అక్కినేని నాగచైతన్య నటించిన ఓ సినిమాలో… ఎస్ అనే అక్షరంతో ఉన్న అమ్మాయే నా జీవితంలోకి వస్తుందని నా జాతకంలో ఉంది, నా ఎస్ నువ్వే అని ఎవరితోనో అంటాడు… ఇప్పుడు ఆ వీడియో వైరల్… పాత అమ్మాయి సమంత- ఎస్… కొత్త అమ్మాయి శోభిత- ఎస్… ఇది ఒక వార్త… సమంత అక్కతో నాగ చైతన్య నిశ్చితార్థం అని మరో వార్త… ట్విస్టింగ్, యూబ్యూబ్ బాపతు థంబ్ నెయిల్ వార్త అన్నమాట… ఐతే నాగ చైతన్య […]
అందమే ఆమెకు శాపమై… నిజంగా ఓ క్రీడాకారిణి గుండె పగలడం అంటే ఇదీ…
ఆమె అందమే ఆమెకు శాపమయ్యింది.. రిటైర్మెంట్ ప్రకటించే వరకు వెళ్లింది! కాస్త అందంగా కనపడితే రోడ్ల వెంట చెత్త ఏరుకునే వాళ్లను, అడుక్కునే వాళ్లను కూడా వదలరు మగాళ్లు. అందంగా కనపడితే అప్పుడే చెడ్డీలు తొడిగిన పోరగాడి నుంచి మంచం మీద నుంచి లేవలేని ముసలోళ్ల వరకు చొంగ కార్చుకుంటూ చూస్తారు. అందంగా కనిపించే సాధారణమైన అమ్మాయిలనే వదలని సమాజం.. ఇక సెలెబ్రిటీలను మాత్రం ఎందుకు విడిచిపెడుతుంది. ఐపీఎల్ వంటి మ్యాచ్‌లు చూస్తున్నప్పుడు బంతి ఫోర్ లేదా […]
సుంకిశాలను మరో మేడిగడ్డలా చూపిస్తే… అదంతా ఉల్టా తగిలేది కేసీయార్‌కే…
హైదరాబాద్‌కు నాగార్జునసాగర్ కనీస నీటిమట్టం నుంచి కూడా తాగునీటిని సప్లయ్ చేయడానికి ఉద్దేశించిన పథకం… సుంకిశాల ప్రాజెక్టు..! అంటే సాగర్ డెడ్ స్టోరేజీ నుంచి కూడా నీటిని పంప్ చేయడానికి ఉద్దేశించింది… ప్రాజెక్టు పనులు నడుస్తున్నాయి… అయితే హఠాత్తుగా శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు వరదనీటి ప్రవాహం పెరిగింది… ఆగస్టు మొదటి వారంలోనే ఇంత వరద వస్తుందని ఎవరూ అంచనా వేయలేదు… ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నిర్ణయం తీసుకున్న కేసీయార్ సంకల్పంలో తప్పులేదు… మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ […]
నా బిడ్డలు చెప్పారు… శాకాహారినయ్యాను… పట్టు, తోలు ఉత్పత్తులను వదిలేశాను…
జనరల్‌గా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా… ప్రతి తండ్రికీ తన బిడ్డ ఓ యువరాణి… ప్రేమగానే చూసుకుంటాడు… తన శక్తిమేరా అలా చూడటానికి ప్రయత్నిస్తాడు… మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ కూడా అంతే… తనూ నలుగురు పిల్లలకు తండ్రి… కాకపోతే వారిలో ఇద్దరు దత్తత బిడ్డలు… వాళ్లూ దైహికంగా వైకల్యాన్ని అనుభవిస్తున్నవాళ్లు… కానీ తెలివైన బిడ్డలు… వాళ్ల గురించి చెప్పుకోవడానికి ఎప్పుడూ ఆ తండ్రి సంతోషిస్తాడు, అపురూపంగా షేర్ చేసుకుంటాడు… తన బిడ్డల పేర్లు […]
నిరాడంబరుడు… నిజాయితీపరుడు… గుణధనికుడు… బుద్ధదేవుడు…
‘కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తే అమరవీరుల స్తూపానికి ఎర్ర రంగు వేస్తారా,’ అని సీపీఎం చివరి సీఎం బుద్ధదేవ్‌ను ఎత్తిపొడిచిన సత్యజిత్ రే! ……………………………….. పశ్చిమ బెంగాల్ రెండో మార్క్సిస్టు ముఖ్యమంత్రి, రాష్ట్ర రెండో బ్రాహ్మణ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య 80 ఏళ్ల వయసులో గురువారం కన్నుమూయడం దేశంలో కమ్యూనిస్టు సానుభూతిపరులకు పెద్ద విషాదం. నిజాయితీకి, నిబద్ధతకు మారుపేరైన కామ్రేడ్ బుద్ధదేవ్ బెంగాల్లో కమ్యూనిస్టు పాలనకు తన అనాలోచిత పాలనా విధానాలతో పాతరేశాడనే చెడ్డ పేరుతో మనకు కనుమరుగవ్వడం […]
వినేశ్ ఫోగట్ కాదు… ఇదుగో వీళ్లు దేశం పరువును పారిస్ వీథుల్లో ఈడ్చేశారు…
వినేష్ ఫొగట్ వల్ల కాదు.. ఇదిగో ఇప్పుడు పోయింది ఇండియా పరువు! ఒలింపిక్స్‌లో అధిక బరువు కారణంగా డిస్క్వాలిఫై అయ్యి అంతర్జాతీయ వేదికపై భారత పరువు తీసిందని కొంత మంది వాదిస్తుండగా.. అదేమీ లేదు. ఆమె దేశ్ కి బేటీ.. నిజమైన బంగారం. మన మహిళల సత్తా ఏమిటో నిరూపించిన ధీర వనిత అంటూ మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు. దేశం ఇప్పుడు వినేష్ విషయంలో రెండుగా విడిపోయి వాదోపవాదాలు చేసుకుంటోంది. కానీ అదే సమయంలో నిజంగానే దేశం […]
అర్బన్ రేటింగ్స్‌లో సాక్షి పదకొండో ప్లేసు… మొన్నటి ఎన్నికల్లో సీట్ల సంఖ్యలాగే…
బార్క్ రేటింగ్స్ తాజావి పరిశీలిస్తుంటే… (న్యూస్ చానెల్ రేటింగ్స్) ఆశ్చర్యం కలిగింది… ఆమధ్య నాలుగైదు టాప్ చానెళ్ల జాబితాలోకి కూడా చేరిన సాక్షి చానెల్ ఇప్పుడు ఏకంగా తొమ్మిదో ప్లేసులోకి వెళ్లిపోయింది… అసలు ఆ ప్లేసు అని కాదు, అసలు ఎవరూ పెద్దగా చూడరు అనే అభిప్రాయం, అదే రేంజ్ రేటింగ్స్ ఉంటే ఈటీవీ తెలంగాణ చానెల్ సరసన చేరిపోయింది సాక్షి టీవీ… ఫాఫం, చివరకు మహాన్యూస్ కూడా సాక్షితో పోటీపడే రేంజుకు వచ్చేసింది… రాజకీయాల్లో […]
బంగ్లాదేశ్‌పై చైనా డెట్ ట్రాప్… షరతులు అంగీకరించని షేక్ హసీనా…
షేక్ హసీనా జులై 10 న చైనా పర్యటనకు వెళ్ళింది! ఆ పర్యటన మూడు రోజులుగా ముందే షెడ్యూల్ ప్రకటించారు! చైనా అద్యక్షుడు జీ జింగ్ పింగ్ తో పాటు లీ కీయాంగ్ తో కూడా సమావేశం అయ్యారు! రెండు దేశాలు మొత్తం 21 ఒప్పందాల మీద సంతకం చేశాయి! మరో రెండు MoU లని రెన్యువల్ చేసింది! అయితే షేక్ హసీనా 5 బిలియన్ డాలర్ల అప్పు కోసమే చైనా పర్యటనకి వెళ్ళింది! చర్చలలో అప్పు […]
ఒకే ఒక్కడు… సుప్రీం చీఫ్ జస్టిస్… గొడుగుపాలుడు… ఒక్క రోజు కుర్చీ..!!
శ్రీకృష్ణదేవరాయలు ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఛత్రం (గొడుగు) పట్టుకుని ఉండేవాడే గొడుగుపాలుడు (పేరు భూమా నాయుడు). శ్రీకృష్ణదేవరాయలు ప్రతిరోజూ పంపా విరూపాక్షస్వామి వారిని దర్శించుకుని పూజలు చేయడం రివాజు. ఒక రోజు శ్రీకృష్ణదేవరాయలు స్వామి వారి దర్శనానికి తన వేసవి విడిది పెనుగొండ నుండి తన రాజధాని హంపీకి బయలుదేరవలసి వచ్చింది. సమయం తక్కువ ఉండటంతో తన గుర్రమెక్కి అతి వేగంగా హంపీ వైపు బయలుదేరారు. రాజు ఎక్కడికి వెళితే ఛత్రం పట్టేవారు కూడా వెళ్లాలి కాబట్టి గొడుగుపాలుడు […]
వ్యూహం ప్రకారమే… బంగ్లా అల్లర్లకు ఆజ్యం పోసిన ఎఐ, బోట్ డీప్ ఫేక్ న్యూస్…
బంగ్లాదేశ్ ఒక విఫల ప్రయోగం! Part -2…. బంగ్లాదేశ్ విఫల ప్రయోగం ఎలా అవుతుంది అనే సందేహం రావొచ్చు ! అసలు పాకిస్థాన్ అనేదే విఫల ప్రయోగం అని 1971 లోనే నిరూపితం అయినప్పుడు అదే పాకిస్థాన్ నుండి విడిపోయిన బంగ్లాదేశ్ విఫల ప్రయోగం అవకుండా ఎలా ఉంటుంది? ఏ 2 bn డాలర్ల అప్పు కోసం పాకిస్థాన్ దేబిరిస్తున్నదో అంతకంటే చిన్న దేశం అయిన బంగ్లాదేశ్ 5 bn డాలర్ల కోసం చైనా దగ్గరకి వెళ్ళింది! […]
1975 నుండి 2011 వరకూ 19 సార్లు సైనిక కుట్రలు జరిగాయి బంగ్లాదేశ్‌లో…!
1971 లో పాకిస్థాన్ నుండి బంగ్లాదేశ్ విడిపోయి స్వంతంత్ర దేశంగా ఏర్పడినప్పుడు అప్పటి భారత ఆర్మీ అధికారి ఒకరు ఇలా వ్యాఖ్యానించాడు….. ‘బెంగాలీ మాట్లాడే వారు ఉర్దూ మాట్లాడే వారి నుండి వేరుపడ్డారు అనేది తాత్కాలికం ! కానీ మతం ఒకటే అన్నది విస్మరించ కూడదు. ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే ! మహా అయితే ఒక 30 ఏళ్ళపాటు ప్రశాంతంగా ఉంటుంది బంగ్లాదేశ్ ! బంగ్లాదేశ్ మరో పాకిస్థాన్ అవుతుంది త్వరలో! ముక్తి బాహిని (ముక్తి […]
వర్గపోరాటం కథ… జయప్రద తొలి సినిమా… ప్రభాకర్‌రెడ్డిని ‘ముంచేసింది’…
Class war movie . గాంధీ పుట్టిన దేశం , భూమి కోసం సినిమాల్లాగా ఎర్ర సినిమా . ప్రముఖ నటుడు ప్రభాకరరెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి లక్ష్మీ దీపక్ దర్శకుడు . ప్రభాకరరెడ్డి 27 సినిమాలు తీస్తే , కమర్షియల్ గా రెండు సినిమాలు నష్టాలు తెచ్చాయట . ఆ రెండింటిలో ఇది ఒకటి . సుమారు పది లక్షల రూపాయల నష్టం వచ్చిందట . జయప్రద మొదట బుక్ అయిన సినిమా ఇదేనట . […]
ఆహా… ఈ మంచి షోను సైతం సగటు టీవీ షోలాగా మార్చేశారు కదరా బాబూ…
ఆహా ఓటీటీలో ఓ కొత్త ధోరణి… ప్రతి ప్రోగ్రామ్‌కు ఓ కేరక్టర్ ఉంటుంది… ఉండాలి… దానికి ప్రేక్షకులు అలవాటు పడతారు, దాన్ని బ్రేక్ చేయొద్దు, చేస్తే ఓ రకమైన చిరాకు పుడుతుంది ప్రేక్షకుడికి… అప్పట్లో అన్‌స్టాపబుల్ అని బాలయ్యతో ఓ ప్రోగ్రామ్ చేశారు, సూపర్ హిట్… కానీ సీజన్‌కూ సీజన్‌కూ మధ్యలో అనుకుంటా, ఏదో తన సినిమాకు ప్రమోషన్ అవసరపడింది… ఇంకేముంది..? తెర మీదకు వచ్చేసి ఒకటో రెండోె ఎపిసోడ్లు ప్రమోషన్ కోసం లాగించేసి వదిలేశాడు, ఇప్పటికీ […]
వినేశ్ ఫొగట్ విషయంలో ఏం జరిగింది..? ఆమె మోసం చేసిందా..?
ఒలింపిక్స్ ఫైనల్ బౌట్‌కి చేరుకున్న మొదటి భారత మహిళా రెజ్లర్‌గా రికార్డు సృష్టించిన వినేశ్ ఫొగట్ సంతోషం 12 గంటల్లో తల్లక్రిందులు అయ్యింది. నిర్దేశించిన బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉందన్న కారణంతో వినేశ్ ఫొగట్‌ను డిస్క్వాలిఫై చేయడమే కాకుండా.. 50 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో ఐవోసీ ఆమెను ఆఖరు స్థానానికి పరిమితం చేసింది. సెమీస్‌లో వినేశ్ చేతిలో ఓడిపోయిన క్యూబా రెజ్లర్ గుజ్మాన్ ఫైనల్‌కు క్వాలిఫై అయ్యింది. పతకం గెలుస్తుందని భావించిన వినేశ్.. […]
సుమ మరిచిపోయినట్టుంది… ప్రచారకర్తలకూ కొంత జవాబుదారీతనం ఉంది…
ఇది మరొక రకం వివాదం… యాంకర్ సుమ ఇరుక్కుంది ఈ వివాదంలో… తెలిసి గానీ, తెలియక గానీ… విషయం ఏమిటంటే..? ఆమె రాకీ అవెన్యూస్ తరఫున యాడ్స్ చేసింది… అది ఇన్ఫ్రా కంపెనీ.. 26 లక్షలకే ట్రిపుల్ బెడ్రూమ్ అనే ప్రచారాన్ని నమ్మి, సుమ చెబుతుంది కదాని నమ్మి, డబ్బులు పెట్టి ఇరుక్కుపోయాం, మోసపోయాం, సుమ స్పందించాలి, ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి అని బాధితుల పేరిట సోషల్ మీడియా పోస్టులు కనిపిస్తున్నాయి… సరే, ఇలాంటి మోసాల్లో […]
తక్కువ బరువు కేటగిరీలో పోటీపడుతున్నప్పుడు… అప్రమత్తంగా ఉండాలి కదా…
మిత్రుడు జగన్నాథ్ గౌడ్ చెబుతున్నట్టు…. వినేష్ ఫోగాట్ మొదటి అంతర్జాతీయ ప్రపంచ పోటీ న్యూ ఢిల్లీ లో 2020 సంవత్సరంలో ఆసియన్ రెస్లర్ పోటీలో 53 కేజీల విభాగంలో పాల్గొన్నారు. చివరి అంతర్జాతీయ పోటీ 2022 లో ప్రపంచ రెస్లర్ పోటీల్లో కూడా 53 కేజీల విభాగంలో పాల్గొన్నారు. ప్రస్తుతం మాత్రం 53 కాకుండా 50 కేజీల విభాగంలో పాల్గొని చివరికి పోటీ రోజు బుధవారం బరువు చూసినప్పుడు 50 కేజీల కంటే ఎక్కువ ఉండటం వలన […]
బీజేపీలో బీఆర్ఎస్ విలీనమా..? నెవ్వర్, అసలు ప్లాన్ అది కాకపోవచ్చు..!!
ఇటీవలి రాజకీయ పరిణామాలలో BRS (రాజ్యసభ) నుండి పార్లమెంటు సభ్యులు (MPలు) భారతీయ జనతా పార్టీ (BJP)లో విలీనం కాబోతున్నారని ఢిల్లీ రాజకీయ సర్కిల్లోని ఉన్నత స్థాయి వర్గాలు సూచిస్తున్నాయి… రెండు పార్టీల మధ్య కుదిరిన అవగాహనలో భాగమే ఈ చర్య అట… రాజ్యసభలో అవసరమైన సంఖ్యలో సీట్ల కొరతను ఎదుర్కొంటున్న బిజెపి, “ఆపరేషన్ కమలం” అని వ్యవహారికంగా పిలవబడే ఆపరేషన్ మళ్లీ ప్రారంభించింది… ఇతర పార్టీల నుండి ఎన్నికైన సభ్యులను బిజెపిలో చేరేలా ఆకర్షించడం ఈ […]
గీతను కించపరిచిన బిత్తిరి సత్తి… సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు… పెడసరం పోకడ…
బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్ ముదిరాజ్ నిజంగానే భగవద్గీతను కించపరిచిండా..? ఏమని కించపరిచిండు..? ఎందుకు చేస్తున్నాడిలా..? ఈ ప్రశ్నల వివరాల్లోకి వెళ్లడం లేదిక్కడ… ఒక వివాదం ఇది… తనేదో గీతను కించపరిచే వీడియో చేశాడని, హిందువుల మనోభావాలు కించపరిచాడని రాష్ట్రీయ వానరసేన అనే హిందూ సంస్థ హైదరాబాద్ సైబర్ క్రైమ్ నమోదు చేసింది… ఐతే ఒక వీడియోలో బిత్తిరి సత్తి తన మీద వచ్చిన విమర్శలకు సమాధానాలిచ్చిన తీరు అస్సలు బాగాలేదు… తన యాటిట్యూడ్ బయటపెడుతోంది… రాష్ట్రీయ […]
మూకస్వామ్యం… ప్రేతగణం ఉన్మాదపు హోరు… బంగ్లాదేశ్‌లో అరాచకం…
షేక్ హసీనా ప్రభుత్వం కూల్చడానికి విద్యార్థులను సంఘ విద్రోహ శక్తులను ప్రోత్సహించారు. పోనీ ఆమెను దింపేస్తే తరువాత ఎవరు పరిపాలిస్తారు, రెచ్చిపోయి ఉన్న మూకలను ఎవరు అదుపు చేస్తారు అనే ముందస్తు ప్రణాళికలు ఏవీ లేకుండా హాసీనాకు 45 ని.లు సమయం ఇచ్చి రాజీనామా చేసి దేశం వదలి పొమ్మంది ఆ దేశ ఆర్మీ. దాని వల్ల బంగ్లాదేశ్ లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. లా అండ్ ఆర్డర్ పూర్తిగా నాశనం అయి, సామాన్య ప్రజలు భయంతో […]
ఒలింపిక్ అథ్లెట్ల విజయాల వెనుక నిలిచిందెవరు..? సానపట్టిందెవరు..?
గగన్ నారంగ్, మేరీ కోమ్, సైనా నెహ్వాల్, పీవీ సింధు, మీరాబాయ్ చాను, లవ్లీనా బోర్గెయిన్.. వీళ్లంతా ఒలింపిక్స్‌లో మెడల్స్ సాధించిన వాళ్లే. ఒకప్పుడు ఇండియన్ అథ్లెట్లు ఒలింపిక్స్‌కు వెళ్లామా.. వచ్చామా అన్నట్లు ఉండేది. 1952 హెల్సింకీ ఒలింపిక్స్‌లో కేడీ జాదవ్ రెజ్లింగ్‌లో బ్రాంజ్ మెడల్ గెలిచాడు. ఆ తర్వాత 1996లో లియాండర్ పేస్ టెన్నిస్‌లో, 2000లో కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్‌లో బ్రాంజ్ గెలిచే వరకు మనకు వ్యక్తిగత పతకాలే రాలేదు. 2008లో అభినవ్ బింద్రా […]
- « Previous Page
- 1
- …
- 116
- 117
- 118
- 119
- 120
- …
- 452
- Next Page »