. పదే పదే చెప్పుకుంటున్నదే…. తెలుగు ఫిలిమ్ జర్నలిజం రోజురోజుకూ పాతాళంలోకి దిగజారిపోతున్న దురవస్థ గురించి… కానీ ఓ నిర్మాత, ఓ దర్శకుడు ఏం చేయగలడు ఫాఫం… సిండికేట్… బహిష్కరిస్తే ప్రచారం రాదు… ఆ సోకాల్డ్ జర్నలిస్టులు అనబడే పర్వర్టెడ్ కేరక్టర్ల తిక్క ప్రశ్నలకు జవాబులు చెప్పలేరు… ఎస్, హైదరాబాదులో ఇండస్ట్రీకి పెద్ద శాపం తెలుగు జర్నలిజమే… మంచు లక్ష్మి మీద పిచ్చి కూతలు కూసిన ది గ్రేట్ ముసలి జర్నలిస్టు ఒకరు సిగ్గుపడి, తలవంచి చివరకు […]
రిషబ్ శెట్టి ‘కాంతార’ మ్యాన్షన్… కళాత్మకత, సంస్కృతి, భద్రత మేళవింపు…
. కాంతార ఫేమ్ రిషబ్ శెట్టికి సంబంధించిన ఏ కథనమైనా ఇప్పుడు వైరల్… కన్నడ మీడియా తన నివాసం గురించి కథలు కథలుగా రాస్తోంది… వాటిల్లో ఏమేరకు నిజాలున్నాయో తెలియదు, మంచి ఫోటోలు కూడా లేవు… కానీ చదవడానికి మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి కథలు… వాటి సారాంశం ఏమిటంటే…; ‘కాంతార’ సినిమాతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి నివాసం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది… సుమారు ₹12 కోట్లు విలువ చేసే ఈ […]
చావు దాకా తోడుగా, తోడ్పాటుగా వెన్నంటి… A True Love Story…
. ( రమణ కొంటికర్ల )…. అప్పటివరకూ హాలీవుడ్ ను ఊపేస్తున్న ఓ ఛార్మింగ్ స్టార్ అతను. అతడి కోసం ప్రొడ్యూసర్స్ క్యూ కట్టేవారు. ఫోన్ కాల్స్ మార్మోగుతుండేవి. క్షణం తీరిక లేని సమయం. ఆయనతో కరచాలనం చేస్తే చాలు జన్మధన్యమనుకునేవారెందరో. ఇక ఫోటో కూడా దిగితే ఆ ఆనందానికి అవధుల్లేకుంటుండెనేమో. కానీ, ఒకానొక సమయంలో ఆయన ఫోన్ చేసినా స్పందించేవారే కరువైపోయారు. ఆయన దగ్గరకు రావాలంటేనే తోటి నటీనటులతో పాటు, ఆయన్ను ఆరాధించే సామాన్యులూ భయపడ్డారు. స్నేహితులు […]
“యుద్ధం తానే, శాంతి తానే — జరగని యుద్ధాలనూ ఆపాడట..!!
. తెలుగులో వాచాలత్వం అని ఓ పదం ఉంది… మెదడుకూ నోటికీ సంబంధం లేని పిచ్చి కూతలు… ఈ పదానికి అసలు సిసలు ఐకన్ ది గ్రేట్ ట్రంప్… నోరిప్పితే చాలు ఏతులు, ఎచ్చులు… నేను ఎనిమిది యుద్ధాలను ఆపాను అని కదా తన క్లెయిమ్… నాకు దక్కకపోతే అది అమెరికాకే అవమానం అనీ కూశాడు కదా… పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు ఫ్యాక్ట్ చేశాయి, తను నిజంగానే ఎనిమిది యుద్ధాల్ని ఆపాడా అని… అవీ చెప్పుకుందాం… […]
మరేటి సేస్తాం అలగైపోయినాది… సొంత ‘నోబుల్’ అవార్డులే ఇక దిక్కు…
. ఆహా… ట్రంపుకి నోబెల్ శాంతి బహుమతి దక్కకపోవడంతో ప్రపంచమంతా చప్పట్లు చరిచింది… బహుశా వైట్ హౌజులో కూడా సౌండ్ రాకుండా కొట్టి ఉంటారు చప్పట్లు… చాన్నాళ్ల తరువాత ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా జోకులు, మీమ్స్, సెటైర్లు, రీల్స్, షార్ట్స్, వెటకారాలతో నవ్వులు పండించింది… ఒక్క ముక్కలో చెప్పాలంటే… నోబెల్ తిరస్కరణ, ఈ సోషల్ మీడియాా స్పందన ట్రంపు పట్ల పేద్ద అభిశంసన… విశ్వవ్యాప్తంగా ఓ అగ్రదేశ అధ్యక్షుడు పెద్ద లాఫింగ్ స్టాక్… షేమ్ షేమ్… దొంగచాటుగా […]
బ్లేమ్ గేమ్… బీసీ రిజర్వేషన్లపై పార్టీల పరస్పర నిందాపర్వం…
. తెలంగాణ రాజకీయాల్లో బీసీ రిజర్వేషన్లపై బ్లేమ్ గేమ్ నడుస్తోంది… చెల్లని జీవోతో రేవంత్ బీసీలకు ద్రోహం చేశాడని బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు… అసలు బీఆర్ఎస్, బీజేపీ ఇన్‌ప్లీడ్ కాలేదు, బీజేపీ పూనుకుంటేనే బీసీ రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం చెప్పేది, అసలు ద్రోహి బీజేపీయే అని కాంగ్రెస్ పార్టీ… కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన విధానమే తప్పు, సో, ఆ రిజర్వేషన్లకు ఆమోదముద్ర దక్కదని ముందు నుంచే చెబుతున్నాం అంటూ బీజేపీ… సీపీఐ, సీపీఎంతో పాటు బీసీ సంఘాలు, […]
కేసీయార్ మార్క్ సింపతీ పాలిటిక్స్… సీటుసీటుకూ మారుతుంటయ్…
. స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడింది కదా… ఆ ఎన్నికల సంగతేమిటో కాలం చెబుతుంది… ఈలోపు అందరి దృష్టీ జుబ్లీ హిల్స్ ఉపఎన్నిక మీద పడింది… రేవంత్ రెడ్డి రాజకీయ ఎత్తుగడలు ఆలోచిస్తుంటే.,. బీఆర్ఎస్ క్యాంపు మాత్రం సోషల్ మీడియా క్యాంపెయిన్‌ను, ప్రత్యేకించి సానుభూతి అనే అస్త్రాన్ని ప్రయోగిస్తోంది… మాగంటి భార్య, కూతుళ్ల ప్రచారం ఫోటోలు పెట్టేసి… ఎమోషన్ చుట్టూ ఈ ఉపఎన్నికను తిప్పాలని ఆలోచిస్తోంది… ‘‘పాపం, భర్త లేని భార్య, తండ్రి లేని కూతుళ్లు… కాంగ్రెస్ […]
రెండు బొమ్మలూ ఒక్కచోట కుట్టేసి… మరోసారి దండుకో నా రాజామౌళీ…
. బాహుబలి… తెలుగు సినిమా మార్కెట్‌ను ఎలా విశ్వవ్యాప్తం చేయాలో చేసి చూపించాడు రాజమౌళి… ఆ సినిమా రిలీజప్పుడు రకరకాల మార్కెటింగ్ పద్ధతులతో వీలైనంత దండుకున్నాడు… తరువాత బాహుబలి సీక్వెల్… దాన్నుంచి మరింత పిండుకున్నాడు… పుస్తకాలు, బొమ్మలు, కామిక్స్, ఆడియోలు… మార్కెటింగ్ మాయామర్మాలు తెలిసినోడు కదా, కొడుకును ప్రయోగించి rrr సినిమాకుఓ ఆస్కార్ కూడా కొట్టాడు… అదీ ఓ పిచ్చి పాటకు… పది అవార్డులకు వల వేస్తే ఒకటి పడింది… ఇప్పుడిక బాహుబలి పేరిట ఇంకా ఇంకా […]
ఆధునిక తెలుగులో ఎండ్ టు ఎండ్ ఇంగ్లిష్ ఓన్లీ…!
. ఆధునిక తెలుగులో ఎండ్ టు ఎండ్ ఇంగ్లిష్ ఒక లిపి ఏర్పడడానికి వందల, వేల ఏళ్ల సమయం పడుతుంది. మొనదేలిన రాయి ప్రవాహంలో ఒరుసుకుని, ఒరుసుకుని నున్నగా, గుండ్రంగా తయారయినట్లు తెలుగు లిపి కూడా కాలప్రవాహంలో గుండ్రంగా, అందంగా ఏర్పడింది. నవ్వుతున్నట్లు ‘అ’అక్షరం ఎంత అందంగా ఉంటుంది? పురి విప్పిన నెమలిలా ‘ఖ’ఉంటుంది. కీర్తికి పెట్టిన కిరీటంలా ‘గ’ ఉంటుంది. బుగ్గన సొట్టలా ‘ఠ’ ఉంటుంది. రాయంచలా ‘హ’ ఉంటుంది. తెలుగు వర్ణమాల అచ్చులు, హల్లుల […]
‘‘నేనెందుకు అర్చకవృత్తి చేపట్టానంటే…’’ చిలుకూరు రంగరాజన్ కథ…
. భండారు శ్రీనివాసరావు…. సువిశాల ప్రాంగణంలో అనేక ఏళ్ళుగా నిద్రాణంగా ఉండిపోయిన ఆ చిలుకూరు దేవాలయానికి ఇంతగా ప్రాచుర్యం లభించడానికి కారణం సౌందర రాజన్ అనే పెద్దమనిషి. ఉన్నత చదువులు అభ్యసించారు. కామర్స్ లెక్చరర్ నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ స్థాయికి ఎదిగారు. చిలుకూరు గుడికి అనువంశిక ధర్మకర్త. రిటైర్ అయిన తర్వాత అదే దేవాలయంలో ప్రధాన అర్చక వృత్తి స్వీకరించారు. హిందూ దేవాలయాలు ప్రభుత్వ అధీనంలో ఉండరాదని దశాబ్దాలుగా సాగిస్తున్న ఉద్యమానికి ఆయన వన్ మ్యాన్ ఆర్మీ. […]
చిరంజీవి క్లాసిక్ చేస్తే ఎందుకో గానీ ఆ ‘ఆరాధన’ దక్కదు తనకు…
. Subramanyam Dogiparthi ….. నా హృదయంలో నిదురించే చెలీ, కలలతొనే కవ్వించే సఖీ … 1962 లో కుర్రకారుని ఒక ఊపు ఊపేసిన ఆరాధన సినిమాలోని పాట ఇది . కళ్ళు లేకపోయినా మనసు మనసు ఆరాధించుకుంటూ ఉంటాయని చెప్పిన రొమాంటిక్ క్లాసిక్ . అక్కినేని , సావిత్రి , జగ్గయ్య కాంబినేషన్లో వచ్చింది . నా మది నిన్ను పిలిచింది గానమై వేణుగానమై నా ప్రాణమై … 1976 లో వచ్చింది మరో సూపర్ […]
అసలే ఆమె రేఖ… పైగా ఓ సరళీకృత అక్రమ ప్రేమ కథ… తెర చించేసింది…
. Taadi Prakash……… బాసు భట్టాచార్య ‘ఆస్తా’… A contagious disease Called consumerism… సరళీకృత అక్రమప్రేమ – స్టోరీ 5 1996…పీవీ నరసింహరావు, మన్మోహన్‌సింగ్ కలిసి తెచ్చిన ఆర్థిక సంస్కరణల ఫలితాలను ఇండియా ఎంజాయ్ చేస్తోంది. అమెరికన్ డాలర్లూ, గల్ఫ్‌డబ్బూ, విదేశీ బైక్‌లూ, కార్లూ, కొత్త అవకాశాలూ వచ్చిపడుతున్నాయి. వందల కోట్ల చేతుల ఇండియన్ మార్కెట్ ప్రపంచదేశాల్ని వూరిస్తోంది. మార్కెట్ విస్తరిస్తోంది. ఆశ పెరుగుతోంది. మనిషి సరుకుగా మారుతున్నాడు. అటు కలకత్తాలో దర్శకుడు బాసూ భట్టాచార్య. ‘ఆస్తా’ సినిమాకి […]
ఆహా… నోబెల్ అవార్డుల జ్యూరీకి మనస్పూర్తి ప్రశంసలు… ఎందుకంటే..?
. ఆహా… ఈరోజు బాగా నచ్చిన వార్త… ప్రపంచంలోకెల్లా అత్యంత ధూర్తుడైన పాలకుడు… ది గ్రేట్ మోడీ దోస్త్… ట్రంపు గాడు ఖడ్గం పట్టుకుని, నాకు నోబెల్ శాంతి బహుమతి రాకపోతే ఒక్కొకడి తాట తీస్తా అంటూ సగటు తెలుగు హీరోలాగా గర్జించినా సరే… వాడికి నోబెల్ దక్కలేదు… 2025 ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి మరియాను వరించింది… నార్వేజియన్ నోబెల్ కమిటీ ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేసింది… ఈ ప్రైజ్ కోసం ఎంతగానో ఎదురుచూసిన అమెరికా […]
అంబానీలు, ఆదానీలు బోలెడు… అచ్చమైన భారత ‘రతన్’ టాటా ఒక్కడే..!
. టాటా అంటే నాణ్యత… టాటా అంటే నమ్మకం… టాటా అంటే ఔదార్యం… టాటా అంటే ఉపాధి… టాటా అంటే భారతీయం… టాటా అంటే విశ్వసనీయత… ఎన్నెన్నో పర్యాయపదాలు… సింపుల్‌గా చెప్పాలంటే టాటా అంటే ఇండియా పారిశ్రామిక ముఖచిత్రం… ఆ గ్రూపును అలా తీర్చిదిద్దినవాడు రతన్ టాటా… మన వ్యవస్థ విషాదం ఏమిటంటే..? మనం ఎంతో గొప్పగా చెప్పుకోదగిన పరిపూర్ణ జీవితం గడిపిన రతన్ టాటాకు పద్మవిభూషణే తప్ప భారత రత్న ఇవ్వలేకపోయాం… పలుసార్లు రాష్ట్రపతి పదవికి […]
రేఖ బయోబుక్..! పుట్టుక నుంచీ ఆమె లైఫ్ జర్నీపై సంపూర్ణ చిత్రణ…
. నిజమే… చాన్నాళ్ల తరువాత ఒక పుస్తకాన్ని వేగంగా చదివేయడం ఇదే… ఎందుకు..? అది రేఖ జీవితానికి సంబంధించింది కావడం… ఆమె భారతీయ సౌందర్య ప్రతీక… యాభై, అరవైలలోని లక్షలమందికి ఈరోజుకూ ఆమె అంటే ఆరాధన… అప్పట్లో కోట్ల మందికి ఆమె కలలనాయిక… అంతేనా..? కాదు, ఆమె జీవితం ఓ సినిమా కథను మించి ఎన్నోరెట్లు అబ్బురం కాబట్టి… ఆమె గతాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి అలా పుస్తకాన్ని వేగంగా చదివేలా చేసింది… నిజానికి ఏడెనిమిదేళ్లుగా రేఖ బయట […]
రష్మికపై కన్నడ ఇండస్ట్రీ నిషేధం..? నిజమేనా..? ఎవరితో లొల్లి..?!
. రష్మిక మీద శాండల్‌వుడ్ బ్యాన్… కన్నడ మీడియా మాత్రమే కాదు, తెలుగు మీడియా కూడా అదే రాస్తోంది గుడ్డిగా… ఐతే ఇదేమీ కొత్త కాదు… శాండల్‌వుడ్ (కన్నడ సినిమా) వర్సెస్ రష్మిక అన్నట్టుగా పంచాయితీలు పెట్టి మరీ పెట్రోల్ పోస్తున్నది కన్నడ మీడియా… 1) కాంతార చూశారా అని ఎవరో అడిగితే ఇంకా చూడలేదు అన్నదామె… అంతే… ఓ గగ్గోలు… నీ తొలి దర్శకుడి సినిమా చూడవు, ప్రశంసించవు, ఇదేం పొగరు అని మొదలుపెట్టింది మీడియా… […]
అగ్ని శలభ న్యాయం… జర్నలిజం కొలువులూ అంతే… మాడిపోతారు..!!
. ఒక మనిషి ఇంకో మనిషి జీవితంతో ఆడే ఆటనే స్వార్థం అంటారు.. తాము ఇంకొద్దిరోజుల్లో చస్తామని తెలిసినా… కొంతమంది మనుషుల వక్రబుద్ది ఏమాత్రం మారదు.. నేను 2010లో వైజాగ్ లో రిపోర్టర్ గా ఒక ఛానెల్లో పని చేస్తున్నపుడు నాకు అడ్వర్టయిజ్మెంట్ల విషయంలో ఆ ఛానెల్లోని ఇన్ పుట్ ఎడిటర్ తో పడేది కాదు.. రిపోర్టర్ గా న్యూస్ కవరేజ్ చేస్తాను గానీ.. ఏమాత్రం చేయలేనని తెగేసి చెప్పాను. ఎంతటి ప్రమాద కరమైన చోటికైనా సరే […]
నీయమ్మని, నీయక్కని, నీతల్లిని… ఈ డర్టీ సాంగ్‌కు సిగ్గూశరం లేని సమర్థన..!!
. ముందుగా ‘ముచ్చట’ ఆమధ్య పబ్లిష్ చేసిన ఓ విమర్శ చదవండి… ఒకప్పుడు కాస్త మంచి నటుడే అనిపించుకున్న రవితేజ వయస్సు పెరిగేకొద్దీ అశ్లీలాన్ని ఆశ్రయించిన తీరు మీద… మరీ ప్రత్యేకించి రాబోయే తన సినిమా మాస్ జాతరలోని ఓలె ఓలె పాటలోని బూతుల మీద బోలెడు విమర్శలు వస్తున్నాయి కదా… చదవండి… జామచెట్టుకు కాస్తాయ్ జామకాయలు… అనే ఉత్కృష్టమైన సాహిత్యానికి దీటైన, దాటేసే మరింత మహోత్కృష్ట సాహిత్యం ఇక రాదనే భ్రమల్ని పటాపంచలు చేసింది ఈ […]
నా బిడ్డ పెళ్లిని ఆ బైకర్ల గ్రూప్ రఫ్‌గా అడ్డుకుంది… కానీ మంచే జరిగింది…
. బైకర్లు ఆపిన పెళ్లి: ఒక మృగం నుండి రక్షణ నా కూతురి పెళ్లికి 42 మంది బైకర్లు అకస్మాత్తుగా వచ్చి, చర్చి తలుపులను అడ్డుకున్నారు, లోపలికి ఎవ్వరూ వెళ్లడానికి వీలు లేకుండా చేశారు. నేను అరిచాను, కదలమని అడిగాను, పోలీసులకు ఫోన్ చేస్తానని బెదిరించాను, నా బిడ్డ జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజును నాశనం చేస్తున్నారని చెప్పాను. ఆ బైకర్ల నాయకుడు, చేతుల నిండా గాయాలు ఉన్న ఒక భారీకాయుడు, కన్నీళ్లతో నా వైపు చూస్తూ […]
ఆహా… దక్షిణ వాగ్గేయకారులకూ అయోధ్య రాముడి చెంత చోటు…
. భాషాతీత విఖ్యాత రామా! మనం గమనించంగానీ…భారతీయ భాషలన్నిటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ, ప్రతిఫలిస్తూ, ప్రతిబింబిస్తూ ఉంటుంది. తెలుగులో కూడా అంతే. ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే – రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడేమవుతాడని అడిగినట్లే ఉంటుంది. చెప్పడానికి వీలుకాకపోతే – అబ్బో అదొక రామాయణం. జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే – సుగ్రీవాజ్ఞ, లక్ష్మణ రేఖ. ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే – అదొక పుష్పకవిమానం. కబళించే చేతులు, చేష్ఠలు కబంధ […]
- « Previous Page
- 1
- …
- 11
- 12
- 13
- 14
- 15
- …
- 390
- Next Page »



















