Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎంతకు తెగించార్రా… చివరకు నైవేద్యపు బెల్లం కూడా కల్తీయేనా..?!

October 19, 2024 by M S R

adulterated jaggery

తిరుమల లడ్డూలో జంతుకొవ్వు నూనెల కల్తీ నెయ్యి ఆనవాళ్లు బయటపడటంతో దేశవ్యాప్తంగా గుళ్లల్లో ప్రసాదాలపై భక్తుల్లో సందేహాలు మొదలయ్యాయి… భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆయా రాష్ట్రాలు వెంటనే చర్యలు ప్రారంభించాయి కూడా… పలు రాష్ట్రాలు తమ గుళ్లలో ప్రసాదం తయారీకి రాష్ట్ర సహకార సంస్థల బ్రాండ్లనే వాడాలని ఆదేశించాయి… తెలంగాణలో కూడా విజయ డెయిరీ నెయ్యినే వాడాలని ఆదేశించారు… ఎందుకైనా మంచిదని కల్తీ పరీక్షలు కూడా చేయించారు… ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరయ్యే  యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం […]

పేరున్న మొహాల కోసం బలగం వేణు తన్లాట… అక్కడే అసలు తప్పు…

October 19, 2024 by M S R

venu

ఎమోషన్స్‌ను తెరపై బలంగా ప్రజెంట్ చేయగల ఓ దర్శకుడు వేణులో ఉన్నాడని చాలామందికి బలగం సినిమా వచ్చేవరకూ తెలియదు… అప్పటిదాకా తను జస్ట్, ఓ జబర్దస్త్ బాపతు కమెడియన్ మాత్రమే… కానీ బలగం వచ్చాక తనలో రియల్ టాలెంట్ లోకానికి అర్థమైంది… తనను ఐదారు మెట్లు ఎక్కించింది ఆ సినిమా ఒకేసారిగా… వోకే, గుడ్, ట్రెమండస్… ఫస్ట్ సినిమా తనను ఇండస్ట్రీలో నిలబెట్టింది… కానీ వాట్ నెక్స్‌ట్..? అసలు పెద్ద పెద్ద దర్శకులకు ద్వితీయ గండం ఉంటుంది… […]

పురాణాల్ని సోషలైజ్ చేయడం బాపుకు అలవాటే… ఈ కథ కూడా అంతే…

October 19, 2024 by M S R

shobha

బాపు సృష్టించిన మరో గొప్ప మాస్ & క్లాసిక్ సినిమా మన వూరి పాండవులు… . పాండవులు అనో , లవకుశులు అనో టైటిల్ పెట్టకపోయినా పురాణాలను సోషలైజ్ చేయకుండా ఉండలేరు బాపు . అది ముత్యాలముగ్గు కావచ్చు , బుధ్ధిమంతుడు కావచ్చు . టైటిల్లోనే పాండవులు అన్నాక ఇంక చెప్పేదేముంది . భారతంలో పంచ పాండవుల్లాగా ఈ సినిమాలో కూడా అయిదుగురు పాండవులు , ఓ దుర్యోధన+ దుశ్శాసనుడు ఉంటాడు , ఓ శకుని ఉంటాడు […]

అక్షరాలా ఆమె మహాతల్లి..! ప్రపంచ మానవ చరిత్రలో ఇదే తొలిసారి…

October 19, 2024 by M S R

nonuplets

. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ పోస్టు ఒకటి కనిపించింది… 16 సంవత్సరాల క్రితం సెన్సేషన్ జననం అని… ఏమిటీ అంటే… ఏడుగురు ఒకేసారి పుట్టారు… వాళ్లంతా బతికే ఉన్నారు… ఇదుగో తల్లిదండ్రులతో వాళ్లందరూ ఒకే ఫోటోలో… ఇదీ ఆ పోస్టు సారాంశం… కానీ, నాకు తెలిసి… వాళ్లు పుట్టింది 16 ఏళ్ల క్రితం కాదు… McCaughey septuples గా ఈ ప్రసిద్ధులు పుట్టింది 1997లో… అంటే దాదాపు 27 ఏళ్ల క్రితం… ప్రపంచంలో పుట్టిన ఏడుగురు […]

ఓ చిన్న తప్పు ఆటనే మార్చేస్తుంది… జీవితమైనా… బిగ్‌బాస్ ఆటయినా…

October 18, 2024 by M S R

bb8

ఒక తప్పుటడుగు… ఒక తప్పుడు అంచనా… మొత్తం గేమ్‌ను మార్చేస్తుంది… నిజ జీవితంలోనైనా అంతే, బిగ్‌బాస్ ఆటలోనైనా అంతే… అదే జరిగింది… నిజానికి మణికంఠ ఓ మెంటల్ కేసు… కానీ రోజులు గడిచేకొద్దీ మారాడు, మెచ్యూరిటీ కనిపిస్తోంది… అంటే, మొదట్లో ఫ్యామిలీ ఇష్యూస్ చెప్పి, సింపతీ గేమ్ ఆడాడని లెక్క… మొన్న అవినాష్ అండ్ కో తనను కరప్ట్ చేయాలని చూశారు, కానీ మణికంఠ నిజాయితీగా తను కోవర్టుగా మారలేనని తిరస్కరించాడు… ఈరోజు గేమ్‌లో కూడా అంతే… […]

ఆమే… అవును, ఆమే… ఇండియన్ సినిమా తెరపై ఓ ప్రజ్వలిత వెలుతురు…

October 18, 2024 by M S R

smitha

. , ‘భూమిక’ The Role ఎ ఫిల్మ్‌ బై శ్యాం బెనెగల్‌ …………………………………………………….. S M I T A P A T I L A Barometer for Accomplishment 1955 అక్టోబర్ 17 మహానటి స్మితాపాటిల్ పుట్టిన రోజు ……………………………………… మహారాష్ట్రలో ఓ మారుమూల కుగ్రామం. ఒక అందమైన దేవదాసీ, వయసులో పెద్దవాడైన ఓ బ్రాహ్మడు (బి.వి.కారంత్‌) భార్యాభర్తలు . వాళ్ళకో పదేళ్ళ కూతురు ఉష. శాస్త్రీయ సంగీతంలో ఆరితేరిన ఉష […]

కులమే తెలుగు మీడియాకు ఇంధనం… కాదని ఖండిస్తే పెద్ద అజ్ఞానం…

October 18, 2024 by M S R

dailies

. విన్నావా గురూ… ఆంధ్రజ్యోతిలో మార్పులట…? గాసిప్స్ అంటావా..? లేదే… హేమిటట…? ఇంకా తెలియదా..? ఎడిటర్ నల్గొండ బ్రాహ్మణ శ్రీనివాస్‌ను తరిమేస్తున్నారట…! మొన్నీమధ్యే రాజీనామా ఇచ్చాడట… కాదు, అడిగారట… ఫస్ట్ నుంచి తను ఎడిటర్ కాదట… పోనీలే ఫాఫం… ఏదో నామ్‌కేవాస్తే ఎడిటర్… వారానికో వ్యాసం తప్ప, ఆయనకూ పెద్ద పనేం ఉంది గనుక… ఆయన చెబితే ఎవరు విన్నారు గనుక… ఐనా ఆయన తెలుగు స్టార్ హీరో కమర్షియల్ మాస్ మసాలా సినిమాకు దర్శకుడు కాలేదు […]

మళ్లీ ఫ్లాప్ దిశగా బిగ్‌బాస్… అట్టహాసాలు ఫలించక మళ్లీ పూర్ రేటింగ్స్…

October 18, 2024 by M S R

hariteja

8 మంది పాతవాళ్లు హౌజులో ఉంటే మరో 8 మందిని వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా హౌజులోకి జొప్పించారు కదా… వాళ్లూ పాత కాపులే… ఈ ఎంట్రీలను రీలోడ్ పేరిట ఆరో తేదీన స్పెషల్ ఈవెంట్ అట్టహాసంగా నిర్వహించారు… మూడూమూడున్నర గంటల ఎపిసోడ్.,. ఐతేనేం..? రేటింగుల్లో తుస్సు… హైదరాబాద్ బార్క్ కేటగిరీలో ఆరు రేటింగులలోపే… శనివారం వీకెండ్ షో రేటింగ్స్ ఐదులోపు… మిగతా రోజుల్లో 3.5 నుంచి 4 వరకు… దసరా స్పెషల్ కూడా హంగామా చేశారు మొన్న… […]

చేతక్..! చరిత్ర మెచ్చిన అశ్వం… అందుకే ఆ నగర కూడలిలో ఓ విగ్రహం…

October 18, 2024 by M S R

chetak

. ఒక మహారాణా ప్రతాప్- ఒక చేతక్ గుర్రం ఇప్పుడంటే ప్రత్యర్థిమీద గెలవడానికి చాలా సులభమైన మార్గాలున్నాయి. బోడి పెంపుడు వేటకుక్కలను ఉసిగొలిపి…వదిలినా చాలు. చచ్చినట్లు శరణాగతి చొచ్చి యుద్ధసీమలో శంఖారావం పూరించడానికి ముందే కాళ్లమీద పడి…కనికరించమని శత్రువే వేడుకుంటాడు. సభా మర్యాద దృష్ట్యా చెప్పడానికి వీలుకాని ఇంకా ఎన్నెన్నో క్షుద్రవిద్యల ద్వారా ఇప్పుడు గెలుపు చిటికెలో పని. వెన్నుపోట్లు కూడా పొడవకుండానే కూర్చున్న చోట కూర్చున్నట్లుగానే ఉండి శత్రువు అంతు చూడవచ్చు. యుద్ధం చేయకుండానే విజయాన్ని […]

ఒళ్లమ్ముకుంటేనేం..? గుండెలో తడి ఉండదా..? దానికీ భావోద్వేగాలుండవా..?

October 18, 2024 by M S R

lakshmi

. మనం ఎన్నో సినిమాలు చూస్తుంటాం . కానీ కొన్ని సినిమాలు , ఆ సినిమాల కధాంశాలు , పాత్రలు , ఆ పాత్రల్లోని నటులు , సంగీతసాహిత్యాలు , దర్శకత్వ ప్రతిభ మన మనసుల్లో అలా శాశ్వతంగా నిలిచిపోతాయి . మధురానుభూతిని కలిగిస్తాయి . నాకు అలా మిగిలిపోయిన సినిమాలలో ఒకటి 1978 లో వచ్చిన ఈ మల్లెపూవు సినిమా . It’s a musical , literary , emotional classic . ముఖ్యంగా […]

లారెన్స్ బిష్ణోయ్..! ఓహ్… లా చదివిన గ్యాంగ్‌స్టర్ వెనుక ఇంత కథ ఉందా..?

October 18, 2024 by M S R

bishnoy

. బాగా తెల్లగా, ఎర్రగా బుర్రగా ఉన్నాడని బిష్ణోయీ కుర్రాడికి బ్రిటిష్‌ ఉన్నతాధికారి హెన్రీ లారెన్స్‌ పేరు! ……………………………………………………………………… బాలీవుడ్‌ ‘కండలవీరుడు’, ముస్లిం తండ్రికి, హిందూ తల్లికి పుట్టిన అత్యంత లౌకిక పౌరుడు సల్మాన్‌ ఖాన్‌ ఇప్పుడు ముంబై నగరం బాంద్రాలో నివసించే డీలక్స్‌ అపార్ట్‌మెంట్‌ వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. విజిటర్లు ఎవరినీ ‘టైగర్‌ జిందా హై’ హీరో తన నివాసంలోకి అనుమతించడం లేదు. ఇవి ఇప్పుడు ఇంగ్లిష్‌ న్యూజ్‌ చానల్స్‌లో పదే పదే […]

సార్… పేపర్ వేయించుకొండి… చౌకగా ఏడాది ప్యాకేజీ, పైగా ఈ ప్రెషర్ కుక్కర్ ఫ్రీ…

October 18, 2024 by M S R

sakshi

సేటూ… కొన్ని కిరాణా ఐటమ్స్ చెప్పుతా, జెర జల్దీ ఇచ్చెయ్ అని పురమాయించి, అక్కడే నిలబడ్డాను… మధ్యాహ్నం, చిన్న షాపు… వేరే ఎవరూ గిరాకీ లేరు… షాపు గుమస్తా సరుకులు ఒక్కొక్కటీ ప్యాక్ చేస్తున్నాడు… ఒకాయన వచ్చాడు… మెడలో సాక్షి ఐడీ కార్డు వేలాడుతోంది… డిజిగ్నేషన్ అని ఏదో కనిపిస్తోంది, కానీ అర్థం కాలేదు… సేటూ… మళ్లీ ఇటువంటి ఆఫర్ రాదు, పేపర్ వేయించుకో… ఇవిగో ఈ కుక్కర్లు ఫ్రీ ఇస్తున్నాం… రెండు కుక్కర్లు వెంట తెచ్చాడు… […]

బిష్ణోయ్ గ్యాంగ్..! సల్మాన్‌ ఖాన్‌కే కాదు, ఏకంగా కెనడా ప్రధానికీ పూర్తిగా సమజైంది…

October 17, 2024 by M S R

bishnoy

. లారెన్స్ బిష్నోయి Vs సల్మాన్ ఖాన్! గత శనివారం అక్టోబర్ 12 న NCP నాయకుడు బాబా సిద్ధికి (Baba Siddiqui ) ముంబైలోని బాంద్రాలో తన కొడుకు కాంగ్రెస్ mla అయిన జీషన్ ఇంటి నుండి బయటికి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో చనిపోయాడు! బాబా సిద్ధికి మొదటిన్నుండి కాంగ్రెస్ లో ఉన్నాడు. ఇటీవలే కాంగ్రెస్ కి రాజీనామా చేసి NCP లో (అజిత్ పవార్ ) చేరాడు. సిద్ధికి కొడుకు […]

ప్చ్… గంతులు వేసే డ్యూయెట్లు లేని సీరియస్ లాయర్ విశ్వనాథుడు…

October 17, 2024 by M S R

jayasudha

S D లాల్- NTR కాంబినేషన్లో వచ్చిన విజయవంతమైన రీమేక్సులో ఒకటి 1978 లో వచ్చిన ఈ లాయర్ విశ్వనాథ్ . నిజాయితీకి మారుపేరుగా న్యాయసేవ చేస్తున్న లాయర్ gangster గా మారి , దోషుల్ని పోలీసులకు పట్టించే కధానాయకుడి పాత్ర లాయర్ విశ్వనాథ్ . లాయరుగా NTR చాలా హుందాగా , బేలన్సుడిగా నటించారు . నాకు బాగా నచ్చిన పాత్ర , నటన . Gangster అయిన తర్వాత కూడా ఆయనకు గంతులు వేసే […]

నిజమే… రాజులే పోయారు… రాజరికం మీద మన మోజు పోలేదు..!

October 17, 2024 by M S R

kumbhalgarh

. డెస్టినేషన్ వెడ్డింగులకు పెట్టిన కోట కుంభల్ గఢ్ ఏ కోట చూసినా ఏమున్నది గర్వకారణం? అని ప్రశ్నించుకుని కోటగోడ లోతుల్లోకి వెళితే సమాధానంగా ఎన్నెన్నో గర్వకారణాలు దొరుకుతాయి. ప్రపంచంలో చైనా కోట గోడ తరువాత రెండో అతిపెద్ద కోటగోడ రాజస్థాన్ లో కుంభల్ గఢ్ లో ఉంది. ఉదయ్ పూర్ కు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న కుంభల్ గఢ్ చూసి తీరాల్సిన ప్రదేశం. శత్రుదుర్భేద్యమైన ఈ కోట గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియాగా పేరు […]

నాగార్జున కళ్లల్లో నీళ్లు… ఎన్ని ఎమోషన్స్ సుడితిరిగి తన్నుకొచ్చాయో…

October 17, 2024 by M S R

nagarjuna

నాగార్జున కన్నీళ్లు పెట్టుకున్నాడు… ఎంత ప్రాక్టికల్ మనిషికైనా సరే కొన్నిసార్లు ఎమోషన్స్ తన్నుకొస్తాయి… కన్నీళ్లు బయటికొస్తాయి… సహజం… ఐతే తను కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం వేరు… అది స్టార్ మా పరివార్ అవార్డుల వేదిక… అంటే ఏమీలేదు… వివిధ మాటీవీ సీరియళ్లలో నటించిన నటీనటులకు అవార్డులు… దాన్ని గ్రాండ్‌గా నిర్వహించారు… ముఖ్య అతిథుల్లో ఒకడిగా నాగార్జున వచ్చాడు… అదే వేదికగా అక్కినేని వందేళ్ల వేడుక (సెంటినరీ)ను కూడా ప్రదర్శించారు… అక్కినేని పాత పాటల్ని నెమరేసుకోవడం… అమల, సుశీల […]

న్యాయదేవత కళ్లకు గంతలు విప్పేశారు… ఆ ఖడ్గాన్ని తీసేశారు… కానీ..?!

October 17, 2024 by M S R

goddess of justice

. ఒక వాట్సప్ న్యూస్ గ్రూపులో కనిపించిన వార్త ఇది… ఓసారి చదవండి… . న్యాయదేవత కళ్లకు గంతలు తొలిగాయి. అవును, మీరు చదువుతుంది నిజమే. ఇన్నాళ్లూ భారతదేశంలో న్యాయ దేవత విగ్రహం కళ్లకు గంతలు ఉండేవి. ఇకపై న్యాయదేవత కళ్లకు గంతలు ఉండకూడదని దేశ అత్యున్నత ధర్మాసనమైన సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఆ నిర్ణయానికి అనుగుణంగా… సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఆదేశాలతో సుప్రీం కోర్టులో కొత్తగా న్యాయదేవత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. […]

మోడీ వాషింగ్ పౌడర్… మురికినీ బురదనూ ఇట్టే కడిగేస్తుంది…

October 16, 2024 by M S R

cbn

పార్టీలకు అనుబంధంగా పనిచేసే సోషల్ మీడియా, మీడియా గ్రూపులు ఇప్పుడు ఓ పెద్ద దందా… వందలు… కాదు, వేల కోట్ల  టర్నోవర్… బాగా జీతాలు లభిస్తుండటంతో చాలామంది డిజిటల్, క్రియేటివ్ పర్సన్స్ ఎంటరవుతున్నారు… సెటైర్లు, మీమ్స్, పోస్టులు, రీల్స్, షార్ట్స్, వీడియోలు, వార్తలు… వాట్ నాట్..? ఇదొక పెద్ద ఉపాధి రంగం అయిపోయింది… అఫ్‌కోర్స్, దూషణలు, వెక్కిరింతలు, బూతులు, మార్ఫింగులు, ఫేక్ వార్తలు సరేసరి… నాణేనికి రెండు మొహాలు కదా… తాజాగా కేరళ కాంగ్రెస్ విభాగం పోస్ట్ […]

ఆ కృష్ణ జింక ఆ ధూర్త సల్మాన్‌ను వేటాడుతూనే ఉంది… మద్దతుదార్లనూ…!!

October 16, 2024 by M S R

salman

తల్లిలేని జింక పిల్లలకు చనుబాలిచ్చే స్త్రీలున్న బిష్ణోయీ సమాజంలో పుట్టిన లారెన్స్‌ బిష్ణోయీ! రాంగోపాల్ వర్మ సిన్మా తీస్తాడట! ………………………………………………………………………… జింక పిల్ల తల్లి మరణిస్తే.. ఆ పిల్లను బిష్ణోయీ మహిళ తన చాతి దగ్గరకు తీసుకుని పాలు ఇస్తుంది. పిల్లలకు ఆవుపాలు తాగించి పెంచే మన సమాజంలో ఇది వింత. ఇలాంటి దృశ్యం మనకు ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. ––కిందటేడాది భారత నటుడు వివేక్‌ ఓబెరాయ్‌ దుబాయిలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ బిష్ణోయీ సమాజం గురించి […]

ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్‌కూ ఓ చరిత్ర… ఓ విశిష్టత… ఏమిటో తెలుసా..?

October 16, 2024 by M S R

air

. ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్ – భండారు శ్రీనివాసరావు . కొన్ని శబ్దాలు చెవుల్లో ఎప్పుడూ మార్మోగుతూనే ఉంటాయి. కొన్ని స్వరాలు నాలుకపై నిరంతరం నాట్యం చేస్తూనే ఉంటాయి. కాలచక్రం గిర్రున తిరిగినా, కాలదోషం పట్టని కొన్ని అద్భుతాలు ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి ఆకాశవాణి సిగ్నేచర్‌ ట్యూన్‌. ప్రతి రోజూ ఉదయం రేడియోలో వినిపించే ఆ సుస్వరం వినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మాండలీన్‌, వయోలిన్‌, పియానో, కలగలసిన అద్భుతమైన ఆ రాగం పురుడు […]

  • « Previous Page
  • 1
  • …
  • 125
  • 126
  • 127
  • 128
  • 129
  • …
  • 391
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • కిస్ కామ్..! ఈ వైరల్ కంట్రవర్సీ అసలు కథేమిటో తెలుసా..?!
  • రిస్కీ ప్రాజెక్టు… రణబీర్ రాజ్యం ఎదుట ‘మంచు రామాయణం’ కష్టమే…
  • ప్లేయర్లు వస్తుంటారు, పోతుంటారు… కానీ చంటిగాడు పర్మనెంట్…
  • నిజంగా రాజీవ్ గాంధీ, ఎల్‌కే అడ్వాణీ భారతరత్నాలు కాదా..?!
  • చదువుతుంటేనే కడుపులో దేవుతున్నట్టుగా… ఈ నేర తీవ్రత…
  • ఆమె నిదుర పట్టనివ్వని ఓ నిశాచరి- సౌందర్య పిశాచరి… కానీ..?
  • రాజాసింగ్ ఎటూ వెళ్లడు… తన తాజా వ్యాఖ్యల్లోనూ అర్థమయ్యేది ఇదే…
  • నాడు ఆస్కార్ మిస్… సింగర్ సిప్లిగంజ్‌కు రూ. కోటి తెలంగాణ ఆస్కార్…
  • రక్తపిశాచికి నో బెయిల్… సరైన తీర్పు… కుదిపేసే నేరతీవ్రత…
  • ఈటల సొంత పార్టీ..?! అప్పుడే నామకరణాలు కూడా అయిపోయాయి..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions