Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సినిమా పెద్దలూ… దిల్ రాజు గారు ఏదో చెబుతున్నారు… వింటిరా..?!

June 16, 2025 by M S R

.
ప్రభుత్వం అవార్డులు ఇచ్చినప్పుడు వచ్చి తీసుకోవడం ఒక బాధ్యత! అవార్డుల వేడుక తేదీ నోట్ చేసుకుని ఆరోజు షూటింగ్ పెట్టుకోకుండా బాధ్యతగా వచ్చి అవార్డులు తీసుకోవాలి! దూరంగా ఉన్నాం, షూటింగుల్లో ఉన్నాం అంటే ఇక నుంచి కుదరదు!

రేపు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇస్తారు. అక్కడైనా ఇక్కడైనా అవార్డు వచ్చినప్పుడు బాధ్యతగా స్వీకరించాలని హితవు పలికారు దిల్ రాజు…

నిన్న జరిగిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ సందర్భంగా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. ఆయన వెంట FDC మేనేజింగ్ డైరెక్టర్ హరీష్ కూడా ఉన్నారు. ఇద్దరూ కలసి ముఖ్యమంత్రు రేవంత్ రెడ్డికి, మంత్రులకు, హాజరైన నటులకు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు…

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు అవార్డు వచ్చిన కొందరు హీరోలు ఈ వేడుకకు రాకుండా డుమ్మా కొట్టారు! ముఖ్యంగా గత పదేళ్లకు సంబంధించి ఇచ్చిన ఉత్తమ చిత్రాలకు సంబంధించిన వారిలో చాలామంది రాలేదు.

2024 సంవత్సరానికి సంబంధించి, అలాగే ప్రత్యేక వ్యక్తిగత పురస్కార గ్రహీతలు అందరూ హాజరయ్యారు! ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దిల్ రాజు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగే ప్రభుత్వం నిర్వహించే సినిమా వేడుకల్లో పురస్కారాలు వచ్చిన ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు.

గత ఆరు నెలలుగా శ్రమించి ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మిస్ కమ్యూనికేషన్ వల్ల బిగ్ ఈవెంట్ లో కొన్ని చిన్న చిన్న లోపాలు వుంటాయని, నిన్న ఫంక్షన్ కు వచ్చిన వారు ఏదయినా విషయంలో హర్ట్ అయితే చైర్మన్ గా బాధ్యత వహించి క్షమాపణలు కోరుతున్నానని ఆయన అన్నారు……. – డా.మహ్మద్ రఫీ

.



ఎన్టీఆర్ జాతీయ అవార్డు: బాల‌కృష్ణ‌

పైడి జయరాజ్ అవార్డు: మ‌ణిర‌త్నం

బి.ఎన్. రెడ్డి అవార్డు: సుకుమార్‌

నాగిరెడ్డి – చక్రపాణి అవార్డు: అట్లూరి పూర్ణ‌ చంద‌ర్ రావు

కాంతారావు అవార్డు: విజ‌య్ దేవ‌ర‌కొండ‌

రఘపతి వెంకయ్య అవార్డ్: యండమూరి వీరేంద్రనాథ్

 



దిల్ రాజు దిల్ కొట్టుకుంటూ ఉండవచ్చు, తను పెత్తనం చేస్తున్న తెలంగాణ ఫిలిమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పరువు కోసం, రేవంత్ రెడ్డి గౌరవం కోసం… కానీ అందరూ బన్నీలాగా, బాలయ్యలాగా ఉండలేరు, జైతెలంగాణ అనలేరు…

అఫ్‌కోర్స్, బన్నీ కథ వేరు… బాలయ్యతో రేవంత్ బాబుయిస్టిక్ అనుబంధం వేరు… మరి మిగతావాళ్లు..? ఇంకా అదే ఆంధ్రపాతంతోనే ఉన్నారా..? అందుకే రేవంత్ రెడ్డి అన్నాడు ఓ మాట… మేం పైకి కఠినంగా ఉంటాం, కానీ సానుకూలంగా ఉంటాం అని… అర్థమైనవాడికి అర్థమైనంత…

సరే, ఈ మాట అనడానికి దిల్ రాజు ఎవరు అనడక్కండి… సారు గారు ఆ నలుగురిలోనూ ప్రముఖుడు… పొలిటికల్ కనెక్షన్స్… కాకపోతే పవన్ కల్యాణ్ కరుణ, చల్లని చూపులు ఉన్నవాడికే ఆంధ్రా ప్రభుత్వంలో కాస్త పలుకుబడి, పవన్ కల్యాణ్ లెక్కలు వేరు, తను రేవంత్ రెడ్డి కాదు… ఇండస్ట్రీ మనిషి…

వోకే, దిల్ రాజు ఎవరితోనైనా కలిసిపోగలడు, మేనేజ్ చేయగలడు… కానీ ఆ అవార్డులేమో ప్రకటించనివ్వండి… అంతెందుకు, గద్దర్ అవార్డుల్లో సింహభాగం ఆంధ్రులకే కదా, ఇదే జాబితా ఫైనల్ చేస్తే సరి… అప్పుడు చూద్దాం, ఇక్కడ గైర్హాజరై అక్కడ ప్రత్యక్షమైన కేరక్టర్లు ఎవరో..,!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ అక్రమ భవనాలకూ – జన్వాడ ఫామ్‌హౌజుకూ ఏమిటి లింకులు?!
  • మోదీకి ఇండొనేషియా అపూర్వ స్వాగతం – ఎందుకీ ప్రాధాన్యం అంటే?
  • మనకు తెలిస్తేనే నిజం- తెలియకపోతే అబద్ధం అయిపోదు… పునర్జన్మ!!
  • ఒక దశలో ఒకేచోట 50 వేల మంది లైంగిక కార్మికులు!!
  • Nabha Natesh – విరిగిపడి, తేరుకుని, తిరిగి తెరపై ‘మెరుపు కలల’ వైపు!!
  • BRS దాచిపెట్టే వైఫల్యాల్లో మరొకటి – మేడిగడ్డలాగే ‘కన్నెపల్లి’ కూడా!!
  • STOCK MARKET HUMOUR – Sorry, I haven’t verified the Data
  • ట్రంప్ – రెడ్ కార్డ్..! ఫిఫా పోటీల్లోనూ తనే ‘సుప్రీం రెఫరీ!!
  • TGRPDCL @ రైతు డిస్కమ్ – రేవంత్ రెడ్డి సర్కారు భలే ప్లాన్ !!
  • రొనాల్డో శకం ముగిసింది – ఫుట్‌బాల్ సామ్రాట్ కన్నీటి వీడ్కోలు!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions