“నమ్మరే! నేను మారానంటే నమ్మరే! నేనొకనాడు దొంగని అయితే మాత్రం ఏం? బాగుపడే యోగం లేదా? బ్రతికే అవకాశం ఈరా ? చెడినవాడు చెడే పోవాలా ? పాతిపెట్టిన పాతబ్రతుకు వలవేస్తుంది కోరుకున్న కొత్త జీవితం వెలివేస్తుంది కష్టం చేస్తానంటే కాదంటారే? నా శ్రమలో ద్రోహం ఉందా? నా చెమటలో దోషముందా? ఎవరు నమ్మకున్నా… నన్ను నమ్ముకున్న వారున్నారే… వాళ్ళేం కావాలి? నేనేం చేయాలి?” సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఘంటసాల చిత్రం: […]
ఏదో ఓ చిన్నమాట… మనసు చిట్లిన చప్పుడు… తరువాత అంతా నిశ్శబ్దమే…
Prabhakar Jaini….. మనుషులు ఎందుకు మన చేజారిపోతారు..? ఆత్మీయులను కాపాడుకుంటున్నారా? అసలు మీరెంత మందిని చేజార్చుకున్నారో ఎప్పుడైనా లెక్క చూసుకుంటున్నారా? —….. ‘భారత సినీ ప్రేక్షకుల్ని ఉర్రూతలూపిన ‘బాబీ’ మొన్నటి సెప్టెంబర్ 28కి యాభై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇవాళ్టికీ దేశంలోని అన్ని భాషల్లో ఏదైనా టీనేజ్ ప్రేమకథ తీస్తూంటే గనక అది ఏదో ఒక మేరకు ‘బాబీ’కి కాపీ. ఆ సినిమా ఇచ్చిన ఫార్ములాతో వందలాది కథలు వచ్చాయి. వస్తాయి. ‘మేరా నామ్ జోకర్’ తీసి […]
గుంజన్ సక్సేనా..! స్ట్రెయిట్‌గా, నీట్‌గా… ఏమాత్రం దారితప్పని ఓ బయోపిక్..!
నాలుగేళ్లయింది ఈ సినిమా వచ్చి..! సినిమా పేరు గుంజన్ సక్సేనా, ది కార్గిల్ గరల్… నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాల సెర్చింగులో కనిపిస్తే దాని వెంట పరుగు తీసింది దృష్టి… ఈమధ్య హృతిక్ రోషన్ సినిమా ఒకటి ఫైటర్, మన వరుణ్ తేజ సినిమా ఆపరేషన్ వాలెంటైన్ మరొకటి ఎయిర్ ఫోర్స్ వార్ మీద వచ్చాయి… అంతేకాదు, కంగనా రనౌత్ సినిమా కూడా ఒకటి వచ్చినట్టు గుర్తు (తేజస్..?)… వీటన్నింటికన్నా ముందే వచ్చింది ఈ గుంజన్ సక్సేనా… కరణ్ జోహార్ […]
ద్రౌపది ముర్ముపై పినరై విజయన్ పిటిషన్… సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేనా..?!
కేరళ ప్రభుత్వం ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మీద సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ వేసింది… విషయం ఏమిటంటే..? ఆమె నాలుగు బిల్లులను పాస్ చేయకుండా తన వద్ద పెండింగ్‌లో ఉంచుకున్నారని..! సరే, ఆ బిల్లులు ఏ అంశాలకు సంబంధించినవీ అనేది పక్కన పెడితే… రాష్ట్రం పంపించిన ప్రతి బిల్లును రాష్ట్రపతి పాస్ చేయాలనేమీ లేదు… రాష్ట్రపతి పరిశీలన, విచక్షణతోపాటు, కేంద్రప్రభుత్వ అభిప్రాయం, రాజ్యాంగబద్ధత, సమాజంపై ప్రభావం వంటి చాలా కారణాలుంటయ్… సరే, సుప్రీంకోర్టులో ఆమెతోపాటు ఆమె సెక్రెటరీ, […]
చిట్టిచెల్లెలు… ఇలాంటి కథలు, ఎన్టీవోడి నటన మళ్లీ చూడగలమా…?
Subramanyam Dogiparthi……. వాణిశ్రీ జైత్రయాత్రలో మరో సినిమా 1970 లో వచ్చిన ఈ చిట్టిచెల్లెలు సినిమా . NTR- సావిత్రిల రక్తసంబంధం సినిమాలో సూరేకాంతం అన్నాచెల్లెళ్ళను హింసిస్తే , ఈ చిట్టిచెల్లెలు సినిమాలో అన్నను విధి హింసిస్తుంది . NTR నటన అద్భుతం . చిన్నప్పటి నుంచి తానే తల్లీతండ్రయి చెల్లెల్ని పెంచి , విధి ఆడిన నాటకంలో తన తండ్రే చెల్లెలు భర్తను హత్య చేస్తే , ఆ నిజాన్ని చెల్లెలుకు తెలియకుండా , బిడ్డను […]
ఆ 370 సీట్లు గనుక వస్తే… అప్పుడిక మోడీ అసలైన రాజసూయ యాగం..!!
మా చంద్రబాబు మోడీ ఎదుట ఎందుకు మోకరిల్లాల్సి వచ్చిందీ అనే వివరణ ఇచ్చుకోవడానికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఓ సుదీర్ఘమైన ‘కొత్త పలుకు’ రాయాల్సి వచ్చింది… రాజీపడకపోతే ప్రాంతీయ పార్టీల నేతలందరూ దెబ్బతినిపోతున్నారు అని బోలెడు ఉదాహరణలూ ఇచ్చి, మోడీ రాజసూయ యాగం చేస్తున్నాడు అని ముక్తాయించాడు… సో, చంద్రబాబుకు తప్పలేదు అని తేల్చేశాడు… అంతేకాదు, మోడీ వ్యక్తిపూజ దేశంలో, బీజేపీలో ఎక్కువైందీ, గతంలో ఇందిరాగాంధీ కూడా ఇలాగే వ్యవహరించి దెబ్బతినిపోయింది అంటూ చురకలు కూడా వేశాడు… సరే, […]
‘సంగీత కళానిధి’ అవార్డు మీద తమిళనాట ఓ కొత్త రచ్చ… విద్వాంసుల కొట్లాట…
కేరళలో ఆర్ఎల్వి రామకృష్ణన్ అనే దళిత మోహినీయాట్టం కళాకారుడని చిన్నబుచ్చుతూ సత్యభామ జూనియర్ చేసిన ద్వేష వ్యాఖ్యల గురించి చెప్పుకున్నాం కదా… ఇదేమో తమిళనాడులోని వివాదం… ఇది కర్నాటక సంగీతం గురించి… ఈ వివాదం ఆ సంగీత పరంపరలో ధిక్కారిగా పేరొందిన టీఎం కృష్ణకు సంబంధించింది… పెద్దగా మీడియా ఫోకస్ చేయడం లేదు, తెలుగు మీడియాకు అసలు ఇలాంటి వాటిపై అసలు ఆసక్తే ఉండదు, కానీ తమిళనాడు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నయ్… కృష్ణకు మద్దతుగా, […]
Swatantrya Veer Savarkar… మరో ప్రాపగాండా మూవీ అట్టర్ ఫ్లాప్…
నో డౌట్… స్వతంత్ర వీర సావర్కర్ అనే తాజా సినిమా ఖచ్చితంగా బీజేపీ భావజాల వ్యాప్తికి ఉద్దేశించిన సినిమా… పొలిటికల్ ప్రాపగాండా కోసమే… అందుకే సరిగ్గా ఎన్నికల ముందే ఇవి రిలీజ్ అవుతుంటయ్… ఐతే ఈ సినిమా డిజాస్టర్… జస్ట్, కోటి రూపాయలు వసూలు చేసింది రెండు రోజుల్లో… ఒక రాజకీయ పార్టీ భావజాల వ్యాప్తికి సినిమాల్ని తీసి, జనంలోకి వదలడం సరైందేనా అనే చర్చలోకి ఇక్కడ వెళ్లడం లేదు… ఇన్నాళ్లూ సావర్కర్ మీద యాంటీ -హిందూ […]
అబ్సర్డ్… ఆయుర్వేదాన్ని సమర్థిస్తే అల్లోపతి వైద్యానికి వెళ్లకూడదా ఏం..?
Nallamothu Sridhar Rao …. ఏ వైద్య విధానం సరైనది? ప్రతీ దాంట్లో వాదించుకోవడమే మనకు ఇష్టమా? ఇంగ్లీష్ మెడిసిన్ (అల్లోపతి) గొప్పదా, ఆయుర్వేదం గొప్పదా, హోమియో గొప్పదా, ఎనర్జీ మెడిసిన్.. ఇలా ఏవి గొప్పవి అని ఎవరివారు వాదించుకోవడం పూర్తిగా అర్థరహితం. చిన్న ఉదాహరణతో మొదలుపెడతాను. మీకు జలుబు వచ్చింది అనుకోండి.. ముక్కులు కారుతుంటే, కొద్దిగా పసుపు వేడి నీటిలో వేసి ఆవిరి పట్టడం చేస్తారు. పెద్ద పెద్ద ఇంగ్లీష్ మెడిసిన్ స్పెషలిస్టులు కూడా ఇదే […]
ఈడీ ఒక్క స్విచ్ నొక్కితే రెండు లైట్లు ఆరిపోయాయి! కపిల్ సిబల్‌కు డబ్బేడబ్బు…
ఒక్క స్విచ్ నొక్కితే రెండు లైట్లు ఆరిపోయాయి! మొదటి బల్బు కవిత! రెండో బల్బు కేజ్రీవాల్! తనని అరెస్ట్ చేయటం అక్రమం అంటూ కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. మొన్న రాత్రి కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయక ముందే ఆప్ నాయకులు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమం అంటూ! నిన్న ఉదయం సెషన్ లో కవిత పిటిషన్ సుప్రీం కోర్టు డివిజన్ బెంచ్ ముందు విచారణకు వచ్చింది. కపిల్ సిబాల్ కవిత […]
కళాకారులు కొన్నిసార్లు కాకులవుతారెందుకో? తమ అసలు నలుపు తెలియరెందుకో?
… నలుగురు కూడిన చోట ఎవరి గురించైనా చెడ్డగా మాట్లాడుకుంటూ ఉంటే ‘లోకులు పలు కాకులు’ అంటాం! పాపం కాకులు ఏమి చేశాయి? కావ్.. కావ్ అని అనడం తప్ప! కొన్నిసార్లు కొందరు కళాకారులు కూడా అలా కాకులవుతారు. ఆ కాకులకంటే దారుణంగా అరుస్తుంటారు. తమ అసలు నలుపు తెలియక తమ అరుపుల్ని సమర్థించుకుంటూ ఉంటారు. … కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఉన్న కళామండలం కళాకారులకు పుణ్యధామం. 1930లో వి.నారాయణ మీనన్ ఆ సంస్థను ప్రారంభించారు. అక్కడ […]
ఇది కదా చదివి పొంగిపోవాల్సిన వార్త! పదిమందికీ షేర్ చేయాల్సిన వార్త!
పోరాడితే పోయేదేమీ లేదు… ఒక తల్లీ కూతుళ్ల సాహసగాథ ఇది కదా చదవి పొంగిపోవాల్సిన వార్త! ఇది కదా చూసి అభినందించాల్సిన వార్త! ఇది కదా పదిమందికి షేర్ చేయాల్సిన వార్త! ఇంట్లో ఈగలకు, దోమలకు, నల్లులకు, బల్లులకు; వీధిలో పిల్లులకు, కుక్కలకు నిలువెల్లా వణికిపోయే మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన వార్త ఇది. హైదరాబాద్ బేగంపేట అంటే నగరం నడి బొడ్డు. మధ్యాహ్నం ఒకటిన్నర అంటే పట్ట పగలు. గుమ్మం ముందు ఇద్దరు యువకులు తుపాకీ పట్టుకుని…ఏయ్! కదిలారో […]
బాపు ఫీల్ గుడ్ సినిమా… ఆ బాలనటుడే సినిమా మొత్తం మోశాడు…
Subramanyam Dogiparthi ……… బాలరాజు కథ… ఇది బాపు గారి సినిమా . బాగుంటుంది . సినిమా సింహ భాగం మహాబలిపురం నేపధ్యంలో సాగుతుంది . Feel Good Movie . మాస్టర్ ప్రభాకరే సినిమాకు కధానాయకుడు . ఆరిందాలాగా నటించాడు . Happy go lucky go character . బాల భారతంలో దుర్యోధనుడిగా నటించింది ఈ మాస్టర్ ప్రభాకరే . తమిళంలో హిట్టయిన వా రాజా వా సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా […]
కనువిప్పేమీ కాదు… మాల్దీవుల అధ్యక్షుడివి ధోకేబాజ్ మాటలు…
ముందుగా ఓ తాజా వార్త చదవండి… ‘‘మాల్దీవుల ప్రెసిడెంట్ మొహమ్మద్ ముయిజ్జూ తన స్టాండ్‌ను మార్చుకుని, భారతదేశం మాల్దీవులకు అత్యంత సన్నిహిత మిత్రుడు అని చెప్పాడు, మొహమ్మద్ ముయిజ్జూ ఇప్పుడు PM మోడీ నుండి రుణ విముక్తిని కోరుతున్నాడు, మాల్దీవులు గత సంవత్సరం చివరినాటికి భారతదేశానికి 400.9 మిలియన్లు బకాయిపడింది… మాల్దీవులకు సహాయం అందించడంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుంది, అత్యధిక సంఖ్యలో ప్రాజెక్టులను అమలు చేసింది…” అని అతను భారతదేశాన్ని ప్రశంసించాడు… మాల్దీవులు ఓ దీవి… […]
నా ఇంటి గడప తొక్కకుండా నా భర్తను కట్టడి చేయండి యువరానర్…
మిత్రుడు సూర్యప్రకాష్ జోశ్యుల వాల్ మీద కనిపించింది ఈ పాత వార్త… రూపవాణి పత్రికలో అనుకుంటా, పబ్లిషైంది… 1960 బాపతు సంచిక అయి ఉంటుంది… ఈమధ్య నటి జయలలిత అనుభవాలు, సినిమా నటి లక్ష్మి మీద ఆమె మాజీ భర్త చేసిన వ్యాఖ్యలు గట్రా చర్చనీయాంశమయ్యాయి… నాటి పాత ముచ్చట్లన్నీ వార్తల్లోకి వస్తున్నాయి… అఫ్కోర్స్, ఇప్పుడైతే మరీ సినిమా సెలబ్రిటీల ప్రేమలు, సహజీవనాలు, పెళ్లిళ్లు, బ్రేకప్పులు, విడాకులు, గృహహింస, కేసులు గట్రా కామన్ అయిపోయాయి… కానీ అప్పుడెప్పుడో […]
ఈ కవిత అరెస్టు సరే… ఆ తమిళ కనిమొళి 2జీ కేసుకూ కాళ్లొచ్చినయ్…
కేవలం విపక్ష పార్టీల మీదకే ఈడీలు, ఐటీలు, సీబీఐలను ఉసిగొల్పి, అరెస్టులు చేయించి, బీజేపీ ఏకపక్ష న్యాయాన్ని అమలు చేస్తోందనీ, తన పార్టీలో చేరితే హఠాత్తుగా సచ్చీలురైపోతున్నారనే విమర్శలు చాన్నాళ్లుగా ఉన్నవే… పోనీలే, అలాగైనా కొంతమంది అక్రమార్కులు బయటపడుతూ కటకటాల వెనక్కి చేరుతున్నారు కదానే అల్ప సంతోషం కొందరిది… హేమంత్ సోరెన్ అరెస్టు… కేజ్రీవాల్ అరెస్టు… కవిత అరెస్టు… ఈ వార్తల నడుమ మరో ముఖ్యమైన పరిణామం పెద్దగా ఫోకస్‌లోకి రాలేదు… అది డీఎంకేకు సంబంధించి…! టూజీ […]
‘‘ఆ బెడ్రూం మూలుగులు, నిట్టూర్పులు, పలవరింతలు ఆపించండి సార్’’
సాధారణంగా ఇరుగూపొరుగూ ఇళ్ల నడుమ గొడవలు పెద్ద విషయమేమీ కాదు… కామన్… కలిసే ఉంటారు లేదా కలహించుకుంటారు, వాళ్ల మీద వీళ్లు, వీళ్ల మీద వాళ్లు చాడీలు చెప్పుకుంటారు… నడుమ ఉండే గోడకు చెవులు అతికించుకుంటారు… ఉన్నవీ లేనివీ, ఉన్నవాటికి అతిశయోక్తులు, భూతద్దాలు గట్రా అతికించబడతాయి కూడా… వినేవాళ్లకూ ఓ సరదా, నవ్వుకుంటారు… ఇండిపెండెంట్ ఇళ్లకన్నా అపార్ట్మెంట్లలో ఇవి మరీ అధికం… కామన్ వాల్స్, కామన్ స్పేస్ ఎక్కువ… కామన్ సెన్స్ తక్కువ కదా… ఐనా సరే, […]
తెల్లని పైజామాలో మెల్లగా అతి సాదా సీదా మేరుపర్వతంలాగా వచ్చాడు
Taadi Prakash… అబూ శిఖరం అంచుల్లో …. Artist Mohan on Alltime Great Abu Abraham ……………………… శనివారం సాయంత్రంలో విశేషమేముంటుంది గనక!సవాలక్ష సాయంత్రాల్లో అదో బోరు సాయంత్రం.కానీ ఆఫీసు టేబుల్ మీది చెత్త మధ్య ఒక చిన్న మెసేజ్. “అబూ అబ్రహాం మిమ్మల్ని ఫోన్ చేయమన్నారు.” గుండె ఆగిందో తెలీదు. కొట్టుకుందో తెలీదు. హడావుడిగా ఫోన్ చేస్తే అవతలి నుంచొక గంభీరమైన గొంతు,యెహోవా మబ్బుల్లోంచి మాట్లాడినట్టుగా,గంటలో రమ్మన్నారాయన. వట్టి చేతుల్తో వెళ్ళేదేలా? త్వరత్వరగా ఓ […]
‘‘అరవింద్ కేజ్రీవాల్ పైకి కనిపించేంత ప్రజాస్వామ్య నాయకుడేమీ కాదు’’
కేజ్రివాల్ విజువల్ పర్సన్, విజన్ ఉన్న పర్సన్, సీ, లుకింగ్, బ్రైట్ లాంటి విజువల్ పదాలు ఆయన మాటల్లో తరచూ వినిపిస్తాయి. ఆయన కంటి కదలికలు, చేతుల కదలికలు కూడా అదే విషయాన్ని ధ్రువపరుస్తాయి. ఏ విషయం గురించైనా మాట్లాడేటప్పుడు ఆయన మొదట ఎడమవైపు పైకి చూసి తర్వాత నేరుగా చూస్తారు. అంటే ఆయన తన జ్ఞాపకాలు, అనుభవాల్లోంచి కావాల్సిన సమాచారాన్ని సేకరించి మాట్లాడుతున్నారని అర్ధం. అంతేకాదు ఆయన నిజాన్నే మాట్లాడుతున్నారని ఈ కంటి కదలికలు చెబుతాయి. […]
కన్నీటిని తుడిచి, సాయం చేసే ఆమె చేతులకు అవినీతి మరకలు…
సంపాదించుకున్న మంచి పేరు పోవడానికి, సమాజానికి మొహం చూపించుకోలేని స్థితికి రావడానికి ఏదో ఒక్క సంఘటన చాలు… ఏసీబీ వలలో మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిందనే ఫోటో, వార్త చూశాక అదే ఆశ్చర్యమేసింది… మంచి సమాజ సేవికగా, మంచి మనస్సున్న అధికారిణిగా సోషల్ మీడియాలో, మీడియాలో బాగా పాపులరైన ఆమె ఒక్కసారిగా అథఃపాతాళానికి పడిపోయినట్టుగా ఉంది… అఫ్ కోర్స్, అవినీతి వ్యవహారాలు ఉన్నవాళ్లు ఆ సంపాదనను పది మందికీ పంచకూడదని, మంచి మనస్సు ఉండకూడదని […]
- « Previous Page
- 1
- …
- 148
- 149
- 150
- 151
- 152
- …
- 483
- Next Page »