Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కేసీయార్‌ను కించపరచడమే… ఆయన పత్రికొక్కటే స్పందించింది…

July 17, 2024 by M S R

ismart

సినిమా బలమైన దృశ్యమాధ్యమం… దాని ప్రభావం సమాజంపై బాగా ఉంటుంది… నెగెటివ్‌గా, పాజిటివ్‌గా… కాకపోతే ప్రజెంట్ సినిమాలన్నీ సొసైటీపై నెగెటివ్ ప్రభావాన్ని చూపించేవే… మెజారిటీ సినిమాలు… మరి సినిమా వార్తలపై మీడియా ధోరణి ఏమిటి..? ఏమీ లేదు… ఆహాకారాలు, ఓహోరావాలు… అంతే, భజన… సినిమావాళ్లు ఇచ్చే ఫోటోలు, వివరాలను, ప్రెస్‌మీట్లు, వంద శాతం హిపోక్రటిక్ ఇంటర్వూలనే అచ్చేసి, ప్రసారం చేసి పరవశింస్తుంది మీడియా… మీరు ఏ పేపరైనా తిరగేయండి, అన్ని వార్తలూ ఒకే తీరు… మళ్లీ ఇందులో […]

మనోరథంగళ్… అలాంటి తొమ్మిది మనకు నూటా తొమ్మిది…

July 17, 2024 by M S R

khadeer

  లా చదివి సినిమాల్లో ప్రయత్నిస్తున్న మమ్ముట్టిని మొదట గమనించి ప్రోత్సహించింది ఎం.టి.వాసుదేవ నాయర్‌. ‘నేను ఆయన వల్లే హీరోనయ్యాను’ అని కృతజ్ఞత ప్రకటిస్తాడు మమ్ముట్టి. సాహిత్యం పట్ల కృతజ్ఞత ప్రకటించడం సంస్కారం అని చాలామంది స్టార్లు అనుకోకపోవచ్చు. అనుకునే స్టార్లు కొందరు ఉంటారు. కేరళలో ఎక్కువమంది ఉన్నారు. మమ్ముట్టి గతంలో వైకం ముహమ్మద్‌ బషీర్‌ ‘గోడలు’ (కాత్యాయని గారి అనువాదం ఉంది) కథలో నటించి జాతీయ అవార్డు పొందాడు. ఇప్పుడు విశేషం ఎం.టి.వాసుదేవ నాయర్‌ 9 […]

ముచ్చట ముందే చెప్పినట్టు… కేసీయార్ మరింత ఫిక్స్ అయిపోయాడు…

July 16, 2024 by M S R

kcr

విచారణ జరుగుతూ ఉండగానే జస్టిస్ నర్సింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టడాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించింది… వెంటనే ఆయన విద్యుత్తు విచారణ కమిషన్ నుంచి వైదొలిగారు… కానీ ఇది బీఆర్ఎస్‌కు, కేసీయార్‌కు రిలీఫ్ ఏమీ కాదు… ఒకరకంగా సుప్రీంకోర్టు మరింత ఫిక్స్ చేసినట్టే తనను..! కాకపోతే మరో జడ్జిని నియమించండి, జుడిషియల్ కమిషన్ అనకుండా ఎంక్వయిరీ కమిషన్ అనాలని సుప్రీం కోర్టు సూచించింది… వాటికి రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించింది… కాస్త టైమ్ తీసుకుని కొత్త జడ్జి పేరు చెబుతామని పేర్కొంది… […]

ఏం జేద్దామంటవ్ మరి..! ఓ తాగుడు పాటలో కేసీయార్ మాటలు..!!

July 16, 2024 by M S R

ismart

డబుల్ ఇస్మార్ట్… పోతినేని రాం (రాపో) హీరోగా చార్మి జగన్నాథ్, సారీ, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన సినిమా…  ఆ సినిమాకు సంబంధించిన మార్ ముంత, చోడ్ చింత అనే ఓ సాంగ్ రిలీజ్ చేశారు… అదేదో ఐటమ్ సాంగ్ కావచ్చు బహుశా… గట్లనే వాసన కొట్టింది చూస్తుంటే… సరే, సదరు రాపో అప్పట్లో ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా చేశాడు కదా ఇదే జగన్నాథుడితో… అది సూపర్ హిట్… కానీ రాం నోటి వెంట తెలంగాణ […]

మోడీ 228 కిలోల బంగారం దోచేశాడట… ఢిల్లీలో గుడి కడతాడట…

July 16, 2024 by M S R

kedarnath

దేశంలో లెక్కకుమిక్కిలి మఠాలు… ఎవరు ఏ సంప్రదాయమో, ఏ పరంపరో ఓ పట్టాన అర్థం కాదు… అసలు ధర్మప్రచారంలో గానీ, ఆధ్యాత్మిక వ్యాప్తిలో గానీ, మతోద్ధరణ కృషిలో గానీ నయాపైసా శ్రమ, ప్రయాస కనిపించవు… పైగా అడ్డమైన రాజకీయాల బురద పూసుకోవడానికి మఠాధిపతులు ఎప్పుడూ రెడీగా ఉంటారు… అప్పట్లో అయోధ్య మీద రాద్ధాంతం చేశారు నలుగురు శంకరాచార్యులు… ఆ పేరు పలకడానికే చాలామంది ఇష్టపడటం లేదు… అయోధ్య పునర్నిర్మాణానికి, ఆ పోరాటానికి నయాపైసా భాగస్వామ్యం లేదు వాళ్లకు… […]

సాయిరెడ్డి భాష బాగాలేదు సరే… నిజమే, మీడియా తక్కువేమీ కాదుగా…

July 16, 2024 by M S R

dirty media

నిజానికి విజయసాయిరెడ్డి ప్రైవేటుగా ఎవరితో ఎలా మాట్లాడతాడో తెలియదు… కానీ నిన్నటి ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడిన విధానం, వాడిన భాష తన స్థాయికి తగినట్టు లేదు… కడుపులో రగిలిపోతున్నట్టుంది, అదుపు తప్పాడు… పదే పదే కమ్మ కులాన్ని ప్రస్తావించడం, మీడియా మొత్తాన్ని తిట్టిపోయడం బాగాలేదు… ఎవరో ఓ ఎండోమెంట్ అధికారిణి… పేరు ఏదైతేనేం, కులం ఏదైతేనేం… ఆమెకూ సాయిరెడ్డికీ రంకు అంటగట్టి ఓ సెక్షన్ మీడియా ఎడాపెడా రాసేస్తోంది, ఏదేదో చెప్పేస్తోంది… ఐతే అవన్నీ మీడియా సొంత […]

బీఆర్ఎస్ ఎంపీలను చేర్చుకోవడం నిజంగా బీజేపీకి అత్యవసరమా..?

July 16, 2024 by M S R

పార్లమెంటు

మొత్తం మీడియాలోనూ వచ్చింది వార్త… ఏమిటంటే..? రాజ్యసభలో బీజేపీ బలం మరీ 86కు పడిపోయింది… ఎన్డీయే బలం లెక్కించినా 101కు పడిపోయింది… ఇదీ వార్త… నలుగురు నామినేట్ సభ్యుల పదవీకాలం పూర్తయినందున ఈ మార్పు తలెత్తింది… ఇక ఎవరికి తోచిన బాష్యాలు వాళ్లు రాసేసుకున్నారు… ఇక రాజ్యసభలో బిల్లులు పాస్ చేయించుకోవడం బీజేపీకి కష్టమే అన్నట్టుగా కొందరు తేల్చేశారు… పిచ్చి లెక్కలు, పిచ్చి విశ్లేషణలు… ఎందుకంటే..? నిజానికి మొత్తం సభ్యుల సంఖ్య 245… 20 ఖాళీలు… అంటే […]

ఎటుచూసినా ఎద్దు కొమ్ములే… ఎటొచ్చీ సొమ్ములే కొరత… ఎమ్మిగనూరు సంత…

July 16, 2024 by M S R

market

ఎమ్మిగనూరు ఎద్దుల మార్కెట్ చూశారా? …………………………………………………. A Typical Indian Agrarian Tragedy …………………………………………………. కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు 14 జూలై 2024 ఆదివారం ఉదయం ఎమ్మే, ఎమ్మోగ అంటే ఎనుము, పశువులు -కన్నడలో. అదే ఎమ్మిగనూరు అయింది. గాంధీనగర్ సెంటర్ నించి కొబ్బరికాయల దుకాణమూ, టీ కొట్లూదాటి, కర్నూలు బైపాస్ రోడ్డు మీద తిన్నగా అయిదారు నిముషాలు నడిస్తే – పచ్చని కూరగాయల సంత, పశువుల్ని తోలుకొచ్చిన వందల మినీ వ్యాన్ ల వరసలు. ఆ […]

ఎన్టీయార్ సినిమా అన్నాక మారువేషాలు ఉండాలి కదా… ఉన్నాయి…

July 16, 2024 by M S R

ntr

నిర్మాత అదృష్టవంతుడు అయితే సినిమా వంద రోజులు ఆడుతుంది . అందులో NTR సినిమా . సాదాసీదా సినిమా అయినా వంద రోజులు ఆడిన సినిమా 1974 లో వచ్చిన ఈ మనుషుల్లో దేవుడు సినిమా . పుండరీకాక్షయ్య నిర్మాత . బి వి ప్రసాద్ దర్శకుడు . వారాలు చేసుకుని శ్రధ్ధగా చదువుకునే ఒక అనాధను ఒక డాక్టర్ చేరదీసి , చదివించి ప్రయోజకుడిని చేస్తాడు . ఈలోపు ఓడలు బండ్లు అయి ఆ డాక్టర్ […]

ఆరేళ్లపాటు ఐసీయూలో మర్రి మహాతల్లి… కోలుకుంది, పిలుస్తోంది…

July 16, 2024 by M S R

marri

“ఈ మఱ్ఱి యా కొకో! యేకార్ణవము నాఁడు శేషాహిశాయికి సెజ్జ యయ్యె నీ మఱ్ఱి మొదలనొకో! మహాదేవుఁ డే కాగ్రచిత్తంబున నతిశయిల్లు నీ మఱ్ఱి భావమొకో! మృగాంకుని మేనఁ బ్రతిబింబరూపమై పాయకుండు నీ మఱ్ఱి మీద నొకో! మున్ను గజకచ్ఛ పములతో లంఘించెఁ బక్షివిభుఁడు నిట్టి మఱ్ఱి యుండు నీ ద్వీపమును వట ద్వీప మనక, యేమి తెలివి యొక్కొ! తొంటి పెద్ద లెల్లఁ దొడఁగి జంబూద్వీప మనిరి నాఁగ నొప్పె న క్కుజంబు” -అనంతామాత్యుడి భోజరాజీయం. […]

15 ఏళ్లుగా కలిసి ఉండటం లేదు.., సో, మీ బంధం ఓ డెడ్ మ్యారేజ్..!

July 16, 2024 by M S R

payal

సినిమా, టీవీ ఇతర సెలబ్రిటీలే కాదు… పొలిటికల్ సెలబ్రిటీల పెళ్లిళ్లు, విడాకుల కథలు కూడా కొన్నిసార్లు ఆసక్తికరంగా, వార్తలుగా మారుతుంటాయి… జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ ముఖ్య నేత ఒమర్ అబ్దుల్లా, ఆయన భార్య పాయల్ విడాకుల కేసు సుప్రీంకోర్టు దాకా వచ్చింది… ఒమర్ అబ్దుల్లాకు పెద్ద పరిచయం అక్కర్లేదు… కానీ ఎవరు ఈమె..? అసలు పేరు పాయల్ నాథ్… తండ్రి రిటైర్డ్ మేజర్ రామనాథ్… ఆమె పుట్టింది ఢిల్లీలో, కానీ వాళ్ల రూట్స్ […]

Indian-2 … వావ్… అమెరికా సెకండ్ లేడీగా మన తెలుగు మహిళ..!?

July 16, 2024 by M S R

Usha-Vance

95 ఏళ్ల వయస్సులోనూ రోజూ 60 కిలోమీటర్లు వెళ్లొస్తూ బోధన వృత్తిలో కొనసాగుతున్న చిలుకూరి శాంతమ్మ స్పూర్తిదాయక కథనం నిన్న చదువుకున్నాం కదా… ఈరోజు మరో చిలుకూరి వారి మహిళ గురించి… డిఫరెంట్ స్టోరీ… నవంబర్‌ 5 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ ట్రంప్‌–వాన్స్‌ జోడీ గెలిస్తే అగ్రరాజ్యం ‘సెకండ్‌ లేడీ’ అయ్యేది మన తెలుగు మహిళ ఉషా చిలుకూరే! …………………………………………………….. ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా దేవి హ్యారిస్‌ సగం భారత సంతతి మహిళ అనే […]

కొడుక్కి ఓ తండ్రి విసిరిన సవాల్… అదే ‘మా తుఝే సలాం’ పుట్టుక…

July 16, 2024 by M S R

rehman

మా తుఝే సలాం… 27 ఏళ్ల క్రితం స్వరబద్ధం చేయబడిన ఈ పాట దాదాపు ఒక జాతీయ గీతంలాగే దేశమంతటా పాడబడుతూనే ఉంది… ఏఆర్‌రెహమాన్ పేరు చిరకాలం ఉండేలా..! మొన్న టీ20 వరల్డ్ కప్ గెలిచాక స్టేడియంలో వేలాది మంది ఎదుట మన క్రికెట్ జట్టు ఈ పాట పాడుతుంటే అక్కడున్నవాళ్లకు, టీవీల్లో చూస్తున్న వాళ్లకు గూస్ బంప్స్… దేశమాతను కీర్తించే ఈ పాట స్థాయిలో మరే దేశభక్తి గీతం కూడా పాపులర్ కాలేదనుకుంటా… అసలు ఆ […]

రెండు సినిమా పాటల మీద కేసు… కాపీ కేసులో బుక్కయిన రక్షిత్ శెట్టి…

July 15, 2024 by M S R

రక్షిత్

కుర్చీలు మడతపెట్టే మన తమన్, మన ఇతర సంగీత దర్శకుల్ని ఎవరూ గట్టిగా తగుల్కోలేదు గానీ… పాటల చౌర్యం, పాటల కాపీరైట్స్ ఇష్యూస్ కన్నడ ఇండస్ట్రీలో సీరియస్ కేసులకే దారితీస్తున్నయ్… అంత తేలికగా ఎవరినీ వదిలిపెట్టడం లేదు ఎవరూ… రక్షిత్ శెట్టి… ఈ హీరో పేరు వినగానే రష్మిక మంథాన గుర్తొచ్చేది… తన మాజీ ప్రేమికుడు, నిశ్చితార్థం దాకా వెళ్లి పెళ్లి కేన్సిలైంది… తరువాత చార్లి 777 అనే సినిమాతో తెలుగువాళ్లకు కూడా బాగానే పరిచయమయ్యాడు తను… […]

అప్పట్లో రేవంత్ తీవ్ర ఆరోపణలు… నిజంగానే రకుల్ బ్రదర్ చిక్కాడు…

July 15, 2024 by M S R

‘‘BRS అధికారం కోల్పోగానే డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిన రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు. రకుల్ ప్రీత్ సింగ్ (Heroine Rakul Preet Singh) సోదరుడు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడటం తీవ్ర కలకలం రేపుతోంది. భాగ్యనగరంలో భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడింది. సైబరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్‌ డివిజన్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఐదుగురు నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న మరో ఐదుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డవారిలో సినీరంగానికి […]

యాంకర్ అనసూయమ్మ గారూ… మొత్తానికి మీరు మారిపోయారు మేడమ్…

July 15, 2024 by M S R

anasuya

యాంకర్ అనసూయ… ఇప్పుడలా అనకూడదేమోనట కదా, సరే, రంగమ్మత్త అనసూయమ్మ గారూ… మీరు మారిపోయారు మేడమ్ అని నెటిజనం హాశ్చర్యపోతున్నారు… నిజం… ఆమె అనసూయేనా అని నాలుగుసార్లు సదరు ట్వీట్ ఖాతాను ఫ్రెష్ కొట్టీ కొట్టీ చెక్ చేస్తున్నారు… విషయం ఏమిటంటే..? అనసూయ అంటేనే ఓ ఫైర్ కదా… అంటే పుష్ప బాపతు ఫైర్ కాదు… సోషల్ మీడియాలో తన మీద చిన్న వాక్యం నెగెటివ్‌గా కనిపించినా, అనిపించినా వెంటనే సదరు ట్రోలర్‌ను తిట్టేస్తుంది… చాకిరేవు పెడుతుంది […]

ఎవరు విలన్లు..? ఎవరు హీరోలు..? కేరళలో కౌరవులందరికీ గుళ్లు..!!

July 15, 2024 by M S R

duryodhana

చిన్న స్పష్టీకరణ…. పురాణాలు, ఇతిహాసాల్లో పాత్రలు ప్రతినాయకులా, నాయకులా అనేది చిన్నప్పటి నుంచీ మన కుటుంబం, మన సమాజం, మన పుస్తకాలు, మన కళాప్రదర్శనలను బట్టి, మనం అర్థం చేసుకునే తీరును బట్టి ఉంటుంది… ఉదాహరణకు రాముడు ఆర్యుడు, ద్రవిడదేశంపై దాడికి వచ్చాడు, రావణుడిని హతమార్చాడు అని కోట్ల మంది నమ్ముతారు దక్షిణ భారతంలో.,. రావణుడిని పూజిస్తారు… ఈరోజుకూ రాముడు, కృష్ణులను ఆర్య రాజులుగానే చూస్తుంది ద్రవిడ సమాజం… ఇప్పుడు కర్ణుడు గొప్పా, అర్జునుడు గొప్పా అనే […]

ఆ పెళ్లి ఖర్చుపై పిచ్చి లెక్కలు… ఫూలిష్ పోస్టులు… నవ్వులాటలు…

July 15, 2024 by M S R

ambani

కొందరుంటారు సోషల్ మీడియాలో… తమకు తామే మేధావులం, మాకన్నీ తెలుసు అనుకుని, జనం నవ్వుతారు అనే సోయి లేకుండా పోస్టులు పెట్టేస్తారు… ఇదీ అలాంటిదే… (అనేక వార్తలు… నగల మీద, ప్రివెడ్డింగ్ ఖర్చుల మీద, పెళ్లి ఏర్పాట్ల మీద, ప్రత్యేక ఫ్లయిట్ల మీద, వంటకాల మీద, హాజరైన సెలబ్రిటీల మీద… చివరకు ఆషాఢంలో పెళ్లి ఏమిటనే చర్చ దాకా…) ముఖేష్ అంబానీ తన కొడుకు పెళ్లికి 5000 కోట్లు ఖర్చు పెట్టాడు అనే అంశం మీద రకరకాల […]

సరిపోదా శనివారం..! అవును, ఇదీ ఓ సినిమా కథలాగే ఉంది…!!

July 15, 2024 by M S R

snake

ప్రతి శనివారం… అవును, మల్లాది నవల ‘శనివారం నాది’లో నెగెటివ్ షేడ్స్ ఉన్న ఓ వ్యక్తి ప్రతి శనివారం ఏదో ఓ దుర్ఘటనకు పాల్పడుతుంటాడు… సరిపోదా శనివారం అని ఓ సినిమా వస్తోంది, హీరో నాని… ఆ మల్లాది నవల కథనే ఈ సినిమా కథ కావచ్చుననే సందేహాలు కూడా వినవస్తున్నాయి… ఈ శనివారం సెర్చింగులో మరో ఇంట్రస్టింగ్ కథ కనిపించింది… కథ అని ఎందుకంటున్నానో కథ మొత్తం చదివాక మీకు తెలుస్తుంది… ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్… వికాస్ […]

మా కార్లకు బ్లూ బుగ్గలు, కుయ్ కుయ్ సైరన్ల పర్మిషన్లు ఇవ్వగలరు…

July 15, 2024 by M S R

ias

గౌరవనీయ కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి మరియు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రివర్యుల దివ్యసముఖమునకు- మరియు ఏ శాఖలకు మా సమస్యలు వరిస్తాయో ఆయా శాఖల మంత్రులకు- ముఖ్యమంత్రులకు- ప్రధానికి- ఊరూ పేరూ లేని సగటు భారతీయ నాలుగు చక్రాల వాహనాల యజమానులు వ్రాసుకొను బహిరంగ లేఖార్థములు. మహారాష్ట్ర పూనాలో ఒకానొక శిక్షణలో ఉన్న ఐఏఎస్ అధికారిణి తన సొంత అత్యంత విలాసవంతమైన ఆడి కారుకు మహారాష్ట్ర ప్రభుత్వ లోగోను, అధికారిక బ్లూ బుగ్గను పెట్టుకున్న […]

  • « Previous Page
  • 1
  • …
  • 126
  • 127
  • 128
  • 129
  • 130
  • …
  • 452
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions