. ఓ వార్త… షణ్ముఖ్ జస్వంత్ అనే ఓ కేరక్టర్… యూట్యూబ్ వీడియోస్, వెబ్ సీరీస్‌తో ఫాఫం బాగానే ఉండేవాడు… బిగ్‌బాస్ (బహుశా 5 సీజన్,..?) లోకి ఎంటరయ్యాక తన జీవితం దుర్భరమైపోయింది… ఆ టీం ఏదో శాసిస్తుంది… దాంతో సిరి హన్మంతు అనే మరో కేరక్టర్‌తో లవ్వు, రొమాన్స్ హౌజులో… ఆమెకు బయట ఒకడున్నాడు… ఇతనికీ బయట ఒకామె ఉంది… కానీ టీఆర్పీల కోసం వాళ్ల నడుమ లవ్ ట్రాక్ నడిపించింది బిగ్‌బాస్… వాడికి రేటింగ్స్ […]
బ్యాంకు ధనం… దోచుకున్నవారికి దోచుకున్నంత మహదేవా…
. రుణ ఎగవేతానందలహరి! అప్పిచ్చువాడు లేని ఊళ్లో ఉండనే ఉండవద్దని శతకకారుడి ప్రబోధం. “ఋణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయాః ఋణక్షయే క్షయం యాంతి కా తత్ర పరిదేవనా” రుణానుబంధమే లౌకిక ప్రపంచానికి అత్యంత కీలకమయినది. బ్యాంకులతో ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు ఉన్నది జన్మ జన్మల అలౌకిక, పారమార్థిక(పారమార్థిక అనగా పరమ ఆర్థిక సంబంధమైన అన్న వ్యుత్పత్తి అర్థం తప్ప ఇంకే అర్థమూ తీసుకోకూడదని మనవి) రుణానుబంధమే. ఆ ఎగవేత దారుణ రుణ భారం తీర్చాల్సింది బాధ్యతగల సగటు […]
నేను క్రిస్టియన్ కాను…. సోనియా మాటల అర్థమేమిటో తెలియదు…
. ‘A Maverick in Politics’… అని ఓ పుస్తకం రాస్తున్నాడు కదా మణిశంకర్ అయ్యర్… లాహోర్‌లో పుట్టిన ఈ 83 ఏళ్ల రాజకీయ నాయకుడు పూర్వాశ్రమంలో ఓ ఫారిన్ సర్వీస్ ఉన్నతాధికారి… డూన్, కేంబ్రిడ్జి విద్యాభ్యాసం సమయంలో రాజీవ్ గాంధీ ఈయనకు జూనియర్… అప్పటి నుంచే సాన్నిహిత్యం ఉంది ఇద్దరికీ… తరువాత పీఎం ఆఫీసులో కూడా పనిచేశాడు ఈయన… మూడుసార్లు లోకసభకు ఎన్నికైనా తరువాత వరుస పరాజయాలు… ఒక దఫా రాజ్యసభ సభ్యుడు… తండ్రి చార్టర్డ్ అకౌంటెంట్… […]
నటన, పాటలు, స్క్రీన్‌ప్లే, కథ, మాటలు, దర్శకత్వం… అన్నీ ఒక్కడే..!
. ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం ) ……. దాసరి మార్క్ సినిమా బుచ్చిబాబు . అన్ని పాటలూ ఆయనే వ్రాసుకున్నారు . ఓ అతిధి పాత్రలో MLA బూతుల పాపయ్యగా కూడా నటించారు . టోటల్ కధ , స్క్రీన్ ప్లే , మాటలు , పాటలు , నటన , దర్శకత్వం అన్నీ ఆయనే . షష్టావతారాలు . ఆ ప్రజాప్రతినిధి పాత్రలో ఓటర్లు ఎంత అమాయకులో , చైతన్యరహితులో కూడా ఉపన్యాసం ఇస్తారు . ప్రజాప్రతినిధుల […]
పుష్ప తొక్కిసలాటలో ఎవరిది తప్పు…? ఓ కథ చెప్పుకుందాం…!!
. Rajasekhar Paruchuri ……. తిలాపాపం – తలా పిడికెడు ఒక గద్ద ఒక పామును తన్నుకుని పోతూంది ఆహారంగా… చావుకి దగ్గరగా ఉన్న పాము తనలో విషాన్ని వదిలిపెడుతుంది. ఆ విషం కిందనే పాలూ, పెరుగు అమ్మకానికి పట్టుకెడుతున్న గొల్లభామ తలమీది గంపలోని ఒక పెరుగు ముంతలో పడుతుంది. అదే సమయానికి, గాలి వీచి ముంతపై కప్పిన గుడ్డ తొలగిపోవడం మూలంగా… ఈ పెరుగు ముంతని ఒక బ్రాహ్మణునికి అమ్ముతుంది గొల్ల భామ… […]
అనూహ్యంగా మార్పు …. మన పూర్వీకుల సూత్రాల వైపు పునఃపయనం…
. ( Nallamothu Sridhar Rao ) ……. పబ్ కల్చర్ నుండి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌కి వస్తున్నారంటే.. విశృంఖలమైన జీవితం నుండి ఆధ్యాత్మికత వైపు వస్తున్నారంటే తెలీట్లేదా? ఒక చిన్న కధతో మొదలుపెడతాను. 20 ఏళ్ల యువకుడు.. ఫ్రెండ్స్‌తో రోజూ చల్లటి బీర్ తాగడం అలవాటైంది.. అది మెల్లగా శృతిమించింది. దాంతో పాటు నైట్ లైఫ్ అంటూ వేకువజాము 2- 3 గంటల దాకా తిరుగుతూ, వేళాపాళా లేకుండా తినడం అలవాటైంది. రెండేళ్లు బిందాస్‌గా గడిచింది. […]
ఇళయరాజా కంట్రవర్సీ… తనే క్లారిటీ ఇచ్చినా తెగని చర్చ, ఆగని రచ్చ…
. వివాదాస్పద వ్యాఖ్యలకు పేరుపడిన నటి కస్తూరి మళ్లీ వార్తల్లోకి వచ్చింది… ఈసారి శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయంలో ఇళయరాజాకు అవమానం గురించి… నో, నో, ఏమిటీ వివాదం..? గర్భగుడిలోకి ఎవరికీ ప్రవేశం లేదు, ఆయనకు జరిగిన అవమానమూ లేదు, నోర్ముయ్యండెహె అన్నట్టు ఓ ట్వీట్ వదిలింది… అసలు వివాదం ఏమిటంటే..? ఆ గుడికి వెళ్లిన ఇళయరాజాకు అక్కడి అధికారులు స్వాగతం పలికారు, ప్రోటోకాల్ మర్యాదలు కల్పించారు… అంటే విశేష దర్శనం ఎట్సెట్రా… 81 ఏళ్ల ఈ స్వరకర్త […]
వహ్ తాజ్ అనాలని ఆ ఉస్తాద్ ఎందుకన్నాడు..! వహ్ యాసీన్..!!
. ( యాసీన్ ఫేస్బుక్ వాల్ నుంచి స్వీకరణ ) …. వహ్_ఉస్తాద్_అని_పిల్లాడంటే… వహ్_తాజ్_అనమని_ఉస్తాద్_ఎందుకన్నాడు? ఇద్దరూ పోటాపోటీగా తబలా వాయిస్తూ ఉంటారు. అద్భుత వాద్యసంవాదం చివర్న చిన్నపిల్లాడు ‘వహ్ ఉస్తాద్’ అనగానే… ‘వహ్ తాజ్’ అనమంటూ ఉస్తాద్‌గారు సరిదిద్దే యాడ్ అది. ‘చాయ్’ కప్పును కాస్త పక్కకు పెట్టేయండి… ‘వహ్ ఉస్తాద్’ అని పిల్లాడంటే ‘వహ్ తాజ్’ అనమని జాకిర్ హుసేన్ ఎందుకన్నాడంటారూ? * * * * * అవి అమాయకమైన మా చిన్నప్పటి రోజులు. […]
ఆన్లైన్ అంటే అదోరకం సంత… చచ్చులు పుచ్చులూ ఉంటయ్…
. ( Shankar G ) …… మనం ఆన్లైన్ షాపింగుల గురించి కదా చర్చించుకుంటున్నది… సరే, ఇంకాస్త ముందుకెళదాం… ఆన్లైన్ షాపింగ్ సంతలో కూరగాయలు కొనటం లాంటిదే. చచ్చులు పుచ్చులతో పాటు మంచివి కూడా ఉంటాయి. అనుభవం ఉన్నవాళ్లయితే ఏరి ఏరి మరీ మంచివి తీసుకుంటారు. ఆన్లైన్ షాపింగ్ T Shirts… T shirts బ్రాండ్స్ ఎక్కువ శాతం సైజ్ సమస్య ఉండదు. ఏ బ్రాండ్ తీసుకున్నా కొంచం అటు ఇటుగా […]
సంధ్య థియేటర్ , అల్లు అర్జున్ కేసు మరింత బిగుసుకుంది..!
. నిన్ననే చెప్పుకున్నాం కదా, అల్లు అర్జున్ మీద కేసు మరింత బిగసుకుంటోందని… అదే జరుగుతోంది… పుష్ప2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటుచేసుకుని, రేవతి అనే మహిళ మృతిచెందడం, ఆమె కొడుకు ఐసీయూలో ఉండటం… థియేటర్ బాధ్యులతోపాటు అల్లు అర్జున్ మీద కూడా కేసులు పెట్టి పోలీసులు అరెస్టు చేసి, జైలుకు తరలించడం తెలిసిందే… సరే, అల్లు అర్జున్ హైకోర్టుకు వెళ్లి మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నాడు… కానీ రెగ్యులర్ బెయిల్‌కు దిగువ […]
చీలమండ బెణుకు కాదు… హీరో ప్రభాస్‌కు వేరే హెల్త్ ఇష్యూస్…
. ప్రభాస్ గాయం… ఈ వార్త అన్నింటిలోనూ వచ్చిందే… పాన్ ఇండియా స్టార్, వేల కోట్ల ప్రాజెక్టులు తన మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి తన ఆరోగ్య స్థితి మీద ఆసక్తి, వార్తా ప్రాధాన్యం సహజమే… వార్త ఏమిటీ అంటే..? తను ఏదో షూటింగులో గాయపడ్డాడు, అందుకని జపాన్‌లో కల్కి ప్రమోషన్ కోసం వెళ్లలేకపోయాడు… ఈమేరకు తన టీమ్ ఓ ప్రకటన విడుదల చేసింది… జపాన్‌లో తనకు డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు… సో, జపనీస్ భాషలోనే అక్కడ […]
అయ్యో మనోజ్… సొంత తల్లి కూడా నెగెటివ్ అయిపోయింది బ్రో…
. ఓ మంచి సినిమా కథలా… ఆ సినిమా కుటుంబం కథ కూడా చాలా ట్విస్టులు తిరుగుతోంది… ఇన్నాళ్లు తండ్రీ కొడుకులు, అన్నాదమ్ముళ్లకు పరిమితమైన తాజా కొట్లాటల కథలోకి తల్లులనూ తీసుకొచ్చారు… మోహన్‌బాబు రెండో భార్య, అనగా మంచు మనోజ్ తల్లి పేరిట ఓ లేఖ ప్రచారంలోకి వచ్చింది… రావడమే కాదు, ఏకంగా ఆ లేఖ తన కొడుక్కి వ్యతిరేకంగా ఉండటం సంచలనం… (మంచు విష్ణు, మంచు లక్ష్మి తల్లి వేరు… మంచు మనోజ్ తల్లి వేరు […]
ఆన్లైన్లో బట్టలు కొంటున్నారా..? జాగ్రత్త… నాసిరకం అంటగడతారు..!!
. ( Shankar G ) …. ఆన్లైన్ షాపింగ్… ఇవీ జాగ్రత్తలు… నేను దాదాపుగా 15 సంవత్సరాలుగా ఆన్లైన్ లోనే కొంటున్నాను. మొదట జబాంగ్ లో కొనేవాణ్ని. అది కాస్త మింత్రాగా మారిపోయింది. ఆ మింత్రా ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ తో అసోసియేట్ అయ్యింది. ఇవికాకుండా అమెజాన్, అజియో, టాటా క్లిక్, NN NOW, nyaka ఫ్యాషన్ లాంటి వాటిల్లో కూడా purchase చేసేవాణ్ణి. సైజ్ సెలక్షన్… మొదట సైజ్ ఎంచుకోవటంలో బాగా ఇబ్బంది పడేవాన్ని.. ఒక్కో బ్రాండ్ […]
ఆ చదరంగం పోటీలో అసలు విన్నర్… నిర్మలా సీతారామన్..!!
. ( రమణ కొంటికర్ల ) గుకేష్ విజయంతో… ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ ఇప్పుడు అభినందనలను తన బ్యాగులో వేసుకుంటోంది. ఇంతవరకూ ఎవ్వరూ సాధించని రికార్డును 18 ఏళ్లకే సాధించి… ప్రపంచ చదరంగాన్నే ఆశ్చర్యపర్చిన గుకేష్ కు.. నాల్గున్నర కోట్లకుపైగా ఆదాయపన్ను విధించడంతో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ పరపతి అమాంతం పెరిగిపోయింది. కేవలం వ్యక్తిగత దూషణలు, వ్యక్తులపై మాత్రమే సెటైర్స్ అధికంగా కనిపించే సోషల్ మీడియా సైట్స్ లో… ఇప్పుడు ఆదాయపన్ను వంటి […]
ఏందయా ఇదీ… ఇదేందయా ఇదీ… ఇది నేనెప్పుడూ చూడలా…
. కప్పు టీ లక్ష రూపాయలు… బంగారు టీ, కాఫీ “నీ ఇల్లు బంగారం కాను…” అని మాటవరసకు ఆశ్చర్యపోతాం కానీ… మన మాట పొరపాటునైనా నిజమవుతుందని తెలిస్తే… కలలో కూడా అనం. చరిత్రలో నిలిచిపోయినదంతా సువర్ణాక్షర లిఖితమే కావాలి. మంచిదేదయినా బంగారంతో పోల్చాల్సిందే. బంగారంలాంటి ఇల్లు; బంగారంలాంటి సంసారం; బంగారంలాంటి మనసు; బంగారు పాప; బంగారు తొడుగు; నిలువెత్తు బంగారం; బార్న్ విత్ గోల్డెన్ స్పూన్; మన బంగారం మంచిదైతే…; బంగారు గాలానికి బంగారు చేపలు పడవు; […]
ఫక్తు రొటీన్ సినిమా కథ… హిట్ పాటలతో నూరు రోజుల ఉత్సవం…
. ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం ) …. కృష్ణ శ్రీదేవిల జైత్రయాత్రలో మరో సినిమా ఆగస్టు 1980 లో వచ్చిన ఈ చుట్టాలున్నారు జాగ్రత్త . కధ రొటీనే అయినా ప్రముఖ నటుడు , నిర్మాత బాలయ్య బిర్రయిన స్క్రీన్ ప్లే సినిమాను ఏడు సెంటర్లలో వంద రోజుల వైపు నడిపించింది . చాలా సినిమాల్లో మంచి మారాజుల్ని నమ్మించి మోసం చేసేది చుట్టాలు , చుట్టూ ఉండేవారు . ప్రపంచంలో మోసగించబడేది ఎప్పుడూ మంచోళ్ళు , […]
వారెవ్వా… తెలంగాణ సర్వీస్ కమిషన్ – ఆంధ్రా ప్రశ్నల పరీక్షలు…
. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 ప్రశ్నలను ఆంధ్రా మేధావులు రూపొందించారా? తెలంగాణ అస్తిత్వానికి సంబంధంలేని, తెలంగాణ ఏర్పాటును నిలువెల్లా ద్వేషించిన వారి ప్రస్తావనలు, తెలంగాణ ఏర్పాటు కాకూడదని చివరి క్షణం దాకా విఫలయత్నాలు చేసిన వారి వివరాలు తెలంగాణ పరీక్షల్లో ఎందుకు అడిగారు? అని గుండెలు బాదుకోవడం దండగ… ఆమధ్య “ముతక మరణాలు, ముతక జననాలు” అని పరమ ముతక భాషతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థులకు ఎలా చుక్కలు చూపించిందో చెప్పుకున్నాం కదా… […]
యండమూరి రాస్తున్న చిరంజీవి బయోగ్రఫీ ఆగిపోయింది…
. ( యండమూరి వీరేంద్రనాథ్ ) …….. తన జీవిత చరిత్ర వ్రాయటం మరి కొంతకాలం ఆపుదాం- అన్నాడు చిరంజీవి. సగం రాసిన ఆ పుస్తకాన్ని మరి కొన్ని నెలల/ ఒకటి రెండు సంవత్సరాల పాటు ఆపడం జరుగుతుంది. ఈ లోపు ఖాళీగా ఉండకుండా మనసుకు చాలా సంతృప్తినిచ్చే మరో పుస్తకం ప్రారంభించాను. (ఫొటో: మా ఇంటికి వచ్చిన విశిష్ట అతిథులు. కోచ్ రమేష్. ఆయన తీర్చిదిద్దిన శిష్యురాలు ప్యారిస్ పారా ఒలింపిక్స్ మెడలిస్ట్ దీప్తి, మాజీ […]
అయ్యా కోమటిరెడ్డి అమాత్యా…? ఈ వార్త తమరు చదివారా..? విన్నారా..?
. కోమటిరెడ్డి వెంకటరెడ్డి… రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ చూసేది ఈయనే… పుష్ప2 సినిమాలకు అడ్డగోలు రేట్లు, బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చింది ఈయన నేతృత్వంలోని ఉన్నతాధికారులే… ఆ బెనిఫిట్ షో కాస్త సంధ్య థియేటర్లో ఓ మహిళ మృతికి, ఓ పిల్లాడి చావుబతుకుల దుస్థితికి, అల్లు అర్జున్ అరెస్టుకు, రేవంత్ ఢిల్లీ వివరణకూ, జాతీయ స్థాయి చర్చకూ దారితీసిన సంగతీ తెలిసిందే కదా… ఇదే మంత్రి ఏమన్నాడు..? నో, నాటెటాల్, నెవ్వర్… ఇకపై నో బెనిఫిట్ […]
ఇది అర్థమైతే మీ టేస్ట్, మీ రేంజ్ గొప్పది… ఓసారి ట్రై చేయండి…
. … ప్రసేన్ బెల్లంకొండ…. మెదడుకు చెమట పట్టించుకుంటూ కఠోర దీక్షతో పుస్తకాలు చదవాల్సొచ్చే వయసొకటుంటుంది. సాహిత్యం అపుడపుడే పరిచయం అవుతున్నకాలంలో నువు ఫలానా పుస్తకం చదవలేదా ‘ వెవ్వెవ్వే ‘అని అంటారేమో అన్న ఆందోళన పీడించే వయసది. నాకది నలభైనాలుగేళ్ల క్రితం. ఇప్పుడు అలా నేను అప్పుడు చదివిన ఓ నవల ఆధారంగా తీసిన వెబ్ సిరీస్ గురించి మాట్లాడాలి. వాడెవడో మనకు తెల్వదుగానీ అప్పుడందరూ మార్వ్కెజ్ అని ఏదేదో మాట్లాడుకుంటున్నారు. అదేదో హండ్రెడ్ ఇయర్స్ […]
- « Previous Page
- 1
- …
- 13
- 14
- 15
- 16
- 17
- …
- 460
- Next Page »