ఆమధ్య ఈటీవీలో బుల్లెట్ భాస్కర్ కావచ్చు, ఒక స్కిట్లో ఓ మాటంటాడు.,. ఒరేయ్, సినిమా మొదట్లో వచ్చే ముఖేష్ యాడ్ కూడా పూర్తి గాకుండానే రివ్యూ పోస్ట్ చేశారేమిట్రా అని… ప్రస్తుత రివ్యూల ధోరణి మీద పర్ఫెక్ట్ వన్ లైనర్ పంచ్ అది… నిజమే అది… ప్రస్తుతం విజయ్ దేవరకొండ సినిమా ఫ్యామిలీ స్టార్ సినిమాకు సంబంధించి బోలెడు ఫేక్ రివ్యూలు యూట్యూబును ముంచెత్తుతున్నయ్… అసలు ఎక్కడా బెనిఫిట్ షోలు, ప్రీమియర్లు వేయకుండానే… సినిమా రిలీజు కాకుండానే… […]
“చెమ్మచెక్క ఆస్కారే తస్సదియ్య తస్కారే! ఉన్నోళ్లు ఉస్కోరే! లేనోళ్లు మూస్కోరే!
చెమ్మచెక్క ఆస్కారే! తస్సదియ్య తస్కారే!! ఇటలీ మిలాన్ బార్ లో అర్ధరాత్రి తప్ప తాగి…స్పృహలేకుండా పడి ఉన్న హీరోను వందమంది విలన్లు పచ్చడి పచ్చడిలా కొట్టి…వెళ్లిపోబోతూ ఉంటారు. ఈలోపు హీరో చేయి…మెడలో ఉన్న తాయెత్తుకు తగులుతుంది. అది చిన్నప్పుడు హీరోకు అమ్మ కట్టిన హనుమ బిళ్ల. ఇది ఓపెనింగ్ షాట్. నల్లమల అడవి సున్నిపెంట ఇంటి ముందు పెంటలో ఆడుకుంటూ నీటి కుండను పగులగొట్టినందుకు అమ్మ కోప్పడితే…అమ్మ గుర్తుగా ఆ కుండ పెంకును జేబులో పెట్టుకుని…ఇల్లు వదిలి…బాంబే […]
సంపద పెరగడమే కాదు… పెరిగింది విరగకుండా కాపాడుకోవడమే పెద్ద టాస్క్…
ఎలా సంపాదించావు అని కాదు, ఎంత సంపాదించావు అనేదే ఇప్పటి లెక్క…! అవే సక్సెస్ స్టోరీలు… అవే ఇన్స్పిరేషన్ స్టోరీలు… నిజమే, ప్రస్తుతం ట్రెండ్ పైసామే పరమాత్మ… కానీ ఫెయిల్యూర్ స్టోరీల మాటేమిటి..? అవి కదా మనకు పాఠాలు నేర్పి, మనల్ని మరింత జాగ్రత్తగా మలుసుకునేలా చేసేవి… ఫలానా వ్యక్తి ప్రపంచ ధనికుల జాబితాలో చేరాడు, ఫోర్బ్స్ జాబితాలో ఫలానా స్థానంలో ఉన్నాడు అని బోలెడు వార్తలు చదువుతున్నాం, రాస్తున్నాం, వింటున్నాం… కానీ గగనానికి ఎగిసి హఠాత్తుగా […]
రష్మికే కాదు… యాంకర్లు అందరికీ ఈ చిన్న పరీక్ష పెడితే ఎలా ఉంటుంది..?
అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్ గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్ ఒకసారి తప్పుల్లేకుండా చదవడానికి ప్రయత్నించండి… అర్థాలు, తాత్పర్యాలు అక్కర్లేదు, ఉచ్ఛరణ దోషాలు లేకుండా చదవగలమా అనేది పరీక్ష… అబ్బే, మనకెందుకండీ ఈ పరీక్షలు అంటారా..? పోనీ, మన టీవీ న్యూస్ రీడర్లకు, డిబేట్ ప్రజెంటర్లకు, టీవీ యాంకర్లకూ ఈ పరీక్ష పెడితే […]
ఈ గొర్రెబతుకు భరించాలంటే సినిమాలపై అవ్యాజమైన ప్రేమో, పిచ్చో ఉండాలి…
గోట్ లైఫ్ సినిమాకు తెలుగునాట కలెక్షన్లు లేవు, థియేటర్లలో జనం లేరు… ఎందుకు..? సినిమా ప్రియుల నడుమ చర్చ సాగుతూనే ఉంది… అసలు ఈ సినిమా కథను సగటు తెలంగాణ వలస గల్ఫ్ కార్మికుడి కథలతో ఎలా రిలేట్ చేసుకోవాలి..? ఫేస్బుక్లో Sampath Rao Pulluri రాసిన ఓ విశ్లేషణ ఆసక్తికరంగా ఉంది… కొంచెం లెంతీ, ఐనా చదవాల్సిన సమీక్షే ఇది… తెలుగులోనూ కొత్త దర్శకులు వస్తున్న వేళ వాళ్లకూ ఉపయోగమే ఇది… గోట్ లైఫ్: సినిమా పరిచయం…. […]
అక్షయపాత్ర..! అరుదైన ఓ ఘనతకు అక్షరాలా ఐరాస అభినందనలు…
అక్షయపాత్ర… మహాభారతంలో ద్రౌపది తన దగ్గరున్న అక్షయపాత్రతో ఎంతమంది అన్నార్తులు వచ్చినా సరే, భోజనాలు సమకూరుస్తుంది… ఓసారి కుయుక్తితో దుర్వాసుడు భోజనాలవేళ దాటాక, తన శిష్యగణంతో వచ్చి భోజనాలకై ఒత్తిడి తెస్తాడు… అప్పుడు కృష్ణుడు సమయానికి అరుదెంచి, అక్షయపాత్రలో మిగిలిన ఓ మెతుకు తిని, సాధుగణం ఏమీ తినకుండానే పొట్టలు పగిలిపోతూ వాపస్ వెళ్లిపోయేలా చేస్తాడు… ఇది పురాణ కథ… సరే, వర్తమానానికి వద్దాం… ఇంటికి నలుగురు అతిథులు వస్తున్నారు, భోజనాలు చేసి వెళ్తారు అంటేనే గృహిణికి […]
‘మీకు టేస్ట్ లేదు, సినిమాను మీరు ప్రేమించలేరు, మీ రివ్యూలూ అంతే…’
ఓ ప్రయోగం… ఓ భిన్నమైన ప్రజెంటేషన్… సూపర్బ్ నటన… ఆరేడేళ్ల ప్రయాస… తపస్సు… ఓ అత్యంత పాపులర్ నవలకు దృశ్యరూపం… అన్నీ నిజాలే… కానీ అందరికీ నచ్చాలని ఏముంది..? ఆడుజీవితం సినిమా గురించే..! అది బేసిక్‌గా మలయాళ సినిమా… నటీనటులు, ఇతర క్రాఫ్ట్స్‌మెన్ వాళ్లే… టార్గెట్ చేసిన ప్రేక్షకులూ మలయాళీలే… సో, మలయాళీ ప్రేక్షకులను కనెక్టయింది… సహజంగానే మలయాళ ప్రేక్షకులు భిన్నమైన కథల్ని, ప్రయోగాల్ని ఇష్టపడతారు… అనేక ఏళ్లుగా ఆ టేస్ట్ వాళ్లలో ఇంకిపోయింది… ఫార్ములా సినిమాలకు […]
మోడీ గారూ… మా తెలుగు కూడా నేర్చుకొండి… ఆ ఐరాసలో మాట్లాడండి…
మోడీజీ! తెలుగు కూడా నేర్చుకోండి! గౌరవనీయ భారత ప్రధానమంత్రి మోడీ గారికి- నమస్సులు. ఏడు పదులు దాటిన వయసులో మీకు ఏ మాత్రం సంబంధంలేని దక్షిణ భారత తమిళం నేర్చుకుని…ఐక్యరాజ్యసమితిలో ప్రసంగిస్తానని చెప్పినందుకు మీకు మనసారా అభినందనలు. మా తెలుగువారి ఠీవి పి వి తెలుగు, సంస్కృతం, ఇంగ్లిష్, హిందీ, కన్నడ, ఉర్దూ, జర్మన్, రష్యాతో పాటు మరికొన్ని అంతర్జాతీయ భాషల్లో వీరవిహారం చేసిన సంగతి మీకు తెలియనిది కాదు. కర్ణాటక తుముకూరు ప్రాంతంలో పి వి […]
‘‘సింగిల్ మాల్ట్ గ్లాసులో ఐస్‌క్యూబ్స్ వేస్తుంటే వెయిటర్ వద్దన్నాడు…’’
సుప్రీంకోర్టు అంటే చాలా కేసులకు సంబంధించి వేడి వేడి వాదనలు, విచారణలు సాగుతుంటాయి కదా… అప్పుడప్పుడూ సరదా సంభాషణలు వాతావరణాన్ని ఉల్లాసపరుస్తాయి… ఆహ్లాదాన్ని నింపుతాయి… సుప్రీంలో ఇండస్ట్రియల్ లిక్కర్ మీద ఓ కేసు ఉంది… జడ్జిగా సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ కూడా ఉన్నాడు… ఈ కేసులో సీనియర్ అడ్వొకేట్ దినేష్ ద్వివేదీ తన వాదనలు మంగళవారం స్టార్ట్ చేశాడు… ‘తెల్లని నా జుట్టుపై రకరకాల రంగులు కనిపిస్తున్నందుకు ముందుగా నన్ను క్షమించండి… అఫ్ కోర్స్, మన చుట్టూ […]
నిను వీడని నీడను నేనే… వయనాడులోనూ స్మృతీ ఇరానీ ప్రత్యక్షం…
నిను వీడని నేనే… అన్నట్టుగా రాహుల్ గాంధీ వెంట పడుతోంది స్మృతీ ఇరానీ..! 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీపై ఆమేథీలో ఆమె గెలుపు బీజేపీ క్యాంపులో ఓ ఆనంద సందర్భం… కాకపోతే దీన్ని సందేహించిన రాహుల్ మైనారిటీ వోట్లు అధికంగా ఉన్న వయనాడులో పోటీచేసి, గెలిచి లోకసభలోకి మళ్లీ వచ్చాడు… ఇప్పుడు కూడా ఆమేథీకి మళ్లీ రాదలుచుకోలేదు, రిస్క్ తీసుకోదలుచుకోలేదు, మళ్లీ వయనాడుకే జై అంటున్నాడు… ఆమేథీలో మరో పాపులర్ పర్సనాలిటీని నిలబెట్టడమో లేక తమ మిత్రపక్షం […]
లీగల్ లిటిగేషన్లతో కొట్టాలి బీఆర్ఎస్ను… రేవంత్‌కు ఆంధ్రజ్యోతి పిలుపు…
గేట్లు తెరిచి, ఎడాపెడా చేరికలకు వోకే చెప్పేసిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బ్యానర్ స్టోరీలో చెప్పిన ఓ సలహా పాటిస్తే బెటరేమో…! మన ఎమ్మెల్యేల సంఖ్య పెరగకపోతేనేం, ఎదుటోడి ఎమ్మెల్యేల సంఖ్య ఎలా తగ్గినా సుఖమే కదానేది ఈ స్టోరీ మార్మిక సారాంశం… ఆంధ్రజ్యోతికి రేవంత్ రెడ్డి ఎలాగూ నిత్యపాఠకుడే కాబట్టి తను సీరియస్‌గానే ఆలోచించే చాన్సయితే ఉంది… విషయం ఏమిటంటే..? మెజారిటీకన్నా అయిదారు స్థానాలే ఎక్కువున్నయ్… ఒకవేళ కేసీయార్, బీజేపీ గనుక కలిస్తే… (అవకాశాలు […]
మూడు కాలాల్లో ‘మూడు ముళ్లు’… మన పెళ్లిళ్ల పరిణామ క్రమం ఈ మూడూ…
Subramanyam Dogiparthi…….. మూడు తరాల్లో మళ్ళీ పెళ్లి టైటిల్ తో మూడు సినిమాలు వచ్చాయి . మొదటిది 1939 లో , రెండవది 1970 లో , మూడవది 2023 లో . పెళ్లి గురించి ఆయా కాలాల్లో ఎలాంటి భావన ఉందో ఈ సినిమాలలో ప్రస్ఫుటమవుతుంది . 1939 లో వచ్చిన సినిమాలో వై వి రావు , కాంచనమాల హీరోహీరోయిన్లు . కాంచనమాల బాలవితంతువు . పేరంటానికి పిలవటానికి వచ్చిన ఆడవారు తెలియక నుదుట […]
అతడి ఎడారి నరకం సరే… ఆమె అనుభవించిన ఆ టార్చర్ మాటేంటి..?
మన సినిమాలే రొడ్డకొట్టుడు సినిమాలు కదా… వీలైనంతవరకూ ఫార్ములా, ఇమేజీ బిల్డప్పులు… పైగా రొటీన్ ప్రజెంటేషన్లు… అందుకే మలయాళం ప్రయోగాలు సినిమా ప్రియులను ఆకర్షిస్తుంటాయి… ఓటీటీలు వచ్చాక, తెలుగు వెర్షన్లు, సబ్ టైటిళ్లతో భాషాసమస్యను కూడా అధిగమించినట్టయింది… మరి సినిమా రివ్యూల మాటేమిటి..? అవీ అంతే, తెలుగులో… పక్కా ఓ ఫార్మాట్లో ఉంటాయి… డిఫరెంట్ యాంగిల్స్, లోతైన విశ్లేషణ ఉండవు… (కొందరు తప్ప)… మలయాళంలో రివ్యూలు కూడా భిన్నంగా ఉంటయ్ కొన్ని… మలయాళ మనోరమ డిజిటల్ సైట్లో […]
హైదరాబాద్ పాత బస్తీ లక్క గాజులకు జీఐ గుర్తింపు… మొత్తం 17…
హైదరాబాద్ నగరానికి మరో గుర్తింపు దక్కింది… ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన హైదరాబాద్ పాతబస్తీ లక్క గాజులకు భౌగోళిక గుర్తింపు (Geographical Indication – GI) లభించింది… కేవలం గాజులు కొనడానికి రోజూ అనేకమంది మహిళలు చార్మినార్ దగ్గర లాడ్ బజార్ తదితర ప్రాంతాలను సందర్శిస్తారు తెలుసు కదా… హైదరాబాద్ వచ్చిన విదేశీ టూరిస్టులు సైతం వీటిని కొనుగోలు చేస్తుంటారు… ఇవి హైదరాబాద్ యూనిక్ ప్రొడక్ట్స్… బోలెడు డిజైన్లతో కేవలం గాజులు మాత్రమే అమ్మే దుకాణాలు కూడా […]
సారే జహాసే అచ్చా… అంతరిక్షం నుంచి ఈ మాట విని అప్పుడే 40 ఏళ్లు…
గుర్తుందా..? సరిగ్గా 40 ఏళ్ల క్రితం… భారతీయ వ్యోమగామి రాకేశ్ శర్మ రష్యన్ వ్యోమనౌక సూయజ్‌లో అంతరిక్షానికి ఎగిసిన రోజు… ఏ ప్రధాని అయినా ఇలాంటివి ఓన్ చేసుకోవడానికే ప్రయత్నిస్తాడు కదా… చంద్రయాన్ విషయంలో మోడీలాగా..! అప్పటి ప్రధాని ఇందిర కూడా అంతరిక్షంలో ఉన్న రాకేశ్ శర్మతో మాట్లాడటాన్ని కోట్లాది టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేయించింది… అంతరిక్షం నుంచి మన దేశం ఎలా కనిపిస్తోంది అనే ఇందిర ప్రశ్నకు ‘సారే జహాసే అచ్చా’ అని స్పందించాడు రాకేశ్ […]
జై శ్రీరాం అనొద్దు… ఉద్వేగాలు కడుపు నింపవు… శ్రీమాన్ కేటీయార్ ఉవాచ…
సోషల్ మీడియాలో కొందరి పోస్టులు చూసి, నిజంగా కేటీయార్ ఇలా అన్నాడా అనిపించింది… కానీ, అన్నాడు… అన్నాడని ఆయన పత్రిక నమస్తే తెలంగాణ రాసుకొచ్చింది… ఎండార్స్ చేసింది… ఇంతకీ ఏమన్నాడు..? ‘‘యువత ఎవరైనా జై శ్రీరాం అంటే సముదాయించాలి. జై శ్రీరాం అనే నినాదం కడుపు నింపదు.. నీకు ఉద్యోగం ఇవ్వదు.. ఉద్వేగాలు కాదు.. ఉద్యోగాలు కావాలి.. కొట్లాడేటోళ్లు కావాలి… ఈ రాష్ట్రంలో నిజమైన సెక్యులర్ పార్టీ ఏదైనా ఉందా.. అంటే అది కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ […]
శ్రీలీల సమయానికి ఆ నిర్ణయం తీసుకుని మంచి పనే చేసింది…
నటి శ్రీలీలను శ్రీచైతన్య గ్రూపు బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకున్నారనే వార్తావివరాలు చదువుతూ ఉంటే మరో వార్త కనిపించింది… ఆమె రీసెంట్ బ్లాక్ బస్టర్ టిల్లూ స్క్వేర్ సినిమాలో హీరోయిన్గా చేసే అవకాశాన్ని చేజేతులా వద్దనుకుందట… గుడ్… మంచి పని చేసింది… లేకపోతే భ్రష్టుపట్టిపోయేది… అంటే అది దరిద్రమైన ఆఫర్ అని కాదు, తనకు ఇప్పుడున్న సిట్యుయేషన్లో ఏమాత్రం సూట్ కాని వెగటు పాత్ర అది… అనుపమ పరమేశ్వరన్ కథ వేరు… మొదట ఈ చాన్స్‌కు వోకే చెప్పింది, […]
ఆడుజీవితం… ఓ ఎడారి బందీ కథ… 136 పునర్ముద్రణలు… 9 భాషలు…
గోట్ లైఫ్… పుస్తకం పేరు ఆడుజీవితం… సినిమాకూ అదే పేరు పెట్టారు… ప్రస్తుతం విమర్శలకు ప్రశంసలు పొందిన పాన్ ఇండియా సినిమా ఇది… రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి సినిమాపై… దర్శకుడు, సంగీత దర్శకుడు, హీరోల శ్రమ, ప్రయాస, తపస్సు కనిపిస్తాయి సినిమాలో… ఈ సినిమా వివరాల సెర్చింగులో సినిమాకు ఆధారంగా తీసుకున్న పుస్తకం గురించిన సమాచారం ఆసక్తికరం అనిపించింది… స్వీయానుభవాల ఆధారంగా రాయబడిన పుస్తకంగా ప్రచారమైంది తప్ప నిజం కాదు, పుస్తక రచయిత బెన్యామిన్… తను బెహ్రయిన్‌లో […]
ఆ డ్యాష్ ప్రశ్నలేమిటో… ఆ షో ఏమిటో… ఈ హోస్టింగ్ అవసరమా తల్లీ…
బూతులు, హాట్ సీన్లు, వెగటు కంటెంట్ ఉంటే తప్ప ఓటీటీలను ఎవడూ చూడరనే భ్రమ ఏదో ఆవహించినట్టుంది ఆహా యాజమాన్యానికి కూడా..! అసలే నడపలేక అమ్మకానికి పెట్టినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో హఠాత్తుగా వెగటు కంటెంట్ వైపు ఎందుకు వెళ్తున్నారో అర్థం కాదు… ప్రత్యేకించి మెగా ఫ్యామిలీకి చెందిన నీహారిక హోస్టింగ్ చేసే చెఫ్ మంత్ర అనే కుకరీ షోలో రీసెంటు ఎపిసోడ్లో పరమ చెత్తా డైలాగులను పెట్టారు… ఆహా కూడా మెగా క్యాంపుకు చెందినదే కదా… […]
రెక్కల ముడి విప్పి… చుక్కల ఆకాశంలోకి తోడ్కొని వెళ్లిన పాటల రాజు…
Vijayakumar Koduri ….. రాజా ! నీ మీద మీ అరవం వాళ్ళు సినిమా ఒకటి తీస్తున్నారట కదా ! ఈ సినిమాలో నీ కథ మాత్రమే ఉంటుందా ? ఈ సినిమాలో నీ కథ మాత్రమే ఉంటే అన్యాయం కదా రాజా ! నా బోటి అనేక వేల, లక్షల, కోట్ల మంది కథ కూడా ఈ సినిమాలో భాగం కావాలి కదా రాజా ! నా బోటి అనేకమంది బాధలలో, సంతోషాలలో, గాయాలలో, నిదురపట్టని […]
- « Previous Page
- 1
- …
- 115
- 116
- 117
- 118
- 119
- …
- 457
- Next Page »