Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అదీ ఇజ్రాయిల్ ప్లానింగ్, ఆపరేషన్ అంటే… అణు మొక్కను పీకేసింది…

June 13, 2025 by M S R

.

ఇజ్రాయిల్ ఇరాన్ మీద దాడులు చేసింది… ఎంత ఖచ్చితంగా అంటే… సరిగ్గా ఇరాన్ అణుకార్యక్రమానికి గుండెకాయ వంటి కేంద్రం మీద… పర్‌ఫెక్ట్ టార్గెట్…

కొన్నాళ్లుగా ఇరాన్ బెదిరిస్తూనే ఉంది ఇజ్రాయిల్‌ను, మిమ్మల్ని నాశనం చేస్తామంటూ… యురేనియం శుద్ది చేస్తోంది… ఆల్రెడీ 8, 9 అణుబాంబులకు సరిపడా ఇంధనం కూడా రెడీ అయిపోయింది… మోసుకుపోయే క్షిపణులూ రెడీ…

Ads

అసలే అది ఇజ్రాయిల్… తన దేశరక్షణ కోసం ఎంతకైనా తెగించి, ఎంతమందితోనైనా పోరాడుతుంది… అలా పోరాడుతున్నది కాబట్టే ఇంకా ఆ దేశం నిలబడి ఉంది… ఇరాన్ అణు కార్యక్రమం మీద కాన్సంట్రేట్ చేసింది… అది ఇంకా పెరగకముందే తమకు పెను ప్రమాదకరం కాబోతున్న ఇరాన్ మీద ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరిట భారీ దాడులకు సాహసించింది…

ఏది జరిగితే అది జరగనీ, శత్రువు మూలాల్ని, మొక్క దశలోనే దెబ్బతీయాలి అనేదే ఇజ్రాయిల్ పద్ధతి… ఈసారి దాడుల్లో ఇరాన్ మిలిటరీ చీఫ్‌ సహా సీనియర్ ఎయిర్‌ఫోర్స్ అధికారులు కూడా హతమారిపోయాడు… అంతేకాదు, సీనియర్ న్యూక్లియర్ సైంటిస్టులు కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారు… ఇది సాక్షాత్తూ ఇజ్రాయిల్ చీఫ్ నెతన్యాహూ చెప్పిందే… పెద్ద దెబ్బేనని ఇరాన్ కూడా చెబుతోంది…

ఎస్, గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకునే యుద్ధం సాగుతూనే ఉంది… పాలస్తీనాకు సపోర్టుగా నిలిచే ప్రతి దేశంతోనూ తలపడుతోంది… ఎన్ని నష్టాలకైనా సిద్ధపడుతోంది… ఇప్పుడు ఇరాన్ ప్రతీకార చర్యలు తప్పక ఉంటాయి… పగతో రగిలిపోతోంది అది… సో, మరో యుద్ధం అనివార్యం… అది మరెన్ని దేశాలకు విస్తరిస్తుందో ఇప్పుడే చెప్పలేం…

ఐతే ఇక్కడే ఇండియాతో పోలిక వస్తోంది… పాకిస్థాన్ అణుకార్యక్రమం ఆరంభదశలో ఉన్నప్పుడు ఇదే ఇజ్రాయిల్ ఆ అణుకేంద్రాల్ని ధ్వంసం చేద్దాం, మా దగ్గర పర్‌ఫెక్ట్ సమాచారం ఉంది, జస్ట్, ఇండియాలో మాకు ఫ్యుయల్ నింపండి చాలు అనడిగితే… మన మాజీ మూర్ఖ ప్రధాని మొరార్జీ పడనివ్వలేదు… లేకపోతే పాకిస్థాన్ మరీ అంత ప్రమాదకారి కాకపోయేది…

ఈరోజుకూ మనం ఆపరేషన్ సిందూర్‌ను మరో నాలుగురోజులు కొనసాగించి ఉంటే బాగుండేదనీ, ట్రంపు బెదిరించగానే వెనక్కి తగ్గామనే అసంతృప్తి దేశవాసుల్లో ఉంది… వాడి అణుగోదాము దెబ్బతిన్నదనే వార్తలు తప్ప ధ్రువీకరణ లేదు…

ఇక్కడే ఇజ్రాయిల్‌కూ మనకూ తేడా కనిపిస్తోంది… ఉక్రెయిన్- రష్యా యుద్దంలో అమెరికా, నాటో రష్యాకు వ్యతిరేకంగా అన్నిరకాలుగా ఉక్రెయిన్‌కు సపోర్ట్ చేస్తాయి, ఇజ్రాయిల్‌కు సపోర్ట్ చేస్తాయి… తీరా ఇండియా విషయానికొచ్చేసరికి అమెరికా పాకిస్థాన్‌కే మద్దతుదారు… మళ్లీ చైనాపై పోరాటానికి క్వాడ్ కావాలి, ఇండియా కావాలి, ఇండియా అతిపెద్ద వినిమయ మార్కెట్ కావాలి… వత్తాసు మాత్రం పాకిస్థాన్‌కు.,.

మొన్న ఆ కొట్టిన దెబ్బలేవో ఇంకాస్త గట్టిగా కొట్టి ఉంటే దాని వెన్ను విరిగి ఉండేది… ఏమో, ఆస్ట్రో శర్మిష్ట చెబుతోంది కదా… మొదట పీవోకేలో కొంత భాగాన్ని స్వాధీనం చేసుకుంటాం, ఓ యుద్ధం తప్పదు, తరువాత పీవోకేకు విముక్తీ తప్పదు అని… ఏమో…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ అక్రమ భవనాలకూ – జన్వాడ ఫామ్‌హౌజుకూ ఏమిటి లింకులు?!
  • మోదీకి ఇండొనేషియా అపూర్వ స్వాగతం – ఎందుకీ ప్రాధాన్యం అంటే?
  • మనకు తెలిస్తేనే నిజం- తెలియకపోతే అబద్ధం అయిపోదు… పునర్జన్మ!!
  • ఒక దశలో ఒకేచోట 50 వేల మంది లైంగిక కార్మికులు!!
  • Nabha Natesh – విరిగిపడి, తేరుకుని, తిరిగి తెరపై ‘మెరుపు కలల’ వైపు!!
  • BRS దాచిపెట్టే వైఫల్యాల్లో మరొకటి – మేడిగడ్డలాగే ‘కన్నెపల్లి’ కూడా!!
  • STOCK MARKET HUMOUR – Sorry, I haven’t verified the Data
  • ట్రంప్ – రెడ్ కార్డ్..! ఫిఫా పోటీల్లోనూ తనే ‘సుప్రీం రెఫరీ!!
  • TGRPDCL @ రైతు డిస్కమ్ – రేవంత్ రెడ్డి సర్కారు భలే ప్లాన్ !!
  • రొనాల్డో శకం ముగిసింది – ఫుట్‌బాల్ సామ్రాట్ కన్నీటి వీడ్కోలు!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions