Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తెలుగు రాంబో..! ఫస్ట్ బ్లడ్ హాలీవుడ్ కథకు అచ్చమైన తెలుగీకరణ..!!

April 15, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ……… చిరంజీవిని శాశ్వతంగా ప్రేక్షకుల గుండెల్లో ఖైదు చేసిన సినిమా ఈ ఖైదీ . నవరసాల సమ్మేళనం , సమ్మిళితం . కలిసొచ్చేటప్పుడు అన్నీ నడుచుకుంటూ , కాదు కాదు , పరుగెత్తుకుంటూ వస్తాయి .

మొదటగా మెచ్చుకోవలసింది పరుచూరి బ్రదర్సునే . ఫస్ట్ బ్లడ్ ఇంగ్లిషు సినిమాలో కొన్ని సన్నివేశాల స్పూర్తితో అద్భుతమైన కధను , ఆ కధకు తగ్గట్లుగా తూటాల్లాంటి మాటల్ని వ్రాసారు .

Ads

ఆ తర్వాత బిర్రయిన స్క్రీన్ ప్లే , దడదడలాడించే కధనంతో సినిమాను పరుగెత్తించాడు దర్శకుడు కోదండరామిరెడ్డి . ముఖ్యంగా చిరంజీవి , మాధవిల నృత్య గీతాలు . అత్యంత సుందరంగా చిత్రీకరించాడు . నృత్య దర్శకుడు సలీంను , అతని ట్రూపుని ప్రత్యేకంగా అభినందించాలి .

రగులుతుంది మొగిలి పొద , వేదం నాదం మోదం మోక్షం అన్నీ నీలో చూసానే . ఏం వ్రాసారండి వేటూరి ! ఈ రెండు పాటల్లో ఏ పాట చిత్రీకరణ బాగుంటుంది అంటే చెప్పడం కూడా కష్టమే . వేదం నాదం పాటలో సాహిత్యం చాలా గొప్పగా ఉందని అనిపిస్తుంది నాకు .

ఇంక రగులుతుంది మొగిలిపొద పాట , నృత్యం . మనుషులు నృత్యించినట్లుగా ఉండదు . నాగరాజు , నాగిని నృత్యించినట్లుగానే ఉంటుంది . (ఈ పాటల్లో రొమాంటిక్ ఫోజుల్లాంటివే వసంత కోకిలలో కమల్‌హాసన్ స్మిత నడుమ… మళ్లీ రాక్షసుడు సినిమాలో చిరంజీవి జయమాల నడుమ కనిపిస్తాయి…)

బాలసుబ్రమణ్యం , సుశీలమ్మలు ఎంత శ్రావ్యంగా పాడారో ! మరో రెండు డ్యూయెట్లు . ఒకటి ఇదేమి అబ్బా , రెండోది గోరింట పూసింది గోరింక కూసింది గొడవేమిటే రామచిలుకా . కూసింది !! వేటూరికే చెల్లింది .

చిరంజీవి నట విరాట రూపం ఆవిష్కరించబడింది ఈ సినిమాలో . చిరంజీవి నవరసాలను ఆవిష్కరించాడు . ముఖ్యంగా శృంగారం , కరుణ , రౌద్రం , వీరం , బీభత్సం , శాంత రసాలను గొప్పగా పోషించారు . ఆప్తులయిన తండ్రిని అక్కని శ్రేయోభిలాషి అయిన డాక్టర్ని పోగొట్టుకున్న వ్యక్తిగా , ఫ్యూడలిస్టు క్రౌర్యానికి నష్టపోయిన పేదవాడిగా మారణ హోమాన్నే సృష్టిస్తాడు .

పగ ప్రతీకారాలను స్టెన్ గన్నుతో తీర్చుకునే క్లైమాక్స్ సీన్ సినిమాకే హైలైట్ . ఇలా వ్రాసుకుంటూ పోతే ఓ థీసిసే అవుతుంది . But , the movie deserves it .

చిరంజీవి- మాధవి . వీళ్ళిద్దరి కెమిస్ట్రీ మీద ఆరోజుల్లో చాలా పుకార్లే వచ్చాయి . అంత బాగా ఒదిగిపోయారు ఒకరిలో ఒకరు . ఈ రెండు పాత్రల తర్వాత ప్రేక్షకులు మరచిపోలేని పాత్ర సుమలతకు దక్కింది . బాగా నటించింది .

మాధవి

అలాంటిదే గలగలా పారే నదిలాంటి పాత్ర సంయుక్తది . ప్రేక్షకులు మరచిపోరు . తమిళంలో నిత్య అనే పేరుతోనే నటించేది . ఈ సినిమాకు సంయుక్త అని నామకరణం చేసారు . (తమ బ్యానర్ పేరు)… సిరివెన్నెల సినిమాలో కూడా మంచి పాత్రనే ధరించింది .

హీరో రాణించాలంటే విలనాసురులు ఉండాలి . విలనిజానికి వినూత్న రూపాన్ని ఇచ్చిన రావు గోపాలరావు , నూతన్ ప్రసాద్ , రాళ్ళపల్లిలు విలన్లు . మరో రెండు ప్రధాన పాత్రలు హీరో తండ్రి , అక్క . పి యల్ నారాయణ , సంగీతలు గొప్పగా పోషించారు .

అలాగే ప్రేక్షకులు బాగా గుర్తుంచుకునే పాత్ర పోలీస్ ఆఫీసర్ . రంగనాధ్ బాగా నటించాడు . ఎవరికి వారు అందరూ గొప్పగా నటించారు . నటింపచేసాడు కోదండరామిరెడ్డి .

నెల్లూరు రెడ్లు అయిన తిరుపతి రెడ్డి , ధనుంజయ రెడ్డిలు నిర్మాతలు . అందుకే బుచ్చిరెడ్డి పాలెం మండలం లోని రేబాల గ్రామంలో షూటింగ్ చేసారు . తలకోనలో చాలా షూట్ చేసారు . వాళ్ళు కూడా ఇంత బ్లాక్ బస్టర్ అవుతుందని ఊహించలేదట .

ఇరవై సెంటర్లలో వంద రోజులు , ఆరు సెంటర్లలో రెండు వందల రోజులు , హైదరాబాద్ శాంతి ధియేటర్లో మార్నింగ్ షోలతో ఒక సంవత్సరం ఆడింది . మార్నింగ్ షోలే కుర్ర ప్రేమికుల అడ్డా కదా ! మార్నింగ్ షోలు వర్ధిల్లాలి .

హిందీలో కూడా ఇదే టైటిలుతో తీసారు . జితేంద్ర , శతృఘ్న సిన్హా , హేమమాలిని , మాధవి నటించారు . కన్నడంలో విష్ణువర్ధన్ , ఆరతి , మాధవి నటించారు . బహుశా ఈ ఖైదీ సినిమా గురించి తెలవని వారు కానీ , చూడనివారు కానీ ఉండరేమో !

ఈతరంలో ఒకరూఅరా ఉంటే అర్జెంటుగా చూసేయండి . An unmissable block buster . A landmark in the career of Legend Chiranjeevi . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇంకొన్నాళ్లు పోతే… రూట్ – కోహ్లీ ట్రోఫీగా పేరు మారుస్తారా..?
  • ‘‘బనకచర్ల ఏపీకి మరో కాళేశ్వరం అవుతుంది బహుపరాక్…’’
  • ఫాఫం జగన్… ఈ రఫారఫా నరుకుడు భాషేమిటో, ఈ సమర్థనేమిటో…
  • కేంద్ర సాహిత్య అకాడమీ యువ, బాల సాహిత్య పురస్కారాలు వీళ్లకు…
  • వర్తమాన సినిమా ప్రపంచంలో నిజంగానే ఇది ‘అరుదైన సరుకు’…
  • అక్కినేని అలా… కాంతారావు ఇలా… కాంట్రాస్టు జీవితాలు… డెస్టినీ…!!
  • అసలే చిరంజీవి… ఆపై రాఘవేంద్రరావు… ఆవేశంతో శారద… ఇంకేం..?!
  • అన్నదాతకు సంకెళ్లు… ఖచ్చితంగా ప్రభుత్వానికి మరక, మచ్చ..!!
  • దేనికీ టైమ్ లేదా…? పరుగు తీస్తున్నావా..? టైమ్ మింగేస్తుంది జాగ్రత్త..!!
  • గోదావరి- బనకచర్ల ఇష్యూ రాజకీయంగా రేవంత్‌రెడ్డికి కలిసి వస్తోంది..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions