రాబోయే సినిమా కోసం రిలీజైన ఓ ఫోటో ఆసక్తి రేపింది… అది విష్వక్సేన్ లేడీ గెటప్ అట… సినిమా పేరు లైలా… అచ్చం లేడీ లుక్కే… అదరగొట్టాడు… సరే, చాలామంది హీరోలు ఆడ పాత్రలు వేసి మెప్పించారు… కథానుసారం విష్వక్సేనుడూ లేడీ గెటప్ ట్రై చేస్తున్నాడు, దాన్నలా వదిలేస్తే… అదే సినిమాలో తనతోపాటు కథానాయికగా కనిపించబోయే అమ్మాయికన్నా లేడీ విష్వక్సేన్ లుక్కే కాస్త అందంగా ఉన్నట్టుంది… ఆమె ఎవరబ్బా అని చూస్తే… మహేశ్ బాబుతోపాటు సంతూర్ యాడ్‌లో […]
బ్రహ్మముడి సూపర్ హిట్… కార్తీకదీపం జస్ట్ పాస్… త్రినయని బాగా డౌన్…
త్రినయని కావచ్చు, ప్రేమ ఎంత మధురం కావచ్చు, పడమటి సంధ్యారాగం కావచ్చు… జీ తెలుగు టీవీలో అన్నీ రీమేక్ సీరియల్సే కదా… కాకపోతే ఎంత బాగా ప్రేక్షకులకు కనెక్టయ్యేలా రీమేక్ చేశామనేది ప్రధానం… అవునవును, స్టార్‌మాటీవీలో కూడా రీమేకులే పాపులర్… గతంలో కార్తీకదీపం ఏదో మలయాళ సీరియల్‌కు రీమేక్… కానీ దాన్ని ఇష్టారాజ్యంగా తిప్పీ, తిప్పీ, వంకర బాటలు పట్టి, ఫస్ట్ పార్ట్‌ను ఘోరంగా ముగించిన సదరు దర్శక ఘనుడు… ఇప్పుడు సీక్వెల్ అంటున్నాడు… తీరా చూస్తే […]
ఏపీలో బ్యాన్, ఎమ్మెస్వో మెడపై కత్తి… ఏమీ లేదు, నెట్ ఇంపాక్ట్ జీరో..!
పెద్దగా తేడాలున్నాయా అంటే..? ఎప్పటిలాగే టీవీ9 దూసుకుపోతోంది రేటింగుల్లో… ఒకానొక దశలో ఎన్టీవీ ఫస్ట్ ప్లేసులోకి వెళ్లి, టీవీ9ను రెండో స్థానంలోకి తొక్కేసినా సరే… సాక్షి టీవీ ముఖ్యుల మీద విపరీతమైన ఆరోపణలు వాట్సప్ గ్రూపుల్లో సెన్సేషన్ రేపుతున్నా సరే… టీవీ9 వైసీపీ చానెల్ అనే ముద్ర వేయబడినా సరే… ఎవరికీ అందనంత ఎత్తుకు చేరుకుంది ఇప్పుడు రేటింగుల్లో… హైదరాబాదు కేటగిరీలో అయితే దానికి అస్సలు తిరుగులేదు… ఎన్టీవీ మీద కూడా వైసీపీ ముద్ర వేయబడింది కదా… […]
కల్కి రచ్చలో ఉన్నారా..? ఓసారి ఈ సినిమా కథ కూడా చదవండి..!
పురాణ కథలను కొత్తగా చెబుతారా..? వోకే… ఆయా పాత్రల కోణాల్లో కొత్తగా ప్రజెంట్ చేస్తారా..? వోకే… కాకపోతే స్థూలంగా పురాణాలను గేలిచేయకుండా, మూలకథ దెబ్బతినకుండా, ప్రయోగాలు చేస్తే పర్లేదు… మరీ ఆదిపురుష్‌లాగా చెత్తా చిత్రీకరణ అయితే జనం తిట్టిపోసే ప్రమాదముంది… మన ఇతిహాసాలు, పురాణాల్లోని పాత్రల గుణగణాల మీద మనకు ఆల్రెడీ ఓ ప్రిజుడీస్ అభిప్రాయం ఉంటుంది… చిన్నప్పటి నుంచీ మనం చదివిన పుస్తకాలు, విన్న కథాకాలక్షేపాలు, చూసిన నాటకాలు, సినిమాలతో ఆ అభిప్రాయం ఏర్పడుతుంది… ఐతే […]
పీటలు- పీఠాలు… కర్నాటక రాజకీయం అంటేనే స్వాములు, జోక్యాలు…
ముఖ్యమంత్రి మార్పుకోసం సన్యాసుల పోరాటం “కౌపీన సంరక్షణార్థం” అని బాగా వాడుకలో ఉన్న సంస్కృతం సామెత. అందరికీ తెలిసిందే అయినా- గోచిగుడ్డ నుండి మొదలై… అంతులేని మహా సంసార ప్రయాణం దాకా సాగుతూనే ఉన్న ఆ కథ మళ్లీ మళ్లీ తెలుసుకోదగ్గదే. ఒకానొక ఊరు. పంటపొలాలతో, ధన ధాన్యాలతో పచ్చగా, హాయిగా ఉంది. ఊరిని ఆనుకుని ఊరికి కొండగుర్తుగా ఒక కొండ. ఆ కొండ మీద ఒక శిథిలాలయ మంటపం. ఎక్కడ నుండి, ఎప్పుడొచ్చాడో తెలియదు కానీ… […]
ఉత్త బూడిద స్టోరీ… చంద్రబాబు చెప్పింది ఒకటి, జ్యోతికి అర్థమైంది మరొకటి..!!
నిన్నటి వార్త… ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్‌లో కనిపించింది… శీర్షిక పేరు ‘రోడ్లపై గుంతలు బూడిదతో పూడ్చండి’… సారాంశం ఏమిటంటే…? రాష్ట్రంలో రహదారుల పరిస్థితులపై సీఎం చంద్రబాబు ఓ సమీక్ష సమావేశం నిర్వహించాడు… వర్షాకాలంలో రోడ్ల రిపేర్లు కష్టం, అందుకని ఇప్పుడే రిపేర్లు చేయాలని, గుంతలు పూడ్చాలని ఆయన ఆదేశించాడు… గుడ్, ఇక్కడి వరకూ స్పాట్ న్యూస్, బాగానే రాశారు… సమీక్షలో చంద్రబాబు ‘దగ్గరలోని థర్మల్ కేంద్రాలకు వెళ్లి ఫ్లయ్ యాష్ (ఆ కేంద్రాల్లో బొగ్గు కాల్చగా వచ్చే […]
ఈ సినిమా కథకన్నా… తెర వెనుక పారితోషికం చెక్కుల కథ ఇంట్రస్టింగు…
ఎవరో జూనియర్ ఆర్టిస్టులు నటించవలసిన ఈ సినిమాలో NTR , భానుమతి అంతటి ఉద్దండులు ఎందుకు నటించారో అర్థం కాదు . 1974 లో వచ్చిన ఈ అమ్మాయి పెళ్ళి సినిమా ఎంత మంది చూసి ఉంటారు ?! సినిమా టూకీగా డాక్టర్ పెళ్ళాం గొప్పా లేక లాయర్ మొగుడు గొప్పా !? NTR , భానుమతిలు మధ్య వయస్కుల పాత్రల్లో నటించారు . వారికి ఓ కూతురు , ఇద్దరు కొడుకులు . కూతురి పెళ్లి […]
కోదండరాంను నైతికంగా కార్నర్ చేస్తున్న దాసోజు శ్రావణ్..!!
అఫ్ కోర్స్… దాసోజు శ్రావణ్ కోదంరాం పట్ల వాడిన భాష నచ్చలేదు… ఒకవైపు మీ నాయకత్వంలోనే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను, ఏనాటి నుంచో మీ ఫాలోయర్‌ని అని చెబుతూనే తూలనాడటం సరైందిగా అనిపించలేదు… కానీ శ్రావణ్ పోరాటంలో న్యాయం ఉంది… తన ఆవేదనలో అర్థముంది… దక్కాల్సిన పోస్టు దక్కడం లేదే అనే ఆక్రోశం ఉంది… కానీ… రాజకీయాల్లో ఉద్వేగాలకు తావు లేదు… రాజకీయాలంటేనే క్రూరం… అది జేసీబీలాగా తొక్కేసుకుంటూ పోతుంది… తన, పర అని చూడదు… అది […]
నో ఫోన్‌పే, నో పేటీఎం, నో గూగుల్ పే… కరెంటు బిల్లులు ఎందుకు పే చేయలేం..?!
చాలామందికి అర్థం కావడం లేదు… హఠాత్తుగా కరెంటు బిల్లుల్ని పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే, ఏ యూపీఐ ద్వారా గానీ, బ్యాంకుల యాప్స్ ద్వారా కూడా చెల్లించడానికి వీల్లేదనే వాట్సప్ వార్తలు… ఇన్నాళ్లూ రకరకాల పేమెంట్ యాప్స్ ద్వారా బిల్లులు పే చేసేవాళ్లు వినియోగదారులు… కొత్త బిల్లు జనరేట్ కాగానే అలర్ట్ చేసేవి అవి… డ్యూ డేట్స్ చెప్పేవి… అంతెందుకు..? చాలామంది బిల్లులు సమయానికి పే చేయకపోతే ఇబ్బందులు ఎదురవుతాయనే భావనతో ఆటో పే ఆప్షన్ పెట్టుకునేవాళ్లు… అంటే […]
Hathras Stampede… విషాదం కాదు, ప్రమాదం కాదు… ఓ నేరం..!!
మట్టి మీద ప్రేమ ఉండాలి… పుట్టిన మట్టి మీద మరింత ఉండాలి… అది పుట్టిన ఊరు కావచ్చు, పుట్టిన దేశం కావచ్చు… మట్టి మీద ప్రేమ ఉండాలి… కానీ అది మరీ వెర్రితలలు వేయకూడదు… ఆ మట్టికి మంచి చేయాలి, మంచి పేరు తీసుకురావాలి… మొన్న ప్రపంచకప్పు అందించిన ఆ ఫీల్డ్ మీద ప్రేమ తెగపెరిగిపోయి రోహిత్ శర్మ కాస్త మట్టిని తిన్నాడనే వార్త, ఫోటో చూశాక జాలిపడాలో, కోప్పడాలో, ఇంకేమనాలో అర్థం కాలేదు… మట్టికి మహత్తేమీ […]
అమాత్యులు గారి అర్థాంగి గారు… ఆమాత్రం ప్రోటోకాల్ కోరుకోవద్దా ఏం..?
మంత్రి గారి భార్య గారి ప్రోటోకాల్ తహతహ! ఆమె మంత్రి కాకపోవచ్చుగాక. సాక్షాత్తు మంత్రి గారి భార్య గారు. మంత్రికి భార్య కాబట్టి మంత్రిలో సగభాగం. “ధర్మేచ… అర్థేచ…” ధర్మం ప్రకారం ఆమె పొద్దు పొద్దున్నే ప్రోటోకాల్ అడగడంలో తప్పు లేదు! కుడి ఎడమల డాల్ కత్తులు మెరయగ… ముందు కుయ్ కుయ్ అని సైరన్లు మోగగ… మంత్రి గారి భార్య గారికి ఊరేగాలని కోరిక ఉండడం “అర్థేచ” ప్రకారం అర్థం చేసుకోదగ్గదే! డబ్బులెవరికీ ఊరికే రావు. […]
మోడీ వోట్లపై వింత లెక్కలు, విచిత్ర విశ్లేషణలు… తిక్క బాష్యాలు..!!
ఎహె, మోడీకి వచ్చినవి ఆఫ్టరాల్ 6 శాతం వోట్లు అని కొన్ని వార్తలు కనిపించాయి… అరె, 36.56 శాతం కదా, ఇదేమిటి 6 శాతం అని రాసేస్తున్నారు ఏమిటా అని చూస్తే… అవి మొత్తం జనాభాలో బీజేపీకి పడిన వోట్ల శాతం అట… వారెవ్వా… మోడీ మీద వ్యతిరేక వార్తలు రాయాలనుకుంటే రాయండి గానీ మరీ ఇలాంటి బాష్యాలు ఏమిటో అర్థం కాదు… మోడీలు వస్తుంటారు, పోతుంటారు… ఎవరూ శాశ్వతం కాదు, గెలుపోటములు కూడా వస్తుంటాయి, పోతుంటాయి… […]
సూర్యకాంతం వేయాల్సిన గయ్యాళి పాత్ర మహానటి సావిత్రి వేస్తే..?
1974 లోకి వచ్చేసాం . ఈ ఆడంబరాలు అనుబంధాలు సినిమా లోకి వద్దాం . మాదిరెడ్డి సులోచన వ్రాసిన సంసార నౌక అనే నవల ఆధారంగా ప్రముఖ దర్శకులు సి యస్ రావు దర్శకత్వంలో వచ్చింది ఈ సినిమా . నవల బాగున్నా , ఆ నవలలోని కధను సినిమాకరించటం చాలా ముఖ్యం . సి యస్ రావు అనుభవం ఉన్న డైరెక్టర్ అయినా స్క్రీన్ ప్లే బలహీనంగా ఉంటుంది . అయితే మంచి సందేశాన్ని ఇచ్చే […]
రామరావణ యుద్ధం సీత కోసం కాదు… ఆ రావణుడి వ్యూహమే వేరు…
పది తలల రావణాసురుడు అంటే 6 శాస్త్రాలు, 4 వేదాలు చదివిన అత్యంత జ్ఞానం కలిగిన వ్యక్తి అని అర్ధం. ఎక్కువ మంది రామాయణం కుటుంబానికి సంబంధించినది అని, భారతం యుద్ధానికి సంబంధించినది అని చూస్తారు. కానీ రామాయణం పూర్తిగా అర్ధం చేసుకుంటే సన్ ట్జూ రాచిన “ది ఆర్ట్ ఆఫ్ వార్” కూడా ఎందుకూ పనికి రాదు. అత్యంత శ్రేష్టమైన యుద్ద వ్యూహాలు రామాయణం లో కూడా గమనించవచ్చు. రావణాసురుడికి 6 గురు తమ్ముళ్లు, ఇద్దరు […]
సాలెపురుగు కుడితే స్పైడర్‌మ్యాన్ సూపర్ అట… కల్కిని మాత్రం మెచ్చుకోరట…
సాలెపురుగుు కుడితే స్పైడర్ మాన్ అయ్యాడని చెపితే ఎర్రి మొఖాలు వేసుకొని చూసాం… ఎందుకంటే అది హాలీవుడ్ అని, మనకంటే గొప్ప చిత్రాలను తీస్తారని ఒక సోకాల్డ్ “నమ్మకం”… అరే సాలెపురుగు కుడితే స్పైడర్ మాన్ ఎలా అవుతార్రా అని అడిగితే సినిమాను సినిమాలా చూడాలని, అందులో లాజిక్ లు వెతకడం తప్పని ఎప్పుడూ మనల్ని బ్రెయిన్ వాష్ చేసే బ్యాచ్ చెప్తూ ఉంటుంది… మార్వెల్ సిరీస్లు, గార్డియన్స్ ఆఫ్ గాలక్సీలు చూసిన సోకాల్డ్ మేధావి బాచ్లు […]
అందుకే తను అంబానీ..! 50 జంటలకు పెళ్లిళ్లలతో భారీ దిష్టితీత..!!
చిన్న వార్తే అంటారా..? వోకే… అబ్బే, సముద్రంలో కాకి రెట్ట అంటారా..? వోకే… కొడుకు పెళ్లి భారీ ఖర్చును మన మీద రుద్దేందుకు జియో టారిఫులు పెంచాడు తెలుసా అంటారా..? వోకే… అంత వరల్డ్ టాప్ టెన్ రిచ్చు… సొసైటీకి ఏమిచ్చాడు అంటారా..? వోకే… ఏం చెప్పినా సరే, ఎంత చిన్న ఔదార్యమైనా సరే, స్వాగతిద్దాం… అంతకుమించి మనం అడిగినా ఆయనేమీ చేయడు, పక్కా వ్యాపారి, పక్కా గుజరాతీ వ్యాపారి… కొన్ని ఫోటోలు, ఆ వార్త చూశాక […]
కప్పు పట్టుకుని మురిసిపోయే ఈ వ్యక్తి కథ ఓసారి చదవాలి తప్పకుండా..!!
టీ20 వరల్డ్ కప్ గెలిచాం… సరే, మన క్రికెటర్లను వేనోళ్ల పొగిడాం… జైషా అయితే ఏకంగా 125 కోట్ల నజరానా ప్రకటించాడు… దేశం మొత్తం కీర్తిస్తోంది… రోహిత్, కోహ్లి, బుమ్రా, సూర్యకుమార్, పాండ్యా, అక్సర్ …. పేరుపేరునా ప్రశంసిస్తున్నాం, చప్పట్లు కొడుతున్నాం… ఈ గెలుపు వెనుక ఇంకెవరైనా తెర వెనుక వ్యక్తులు ఉన్నారా..? రాహుల్ ద్రావిడ్ గాకుండా… ఉన్నాడు… తన గురించి చెప్పుకుంటేనే ఈ ప్రపంచ కప్ గెలుపు చరిత్ర చెప్పుకున్నట్టు… లేకపోతే అసంపూర్ణం… 21 రూపాయలతో […]
మరోసారి తప్పులో కాలేసిన రాహుల్… తెలియదు, చెప్పినా ఎక్కదు…
నిజానికి సమస్య ఏమిటంటే… రాహుల్ గాంధీకి ఏమీ తెలియదు… సరే, రాజకీయాల్లో ఉన్నవాళ్లకు అన్నీ తెలియాలని ఏమీ లేదు… కాకపోతే ఎవరైనా ఏదైనా చెబితే దాన్ని ముందుగా బుర్రకెక్కించుకోవాలి, అదీ సరైన తోవలో… తరువాత దాన్ని రాజకీయ భాషలో ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో తెలుసుకోవాలి… అదుగో అక్కడే రాహుల్ గాంధీకి వైఫల్యం… తను నిజంగా తెలివైన రాజకీయ నాయకుడే అయితే ఈపాటికి కాంగ్రెస్ పార్టీ ఓ జోష్‌కు వచ్చి ఉండేది… అమిత్ షా, మోడీ సక్సెస్‌కు కారణం […]
ఓసారి కేసీయార్ అలా ‘క్రాస్ ఎగ్జామిన్’ చేస్తే చూడాలని ఉంది…
కేసీయార్‌ను అలా చూడాలని ఉంది… ఎలా..? విద్యుత్తుపై ఏర్పాటు చేయబడిన జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ఏర్పాటే చట్టవిరుద్దమని హైకోర్టుకు వెళ్తే, కోర్టు కొట్టేసింది కదా… ఇప్పుడిక సుప్రీంకోర్టుకు పోతాడేమో… అదీ భిన్నంగా చెబుతుందని అనుకోను… కేసీయార్ ప్రయత్నాలు వృథా అని మనం కూడా ఆల్రెడీ ఓసారి చెప్పుకున్నాం… (మరోవైపు కవిత పిటిషన్‌ను కూడా ఢిల్లీ కోర్టు కొట్టేసింది… మహిళ అని సానుభూతి చూపలేం, నిందితురాలు అనేందుకు సాక్ష్యాలు కనిపిస్తున్నాయి, పైగా సాక్షుల్ని ప్రభావితం చేసే పలుకుబడి ఉందని […]
కమ్యూనిటీ స్టాండర్డ్స్ అనబడు ఓ పేద్ద భ్రమపదార్థం కథ…
నా పోస్టులకు రీచ్ ఘోరంగా పడిపోయింది… ఏమిటీ దారుణం..? అయ్యో, నేను సారంగలో రాసిన కంటెంట్‌ను షేర్ చేస్తే కమ్యూనిటీ స్టాండర్డ్స్ పేరిట ఫేస్ బుక్కోడు రిమూవ్ చేశాడు… ఏమిటీ దరిద్రం..? బాబోయ్, వీడు నా మీద రెస్ట్రిక్షన్స్ పెట్టేశాడు, కాస్త పదిమందీ కాస్త పోకండి, వాడిని గోకండి గురూ… ఏమిటీ ఘోరం..? ఇలాంటి పోస్టులు విపరీతంగా కనిపిస్తున్నాయి ఈమధ్య ఫేస్ బుక్ వాల్ మీద..! తాము వివిధ పత్రికల్లో, వెబ్ సైట్లలో రాసిన కంటెంట్‌ను ఫేస్ […]
- « Previous Page
- 1
- …
- 132
- 133
- 134
- 135
- 136
- …
- 452
- Next Page »