రెండేళ్ల క్రితం ప్రభుత్వ వేలంలో హైదరాబాద్ కోకాపేట ఎకరా వంద కోట్ల రూపాయల పాట పాడుకుంది. ఆ భూమి తనకు తానుగా ఆ విలువ కట్టుకుని…మార్కెట్ వేలం సాహిత్యానికి ఆ రాగం రేటు స్వరాలు కట్టుకోలేదు. ఆస్థాన రియలెస్టేట్ రారాజ నిలయ సంగీత విద్వాంసులు కృత్రిమంగా అలాంటి వేలం వెర్రి స్వరాలు కట్టి వేలం పాటలు పాడుకున్నారని…తరువాత శంకరపల్లి వేలం పాటల్లో పాడిన వంకరాభరణ తిరోగమన అవరోహణ రాగాల వల్ల తేలిపోయింది. మహా భారతంలో చెప్పిన […]
డౌట్ లేదు… రాజీవ్ విగ్రహం బదులు అక్కడ తెలంగాణ తల్లి విగ్రహమే కరెక్టు..!
మొన్న ఎక్కడో మాట్లాడుతూ కేటీయార్ ‘బస్సుల్లో రికార్డింగ్ డాన్సులు, బ్రేక్ డాన్సులు చేసుకొమ్మనండి, మాకేం అభ్యంతరాల్లేవు’ అని ఏదో అన్నాడు… అంతకుముందు అక్కలు అని రేవంత్ సంబోధించినా సరే, అదేదో మొత్తం తెలంగాణ ఆడపడుచులందరినీ అవమానించారు అంటూ ట్విస్ట్ చేసి, ఏదో గాయిగత్తర లేపాలని చూశారు… కానీ తను చేసిన సంస్కారరహితమైన డాన్సుల మాటేమిటి..? అదేమంటే మహిళలకు రక్షణ లేకుండా పోతోందని రచ్చ… దానికీ కేసీయార్ కాలంలో ఎన్ని అత్యాచారాలు జరిగాయో లెక్క చెప్పి సీతక్క కౌంటర్ […]
ఈ పాత సినిమా విశేషాలు రాస్తూ పోతే… అదీ ఓ ‘అంతులేని కథ’…
అంతులేని కథ… నిజానికి ఈ సినిమా మీద విశేషాలెన్ని చెప్పుకున్నా, అది అంతులేని కథే… ఒడవదు, తెగదు… బాలచందర్ మార్క్ & మేజిక్ సినిమా . జయప్రద సినిమా . 1975 లో అరంగేట్రం చేసి భూమి కోసం , నాకూ స్వతంత్రం వచ్చింది సినిమాల్లో తళుక్కుమన్నా , హీరోయిన్ లెవెలుకు తీసుకుని వెళ్లిన సినిమా 1976 లో వచ్చిన ఈ అంతులేని కధ సినిమా . ఇంట్లో బయటా అందరికీ రాక్షసి లాగా కనిపిస్తూ , పనికిమాలిన […]
కరిగిపోయాను కర్పూర వీణలా..! ఓ పాత ప్రేమకథకు కొత్త రూపు ఇలా…!!
ఓ ప్రేమ జంటకు కొత్తగా పెళ్ళైంది… ఆ జంట తమ హానీమూన్‌కు ప్లాన్ చేసుకుంది… కాస్త భిన్నంగా, ఎప్పుడూ గుర్తుండేలా… అది మంచు పర్వతాల్లో ట్రెక్కింగ్ కు వెళ్లడం… థ్రిల్లింగ్ కమ్ రొమాంటిక్… అనుకున్నట్టే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని, ట్రెక్కింగుకు వెళ్తుంది ఆ జంట… పూర్తిగా పైకి వెళ్ళాక అనుకోని ప్రమాదం… హఠాత్తుగా ఓ మంచు లోయలో పడిపోతాడు ఆ భర్త… షాక్ తింటుంది భార్య… కన్నీరుమున్నీరు అవుతుంది… హానీమూన్ కాస్తా తనకు అంతిమ యాత్రగా […]
ఆలీని నమ్మితే మొత్తం సినిమాకే ‘బొక’పడింది… దర్శకుడు పూరీయే బాధ్యుడు…
డబుల్ ఇస్మార్ట్ మూవీ నుంచి ఆలీ చేసిన అత్యంత వెగటు ‘బొక’ ఎపిసోడ్ పీకేశారు అని ఒక వార్త… పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు… మిస్టర్ బచ్చన్‌లో తెలుగువాడికి ఎక్కని హిందీ పాటలకు కూడా కత్తెర పెట్టారని మరో వార్త… ఇదీ ఊహించిందే… ప్రేక్షకుడి ఫీడ్ బ్యాక్, స్పందనలను బట్టి నిడివి కత్తిరింపులు, సీన్ల తొలగింపులు, జోడింపులు అసాధారణమేమీ కాదు… కానీ… దర్శకుడు పూరి తప్పేమీ లేదు, అంతా ఆలీదే తప్పు… ఆ ఎపిసోడ్ రచన, దర్శకత్వం, నటన […]
మీడియాపై వేణుస్వామి దంపతులు పేల్చిన RDX బాంబ్… ఇక తన్నుకొండి..!
వేణుస్వామి కొద్దిరోజులుగా వార్తల్లో వ్యక్తి… అలా చేసింది సోకాల్డ్ యెల్లో మీడియా… బహుశా లోకేష్ రెడ్‌బుక్‌లో ఉందేమో పేరు… అందుకేనేమో టీవీ5 టార్గెట్ చేసి డిబేట్ల మీద డిబేట్లు చేస్తూ టార్గెట్ చేస్తూ వెంటాడుతోంది అనుకున్నాను… జగన్ గెలుస్తాడనే వేణుస్వామి జోస్యాల వెనుక కూడా ఏదో కుట్ర ఉందనీ… ఐప్యాక్ దగ్గర నుంచి జగన్ చానెళ్లు, వేణుస్వామి వంటి జ్యోతిష్కులు ఓ కూటమిగా పనిచేశారని యెల్లో సిండికేట్ ప్రచారం చేసింది… వోెకే, ఆ కసి ఉందనుకుందాం… ఇదోరకం […]
ఆదివారాలు కూడా వదలరట… ఆ సీరియల్స్ ఆరోజూ వెంటాడుతాయట…
సాధారణంగా టీవీ సీరియల్స్ మీద ఉన్న అభిప్రాయం ఏమిటి..? చెత్త..! ఇదే కదా… కాకపోతే ఇళ్లల్లో ఉండే మహిళా ప్రేక్షకులకు వేరే వినోదం లేదు… థియేటర్ సిండికేట్ల దోపిడీ కారణంగా థియేటర్లకూ పోయే పరిస్థితి లేదు… అదొక నిలువు దోపిడీ… అందరికీ తెలిసిందే… పైగా థియేటర్ వెళ్లాలంటే డబ్బు మాత్రమే కాదు, చాలా అంశాలు అనుకూలించాలి, ఆ చర్చలోకి వెళ్లడం లేదు… ఆ థియేటర్ దుర్మార్గుల అరాచకాలు చివరకు వాళ్లనే ముంచేస్తాయి, అది వదిలేద్దాం… కూర్చున్న కొమ్మను […]
మళ్లీ ఆహా అన్‌స్టాపబుల్… ఈసారి నాగార్జునతో స్టార్ట్… 23 నుంచి షూటింగ్…
తెలుగు టీవీ, ఓటీటీలకు సంబంధించి టాక్ షోలలో సూపర్ హిట్ బాలకృష్ణ హోస్ట్ చేసిన అన్‌స్టాపబుల్ షో… అప్పుడెప్పుడో ఆహా ఓటీటీలో 2021 నవంబరులో స్టార్టయింది కదా… పెద్దగా టీవీ ఇంటర్వ్యూలకు, టాక్ షోలకు రాని పెద్ద పెద్ద స్టార్లను కూడా తన పరిచయాలతో తీసుకొచ్చి, కూర్చుండబెట్టి, తనదైన స్టయిల్ ప్రశ్నలతో, సరదా సంభాషణలతో, ఆటలతో షోను రక్తికట్టించాడు బాలయ్య… అసలు బాలయ్య ఆ షోను హోస్ట్ చేయడమే విశేషం… టీవీ, ఓటీటీ షోలను చిరంజీవి, నాని, […]
నమ్మలేనంత ప్రేమ… భార్య కోసం సముద్రగర్భంలో 13 ఏళ్లుగా అన్వేషణ …
2004లో సునామీ భారతదేశాన్ని అతలాకుతలం చేస్తే, 2011లో ఆ ప్రతాపం జపాన్ మీద పడింది. పసిఫిక్ మహాసముద్రంలో భూకంపం కారణంగా అలలు ఉవ్వెత్తున ఎగిశాయి. భారీ అలలు తీరాన్ని తాకి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. జపాన్‌లో నమోదైన ప్రకృతి విపత్తుల్లో ఇది అత్యంత పెద్దది. ప్రపంచంలోని భయంకరమైన భూకంపాల్లో ఇది నాలుగోది. అలలు 133 అడుగుల ఎత్తున ఎగిసిపడి జనాన్ని నామరూపాలు లేకుండా చేశాయి. ఈ కారణంగా సుమారు 20 వేల మంది మరణించగా, 6,242 మంది […]
రేవంత్‌రెడ్డి ఈ పనే చేస్తే… బడుగు రైతు బతుకులు మరింత సంక్షోభంలోకి…
ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సరే… ప్రత్యేకించి రైతులకు సంబంధించి… జాగ్రత్తగా, ఆచితూచి, దీర్ఘకాలిక ప్రభావాలను కూడా ఆలోచించి, వర్తమాన స్థితిగతులను మదింపు వేసి ఆ తరవాతే అడుగులు వేయాలి… ప్రత్యేకించి బ్యూరోక్రాట్ల సంకుచిత, అపరిపక్వ ఆలోచనల పరిధిలోకి రాజకీయ నిర్ణయాలు లాగబడకూడదు… ఉదయమే ఓ వార్త కనిపించింది… రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులు తీసుకునే ప్రైవేటు రుణాలకు తనే వడ్డీ ఫిక్స్ చేయబోతోందని… బ్యాంకులిచ్చే వడ్డీని మించి రెండు శాతం దాటకూడకుండా చూడనుందని… మనీ లెండర్స్ […]
అన్నే షిమోటీ..! నిఖార్సు ఇండియన్ ఆర్ట్… 1976 లోనే ఓ ‘పడమటి సంధ్యారాగం’…
‘పాడనా తెనుగు పాట, పరవశనై మీ ఎదుట మీ పాట, పాడనా తెనుగు పాట’ … అమెరికా అమ్మాయి సినిమా అంటే ఎవరికయినా మొదట గుర్తుకొచ్చేది ఈ పాటే … ఈ పాట వింటే గుర్తుకొచ్చేది అమెరికా అమ్మాయి సినిమాయే … ఇంత చక్కటి , గొప్ప పాటను వ్రాసిన భావ కవి , ఆంధ్రా షెల్లీ , రవీంద్రనాథ్ టాగోర్ మిత్రుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి హేట్సాఫ్ . ఈ పాట విన్నప్పుడు నాకు మరో […]
యండమూరి మాస్టారూ… ఇక ఏ నవల రాసినా ఆ వ్యక్తిత్వ వికాస పాఠాలేనా..?
మన పట్ల మనకు నమ్మకం ఎక్కువైతే దాన్ని ‘ఓవర్-కాన్ఫిడెన్స్’ అంటారు. నా మనసులో ఎక్కడో నాకు, మంచి మార్కులతో పాసయ్యాననే అహం ఉంది. అదీగాక కాలేజీ రోజుల్లో నేనొక గ్యాంగ్ లీడర్ని. ఆ అహంభావం నా బాడీ లాంగ్వేజ్ లో, మాటతీరులో ఎదుటి వాళ్లకి కనపడిపోతోందని అర్థమైంది. ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడిగిన వాళ్లకి సిద్ధాంతపరంగా సమాధానం చెప్పేవాణ్ని తప్ప నా జవాబులో ప్రాక్టికల్ అప్రోచ్ ఉండేది కాదు. అంతే కాకుండా ఫ్యాక్టరీలో నాపై ఉద్యోగి కన్నా, నాకు […]
PILL… మందు గోళీ కాదు, పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషనూ కాదు… ఈ వెబ్ సీరీస్ అంతకుమించి…
చిన్నప్పుడు జ్వరమొస్తే గ్లాసెడు నీళ్లలో జిందాతిలిస్మాత్ కలుపుకొని తాగడం.. జలుబు చేస్తే అదే జిందాతిలిస్మాత్ రుమాలుకి కాస్త రాసుకొని పీల్చడం. కానీ ఇప్పుడు ప్రతీ దానికి ఒక మాత్ర వేసుకోవాల్సిందే. డాక్టర్ దగ్గరకు వెళ్లడం కంటే ముందు మెడికల్ షాపుకు వెళ్లి ఏదో ఒక ట్యాబ్లెట్ కొనుక్కోవడం.. వేసుకోవడం. ఇలా ఎట్లాబడితే అట్లా ట్యాబ్లెట్లు వేసుకోవడం ప్రమాదకరం. డాక్టర్ దగ్గరకు వెళ్లి.. ఆయన రాసిన ట్యాబ్లెట్లు వేసుకోవడం ఉత్తమం అని చాలా మంది చెబుతుంటారు. కానీ ‘పిల్’ […]
విలీనం బీఆర్ఎస్ అవసరం… బీజేపీది కాదు… తక్షణ ఫాయిదా కూడా లేదు…
కేసీయార్ గవర్నర్, కేటీయార్ కేంద్ర మంత్రి, రాష్ట్ర పార్టీ పగ్గాలు హరీశ్‌రావుకు, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చర్చలు… ఇదీ రేవంత్ రెడ్డి చెబుతున్నది… నో, నో, రేవంత్ రెడ్డే బీజేపీలో చేరతాడు… తన చివరి గమ్యం అదే, చూస్తూ ఉండండి… ఇదేమో కేటీయార్ ప్రతివిమర్శ… బీజేపీలో కాదు, బీఆర్ఎస్ కాంగ్రెస్‌లో విలీనం అవుతుంది, మాకున్న సమాచారం అదే… బండి సంజయ్ విసుర్లు… ఫాఫం, రాష్ట్ర రాజకీయాలు… విలీనం చేయాలని బీజేపీ అడుగుతోందట, కానీ విలీనానికి కేసీయార్ సిద్ధంగా లేడట, […]
రేవంత్ ఓ ఉన్నత స్థాయి సమీక్ష అవసరం… టెంపుల్ సిటీ పేద్ద పెండింగ్ టాస్క్…
నర్సింహస్వామి దర్శనం చేసుకుని బయటికి వస్తుంటే… ఓ ముసలాయన, తన ముందు కొడుకు, వెనుక ఓ మహిళ… ఆ ముసలాయనకు ఆక్సిజెన్ పైపు, పోర్టబుల్ మినీ ఆక్సిజన్ సిలిండర్‌ను తోసుకుంటూ కొడుకు… వాళ్లను తీసుకెళ్తూ ఓ ఆలయ ఉద్యోగి… ఆశ్చర్యం అనిపించింది… ఆ అవస్థలోనూ, క్షణక్షణం కృత్రిమ ఆమ్లజని లేకపోతే గడవని అనారోగ్యం, వృద్ధాప్యంలోనూ నర్సన్న దర్శనం కోసం… అలా దివ్యాంగులు, రోగపీడితులు… దేవుడంటేనే నమ్మకం… నమ్మకమే బలం… ఆ బలమే బతుకు మీద ఆశను, కష్టాలపై […]
యాదగిరిగుట్ట మీద ఇప్పుడెలా ఉంది..? ఏమేం మార్పులు జరుగుతున్నయ్..?
యాదాద్రి యాదగిరిగుట్ట అయిపోయింది మళ్లీ… గుడ్… కొండపైన కొన్ని కార్ల పార్కింగుకే చాన్స్ ఉంది… దాంతో కొండపైకి సొంత వెహికిల్‌లో రావడాన్ని నిరుత్సాహపరచడానికి 500 టికెట్ ధర పెట్టారు… కింద పార్కింగుకు 50 రూపాయలు… అక్కడి నుంచి పైకి ఫ్రీ బస్సులు… మరీ వృద్ధులు, వికలాంగులైతే బ్యాటరీ కార్లు… భక్తుల టాయిలెట్ అవసరాల్ని గుర్తించారు… పలుచోట్ల నిర్మించేశారు… డ్రింకింగ్ వాటర్ దివీస్ వాళ్లు ప్రొవైడ్ చేశారు… బాగా నచ్చింది ఏమిటంటే..? వయోవృద్ధులు, దివ్యాంగులు లిఫ్ట్ వాడుకునే ఛాన్స్, […]
ఆరాధన… ఆ రఫీ పాటలు ఈరోజుకూ చెవుల్లో గింగురుమంటూనే ఉంటాయి…
1976 లోకి వచ్చాం . 1970 లో హిందీలో హిట్టయిన గీత్ అనే సినిమా ఆధారంగా ఈ ఆరాధన సినిమా తీయబడింది . హిందీలో రాజేంద్రకుమార్ , మాలా సిన్హా హీరోహీరోయిన్లుగా నటించారు . మన తెలుగులో NTR , వాణిశ్రీలు నటించారు . కులూ వేలీలో ఔట్ డోర్ షూటింగ్ జరిగింది . సుందరమైన ప్రదేశాలను వీక్షిస్తాం . It’s a great musical and visual feast . మహమ్మద్ రఫీ – జానకమ్మ […]
జైలుకైనా వెళతా… ఇంటికి మాత్రం వెళ్లను… ఇది భారతీయ భార్య శిక్షా స్మృతి…
జైలుకైనా వెళతా… ఇంటికి మాత్రం వెళ్లను… భారతీయ భార్య శిక్షా స్మృతి మగవాడి కష్టం పగవాడికి కూడా రాకూడదని తెలియజెప్పే కథనమిది. “గృహహింస” అంటే వ్యుత్పత్తి ప్రకారం ఇంట్లో హింస అని. కాకపోతే గృహహింస కేసుల్లో సాధారణంగా భార్యను అత్తమామలు, భర్త వేధిస్తుండేవారు కాబట్టి ఆ మాట అనగానే మహిళలు బాధితులు అన్నంతగా అర్థవ్యాప్తి పొందింది. నిజానికి వ్యుత్పత్తిలో ఆ అర్థం లేదు. కాలం మారింది. ఇప్పుడు గృహహింసకు మగవారు కూడా గురవుతున్నారు కాబట్టి…హింసలో సమానత్వం సాధించినట్లే అనుకుని…ఒకానొక […]
స్టాక్ మార్కెట్‌ను మళ్లీ కూల్చబోయి… ఈసారి తనే కుప్పకూలిన హిండెన్‌బర్గ్…
జార్జ్ సోరోస్ కి మళ్ళీ దెబ్బ పడింది! రాహుల్ పేరును కూడా చేర్చాలి! 94 ఏళ్ళ జార్జ్ సోరోస్ కి ఆగస్టు 12 న 94 ఏళ్లు వచ్చాయి! కానీ ఎప్పటిలాగా పుట్టిన రోజు వేడుక జరుపుకోలేదు! ఆగస్టు 11న అంటే, ఆదివారం రోజున హిండెన్‌బర్గ్ రిసెర్చ్ చేత SEBI ( Securities and Exchange Board of India) ఛైర్ పర్శన్ మీద ఆరోపణలు గుప్పిస్తూ ఒక నివేదిక విడుదల చేయించాడు సోరోస్! ఆ నివేదికలో2023 లో […]
అయోధ్యలో బీజేపీ ఓటమి… ఆలేరులో బీఆర్ఎస్ ఓటమి… దేవుళ్లెందుకు కోపగించారు..?
యాదగిరిగుట్టకు వెళ్తుంటే అనిపించింది… అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది… దేశం మొత్తం దృష్టినీ తనవైపు తిప్పుకున్న ఆ బాలరాముడు బీజేపీని అక్కడ ఎందుకు శపించాడు..? అంతగా వారణాసి కారిడర్ డెవలప్ చేసినా సరే, మోడీ మెజారిటీ ఎందుకు పడిపోయింది కాశిలో… అలాగే యాదగిరిగుట్ట ఉండే ఆలేరులో 1800 కోట్ల ఖర్చుతో గుడికట్టిన కేసీయార్‌ను కాదని కాంగ్రెస్‌ను గెలిపించారు ఎందుకు..? చాలా విశ్లేషణలు ఉండొచ్చుగాక… కానీ కేసీయార్ ఆలోచనలు, ప్రణాళికలు, అడుగులకు స్థానిక జనం తిరస్కరణే కదా అది… అలాగే […]
- « Previous Page
- 1
- …
- 112
- 113
- 114
- 115
- 116
- …
- 447
- Next Page »