుపులను వింటుంటాం, చదువుతుంటాం, కొన్నిసార్లు పాటిస్తుంటాం కూడా… మంచిదే, అలాంటివి ఆహ్వానించాలి… ఏ చిన్న సత్సంకల్పమైనా సరే వ్యతిరేకించొద్దు, ప్రత్యేకించి సోషల్ మీడియాలో హెహె అని వెటకారపు ట్రోలింగూ అక్కర్లేదు… ఎప్పుడో ఓ గంట […]
ఈ హీరామండిలో ఓ మనీషా… నాటి కన్యాశుల్కంలో ఓ మధురవాణి…
Mani Kumar Maddipatla….. వేశ్య – విప్లవం కదిలారు కదిలించారు నిస్వార్థంగా ప్రాణాలు అర్పించారు చాలా విషయాలు మాదిరిగానే చరిత్రలో నిక్షిప్తమైపోయారు ప్రతిఫలం దక్కని అభాగ్యుల జాబితాలోనే ఉండిపోయారు ఆ చరిత్ర చదివో, దృశ్యరూపంలో చూశో మనసుంటే అదీ తెరుచుకుంటే కన్నులు చెమ్మగిల్లడం మినహా మరేమీ ఉండదు ఆ కోవలోకే వస్తుంది దృశ్యరూపమైన హీరామండీ పాకిస్తాన్‌లోని లాహోర్ అదో వేశ్య వాటిక అందులో ఏముంది అంటే శరీరాన్ని అప్పగించడం ఉంది ఆధిపత్య పోరు ఉంది ఒకరిని మరొకరు […]
సునీతా విలియమ్స్… గీత, గణపతి, సమోసాలను మించిన విశేషాలివి…
సునీతా విలియమ్స్… సాహసులకు, ప్రత్యేకించి మహిళలకు ఓ స్పూర్తి… నారీ శక్తి… మళ్లీ అంతరిక్షంలోకి వెళ్తోంది… అది అందరూ చదివారు వార్తల్లో… ఆమె అంతరిక్షంలోకి గీతను తీసుకుపోయింది, సమోసాను పట్టుకెళ్లింది వంటివే ప్రధానంగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి… కొన్ని చాలామందికి తెలియని ఇంట్రస్టింగ్ అంశాలు ఏమిటంటే..? (మూడోసారి ఆమెను అంతరిక్షంలోకి తీసుకెళ్లే యాత్ర సాంకేతిక కారణాలతో వాయిదాపడిందని తాజా వార్త…) ఆమె ఇండియాలో పుట్టలేదు… గుజరాత్‌కు చెందిన ఓ న్యూరోఅంటామిస్ట్ దీపక్ పాండ్యా అమెరికాకు పోయాడు అప్పుడెప్పుడో… […]
అవునూ… మోడీని పవన్ కల్యాణ్ ఆవహించాడా హఠాత్తుగా…
Murali Buddha వాల్ మీద కనిపించింది ఇది… అరివీర భయంకరమైన థంబ్ నెయిల్… టీవీ5 మెయిన్ స్ట్రీమ్ ఛానెలే… లోగోలో ఉన్నట్టు తెలుగు టీవీ న్యూస్ చానెళ్లలో అయిదో ప్లేసు కావచ్చు బహుశా… ‘‘రేయ్ రెడ్డీ… జగన్‌ను బొక్కలో తోస్తా’’ అని మోడీ జగన్‌ను హెచ్చరించినట్టు ఆ థంబ్ నెయిల్… అదీ అనకాపల్లి కూటమి సభలో… అవును మరి… సోషల్ మీడియా ప్రింట్, టీవీ మీడియాను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నదే కదా… మరి యూట్యూబ్ చానెళ్లు ప్రవేశపెట్టిన దిక్కుమాలిన థంబ్ […]
కేజ్రీవాల్ కేసుల్లో పీటముడి… ఇక ఏకంగా ఎన్ఐఏ దర్యాప్తు తెరపైకి…
కేజ్రీవాల్ కేసుల్లో కొత్త ట్విస్టు.,. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా హఠాత్తుగా తెర మీదకు వచ్చాడు… కేజ్రీవాల్ మీద ఎన్ఐఏ దర్యాప్తునకు ఆదేశించాడు… మరింత బిగుసుకుంటోంది కేజ్రీవాల్ మెడ చుట్టూ… ఊపిరాడకుండా… నిజానికి బీజేపీ ప్రభుత్వం లేట్ చేసింది… ఖలిస్థానీ శక్తులకు మద్దతుగా నిలిచిన కేజ్రీవాల్‌ను ఇన్నాళ్లూ ఉపేక్షించింది… చివరకు ఆప్ ఆ శక్తుల మద్దతుతో పంజాబ్‌లో పాగా వేసేదాకా కళ్లు తెరవలేదు… సాక్షాత్తూ తన కాన్వాయ్‌ను ఓ ఫ్లయి ఓవర్ మీద రెండు మూడు […]
ఇంట్రస్టింగు తీర్పు… అత్యాచారం తప్పుడు కేసుకూ అదే జైలుశిక్ష…
ఒక కేసు… ఉత్తరప్రదేశ్‌లోని బరేలి… బరాదరి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఓ మహిళ తన కూతురిపై అత్యాచారం జరిగిందని 2019, డిసెంబరులో ఫిర్యాదు చేసింది… కూతురి వయస్సు 15 ఏళ్లు… అజయ్ అలియాస్ రాఘవ్ ఆమెను ఢిల్లీకి తీసుకెళ్లి, మత్తుపదార్థాలు ఇచ్చి అత్యాచారం చేసినట్టు ఫిర్యాదు సారాంశం… దీనిపై కేసు పెట్టారు పోలీసులు, అమ్మాయిని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, అత్యాచారం నిజమేనని అమ్మాయి వాంగ్మూలం ఇచ్చింది… విచారణ సా-గు-తూ-నే ఉంది… సదరు నిందితుడు నాలుగున్నరేళ్లు విచారణ […]
8 నెలలు… 3800 కిలోమీటర్ల ఓ సాహసి ఒంటరి పాదయాత్ర… కానీ దేనికి..?!
సాటి మహిళల సమస్యలే ఎజెండా! కన్యాకుమారి టూ కశ్మీర్… ఓ నారీ జర్నీ!! WOMB.. WOMEN OF MY BILLION. అమెజాన్ ప్రైమ్ లో డాక్యుమెంటరీగా తెరకెక్కిన ఈ కథనం ఇప్పుడో చర్చ. లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఆడియన్స్ అవార్డ్ గెల్చుకుని.. ఆగస్టులో జరుగబోయే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ లోనూ ప్రదర్శించేందుకు సిద్ధమవుతోంది. ఎందుకు WOMB గురించి మరి చర్చ అంటే… సృష్టి బక్షి కన్యాకుమారి నుంచి కశ్మీర్ జర్నీ గురించి […]
బాడీయే బార్… పేగుల్లోనే బ్రూవరీ… కడుపులోనే నైన్టీ తయారీ…
మందు… మెడిసిన్ కాదు, మద్యం… తాగితే వ్యసనం… నాలుక ఊరుకోదు, టైమయితే చాలు ఎప్పుడెప్పుడు అంటూ నాలుక పిడచకట్టుకుపోతుంది… అలవాటు చేశావు కదా, ఏదీ పెగ్గు, రానియ్ రానియ్ అని గోలపెడుతుంది కాలేయం… ఆత్మారాముడు ఆవురావురు అంటుంటాడు… అప్పోసప్పో చేసెయ్, సీసా మూత తీసెయ్… వచ్చిన జీతం అధికశాతం బారులోనే హరీమంటుంది… పైగా రకరకాల వింత వింత పేర్లతో ప్రభుత్వమే ఎంకరేజ్ చేసే చీపెస్ట్ లిక్కర్, అనగా రంగుసారా… రిస్క్ చేస్తే కిక్కేమిటో గానీ కక్కు గ్యారంటీ, […]
దర్శకుడిగా 16 సినిమాలు… 14 సినిమాలకు జాతీయ అవార్డులు…
Sai Vamshi……. * నేను తీసిన ‘గులాబీ టాకీస్’ సినిమా చివర్లో ఒక టీవీ మీద కుక్క కూర్చుని ఉంటుంది. ఆ కుక్క దేనికి సంకేతం అని కొందరు అడిగారు. “కుక్క కుక్కకే సంకేతం” అని చెప్పాను. మరేదో సూచించడానికి నేను కుక్కని సింబల్‌గా పెట్టానని వాళ్ల ఊహ. అలాంటి లెక్కలు వేసుకుని సినిమా చూస్తే ఎలా? అందుకే “For the God Sake, Please don’t read Cinema. Watch it” అని నా అసిస్టెంట్లకు, […]
ముసలోళ్లు మాత్రమే కాదు, పడుచువాళ్లూ తప్పక చదవాల్సిన స్టోరీ…
Hideki wada… ఈయన ఓ Psychiatrist… గత మార్చిలో “80-Year-Old Wall” అని ఓ పుస్తకం రాశాడు… మార్కెట్లోకి రిలీజైంది… వేగంగా 5 లక్షల కాపీలు అమ్ముడైపోయాయి… ఈ వేగం ఇలాగే కొనసాగితే త్వరలోనే 10 లక్షల కాపీల మార్క్ సాధిస్తుంది… అంటే ఈ సంవత్సరం జపాన్‌లో అత్యధికంగా విక్రయించబడే పుస్తకం అన్నమాట… ఎవరీయన..? వృద్ధుల్లో వచ్చే మానసిక సమస్యలను ట్రీట్ చేసే డాక్టర్… 61 ఏళ్లు… గత 35 ఏళ్లలో 6 వేల మందిని ట్రీట్ […]
పారిపోవడం కూడా యుద్ధవ్యూహంలో ఓ భాగమే అంటారు పెద్దలు…
Subramanyam Dogiparthi….. పారిపోవటం కూడా యుధ్ధ వ్యూహంలో ఒక భాగమే అని ఈమధ్య వచ్చిన మహాభారతం సీరియల్లో శ్రీకృష్ణుడు చెపుతాడు . సీరియల్ అని ఎందుకు అన్నానంటే వ్యాస భారతంలో అన్నాడో, భాగవతంలో అన్నాడో నాకు తెలియదు . ప్రవచనకర్తలు జరాసంధుని గోల పడలేక కృష్ణుడు మధుర నుండి ద్వారకకు షిఫ్ట్ అయ్యాడని చెపుతుంటారు . సరే . ఇప్పుడు కలియుగ భారతానికి వద్దాం … పాపం రాహుల్ ! 2004 , 2009 , 2014 […]
ఎన్ఆర్ఐ అంటే దేశవ్యతిరేకా..? నటులంటే నాస్తికులా..? ఇవేం సూత్రీకరణలు..?!
‘‘ఒక అద్భుతమైన లోకంలో మనం బ్రతుకుతున్నాం. ఇక్కడ శాస్త్రవేత్తలు జ్యోతిష్యం మాట్లాడతారు. బాబాలు సైన్స్ బోధిస్తారు. పౌరాణికులు చరిత్ర రాస్తారు. సినీ నటులు భక్తిని వ్యాప్తి చేస్తారు. ధనవంతులు సాదా జీవనం గురించి పాఠాలు చెబుతారు. ప్రవాస భారతీయులు దేశాన్నెలా ప్రేమించాలో చెబుతారు. నేరగాళ్లు విలువలను బోధిస్తారు. రాజకీయ నాయకులు దేవుడి గురించి మాట్లాడతారు. దేవుడు మాత్రం నిశ్శబ్దం పాటిస్తాడు!’’ అని దేవులపల్లి కృష్ణశాస్రి అనే రచయిత ఫేస్బుక్ పోస్ట్‌లో ఆవేదన చెందాడు…. …. ఆంధ్రజ్యోతి పత్రికలో […]
ఎక్కడైనా అక్షింతలు అంటే బియ్యమే… ఆకాశం వర్షించే గింజలు కావు…
బీజేపీ హిందూ సంఘటన వ్యూహాల్ని ఎలా ఎదుర్కోవాలో బీఆర్ఎస్కు అస్సలు అర్థం కావడం లేదు, ప్రసంగాల్లో గందరగోళం కనిపిస్తోంది… అప్పుడే ఒక మాట, మళ్లీ అప్పుడే మరో మాట… కేడర్‌లోనూ అయోమయం నింపుతున్నారు… అన్నింటికన్నా ముందుగా… బీఆర్ఎస్కు మొన్నమొన్నటిదాకా మజ్లిస్ సెక్యులర్ పార్టీ, జాన్ జిగ్రీ… కానీ బీజేపీ మాత్రం మత పార్టీ… చేతనైతే బీజేపీ విధానాల్ని ఖండితంగా వ్యతిరేకించాలి, తప్పదు, తప్పులేదు, అది రాజకీయ అవసరం… అది అమాంతం మింగేయడానికి వస్తున్న అనకొండ… కానీ అటూఇటూ […]
ఆ పాత చంద్రబాబు నేడు లేడేమి..? అంత అనుభవంతోనూ ఈ కంగారేమి..?
Nancharaiah Merugumala….. జరగమంటే జరుగుతాడా, జగన్? జరగడానికి అది కుర్చీగాని.. బెంచీయో లేదా సోఫానో కాదే! ……………………………………………………………… ‘ జరుగు జరుగు జగన్–ఖాళీ చెయ్యి కుర్చీ ’…….. ఇదీ 14 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ పాలకపక్షంగా రాజ్యమేలిన తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార ‘పిలుపు’. 2009 కడప లోక్ సభ ఎన్నికల నాటి నుంచీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోకడలను చూసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి నినాదాలతో ఏం సాధించాలనుకుంటున్నారో అర్ధం […]
- « Previous Page
- 1
- …
- 103
- 104
- 105
- 106
- 107
- …
- 457
- Next Page »