Shrinivas Beebireddy……. అయోధ్య వెళ్లేవారికి, వచ్చే వారికి సమాచార నిమిత్తం… వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోండి, మిగతాదంతా కాకానే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు… ట్రైన్ సమయం కంటే రెండు గంటల ముందు వెళ్ళండి, స్టేషన్ లో ఆధార్ కార్డు చూపిస్తే మనకు ఒక ఐడి కార్డు ఇస్తారు, ఆ ఐడి కార్డు ఉంటేనే ట్రైన్ లోకి అనుమతి… ట్రైన్ లో మనకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం ఇస్తారు, కానీ కూరలో ఉప్పు తక్కువ ఉంటుంది కాబట్టి ఉప్పు […]
ఇప్పుడు బతుకొక గూగుల్ గజిబిజి సాలెగూడు… మిగిలేది వర్చువల్ బూడిద…
పెళ్లి కొడుకు ఉద్యోగం తీసిన ప్రీ వెడ్ షూట్… డిజిటల్ వ్యామోహంలో మనుషులు వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. వైవిధ్యం కోసం ఉచితానుచితాలు మరచిపోతున్నారు. ఎక్కడ ఏమి చేయకూడదో అవే చేస్తున్నారు. ఎక్కడ ఏమి మాట్లాడకూడదో అవే మాట్లాడుతున్నారు. పదేళ్లలో డిజిటల్ మీడియా ఆకాశం అంచులు దాటి ఇంకా ఇంకా పైపైకి వెళుతోంది. చేతి గడియారం, క్యాలిక్యులేటర్, స్టిల్ కెమెరా, వీడియో కెమెరా, డెస్క్ టాప్, టార్చ్ లైట్…ఇలా అనేక వస్తువులను స్మార్ట్ ఫోన్ మింగేసింది. ఇప్పుడు సెల్ ఫోనే […]
అవి కోట్ల క్యూసెక్కుల కన్నీళ్లురా.., నా కొడకా…!
కోట్ల క్యూసెక్కుల కన్నీళ్లురా, నా కొడకా! MAVERICK AND A MAGNIFICENT POET ———————————————————- కవి అరుణ్ సాగర్ కోసం …. *** *** *** ఎంత సరదా మనిషో. స్టైలిష్ గా వుంటాడు. లవ్లీ గా నవ్వుతాడు. పలకరింపుతోనే పడగొడతాడు. అరుణ్ సాగర్ ని చూస్తే ప్రేమించబుద్ధవుతుంది.. కరడుగట్టిన మగాళ్ళకైనా, కాంతులీనే ఆడవాళ్లకైనా! ఎందుకో తెలీదు. ఎంత నచ్చుతాడో గిట్టనివాళ్ళకైనా, కవిత్వం పట్టనివాళ్ళకైనా! మాటల్లో స్నేహాన్ని పంచియివ్వడం అతనికే చేతనవును, గ్లాసులో పెగ్గు వొంచి యిచ్చినంత […]
ఇప్పుడయితే ఈ సినిమాకు సెన్సారోళ్ళు సర్టిఫికెట్ ఇవ్వరేమో !
Subramanyam Dogiparthi….. ఇప్పుడయితే ఈ సినిమాకు సెన్సారోళ్ళు సర్టిఫికెట్ ఇవ్వరేమో ! యువరాజు చనిపోయిన తన అన్నగారి కోసం స్థూపం నిర్మిస్తానికి ప్రజల్ని బాదుతుంటాడు . హీరో కాంతారావు ప్రజల పక్షాన ఆ నిర్ణయాన్ని ప్రతిఘటిస్తాడు . స్థూపాలు , విగ్రహాలు ముఖ్యం కాదు ; ప్రజల బాగోగులు ముఖ్యం అని గొడవ పడతాడు . ఈరోజుల్లో స్థూపాలను , విగ్రహాలను విమర్శించే సినిమాలను బాయ్ కాట్ కూడా చేస్తారు , చేపిస్తారు . వామపక్ష భావజాలం […]
ఇంట్రస్టింగ్… విరిగిపడిన రెండు ప్రతిభా కెరటాల పునః కలయిక…
ఆసక్తికరమైన వార్తే… దర్శకుడు క్రిష్ అనుష్క శెట్టితో ఒక హీరోయిన్ సెంట్రిక్ సినిమా చేయబోతున్నాడు..! ఎదుగుతూ ఎదుగుతూ కెరీర్ బాగా ఉన్న దశలో ఇద్దరూ బోల్తా కొట్టినవాళ్లే… ఇద్దరూ ప్రతిభులే… కాకపోతే డెస్టినీ వాళ్ల పక్షాన లేదు… ఆ ఇద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్నారనేది అందుకే ఇంట్రస్టింగ్… అనుష్క వయస్సు 42 ఏళ్లు… మంగళూరు, తుళు మహిళ… బెంగుళూరులోనే చదివిన ఈ యోగా ఇన్స్ట్రక్టర్ కన్నడ సినిమాలకన్నా తెలుగు, తమిళ సినిమాల్లోనే ప్రసిద్ధురాలు… కన్నడంలో ఒక్క […]
లీడర్ బయోపిక్ అంటేనే ఢమాల్…! వరుసగా ప్రతి సినిమా డిజాస్టరే…!!
‘రజాకార్’ అని ఓ కొత్త సినిమా వస్తోంది కదా… మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందే రిలీజ్ అనుకున్నారు, బీజేపీకి కాస్త ఫాయిదా అవుతుందనీ అనుకున్నారు, తరువాత ఏమైందో వాయిదా పడింది… దానికి సంబంధించిన ఓ ఫంక్షన్లో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మాట్లాడుతున్నప్పుడు ఆమె రాజకీయాల్లోకి వచ్చే అంశం ఓ ప్రశ్నగా ఎదురైంది… ఎప్పటిలాగే ఆ దేవుడి ఆశీస్సులు ఉంటే వస్తానని చెప్పిన ఆమె… నవ్వుతూ… ‘త్వరలో రాబోయే నా సినిమా ఎమర్జెన్సీ గనుక చూస్తే నేను […]
UCC… ఈ ఉత్తరాఖండ్ ఉమ్మడి పౌరస్మృతి ఏం చెబుతోంది..?
Pardha Saradhi Potluri ….. ఫిబ్రవరి 6, 2024… ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధమీ యూనిఫాం సివిల్ కోడ్ (UCC) బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. భారత్ లో UCC ను ప్రవేశ పెట్టిన మొదటి రాష్ట్రం అయ్యింది. అసెంబ్లీలో ఆమోదం పొందిన తరువాత, తిరిగి గవర్నర్ దగ్గరికి వెళ్లి ఆమోదం పొందిన తరువాత చట్టం అమలులోకి వస్తుంది. ఉత్తరాఖండ్ UCC బిల్లు అమలులోకి వస్తే ఎలాంటి చట్ట పరమయిన మార్పులు వస్తాయి? 1.UCC అమలులోకి వస్తే హిందూ వివాహ చట్టం, […]
కుండ కుక్కర్లు ~~ మన ఊరు – మన చరిత్ర
కుండ కుక్కర్లు… మన ఊరు – మన చరిత్ర ****************** ఆదిలాబాదు దగ్గరున్న కేస్లాపురంలో నాగోబా జాతర గొప్పగ నడుస్తున్నది గదా..! దాదాపుగా దేశంలోన వున్న అన్ని రాష్ట్రాల గోండులు లక్షలాదిగా హాజరయ్యే పెద్ద జాతర ఇది. ఈ జాతరలో, కొద్దిగ శ్రద్ధ పెడితే గనుక– మన పురావిజ్ఞానపు విశేషాలెన్నో తెలుసుకోవచ్చు. ఇక్కడి ఫోటోల కనబడుతున్నవి… నాగోబా దేవుని నైవేద్యపు కుండలు. మూతల అమరికలోనే వీటి విశేషత్వం ఉన్నది. ఆవిరి కూడా బయటికి పోకుండ మంచి బిగువైన […]
డ్రామా కంపెనీలోకి కూడా కుమారి ఆంటీని ఫుడ్ డబ్బాలతో సహా పట్టుకొచ్చేశారు..!
మొన్న స్టార్ మా టీవీలో బిగ్‌బాస్ ఉత్సవం షోలోకి ఫుడ్ డబ్బాలతో సహా కుమారి ఆంటీని తీసుకొచ్చారు కదా… జోకులతో సరదాలు చేసుకున్నారు కదా… మరి ఇలాంటి హఠాత్ పాపులర్ స్టార్లను టీవీ తెర మీదకు తీసుకొచ్చు అలవాటున్న ఈటీవీ ఊరుకుంటుందా… శ్రీదేవి డ్రామా కంపెనీ షోలోకి తీసుకొచ్చేశారు… హాయ్ నాన్నా, అందరూ బావున్నారా అని తన అలవాటైన పలకరింపుతో ఈ షోలో ఆంటీ ఏకంగా ఓ ఫుడ్ స్టాలే తెరిచింది… ఈటీవీ ఆస్థాన కమెడియన్లందరూ ఆమె […]
చదివేస్తే ఉన్న మతి పోయినట్టు… వింత తర్కాలతో ఎందుకిలా అభాసుపాలు..?!
Nationalist Narasinga Rao……. ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వంతో ఫైట్ చేయడం / రాజీపడటమ్ అనే నెరేషన్ బిల్డప్ చేయాలని అనే దృక్పథం ఎందుకు …? నిజంగా ముఖ్యమంత్రి కేంద్రంతో ఫైట్ చేసి ఏం సాధిస్తాడు? గుజరాత్ కు 12 ఏండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ కూడా అప్పుడు అన్ని అంశాలలో కేంద్రంతో విభేదించి ఫైట్ చేయలేదు కదా….కేంద్రానికి అయినా రాష్ట్రానికి అయినా ఇచ్చి పుచ్చుకునే దోరణి ఉండటం ఫెడరల్ సిస్టంలో మంచిది… […]
పావులు, పాచికలు… కలియుగానికి ఓ వికృతరూపం భ్రమయుగం…
చూడబోతే అదేదో పురాతన కాలం నాటి ఏదో ఫాంటసీ కథలా కనిపిస్తోంది… సో వాట్… మంచిదే కదా, ఇంట్రస్టింగ్… ఎహె, అంతటి మమ్ముట్టి మరీ ముసలాడిలా, సడెన్‌గా చూస్తే ఎవడో మంత్రగాడిలా కనిపిస్తున్నాడు… వోకే, తప్పేముంది..? పాత్రోచిత ఆహార్యం కావచ్చు… అబ్బా, ఆ డైలాగులు గట్రా ఏదో హారర్ కథలా అనిపిస్తోంది… వావ్, మరీ మంచిది… ట్రెండ్ అదే కదా… అబ్బా, అది కాదు మహాశయా… అదేదో భూతాలు, మంత్రాలు, మాయలు కథలా ఉంది… పర్లేదంటారా..? వోకే […]
ఈ అందగత్తె… హీరోయిన్గా వెలుగుతుందీ అనుకుంటే తల్లిగా సెటిలైంది..!
Subramanyam Dogiparthi…… మా నాన్నగారితో కలిసి చీరాలలో నాజ్ థియేటర్లో చూసా ఈ సినిమాను . 1968 లో బ్లాక్ బస్టర్ . 15 కేంద్రాలలో వంద రోజులు , విజయవాడ దుర్గా కళా మందిరంలో 186 రోజులు ఆడింది . ఎన్నో సినిమాల్లో NTR కు తల్లిగా నటించిన పుష్పలతకు ఈ సినిమా మొదటి సినిమా . NTR కు భార్యగా నటించింది . చాలా అందంగా , చక్కటి నటన కలిగి ఉంది, పెద్ద […]
జగన్ విజయప్రస్థాన యాత్రకన్నా… షర్మిల పాత్ర కత్తిరింపుపైనే సోషల్ చర్చ…
మహి వి రాఘవ … యాత్ర-2 దర్శకుడు… యాత్ర ఫస్ట్ పార్ట్‌ను అందరికీ కనెక్టయ్యేలా, ఎమోషన్స్ కూడా సరిగ్గా చిత్రిక పట్టగలిగి… తీరా యాత్ర సీక్వెల్‌కు వచ్చేసరికి… తనలోని క్రియేటివ్ దర్శకుడిని కోల్పోయాడు అనే విమర్శను ఎదుర్కొంటున్నాడు ఇప్పుడు… జగన్ వ్యతిరేక శిబిరం ఎలాగూ సినిమా మీద ఏదేదో వ్యాఖ్యానాలు చేస్తుంది, అది సహజం… ఇది సాదాసీదా ఓ మసాలా మూవీ కాదు గనుక, వర్తమాన రాజకీయాలతో అల్లబడిన కథ గనుక… ఒక నాయకుడిని బాగా ఎలివేట్ […]
ముద్దపప్పు – మసలవెట్టిన చారు…. ఇగ జూడు, కడుపు కైలాసమే…
Sampathkumar Reddy Matta ……. ముద్దపప్పు – మసలవెట్టిన చారు ~~~~~~~~~~~~~~~~~~~~~~~ ముద్దపప్పు & మసలవెట్టిన చారు.. ఇది తరతరాలుగా వన్నెతరుగని వంట ! సాంబారు గీంబారు.. పేరుతోటి మనం పరాయీకరణకు గురికానప్పటి పాతకాలపు సంప్రదాయకమైన రుచి యిది. బోనం – తీర్థం, పెండ్లి – పేరంటం చుట్టం – పక్కం… సందర్భమేదయినా ఎన్నితీర్ల కాయగూరలు వండుకున్నా సరే అన్నిటికి మొదటిది పప్పు & చారు/ పచ్చి పులుసు. మన ఇంటిమందమే అయితే పచ్చి పులుసు చేసుడు […]
ఇంకేం చేయాలి చెప్మా..! ఇద్దరు బడా స్టార్ల ఎదుట నిలిచిన పెద్ద ప్రశ్న…!!
రజినీకాంత్ వయస్సు 73 ఏళ్లు… తనను ఓ ఫ్యాన్‌లా చూడకపోయినా సరే, తను సాధించిన పాపులారిటీ ఎప్పుడూ అబ్బురం అనిపిస్తుంది… ముదురు ఛాయ, బక్కపలుచని దేహం, పెద్ద అందగాడు కూడా కాదు… ఐనా సరే, ఇండియన్ సినిమా తెర మీద తను ఓ సుప్రీం హీరో… అదీ భాషలకు అతీతంగా… తెలుగు, తమిళం, మలయాళంతోపాటు హిందీ ఎట్సెట్రా… పద్మవిభూషణ్… సీన్ కట్ చేస్తే… చిరంజీవి వయస్సు 68 ఏళ్లు… రజినీకన్నా చిన్నోడే… తను కూడా పద్మవిభూషణ్… తన […]
మోడీ అంచనా మేరకు పాకిస్థాన్ కొత్త ప్రధానిగా మళ్లీ నవాజ్ షరీఫ్..!
Pardha Saradhi Potluri… పార్లమెంట్ కాంటీన్ లో మోడీ ముచ్చట్లు! నేను మిమ్మల్ని కాసేపు విసిగిస్తాను… మోడీ! నిన్న పార్లమెంట్ కాంటీన్ లో భోజనం చేస్తున్న పార్లమెంట్ సభ్యులతో హఠాత్తుగా అక్కడికి చేరుకున్న మోడీ అన్న మాటలు అవి! సహచర సభ్యులతో కలిసి భోజనం చేసిన మోడీ సరదాగా వారితో సంభాషించారు! ఇదెలా జరిగింది అంటే….. భోజనం చేయడానికీ కాంటీన్ కి వచ్చిన మోడీ అప్పటికే అక్కడున్న పలువురు పార్లమెంట్ సభ్యులతో ‘కాసేపు మిమ్మల్ని విసిగిస్తాను, నాతో కలిసి భోజనం చేయండి’ అంటూ […]
మిస్ నాట్ పర్ఫెక్ట్..! త్రిపాఠీ లావణ్యం, నటన అంట్లు తోమడానికే సరిపోయాయ్…!
Ms not so Perfect… సాధారణంగా సీరీస్లు, సినిమాలు చూసిన తర్వాత రివ్యూలు రాయాలంటే మహా బోరు బద్దకం. కానీ ఈ కళాఖండంపై రాయాలనుకునీ రాయకుండా టైం పాస్ చేసా… కానీ, రాయడం వల్ల ఇలాంటి కళాఖండాల బారిన పడకుండా వుంటారని గుర్తొచ్చింది. సరే, ఇంతకీ ఏంటి ఈ కళాఖండం కథాకమామీషు….. డిస్నీహాట్‌స్టార్‌లో కొత్తగా రిలీజయిన ‘Miss Perfect’ గురించి… దీనిలో లావణ్య త్రిపాఠి టైటిల్ రోల్లో నటించింది… ఆమెకి జోడీగా బిగ్‌బాస్ ఫేమ్ అభిజిత్ నటించాడు. దీనిని […]
స్థితప్రజ్ఞత… నిర్వికారం… ఏ సర్టిఫికెట్లూ అక్కర్లేని ఓ శ్రేష్ట మానవుడు…
భారతరత్న పివి… మౌన ముని… పివి చెప్పే పాఠం… అనేక భాషల్లో పివి పాండిత్యం, ఆయన రచనలు, అంతర్జాతీయ విధానాలు, రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా ఆయన తీసుకున్న సాహసోపేతమయిన నిర్ణయాలు, ఇతర పార్టీల నాయకులను గౌరవించిన తీరు, ఆర్థిక సంస్కరణలు, వార్ధక్యంలో కూడా కొత్త విషయాలు నేర్చుకునే ఉత్సాహం…ఇలా పివి గురించి అన్ని విషయాలు అందరికీ తెలిసినవే. సినిమా తారాల్లాంటి వారిని కంటితో చూడాలి. ఘంటసాల లాంటివారిని చెవితో వినాలి. పివి, వాజపేయి […]
ఆ అద్దాలమేడలో ఒక్క గులాబీ పూయలేదు మళ్లీ… పొలమారిన జ్ఞాపకం…
Abdul Rajahussain …. ప్రియురాలి కోసం కట్టిన అద్దాల మేడ…! ప్రవరాఖ్యుడి పోలికల్లో వున్న ఆ శాస్త్రినే చూస్తోంది అందాల ఆ జగదాంబ….! నిగనిగలాడే చంద్రుడు నల్లటి మబ్బుల్లోకెళ్ళి పోయేటప్పటికి ఆ వనమంతా చీకటి ఆవరించింది. అడుగులో అడుగేసుకుంటూ శాస్త్రి దగ్గరకొచ్చిన ఆ జగదాంబ అతన్లో కలిసిపోతోంది.! శృంగారంలో వాళ్ళు స్వరాల్ని పలుకుతుంటే మరి భరించలేని ఆడ నెమలి తన గూడు తలుపులు తెరుచుకొని తమకంలో బయటకొచ్చింది.! కలగలిసి పోతున్నా తనకేసి చూడ్డం సబబు కాదనిపించి విప్పుకుని […]
ఇది మన రజినీకాంత్ సినిమాయేనా…? నిజం చెప్పు ఐశ్వర్యా…!!
రజినీకాంత్ ఇమేజీ అసాధారణం… ప్రేక్షకులు తన నుంచి ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తారు… థియేటర్ విజిళ్లతో దద్దరిల్లిపోవాలి… దశాబ్దాలుగా తనను చూస్తూనే ఉన్నా సరే… తన డైలాగులు, తన మేనరిజమ్స్, తన ఎలివేషన్, ఎమోషన్స్ ఎట్సెట్రా కావాలి… ఏమాత్రం తగ్గినా సరే సినిమా ఢమాల్… ఈ అతి అంచనాలే రజినీకాంత్ సినిమాలకు బలం, బలహీనత కూడా… తను మారలేడు… జనం మారనివ్వరు… అలాగని రొటీన్ మొనాటనస్ సినిమాలు తీస్తే క్రమేపీ తన మీద న్యూట్రల్ ఆడియెన్స్ ఆసక్తిని చంపేసుకుంటున్నారు… […]
- « Previous Page
- 1
- …
- 133
- 134
- 135
- 136
- 137
- …
- 456
- Next Page »